హ్మ్ ! ఎప్పుడు చూసినా పేరేమో టెక్నికల్ , పోస్టేమో నాన్ టెక్నికల్ ఈ సారి ఏమి రాసి పూడ్చిందో అని కంగారు పడుతున్నారు కదా ? నో ఈ సారి పద్దతి మార్చా పేరు టెక్నికల్ ఇంకా పోస్ట్ కూడా టెక్నికల్ అన్న మాట :)
ఇక మీకు అర్ధం అయ్యింది కదా మనం ఇప్పుడు cloud computing గురించి మాట్లాడుకుందాం .
క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏదైనా కంప్యూటింగ్ సేవలను ఇంటర్నెట్ ద్వారా వాడుకోవటం . ఉదాహరణ కు మన బ్లాగు నే తీసుకోండి, మీరు రాసేవి కానీ చదివేవి కానీ మీ సిస్టం లో ఉండనవసరం లేదు కదా ? అలాగే మీ కంపెనీకి కావలసిన పే రోల్ సాఫ్ట్వేర్ కావొచ్చు లేదా మీ కంపెనీ డాటా మొత్తాన్ని జాగ్రత్త పరిచే సర్వీసు కావొచ్చు ఇలాంటి వన్నీ ఇంటర్నెట్ ద్వారా పొందటాన్ని క్లౌడ్ కంప్యూటింగ్ అని అంటారు .
అసలు ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది Old Wine in New Bottle అని కొంతమంది అభిప్రాయం . అలా ఎందుకూ అంటే ఈ కాన్సెప్ట్ traditional web హోస్టింగ్ సర్వీసెస్ కి చాలా దగ్గర గా ఉంటుంది . కానీ ఇక్కడ ఉన్న అదనపు advantage ఏమిటంటే ఎప్పుడైతే అదనపు resources అవసరం అయితే అప్పుడు అదే స్కేల్ లో పెంచుకుంటూ పోవటం , అలాగే అవసరం లేనప్పుడు తగ్గించుకుంటూ పోవటం అనే ఫ్లెక్షిబిలిటీ ఉంటుంది .
ఈ క్రింది బొమ్మలో ఉన్న అంశాలు క్లౌడ్ కంప్యూటింగ్ లో ఉండవలసిన ప్రధానమైన లక్షణాలు :

అసలు క్లౌడ్ అనే పేరు ఎలా వచ్చింది అనేది ఈ పాటికి మీరు ఆలోచిస్తూ ఉంది ఉంటారు కదా ? కరెక్టు దీనికి ఒక కారణం ఉంది . అది సాధారణం గా ఫ్లో చార్ట్స్ గీసేటప్పుడు ఇంటర్నెట్ ని రెప్రజేంట్ చేయటానికి క్లౌడ్ సింబల్ ని వాడతారు కదా , ఆ ఇన్స్పిరేషన్ తో ఈ పేరు పెట్టారన్న మాట .
క్లౌడ్ కంప్యూటింగ్ తో ప్రోవైడ్ చేసే సర్వీసెస్ ని మూడు రకాలు గా చెప్పొచ్చు అవి :
1. Infrastructure as a Service (IaaS)
ఈ సర్వీసు ని కొన్ని సార్లు Hardware as a Service (HaaS) అని కూడా చెప్తారు . ఈ సర్వీసెస్ లో ప్రధానం గా infrastructure అంటే సర్వర్స్ , storage equipment , నెట్వర్క్ components లాంటివి అవుట్ సోర్సు చేస్తారు . ఈ సర్వీసెస్ సాధారణం గా పే పర్ యూజ్ మోడల్ లో బిల్ చేయబడతాయి . అంటే మీకు అవసరం అయినప్పుడు వాడుకొని ఆ వాడుకున్న సమయానికి మాత్రమే డబ్బు కడతారన్న మాట .
2. Platform as a Service (PaaS)
ఈ మోడల్ సర్వీసెస్ లో development కి ఉపయోగపడే software, ప్రోడక్ట్ టూల్స్ లాంటివి అందుబాటులో ఉంటాయి . డెవలపర్స్ ఈ సర్వీసెస్ సహాయం తో ఉదాహరణ కి గూగుల్ apps లాంటి అప్లికేషన్స్ క్రియేట్ చేయొచ్చు . ప్రస్తుతానికి మాత్రం ఈ సర్వీసెస్ ఇంకా అంత గా వాడకం లోకి రాలేదు . దీనికి ముఖ్యం గా పోర్టబిలిటీ, clients క్రియేట్ చేసిన apps move off చేయనివ్వక పోవటం వంటివి కొన్ని కారణాలు .
3. Software as a Service (SaaS)
క్లౌడ్ కంప్యూటింగ్ లో అత్యంత ప్రాధ్యానత గల సర్వీసు గా దీన్ని చెప్పొచ్చు . గూగుల్ , మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు ప్రోవైడ్ చేసే వెబ్ బేసేడ్ ఈమెయిలు సర్వీసు ఈ కాటగిరి లోకే వస్తుంది . అంతే కాకుండా HR , Payroll , ఫైనాన్సు సాఫ్ట్వేర్ సర్వీసెస్ ని నచ్చిన వెండార్ నుంచి కొనుక్కోవచ్చు . ఈ softwares maintenance కి ఎటువంటి ప్రత్యేకమైన IT ఉద్యోగుల నియామాకాలు అవసరం ఉండవు .
సరే క్లౌడ్ కంప్యూటింగ్ అందించే సేవలు గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు అసలు ఈ క్లౌడ్ కంప్యూటింగ్ లో ఉన్న రకాలు గురించి తెలుసుకుందాం . అవి :
1. పబ్లిక్ క్లౌడ్
పబ్లిక్ క్లౌడ్ లో ప్రొవైడర్ తన సేవలని , ఇంటర్నెట్ ఉన్న ఏ వాడకదారు (User) కైనా అందించే సౌలభ్యం ఉంటుంది . ఈ మోడల్ ని స్టాండర్డ్ క్లౌడ్ కంప్యూటింగ్ అని కూడా అంటారు . ఈ మోడల్ లో సాధారణం గా ప్రొవైడర్స్ ఇంటర్నెట్ లో access చేయగలిగిన అప్లికేషన్స్ కి స్టోరేజ్ సర్వీసు ని ప్రోవైడ్ చేస్తారు .
Elastic Compute Cloud (EC2), IBM's Blue Cloud, Sun Cloud, Google AppEngine and Windows Azure Services Platform వంటిని పబ్లిక్ క్లౌడ్స్ ఉదాహరణ గా చెప్పొచ్చు .
2. ప్రైవేటు క్లౌడ్
3. హైబ్రిడ్ క్లౌడ్
హైబ్రిడ్ క్లౌడ్ అనేది కనీసం ఒక పబ్లిక్ క్లౌడ్ , అలాగే కనీసం ఒక ప్రైవేటు క్లౌడ్ ల కంపోజిషన్ తో ఏర్పడుతుంది .
ఈ మూడు రకాల ఆర్కిటెక్చర్ లో హైబ్రిడ్ క్లౌడ్ ఐడియల్ మోడల్ గా చెప్పొచ్చు . ఈ మోడల్ లో పబ్లిక్ క్లౌడ్ లో పరిమిత వనరులతో అవసరమైనప్పుడు స్కేలబిలిటీ పెంచుకునే అవకాశం ఉంటుంది అలాగే vulnarable డేటా , లేదా అప్లికేషన్స్ కి సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది .
ఇప్పటికే మీ తలలు పట్టుకు ఎటో చూస్తున్నారు అని నాకు అర్ధం అయ్యింది, సో ఇది ఇక్కడితో ఆపేసి వేరే భాగం లో క్లౌడ్ కంప్యూటింగ్ వలన IT కంపెనీల , ఉద్యోగుల రోల్ ఎలా మారబోతుంది . అలాగే దీని వలన ఉపయోగాలు చూద్ద్దాం , అర్జెంటు గా ఇప్పుడైతే వెళ్లి ఒక కప్పు కాఫీ తాగేయండి :)))

ప్రైవేటు క్లౌడ్ అంటే మనకు పేరు తోనే అర్ధం అవుతుంది కదా కేవలం కొద్ది మంది లిమిటెడ్ users కి మాత్రమే అందించే సౌలభ్యం ఉంటుంది . ఈ ప్రైవేటు క్లౌడ్ ప్రధాన ఉద్దేశ్యం organizations కి తమ డేటా పైన పూర్తి కంట్రోల్ కలిగి ఉండటం .
3. హైబ్రిడ్ క్లౌడ్
హైబ్రిడ్ క్లౌడ్ అనేది కనీసం ఒక పబ్లిక్ క్లౌడ్ , అలాగే కనీసం ఒక ప్రైవేటు క్లౌడ్ ల కంపోజిషన్ తో ఏర్పడుతుంది .
ఈ మూడు రకాల ఆర్కిటెక్చర్ లో హైబ్రిడ్ క్లౌడ్ ఐడియల్ మోడల్ గా చెప్పొచ్చు . ఈ మోడల్ లో పబ్లిక్ క్లౌడ్ లో పరిమిత వనరులతో అవసరమైనప్పుడు స్కేలబిలిటీ పెంచుకునే అవకాశం ఉంటుంది అలాగే vulnarable డేటా , లేదా అప్లికేషన్స్ కి సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది .
ఇప్పటికే మీ తలలు పట్టుకు ఎటో చూస్తున్నారు అని నాకు అర్ధం అయ్యింది, సో ఇది ఇక్కడితో ఆపేసి వేరే భాగం లో క్లౌడ్ కంప్యూటింగ్ వలన IT కంపెనీల , ఉద్యోగుల రోల్ ఎలా మారబోతుంది . అలాగే దీని వలన ఉపయోగాలు చూద్ద్దాం , అర్జెంటు గా ఇప్పుడైతే వెళ్లి ఒక కప్పు కాఫీ తాగేయండి :)))
19 comments :
Read regarding this in newspaper but couldn't understand.Your's is somewhat uncomplicated.
Waiting to get more knowledge in next part
Good Article :-)
మంచి వివరాలు అందించారు శ్రావ్యా.. ధన్యవాదాలు..
వివరణ చాలా చక్కగా ఉంది. థాంక్స్.
చాల బాగుంది నెక్స్ట్ పార్ట్ కోసం వెయిటింగ్.
క్లౌడ్ సెక్యురిటి గురించి కుడా రాయండి
కాఫీ తాగి మళ్ళి వస్తాను.... దహా.
very good post.
:venkat
Nice One Ma'm
Good one and explained in a simple words. Sure it helps undrstanding the concept for techies and non-techies as well.
@శేఖర్ , @శ్రీరాం గారు , @వేణు గారు , @లక్క రాజు గారు , @చైతన్య గారు , @బులుసు మాస్టారు , @వెంకట్ గారు , @కృష్ణ గారు , @పద్మవల్లి గారు అందరికీ ధన్యవాదాలు !
చైతన్య నెక్స్ట్ పార్ట్ లో రాస్తానండి !
very Well written :)
Resume లో బేసిక్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ కూడా చేర్చేసుకోవచ్చు after this series
ఈ మధ్య దీని గురించి ఎక్కువ వింటున్నా, మీరు సవివరంగా రాసి నా శ్రమని తగ్గించారు... బాగుంది,.. త్వరగా నెక్స్ట్ పార్ట్ రిలీజ్ చెయ్యండి,. :)
Nice Start :-)
ఇవి ఫండమెంటల్స్ కానీ ...
నాది చైతన్య ఎస్ రెక్వెస్టే.. అందులొ బొల్డు సందేహాలు ఉన్నాయ్ నాకు
@హరే కృష్ణ హ హ ఇంతకీ మీ resume లోనేనా యాడ్ చేసేది ? థాంక్ యు :))
@ఫోటాన్ అవునా రాస్తున్న రాస్తున్నా థాంక్ యు :))
@చాణుక్య మీరు చెప్పింది కరెక్టు కొన్ని సార్లు కమ్యూనిటీ క్లౌడ్ ని కూడా కొంతమంది ఒక ప్రత్యేకమైన కాటగిరీ లో గా clasify చేస్తున్నారు . కానీ ఆర్కిటెక్చర్ ని చూస్తే కమ్యూనిటీ క్లౌడ్, ప్రైవేటు క్లౌడ్ ని లేదా హైబ్రిడ్ క్లౌడ్ ఈ రెండిటి లో ఏదో ఒక మోడల్ ఫాలో అవుతుంది . ఒక ఒక తేడా ఏమిటి అంటే ఒక organization బదులు గా కొన్ని organizations ఈ infrastructure లేదా సర్వీసెస్ ని షేర్ చేసుకుంటాయి . అందుకనే నేను కమ్యూనిటీ క్లౌడ్ ఒక ప్రత్యెక వర్గం గా చూపించలేదు . థాంక్ యు :))
@మంచు గారు తప్పకుండా , థాంక్ యు :))
nice job... nenu ee cloud computing ante chala sarlu vinanu.. chala sarlu telsukundam ani google lo search kooda chesanu.. kani anta pedda pedda pages chadavaleka sagam chadivi apesanu.. ila brief ga icharu.. thanks.. Srinivas
మేఘగణనం మేడ్ ఈజీ అన్నమాట! మీ ప్రయత్నం బాగుంది.
@More Entertainment, @శ్రీనివాస్ గారు Thank you :))
హ హ శంకర్ గారు భలే translalate చేసారు గా :)) థాంక్ యు :))
టెక్నికల్ విషయాలు తెలుగులో.. అదీ ఇంత సింపుల్గా వివరించడం కాస్త కష్టమైన పనే, శ్రావ్యా! appreciate your effort! :-)
@Nishi Thank you :))
Post a Comment