Subscribe:

Monday, July 16, 2012

Dieu merci !


ఎనిమిదవుతుంది , ఇంక్కొక సెకన్ కూడా నేను ఆలోచించే శక్తి లేదు !

హ్మ్ ! చిరాకు పుడుతుంది .

ఈ ఫోన్ ఏంటో ప్రొద్దుటి నుంచి దాని దారిని వాగి వాగి అలిసి పోయినట్లుంది .. ఒక సారి  కాల్స్ మిస్సిడ్ కాల్స్ లిస్టు చెక్ చేయాలి.

తీసి చూస్తే ఒక పాతిక missed కాల్స్ . అందులో ఒక పది ఇంటి నుంచి . . అబ్బా మళ్ళీ అప్పుడే ఇంకో కాల్ , ఇక తప్పదు మాట్లాడాలి


నేను : ఏంటమ్మా అంత అర్జెంటు ఈ టైం లో

అమ్మ : ప్రొద్దుటి నుంచి అన్ని కాల్స్ చేస్తే ఒక్క దానికి సమాధానం లేదు...

నేను : అబ్బా ఇప్పుడు ఈ క్లాసు ఏంటి నాకు ? నేను బిజీ గా ఉన్నాను తరవాత చేస్తాను

అమ్మ : ఒక్క నిమషం మాట్లాడటానికి అంత విసుగెందుకు నీకు ? ఎంత పని లో ఉన్నా ఒక్క నిమషం కుదురు గా మాట్లాడలేవా ?

నేను : ప్లీజ్ నేనిప్పుడు నీ తో వాదించ లేను . నన్ను వదిలెయ్యి నేను తరవాత మాట్లాడతా .


---------------------------------


అమ్మయ్య ఈ రోజుకి పనులు తెమిలినట్లే .

హ్మ్ ఈ రోజన్నా ఫ్రెండ్ కి మెయిల్ చేయాలి అనుకున్నాను , ఇప్పుడు ఆ పని చేసి పడుకుంటే ..

ఆ అయినా ఏంటి తనకి అంత పొగరు , ఎప్పుడో విసుగు లో గొడవ పడితే మాత్రం నేనే ఎందుకు మాట్లాడాలి,  ప్రతి సారి ?

నాకేనా పట్టుదల లేంది. Let him go to hell , he deserve it !

రాయను కాక రాయను అంతే...
--------------------------------------------


ఇంకొక రోజు మొదలైంది .... ఉదయం ... మళ్ళే రొటీన్ మొదలు ...ఇక లేచి తయారయ్యి office కి వెళ్ళాలి .............

రాత్రి పడుకునే ముందు బాగా తలనొప్పి అనిపించింది . బాగా నిద్ర పోయి లేవటం వల్ల అనుకుంటా శరీరం అంతా తేలిగ్గా అనిపిస్తుంది .

అమ్మో అప్పుడే ఎనిమిదవుతుందా లేట్ అవుతుంది త్వర గా రెడీ కావాలి .

ఆశ్చర్యం ...

అమ్మా , నాన్న ఇక్కడున్నారు, అదేంటి అంతా దిగులు గా, ఎందుకు ఏడుస్తున్నట్లు గా ఉన్నారు ? అసలెప్పుడు వచ్చారు ?

ఏమి జరిగింది ? ఆ పక్కన ఏంటి అది ?

ఏంటి పిలుస్తుంటే పలకరు ? నా గొంతు వినిపించటం లేదా ? లేదూ నా మీద   కోపం తో ఉన్నారా ?

అరె వీళ్ళందరూ కూడా ఇక్కడ ఏంటి నేనేదన్నా మర్చిపోయానా ?

 strange ..


హ ఇదేంటి ఆక్కడ ఉన్నాను నేను ... అదీ పడుకుని ఇదెలా సాధ్యం ?

నేను ఇంత గట్టి గా పిలుస్తుంటే ఎవరు పట్టించుకోరేమి ? అసలు ఏమి జరుగుతుంది ?

హ్మ్ !


నేను ..
నేను ..
నేను .. చనిపోయానా ? అక్కడ ఉంది నేనేనా ? ఇదెలా ? అందుకే ఎవరికీ నేను పిలుస్తుంటే వినిపించటం లేదా ?
నాకు అర్ధం కావటం లేదు అసలు ఇలా ఎలా జరిగింది ?


ఇప్పుడు అమ్మ , నాన్న ఎలా ?
దేవుడా వీళ్ళ బాధ నేను ఎలా చూడాలి ? ఎవరు వీళ్ళని ఓదార్చాలి?

ఒక్క నిమషం ....

అరె తను తనేనా ఇక్కడ ? అసలు ఎలా తెలిసిది తనకి ఈ విషయం ?
తన కళ్ళ వెంట నీళ్ళు ?

ఓహ్ తనని ఇలానా చూస్తాను అనుకున్నాను ? చిన్న misunderstanding ఎంత దూరం చేసింది ఇద్దరినీ . అయినా అంత పట్టుదల ఏంటి మా ఇద్దరి కి ?

ఒక్కసారి తన దగ్గర గా వెళ్లి సారీ చెప్తే ?

What the hell? పట్టించుకొడేమి ? ఇంకా అదే ఈగో నా ? ఇదే చిరాకు తెప్పిస్తుంది నాకు .

హ్మ్! కాదు కాదు నేను తనకి కనిపించటం లేదనుకుంటా ?

ఓహ్ గాడ్ నిజం గానే చనిపోయానా ?

ఇప్పుడు ఎలా ? ఏమి చేయాలి ?

నా దగ్గరికి వెళ్లి క్రింద కూర్చిండి పోయాను , ఏమి చెయ్యాలో తెలియని నిస్సహాయత !

ఎంత పెద్ద తప్పు చేసాను , కొద్ది రోజుల నుంచి ఎంత అనవసరమైన చిరాకు చూపించాను . ఒక్క సారి కూడా వాళ్ళకి తెలిసేలా చెప్పలేకపోయాను వాళ్ళని నేను ఎంత ఇష్ట పడుతున్నానో . ఇదేనా నరకం  అంటే   . ఇంత కష్టం గా ఉంటుందా ?

దేవుడా ఒక్కసారి ఒకే ఒక్కసారి

let me make my mother smile just once !
let me make to feel my dad proud on me at least for a moment
let me tell to my friend how much I liked him ...
and and

Just let me thank them for the wonderful time I had with them ..


ఒకే ఒక్కసారి ఈ అవకాశం నాకివ్వు... మళ్ళీ ఈ తప్పు చేయను నేను ..

ఇదేంటి ఇప్పుడు ఈ మ్యూజిక్ ?

ఎక్కడ నుంచి వినిస్తుంది ? బాగా తెలిసినట్లు గా ఉంది 

అది అది mission impossible థీమ్ సాంగ్ మ్యూజిక్ కదూ , ఇక్కడ ఎక్కడ నుంచి ...


ఇంత దగ్గర గా

ఏదో విడిపోతున్న భావన , అసంకల్పితం గా నా ఎడమ చేయి ఏదో వెతుకుతుంది అని తెలుస్తుంది ....

నా మెదడు ఏదో చెప్పటానికి ప్రయత్నం చేస్తుంది ..

అప్పటి కి పూర్తి గా మెలకువ రాని స్తితి .... . 

నా మెదడు చెప్తోంది నాకు అర్ధం అయ్యింది , అది చెప్పేది "యు స్టుపిడ్ కళ్ళు తెరిచి చూడు, ఫోన్ తియ్యి అని" :P

ఏమి జరిగిందో నాకు అర్ధం అయ్యింది ....:D

That was the one of the happiest moment in my life ! I really thanked the God :-)

And, yes I have learned
that I should always leave loved ones with loving words. It may be the last time I see them .



Almost everything--all external expectations, all pride, all fear of embarrassment or failure--these things just fall away in the face of death, leaving only what is truly important. Remembering that you are going to die is the best way I know to avoid the trap of thinking you have something to lose. You are already naked. There is no reason not to follow your heart. 
- Steve Jobs

25 comments :

రాజ్ కుమార్ said...

గుర్.. గుర్.. .గుర్...(బుర్ర గోక్కుంటూ...)
;) ;)

ఇది శ్రావ్య గారేనా అని డౌట్.... నా అనుమానం లాస్ట్ పోస్టులో పుట్టీ, ఈ పోస్టు తో పెద్దదయ్యిందీ... ;) ;)

Unknown said...

Wonderful Write Up..

U have a Unique style of writing.
Don't stop it.

Let it come out :)

ఫోటాన్ said...

ఐ గెస్, ప్రతి ఒక్కరికీ ఇలాంటి అనుభవం వుండే వుంటుంది. (నాకు రెండు మూడు సార్లు ఇలాగే జరిగింది).

>>That was the one of the happiest moment in my life ! I really thanked the God :-)

And, yes I have learned

that I should always leave loved ones with loving words. It may be the last time I see them .<<

Loved these lines !

మీ శైలికి భిన్నం గా వుంది, మీలో వున్న కొత్త కోణం (రచనల్లో) కొద్ది కొద్దిగా బయట పడుతోంది, :)

శ్రీనివాస్ said...

oh shit

ఇదంతా కలేనా

Padmarpita said...

ఓహో...వాట్ ఏ నైస్ డ్రీం:-)

sndp said...

intaki mail chesara leka ???

జలతారు వెన్నెల said...

Baagundi Sraavya... Okkasaarigaa andariki cheppakane cheppaavu kshanabanguramaina jeevitam lo manam elaa undaalo prati nimisham... Nice one!

పద్మవల్లి said...

Wonderful Sravya!!!
Very nice message. I love the lines from Steve Jobs.

Ramani Rao said...

నేను చదివాను అనేకన్నా విన్నాను అనడం బాగుంటుంది అదేదో మీరు ఎంతో ఆర్థ్రంగా నాకు చెప్తున్నట్లుగా ఉంది ఈ సంఘటన.. చాలా బాగా రాశారు శ్రావ్య.. వినడానికి శ్రావ్యంగా..... గ్రేట్.. అమ్మా, నాన్నా, తను ల మధ్య సంఘర్షణ.. కళ్ళకు కట్టినట్లుగా.. కలే అయినా .... నిజం కాకూడదు.. అన్నట్లుగా ఎంతోమందికి ఇలా ఉండండి అని చెప్తునట్లుగా.. గ్రేట్.

kiran said...

ఎందుకు మా శ్రావ్య జి ఇలా illogical ..గా తిక్క తిక్క గా ఆలోచిస్తున్నారు...అన్న ఆలోచనకి...మీ ముగింపు తిక్క కుదిర్చింది..
కాని..ఇలాంటివి అనుకోడమే కానీ మర్చిపోతూ ఉంటాం..
రెగ్యులర్ గా బ్రెయిన్ ని ఇలాంటి మంచి టపాలతో రిఫ్రెష్ చేస్తూ ఉంటే..జీవితం..విలువ..మన వాళ్ల విలువ..మనం చేయకూడని నిర్లక్ష్యం గుర్తొస్తాయి :)
loved this post :)

..nagarjuna.. said...

>>ఇలాంటివి అనుకోడమే కానీ మర్చిపోతూ ఉంటాం
హ్మ్... అంతేనా ! హేమిటో, పోస్టు చదివి మనసులో ఓ ప్రశ్న కామెంట్ చదివి ఓ నిట్టూర్పు.

Anonymous said...

అందుకే చావంటే నాకు చచ్చేంత గౌరవం. :)
చావు తెలివి అంటారు గాని, యమఘంటికానాదం ఎలాంటి కఠినాత్మునిలోనైనా వివేచనను తట్టి/కొట్టి మేల్కొలిపే సుమధుర సంగీతం. అది వినిపించేదాక వేచివుండటం... సాధారణ మానవ లక్షణం.

Dieu merci ని 'చావు దయ' అని అనువదించుకోవచ్చా? ఇంతకీ ఇది ఏ స్పానిషో, పోర్చుగీసో, ఫ్రెంచో, జర్మన్, డచ్చో గాని ... ఏదో బాగున్నట్టుంది. :)

Sravya V said...

హ హ శంకర్ గారు :)) Dieu merci అంటే Thank GOD అని (ఫ్రెంచ్) .

రసజ్ఞ said...

c'est un rêve, Dieu merci! ఆ ఊహే భయపెట్టినా వాస్తవం చెప్పారు. అందుకే అన్నారేమో Live as if you were to die tomorrow అని. మంచి పోస్ట్ అండీ!

Sravya V said...

@Raaj రాజ్ నేనే నేనే :-)) థాంక్ యు :-))
@శేఖర్ అలాగే తప్పకుండా :-)) థాంక్ యు :))
@ఫోటాన్ అయితే మీకూ ఇలాంటి కలలు వచ్చేవా :-)) ఇదో రకం శైలి అంటారా ? థాంక్ యు :-))
@శ్రీనివాస్ మరీ అంత disappoint అయ్యారా ?:-)) థాంక్ యు :-))

Sravya V said...

@పద్మార్పిత గారు మీకు నచ్చిందా కల :-)) థాంక్ యు :-))
@sndp గారు హ హ రాసానండి :-)) థాంక్ యు :-))
@జలతారు వెన్నెల గారు మీకు నచ్చినందుకు సంతోషం గా ఉందండి థాంక్ యు :-))
@పద్మవల్లి గారు అంత పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చినందుకు థాంక్ యు :-)) అవునండి జాబ్స్ చెప్పిన ఆ లైన్స్ నాకూ ఇష్టం :-))

Sravya V said...

@రమణి గారు అవునా ? మీకు నచ్చిందుకు సంతోషం గా ఉందండి థాంక్ యు :-))
@కిరణ్ వావ్ మీ కామెంట్ చూసి పొంగిపోయా :-)) థాంక్ యు మీకు నచ్చినందుకు :-))
@నాగార్జున అయితే నాది కూడా ఒక ప్రతి నిట్టూర్పు :-)) థాంక్ యు :-))
@SNKR గారు హ్మ్ అంత పెద్ద పోస్టుని రెండు ముక్కల్లో తేల్చేసారు :-)) థాంక్ యు :-))
@రసజ్న గారు అంతే కదా :-)) merci beaucoup !!!

నిషిగంధ said...

అబ్బా, నీ కలలు చాలా హెవీగా ఉన్నాయ్, శ్రావ్యా.. నాకన్నీ స్కూల్లో నా కొత్త పెన్సిల్ ఎవరో కొట్టేసినట్లు, రేపట్నించీ పరీక్షలైతే ఇవ్వాళ నా బుక్స్ అన్నీ కాలవలో పడి కొట్టుకుపోతున్నట్టు.. ఇంకా ఇలాంటి కలలే వస్తాయి :))
జోక్స్ ఎ పార్ట్, మంచి మెసేజ్... నువ్వు చెప్పిన విధానం చాలా బావుందమ్మాయ్... క్లౌడ్ చాటున దాక్కున రచయిత్రి మెల్లగా బయటకు వచ్చేస్తోంది..మా అందరికీ నచ్చేస్తోంది కూడా! :))

Sravya V said...

నిషి హ హ భలే ఉన్నాయి మీ కలలు ! నా రాతలు నచ్చుతున్నాయా , ఇది పెద్ద కాంప్లిమెంట్ నాకు భూమికి ఒక గజం ఎత్తులో నడుస్తున్నా , థాంక్ యు :))

జీడిపప్పు said...

దేవుడు మనిషికిచ్చిన అతి గొప్ప వరం గురించి కలగన్నారు!!

Try to watch 'It's a Wonderful Life' and 'Groundhog Day' movies.


http://100telugublogs.blogspot.com



.

Sravya V said...

హ్మ్ ! అయితే వరమే అంటారు ?
It's a Wonderful Life - ఈ మూవీ చూసానండి , నాకు చాలా నచ్చింది .
Groundhog Day - ఇది తప్పకుండా చూస్తానండి మీ రెకమెండేషన్ మీద నాకు గొప్ప నమ్మకం ఉంది . Thank you :))

Anonymous said...

Thanks on your marvelous posting! I genuinely enjoyed reading it, you are a great author.
I will always bookmark your blog and will eventually come back sometime soon.
I want to encourage you to definitely continue your great
job, have a nice day!
Feel free to visit my website : bostaditurkiet.net

Anonymous said...

Hello just wanted to give you a brief heads up and
let you know a few of the pictures aren't loading correctly. I'm
not sure why but I think its a linking issue. I've tried it in two different internet browsers and both show the same outcome.
my web page > admef.com

Sravya V said...

Hi Anon
Didn't get, could please give me more details? Thanks in advance.

Anonymous said...

Very good blog post. I absolutely appreciate this website.
Thanks!

Post a Comment