Subscribe:

Tuesday, September 18, 2012

నేను నా Entrepreneurship


మొన్న అదేనండీ నిన్న గాక  మొన్న నా హాండ్ ఫోన్ కి  ఒక కాల్ వచ్చింది. అదేంటో విచిత్రమైన నెంబర్, స్క్రీన్ పట్టకుండా ఇరవై అంకెలు ఉంది .ఇదెక్కడి నెంబర్ అబ్బా అని కాస్త బుర్ర చించుకుని ఇక లాభం లేదు అని కాల్ ఆన్సర్ చేసా.  అంతే      అసలు ఏం గొంతు అదీ ...  ఆ గుర్తొచ్చింది  వీణ మీటినట్లే  ఉంది. సరే కాసేపు  ఆ గొంతులో తియ్యదనాన్ని పక్కన పెట్టి అసలు విషయానికి వద్దాం.  ఆ తియ్యటి  గొంతు నా వివరాలు  చెక్ చేసుకుని  మా బాస్  బ్రహ్మ గారు మీతో మాట్లాడలటండీ  కాల్ కనెక్ట్  చేయనా అని అడిగింది .  

బ్రహ్మ ??  అప్పుడెప్పుడో  ఆంధ్ర ప్రదేశ్  రిలీఫ్ కమిషనర్  గా పని చేసిన  ఐఏఎస్ ఆఫీసర్ ఆయనకీ నాతో పని ఎంటబ్బా అని  తెగ ఆలోచిస్తున్నా,  ఇంతలో అవతలి నుంచి హలో అని ......

నేను హడావుడిగా  హాయ్  సర్ ! ఎలా ఉన్నారు? ఏమి చేస్తున్నారు ? ఇప్పుడు  ఎక్కడ సారూ  మీ పోస్టింగ్? అని  వరస పెట్టి ప్రశ్నలు  వేసేస్తున్నా  (ఇది చూసి  ఆయనేదో నాకు తెలుసు  అనుకోకండి ,  అది  నాకున్న  చెడ్డ  అలవాటు ఎవరు ఫోన్ చేసినా  గుక్క తిప్పుకోకుండా అలా ఒక పది నిమషాలు ప్రశ్నలు గుప్పించటం :-)). పాపం నా దోరణి చూసి బిత్తర పోయినట్లున్నారు  బ్రహ్మ గారు ఇక లాభం లేదని, అమ్మాయి నువ్వు కొంచెం ఆపితే  ఒక రెండు నిమషాలు నేను మాట్లాడతా ఏమంటావ్?అన్నారు !  అప్పటికి  తేరుకుని  నేను సైలెంట్ అయ్యాను .  

ఇక ఆయన చెప్పటం మొదలు పెట్టారు . ...

ఈ మధ్యన నాకు ఒక్కొక్క మనిషిని ఇలా తయారు చేయటం, వాళ్ళ మొహాన రాత రాయడం మహా మొనాటనీగా ఉంది. మీ భూమి మీద ఇప్పుడంతా  బ్యాచ్  ప్రాసెస్లు , ఆటోమేటెడ్ ప్రాసెస్లు అట కదా ? అలా నా పనిని కంప్యుటరైజ్  చేయటానికి  వీలు అవుతుందేమో  కనుక్కుందాం అని కాల్ చేసాను. ఈ మాటలు వినగానే నాకు ఒక్క నిమషం బుర్ర గిర్రున తిరిగింది ... 

అంతే మాట పడిపోయినట్లుగా ఇంకా నానా రకరకాలుగా  అయ్యిపోయి కొంచెం తేరుకుని  అడిగాను. మీరు బ్రహ్మ అంటే  సృష్టి కర్త , సత్యలోకంలో ఉంటారు  ఆ బ్రహ్మగారా?  అని .

Mr .Brahma   : ఆశ్చర్యం గా నేనే ఇంకెవరు అనుకున్నావ్  అన్నారు .  
నేను               : కొంచెం తేరుకుని  అహ ఏమి లేదండి  .. కొంచెం కంగారు పడ్డాను అంతే  ... ఇంతకీ మీ లోకాన్ని
                       ఆటోమేట్ చేయాలని  నిర్ణయించుకున్నారా  అని అడిగాను . 
Mr .Brahma   : అవును  అలాంటి ప్రోడక్ట్  ఏదన్న  రెడీ గా ఉందా  మీ దగ్గర, డెమో లాంటి ఏదన్నా  ఇవ్వగలరా ?   
    
వెంటనే నేను నా ఓవర్  యాక్షన్ టాలెంట్ అంతా వాడి (అబ్బో  ఈవిషయంలో అసలు మన టాలెంట్  ఒక రేంజ్ లెండి :D )  ఓ...  లేకేమండీ ఉంది, బ్రహ్మాండంగా పని చేస్తుంది .మీకు వివరాలతో సహా నేను ప్రోపోజల్ పంపుతాను కదా?   వచ్చే సోమవారం నాటి కంతా వివరాలు  మీ ఈమెయిలులో ఉంటాయి అన్నాను. (ఇంతకీ ప్రోడక్ట్ కాదు కదా పవర్ పాయింట్  presentation కూడా లేదు అదీ విషయం :-))

ఆయనకి చెప్పటం అయితే చెప్పా కానీ , ఫోన్  పెట్టగానే  విషయం  తలుచుకుంటే ఇకంతే నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు.  అసలు ఈ ప్రాజెక్ట్ ఏదో వచ్చేస్తే అబ్బో ఇంతకీ ఎలా చార్జ్ చేయాలి ? డాలర్లు ? బంగారం ? వజ్రాలు? అసలు  బ్రహ్మలోకం లో కరెన్సీ  ఏంటి ? ఎంత ఆలోచించినా నాకు తోచలేదు. వెంటనే ఉందిగా గూగుల్ ఒక క్లిక్ away లో  అని చూస్తే  విచిత్రం గూగుల్ కి కూడా తెలియదట . హ్మ్ !  లాభం లేదు కరెన్సీ  సంగతి తరవాత ముందు అసలు మనకి ఒక టీం అంటూ ఉండాలి  కదా    కనీసం  ఏదో ఒక డెమో  చూపించటానికి? అసలు ముందు ప్రపోజల్  పంపటానికి?  హ్మ్  ! ఎవర్నీ  అడుగుదాం అని అని నా బుర్రకి పదును పెడుతూ ఒక పెద్ద కాఫీ  కప్పు , ఒక నోట్ బుక్ తో  తయారయ్యా .
     
 ప్రొడక్టే లేకుండా ఉందని బిల్డ్ అప్ ఇచ్చి ప్రాజెక్ట్ సంపాదించాలి అంటే ఎంత కష్టం ? అసలు మనం పంపిన ప్రపోజల్ చూసి  వెనకా ముందు ఆలోచించకుండా ఒప్పేసుకోవాలి, అంటే అసలు ఎంత పకడ్బందీగా ఉండాలి . అక్షరాలలో ఎన్ని మాయలు  చూపించాలి . అలా చేయగలవారు నాకు  తెలిసిన వాళ్లలో  ఒకరే,  అదీ ఈయన కుమార్  గారు .  మరి ఆయన ఒప్పుకుంటారో  ఒప్పుకోరో  :-(

 ఆ తరవాత డెమో? డెమో  ప్రెజెంట్ చేయగల వారెవరా అనగానే గుర్తు కొచ్చేస్తారు, ఇంకెవరు మన మలక్పేట్ రౌడీ aka  భరద్వాజ్ వెలమకన్ని . ఈయనే ఎందుకూ అంటే ? అదే మరి నా తెలివితేటలు  మాములువా? :-)) ఈ భరద్వాజ్ గారికి  ONLINE లో  తెలియని లోకం ఉందా ? ఆ  బ్రహ్మ లోకం లో కూడా కనీసం ఒకరో ఇద్దరో తెలిసిన వారుంటారు.  వాళ్ళ ద్వారా  ఈజీగా  ప్రాజెక్ట్ రాబట్టొచ్చు . అదీ మన తెలివి,   బ్రహ్మాండం కదా   ?:-))

అవును లేని ప్రోడక్ట్ కి మాంచి  Customer సక్సెస్ స్టోరీ ఎవరు రాస్తారు చెప్మా ? ఇంకెవరు మన శైలజ గారిని అడుగుదాం  పాపం  ఆవిడ ఒక్కటే ఈ బ్లాగులో నేనో మహా మేధావి ని నమ్మేది  :-)) మరీ ఒకటే  Customer  స్టోరీ  అంటే  బాగోదమో,  కనీసం  ఇంకో రెండు ఉంటె  గానీ ఒక లెవెల్ లో ఉండదు, అందుకే   వేణు శ్రీకాంత్  గారిని  , కొత్తావకాయ గారిని కూడా కొంచెం మొహమాట పెట్టేయాలి ఈ విషయం లో  :P 

ఇవన్నీ సరే మరి డెమో అంటే మేకప్ అదీ పూసి కాస్తా రంగుల రంగుల స్క్రీన్స్ అన్నా  చూపించాలి కదా అంటే  అదే అదే కనీసం మసి పూసి అన్నా మారేడు కాయ చేయాలి కదా ,   అందుకే  ఒక నిర్ణయానికి  వచ్చేసా . 

టెక్నాలజీ  ఏదన్నాకానీ ,కోడింగ్  చేసేవాళ్ళో మాత్రం  బంతి ఉండాలి, ఇక వాళ్ళ మానేజర్ నాకు ఎవరి మీద ఒళ్ళు మండితే  వాళ్ళు  ఆ రోజు  బంతి మానేజేర్ . మరే ఇక తిట్టే పని లేకుండా తనే తిట్టేస్తారుగా  :-)) 

హ్మ్  !  ఇవాళ రేపు మన ప్రోడక్ట్ కి  తగిన   మొబైల్  app  ఉండి  దాన్ని integrate  చేస్తే  ఆ  క్రేజే  వేరు, మరి దానికి మన రాజ్ కుమార్ ఎలాను  ఉన్నారు . 

కోడర్ల సంగతి అలా  ఉంచితే టీం లీడ్ మాత్రం మీ భారతీయుడు గారే , ఆయన వేసే పంచ్ లకి భయపడన్నా వీళ్ళు ఇద్దరూ  శుభ్రం గా పనిచేస్తారు :-)) ఇక  సర్వర్  అడ్మిన్  భాస్కర్ రామరాజు గారు :-))

కోడింగ్ సరే టెస్టింగ్  టెస్టింగ్  ఎవరు చేయాలి చెప్మా   ???

ఆ ఉన్నారు..  ఉన్నారు ఇద్దరు పద్మ గార్లు ఉన్నారు. ఒకరు మోహనరాగం పద్మ గారు,ఇంకొకరు పద్మ ఉండవల్లి గారు . వీళ్ళిద్దరూ కనక  స్ట్రెస్  టెస్ట్  చేస్తే గూగుల్ వాళ్ళు తన్నుకు చావాలి,  ఇక మన ప్రోడక్ట్  ఒక లెక్కా ?  కాబట్టి వీళ్ళే  కరెక్టు .

వీళ్ళందరి బాగోగులు చూడటానికి HR కావొద్దు మరి , అందుకే మన రసజ్న, సిరిసిరి మువ్వ గార్ల   హెల్ప్ అడుగుదాం అని ఫిక్స్ అయ్యా :-))  వీళ్ళిద్దరికీ  ఉన్నా ఓపిక  భూలోకం లో ఎవరికీ  ఉండదు  మరి :-))

మరి  financial  transactions , బడ్జెట్ లు చూడటానికి  -  ఓహ్ ఎవరో ఏంటి  Ph.d  చేసిన  సౌమ్య గారు ఉండగా  :-))

అవునూ రేపొద్దున్న బోలెడు లాభాలు వచ్చేసి నేనో బూర్జువా పెట్టుబడిదారురాలినని (దీని అర్ధం ఏంటో నన్నకండి దయచేసి  ఏదో పదం బావుందని  వాడేసా, ఇలాంటి ఇజాలు వాటికి నేను కొద్దిగా దూరం ) అని అవాకులు చెవాకులు పేలితే నాకు సపోర్ట్ గా ఉండటానికి  శ్రీకాంత్ గారిని  హెల్ప్  అడగాల్సిందే .:-))

ఇంతకీ మీరు గమనించారా ? అసలు ప్రోడక్ట్ కి పేరే  పెట్టలేదు , వస్తున్నా వస్తున్నా అక్కడికే వస్తున్నా! ఆ పేరు పెట్టటానికి ఒక expert ఉన్నారు తనే  RK  తను పెట్టె పేర్లు చూస్తే ఆ ప్రోడక్ట్ ఏదన్నా కానివ్వండి కొనేయాలి అన్న ఉత్సాహం రావటం కాయం   :-))

ఊ .... ఆఫీసు ఇంటీరియర్స్ తీర్చిదిద్దటానికి  హరేక్రిష్ణ ,  పర్యావరణ  స్పెషలిస్టు   అరుణ్  గారు .

ఇంకా ప్రోడక్ట్ లాంచ్ చేసే ఈవెంట్ organize చేయటానికి మాత్రం ఇద్దరు specialists ఉన్నారు వాళ్ళు  నిషిగంధ  ఇంకా వెన్నెల  కిరణ్.  వీళ్ళిద్దరికీ  ఇలాంటి వాటిలో మంచి  experience   ఉంది :-)) ఇక  అక్కడ  కబుర్లు చెప్పటానికి  నేస్తం గారు  స్పెషల్  గెస్ట్  :-))

ఆ ఆ  ఆ  ... నాగార్జున , చంద్రకళ గారు , ఫోటాన్, రంజనిసునీత  గారు    ఆగండి ఆగండి  అబ్బే  లాభాలో మీ వాటా  ఎక్కడికీ పోదూ  ఉన్నారు, ముందు  వీళ్ళ నెత్తిన  చేతులు పెడితే  తరవాత  మీ సంగతి  చూడొచ్చని   అంతే  :-))

అసలు అంతా  బానే  ఉంది కానీ  దీనికి కావాల్సిన infrastructure కి  డబ్బులు ...  అవి ఎక్కడనుంచి  వస్తాయి ?  హ హ  ఈ  విషయం లో అస్సలు నాచేతి కి తడి అంటకుండా పనిచేస్తా కదా . అయినా  పెట్రోలు  బావులు తవ్విన  పప్పు సారూ ,  గ్రనేట్ కొండలు తవ్వుతున్న్హ ఒంగోలు శ్రీను  అనే ఇద్దరు అమాయకులు ఉండగా  మనకెందుకు భయం ?:P   ఇంకా  ఇంకా  ఇలా  రింగులు రింగులు  తిరుగుతున్నా నా ఆలోచనలు ని భగ్నం  చేస్తూ  నేను దిగాల్సిన  మా ఇల్లు  వచ్చేసింది :-)) 


(ఇమేజ్ సోర్సు -   గూగుల్  Images)
ఇంతకీ ఇలాంటి రిచ్ ఆలోచనలు చేయటానికి  కారణం తెలుసా మీకు? మొన్నొక  రోజు  MNCs లకి ఆసియా పసిఫిక్ Regional  Heads గా పనిచేసే చాలా మంది Expats    ఉండే  ప్లేస్ చూసా (మీరు కూడా చూడాలి అనుకుంటే  ఇక్కడ ఒక క్లిక్    క్లిక్కండి )  , అది  చూసాకా నాకు అర్ధం కాని విషయం  అసలు  వీళ్ళకి నెలకి ఎంత బిజినెస్స్  టార్గెట్  ఉంటుంది ,  అది  పూర్తి చేయయానికి  వీళ్ళు ఎలాంటి కష్టం పడతారు clients కి ఎన్ని కుచ్చు టోపీలు పెడతారు?అసలు ఇంత డబ్బు  దండుకోవాలి అంటే ఆ క్లైంట్ రేంజ్ ఎంత ఉండాలి అని :-)))  అసలు అన్నిటికన్నా   ముఖ్యం గా వీళ్ళ బాసులు ఇంకే రేంజ్ లో  ఉండాలి?  ఆ  position  కి  వెళ్ళాలి అంటే ఈ లోకం లో ఉన్న  రిచ్  clients కి ఆల్రెడీ ఇలాంటి వాళ్ళు వలలు వేసి ఉంటారు  ఏదో  అదుగో  అలా సుదూరం లో ఉన్నా ఏ  బ్రహ్మ లోకాన్నో టార్గెట్ చేస్తే  తప్ప నాలాంటి వాళ్ళు  entrepreneurs గా పోటీ  తట్టుకోవటం కష్టం అని ఇలాంటి ఊహలలోకి  వెళ్ళానన్నమాట :-))

హ్మ్  ! ఏదో లెండి  "Entrepreneurship is not a job,  it’s a lifestyle" అని వినోద్ కోస్లా  లాంటి వాళ్ళు  తెగ చెబుతున్నారు అని  ఆ లైఫ్ స్టైల్ ఏదో  నేర్చుకుందాం అని చూస్తుంటే  .. ఇలా  బోలెడు కష్టాలు  :-(  .  ఏదైనానండి  డబ్బు , అధికారం వీటిలో ఏదో కిక్కుంది , అది ఒప్పుకోవాల్సిందే  :-))

అవును.....  ఇంతకీ  బ్రహ్మ లోకం లో కరెన్సీ  ఏంటో మీకేవరకన్నా తెలుసా ???  తెలిస్తే  ఇలా నా చెవిలో  ఊదేయ్యండి  ప్లీజ్  ఆ  రహస్యం ;-))))

- శ్రావ్య 

PS : పైన నేను mention  చేసిన  బ్లాగర్ల తో  నాకు ఉన్న పరిచయం   తో   పేర్లు  mention  చేసాను . ఎవరికైనా  అభ్యంతరం   ఉంటే    తెలియచేస్తే  ఎడిట్   చేస్తాను . 

21 comments :

హరే కృష్ణ said...

అసలు అంతా బానే ఉంది కానీ దీనికి కావాల్సిన infrastructure కి డబ్బులు ... అవి ఎక్కడనుంచి వస్తాయి ? హ హ ఈ విషయం లో అస్సలు నా చేతి కి తడి అంటకుండా పనిచేస్తా కదా . అయినా పెట్రోలు బావులు తవ్విన పప్పు సారూ , గ్రనేట్ కొండలు తవ్వుతున్న్హ ఒంగోలు శ్రీను అనే ఇద్దరు అమాయకులు ఉండగా మనకెందుకు భయం
కెవ్వ్వ్వ్ వ్వ్ వ్వ్! !

బ్లాగర్లతో మహాభాగ్యం
చాలా బావుంది

..nagarjuna.. said...

ఆయ్... నా ప్రాజెక్ట్ బ్లూ ప్రింట్, పైగా పేటెంట్స్ కూడా తీసుకున్నా ఇప్పుడు ఈవిడొచ్చి తనది అంటుందేఁవిటి అనుకున్నా. సివర్లో లాభాల్లో షేర్ అనేసరికి ఒప్పుకుంటున్నా. పన్జెయ్యనవసరం లేకుండా లాభాలు, రివార్డులు వస్తే ఎంత హాయో కదా ! ఐతే నెలకు కనీసం ఒకసారైనా స్వర్గానికి ఫారిన్ ట్రిప్ ఉండాలి
Wish you best... ఉహు...bestest Luck :)

రాజ్ కుమార్ said...

నేను డీప్ గా హర్టయ్యాను. అసలు నా పర్మిషన్ లేకుండా నా పేరు రాస్తారా?
పోనీ రాస్తే రాశారండీ.. ప్యాకేజీ మాట్లాడకుండా మొబైల్ అప్లికేషన్ ఇచ్చేయాలా? అహా.. ఇంకా... ?? చెప్పండి చెప్పండి..
ఇవన్నీ అనవసరం అండీ నాకు పార్ట్నర్షిప్ కావాలి. వేరే మాట లేదు. పెట్టుబడి పప్పుసారుదీ.. లాభాలు మనవీ..గిది ఫైనల్.

థాంక్యూ నన్నూ ఇంక్లూడ్ మాడినందుకు. అన్నట్టు బ్రహ్మలోకం కరెన్సీ తెలీదా?
బొబ్బట్లు

ఆ.సౌమ్య said...

వాకే శ్రావ్య...ఫైనాన్షియల్ మేటర్స్ నాకొదిలేసేయండి..నేను చూసుకుంటా.

ఉష్షు ఉష్షు రాజ్ గొడవ చెయ్యకు...స్స్ స్స్ డబ్బు మన చేతిలో ఉందోయ్...మనం మనం చూసుకుందాం. నువ్విలా వచ్చేయ్ :P

వేణూశ్రీకాంత్ said...

హహహహ సూపర్ :)) అలాగలాగే మీరెలాగంటే అలాగే రాసేద్దాం... కరెన్సీ వివరాలేవో తొందరగా తెలుసుకోండి :)))

నిషిగంధ said...

బ్రహ్మలోకం ఆటోమేషన్ -- కల్లోకూడా అనుకోలేదు, శ్రావ్యా ఇంత ప్రెస్టీజియస్ ప్రోజెక్ట్‌లో నేను సైతం ఉండగలనని :)) థాంక్యూ.. థాంక్యూ!
కాకపోతే నేనీ మధ్య Joy Alukkas డైమండ్ సెట్ లేకుండా ఏ ఈవెంట్ ఒప్పుకోవడం లేదు ;-)

పొద్దున్నే భలే పోస్ట్ చదివించావ్! ఏమి ఐడియాలు వస్తాయ్ తల్లీ నీకు :)))

ఫోటాన్ said...

Pani lekundaa vaataa vaddu, Gun tho chese pani edainaa ivvandi :)) alaagani security gaurd ante oppukom :))€

Unknown said...

హహహ శ్రావ్యా, ఇంత క్రియేటివిటీకి వంద కెవ్వులు:)))అలోచన వచ్చింది కదా అడుగులు కూడా పడతాయిలే!ఏమో గుర్రం ఎగరావచ్చు:))) ఇంత మంచి టీం చేతిలో ఉంది కదా ఇంకా ఇంకా అలోచించు:)))

Chandu S said...

ఆ బొమ్మలో కన్పించే విల్లా నా పేరు మీద వ్రాయిస్తే మీ సక్సెస్ స్టోరీ వ్రాసిపెడతా.
(నాబ్లాగులో వ్రాయడానికి కూడా నేనిలాగే ఛార్జ్ చేస్తున్నా.)

పద్మవల్లి said...

చాలా బాగుంది శ్రావ్యా... వెరీ క్రియేటివ్ ఐడియా. టీం కూడా మంచివాళ్ళనే ఎంచుకున్నావు. సో ప్రాజెక్ట్ సగం సక్సెస్ అయిపోయినట్టే.
నాకిచ్చిన రోల్ కి అసలు అన్యాయం చెయ్యను. అసలే నాది టెస్టింగ్ టీం నుంచి పాస్ సర్టిఫికేట్ తెచ్చుకున్న వాటిని కూడా బ్రేక్ చేసిన హిస్టరీ. కాబట్టి బంతి గారు, రాజ్ కుమార్ కాస్త పారాహుషార్. నా షేర్ జమ చెయ్యడానికి నా స్విస్స్ ఎకౌంటు నెంబర్ ప్రైవేట్గా నీకు పంపిస్తాను.

@@ అది చూసాకా నాకు అర్ధం కానీ విషయం అసలు వీళ్ళకి నెలకి ఎంత బిజినెస్స్ టార్గెట్ ఉంటుంది , అది పూర్తి చేయయానికి వీళ్ళు ఎలాంటి కష్టం పడతారు.
Jokes apart, have you read "How Star bucks saved my life"??? వూరికే గుర్తొచ్చింది.

Bhardwaj Velamakanni said...

Sorry, but I cant share my strategically important contacts like this. Need a better price :)

yogirk said...

I thought you'd use me to yell at someone and fire people in the organization :)

శ్రీరామ్ said...

ఒకే ఊరివాళ్లం అయివుండి, మీ ప్రొజెక్ట్ లొ, కనీసం నన్ను తలుచుకొకుండా, మరచిపొతె ఎలా శ్రావ్య గారు ?

మీకు వినాయక చవితి శుభాకాంక్షలు ......

Sravya V said...

@హరేకృష్ణ హ హ మరే మహాభాగ్యం :-))
@నాగార్జున అబ్బా గాలిలో మేడలు బాగా కట్టేస్తున్నారు గా :-))
@రాజ్ ఎన్టీ నేను వజ్రాలు , బంగారం ఈ లెవెల్ లో ఆలోచిస్తుంటే మీరు బొబ్బట్లు అంటారు :-((, ఇక ఈ మాట చెప్పాకా మీ ప్యాకేజీ ఆ బొబ్బట్లే :-((
@సౌమ్య గారు హ హ అబ్బా అబ్బా ఎంత ఆనందమో కదా :-)) ఏంటీ రాజ్ , మీరు కలిసి ఏదన్నా ప్లాన్ చేద్దామనా అది కుదరదు :-))

Sravya V said...

@వేణు గారు అబ్బా అబ్బా ఎంత మంచి వారో అడగానే ఒప్పుకున్నారు :-))
@నిషి హ హ డైమండ్ సెట్ అంటే అంత చిన్న కోరికా :-))
@ఫోటాన్ బాబు మరీ మాఫియా లెవెల్ లో గన్ పాయింట్ మీద ప్రాజెక్ట్ కి ఒప్పించటం అంత బాగోదేమో :-))
@సునీతా గారు అంటే అంటారా గుర్రం ఎగరోచ్చు అంటారా హ హ :-))

Sravya V said...

@శైలజ గారు మరీ ఆ బొమ్మ లోదే అంటే ఓనర్ ఒప్పుకోడేమో , పోనీ అలాంటిది వేరేది అయితే పర్వాలేదు అంటారా ?:-))
@పద్మ గారు మరి మీ సంగతి తెలిసే కదా ఆ పోస్టు ఇచ్చింది . ఇక స్విస్స్ ఎకౌంటు త్వర గా ఇవ్వండి అలాగే ఎలా withdraw చేసుకోవాలో కూడా చెప్పండి :-))
ఇక ఆ బుక్ మీరు సజెస్ట్ చేసాకా చదవాలి అనిపిస్తుందండీ , చదువుతాను .
@భరద్వాజ్ గారు చా చా డామిట్ కథ అడ్డం తిరిగింది అనాలా నేను ఇప్పుడు :-))

Sravya V said...

@RK హ హ మల్టీ టాలెంట్ ఉన్న వాళ్లకి అదనపు బాధ్యతలు నెమ్మది గా ఇవ్వబడతాయన్న మాట :-))
@the tree గారు మీకు కూడా కొంచెం లేట్ గా వినాయక చవితి శుభాకాంక్షలు :-))
@శ్రీరాం గారు మర్చి పోలేదండి మనం ఒక ఊరి వాళ్ళం కదా, కాఫీ Shop లోనో మాట్లాడుకోవచ్చు బ్లాగు లో ఎందుకూ అని అండి, మీకు కూడా కొంచెం లేట్ గా వినాయక చవితి శుభాకాంక్షలు :-))

kiran said...

ప్రోడక్ట్ launch organize చేసినందుకు.....నాకేంటి అంట..ఆహా నాకేంటి అని :P
చాల బాగంది ఐడియా...
ఓ సారి బ్రహ్మ వస్తే నేను కడిగేద్దును.....ఈ మధ్య creativity ఎక్కువై పోయి సామాన్యులు ఫుల్ గా suffering మరి
నైస్ పోస్ట్ శ్రావ్య జి...
హమ్మయ్య నన్ను ఇక్కడ కోడింగ్ కి వాడనందుకు కోటి వందనాలు :D
నా పేరు బ్లాగ్ లో ఎట్టినందుకు చాకి లు...బేకు :P

Sravya V said...

హ హ కిరణ్ బ్రహ్మ నే కడిగేస్తారా :-) ఇక మీకు ఎంటటే ఒక మంచి painting కిట్ అది చాలు కదా :-)) చాకీలకి బోలెడు థాంక్స్ :-))

Raj said...

కేవ్వ్వ్వ్వ్వ్వ్వ్.. ఏం అవిడియా ఏం అవిడియా..

Any vacancies??? :D

Sravya V said...

రాజేంద్ర హ హ థాంక్ యు :-)

Post a Comment