స్కూల్ చదువు పూర్తి చేసిన స్టీవ్ ఆ తరవాతి సంవత్సరం సౌత్ వెస్ట్ పోర్ట్లాండ్ , ఒరెగాన్ లోని రీడ్ కాలేజ్ లో చేరటానికి నిర్ణయించుకున్నారు. ఈ రీడ్ కాలేజ్ లో చదువు చాలా ఖరీదు అయిన వ్యవహారం కావటం తో క్లారా , పాల్ జాబ్స్ సంపాదన లో చాల భాగం తన ఫీజ్ లకే ఖర్చు కావటం, పైగా ఆ కాలేజ్ చదువు తన భవిష్యత్తు కి ఎలా ఉపయోగపడుతుందో అన్న ఆలోచనలతో ఉన్న జాబ్స్ ఆరు నెలల కంటే తన చదువుని కొనసాగించలేక పోయారు.
స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ లో legendary commencement address సందర్భం గా స్టీవ్ తన కాలేజ్ చదువు గురించి గుర్తు చేసుకున్న మాటలు ఇవి:
After six months, I couldn't see the value in it. I had no idea what I wanted to do with my life and no idea how college was going to help me figure it out. And here I was spending all of the money my parents had saved their entire life. So I decided to drop out and trust that it would all work out OK. It was pretty scary at the time, but looking back it was one of the best decisions I ever made. The minute I dropped out I could stop taking the required classes that didn't interest me, and begin dropping in on the ones that looked interesting.
It wasn't all romantic. I didn't have a dorm room, so I slept on the floor in friends' rooms, I returned coke bottles for the 5¢ deposits to buy food with, and I would walk the 7 miles across town every Sunday night to get one good meal a week at the Hare Krishna temple. I loved it.
ఇలా గ్రాడ్యుయేట్ కాకుండానే తన మామూలు చదువు కి ఫుల్ స్టాప్ పెట్టిన జాబ్స్ , 18 నెలల పాటు అక్కడే కాలిగ్రఫీ కోర్సు చేస్తూ దాదాపు ఒక హిప్పీ లాగా రోజులు గడిపారు. ఈ కాలిగ్రఫీ కోర్సు, తరవాతి కాలం లో తనకి టైపోగ్రఫి పట్ల ఆసక్తి పెంచింది. ఇలాంటి సమయం లో స్టీవ్ కి వచ్చిన అత్యవసరంగా డబ్బు అవసరమైన పరిస్తితులు, ఆయన్ని 1974 లో Atari అనే వీడియో గేమ్ కంపెనీ లో ఉద్యోగం చేసేట్లు గా ప్రోత్సహించాయి. Atari లో పనిచేస్తున్న సమయం లోనే హార్వార్డ్ ప్రొఫెసర్ రిచర్డ్ అల్పెర్ట్ (ఇండియా లో రామదాస్ గా పిలిచేవారు ) టీచింగ్స్ ప్రభావం తో స్టీవ్, తన రీడ్ కాలేజ్ స్నేహితుడైన డాన్ కోట్కే తో కలిసి ఇండియా వచ్చారు , కానీ ఈ యాత్ర స్టీవ్ కి నిరుత్సాహం మిగిల్చింది .
స్టీవ్ ఇండియా కి వచ్చిన సమయం లో వోజ్నిక్ కి HP లో ఉద్యోగం వచ్చింది. ఇది ఒక రకం గా వోజ్నిక్ కి తన డ్రీంజాబ్. అయితే హార్డువేర్ జీనియస్ ఇంకా FORTRAN compilers, BASIC ప్రోగ్రామ్స్ రాయటం లో ప్రతిభ ఉన్న వోజ్నిక్ తన ఉద్యోగం తో పాటు Homebrew Computer Club అనే geeky గ్రూప్ లో చేరాడు . ఇందులో సభ్యులంతా టెక్నాలజీ మీద విపరీతమైన పాసినేషన్ ఉన్న ఇంజినీర్లు. ఇక్కడే వోజ్నిక్స్ తన గ్రూప్ సభ్యులకి ఉపయోగపడే ఒక కిట్ ని తయారు చేసాడు, అదే తరవాత లో ఆపిల్1 గా మనకందరికీ తెలిసింది . ఈ ప్రయత్నం విజయవంతం కావటం తో స్టీవ్ జాబ్స్ కి మనమే ఈ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ తయారు చేసి ఎందుకు అమ్మకూడదు అన్న ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన వోజ్నిక్ కి కూడా నచ్చటం తో వెంటనే కావలసిన పెట్టుబడి కూడబెట్టే పని లో పడ్డారు. 1000$ డాలర్ల తో మొదలైన ఈ కంపెనీ పెట్టుబడి కోసం వోజ్నిక్ తన HP 65 కాలుక్యులేటర్ అమ్మితే, జాబ్స్ ఏమో vw వాన్ అమ్మేసారు . ఇవి రెండూ అమ్మి సంపాదించిన డబ్బు తో ఫూల్స్ డే అయిన ఏప్రిల్ 1 , 1976 న స్టీవ్ జాబ్స్ ఇంటి గారేజ్ లో ఆపిల్ కంప్యూటర్స్ ని ప్రారంభించారు . ఇలా కంపెనీ ప్రారంభం అయిన మొదటి రోజుల్లో ఇద్దరూ స్టీవ్ లు కాక Ron Wayne అనే మూడో పార్టనర్ ఉండేవారు . ఈయన ఇద్దరు స్టీవ్ ల కన్నా వయస్సులో పెద్ద , కంపెనీ ఎకౌంటు వ్యవహారాలు ఈయన చూసేట్లు గా ఒప్పందం చేసుకున్నారు. కంపెనీ లో ఇద్దరు స్టీవ్ ల వాటా చెరో 45% అయితే , రాన్ వాటా 10 % . కానీ కంపెనీ ప్రారంభం అయిన కొన్ని వారాల్లోనే అప్పటికే కుటుంబ బాధ్యతలు ఉన్న రాన్ నమ్మకం లేని రిస్క్ తీసుకోలేక కంపెనీ ని వదిలేసారు .
ఆపిల్ 1 |
7 comments :
అలా జరిగిందా Apple నామకరణం.. భలే భలే..
baagundi..
ఆఖరులో కోట్ చేసిన టెక్స్ట్ చదివాక ఎందుకో స్టీవ్ పై గౌరవం పెరుగుతుంది నాకు...
Next Part Please :)
(we)iWaiting :)
@రాజేంద్ర , @సునీత గారు , @నాగార్జున , @ఫోటాన్ థాంక్ యు ఫ్రెండ్స్ :-)
@రాజేంద్ర పబ్లిష్ చేస్తున్నా :-)
@UG శ్రీరామ్ గారు మీరు పంపిన విడియోలు చూసానండి . తప్పకుండా ప్రయత్నం చేస్తాను వాటి మీద రాసేందుకు :-) మీ ప్రోత్సాహానికి చాల చాల థాంక్స్ !
రిప్లై చేయటం కొంచెం ఆలస్యం అయింది క్షమించేయండి :-)
Post a Comment