Subscribe:

Thursday, October 11, 2012

Steve Jobs(1955-2011) - 2/6


స్కూల్ చదువు  పూర్తి  చేసిన  స్టీవ్ ఆ తరవాతి సంవత్సరం  సౌత్  వెస్ట్  పోర్ట్లాండ్ , ఒరెగాన్ లోని  రీడ్  కాలేజ్ లో చేరటానికి  నిర్ణయించుకున్నారు.  ఈ రీడ్ కాలేజ్ లో చదువు  చాలా  ఖరీదు  అయిన   వ్యవహారం కావటం తో  క్లారా , పాల్ జాబ్స్  సంపాదన లో చాల  భాగం తన ఫీజ్ లకే ఖర్చు కావటం, పైగా  ఆ కాలేజ్  చదువు తన భవిష్యత్తు కి  ఎలా  ఉపయోగపడుతుందో  అన్న ఆలోచనలతో  ఉన్న   జాబ్స్   ఆరు నెలల కంటే తన చదువుని  కొనసాగించలేక పోయారు.

స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ లో legendary commencement address సందర్భం గా స్టీవ్ తన కాలేజ్ చదువు గురించి  గుర్తు చేసుకున్న మాటలు ఇవి:

After six months, I couldn't see the value in it. I had no idea what I wanted to do with my life and no idea how college was going to help me figure it out. And here I was spending all of the money my parents had saved their entire life. So I decided to drop out and trust that it would all work out OK. It was pretty scary at the time, but looking back it was one of the best decisions I ever made. The minute I dropped out I could stop taking the required classes that didn't interest me, and begin dropping in on the ones that looked interesting.
It wasn't all romantic. I didn't have a dorm room, so I slept on the floor in friends' rooms, I returned coke bottles for the 5¢ deposits to buy food with, and I would walk the 7 miles across town every Sunday night to get one good meal a week at the Hare Krishna temple. I loved it.


ఇలా   గ్రాడ్యుయేట్   కాకుండానే  తన  మామూలు  చదువు కి ఫుల్ స్టాప్ పెట్టిన  జాబ్స్ , 18 నెలల  పాటు అక్కడే  కాలిగ్రఫీ   కోర్సు చేస్తూ   దాదాపు   ఒక హిప్పీ  లాగా  రోజులు  గడిపారు.  ఈ కాలిగ్రఫీ  కోర్సు,   తరవాతి కాలం లో  తనకి  టైపోగ్రఫి  పట్ల ఆసక్తి పెంచింది.  లాంటి  సమయం లో  స్టీవ్ కి  వచ్చిన  అత్యవసరంగా డబ్బు అవసరమైన  పరిస్తితులు,    ఆయన్ని 1974 లో  Atari  అనే  వీడియో  గేమ్  కంపెనీ లో  ఉద్యోగం  చేసేట్లు గా  ప్రోత్సహించాయి. Atari   లో  పనిచేస్తున్న  సమయం లోనే  హార్వార్డ్   ప్రొఫెసర్   రిచర్డ్  అల్పెర్ట్  (ఇండియా లో   రామదాస్  గా పిలిచేవారు ) టీచింగ్స్  ప్రభావం తో   స్టీవ్,   తన   రీడ్  కాలేజ్   స్నేహితుడైన   డాన్ కోట్కే  తో  కలిసి  ఇండియా   వచ్చారు ,   కానీ  ఈ యాత్ర  స్టీవ్  కి  నిరుత్సాహం  మిగిల్చింది . 

ఆపిల్ 1
స్టీవ్  ఇండియా  కి వచ్చిన  సమయం లో వోజ్నిక్  కి  HP   లో  ఉద్యోగం   వచ్చింది.  ఇది  ఒక రకం గా వోజ్నిక్ కి తన డ్రీంజాబ్.   అయితే హార్డువేర్  జీనియస్ ఇంకా   FORTRAN compilers,  BASIC  ప్రోగ్రామ్స్  రాయటం లో  ప్రతిభ  ఉన్న    వోజ్నిక్  తన  ఉద్యోగం తో  పాటు Homebrew Computer Club  అనే  geeky  గ్రూప్  లో చేరాడు .  ఇందులో సభ్యులంతా    టెక్నాలజీ   మీద   విపరీతమైన  పాసినేషన్ ఉన్న  ఇంజినీర్లు.  ఇక్కడే  వోజ్నిక్స్  తన  గ్రూప్   సభ్యులకి  ఉపయోగపడే  ఒక కిట్  ని  తయారు  చేసాడు, అదే తరవాత  లో  ఆపిల్1  గా  మనకందరికీ తెలిసింది . ఈ ప్రయత్నం   విజయవంతం కావటం తో  స్టీవ్ జాబ్స్  కి మనమే  ఈ  ప్రింటెడ్  సర్క్యూట్   బోర్డ్స్  తయారు చేసి  ఎందుకు అమ్మకూడదు  అన్న  ఆలోచన   వచ్చింది.  ఆ ఆలోచన  వోజ్నిక్ కి కూడా నచ్చటం తో  వెంటనే   కావలసిన  పెట్టుబడి కూడబెట్టే  పని లో పడ్డారు. 1000$ డాలర్ల తో  మొదలైన  ఈ  కంపెనీ  పెట్టుబడి కోసం  వోజ్నిక్ తన  HP 65  కాలుక్యులేటర్ అమ్మితే,    జాబ్స్  ఏమో   vw వాన్    అమ్మేసారు . ఇవి రెండూ అమ్మి సంపాదించిన  డబ్బు  తో ఫూల్స్  డే అయిన ఏప్రిల్ 1 , 1976 న  స్టీవ్ జాబ్స్  ఇంటి  గారేజ్ లో  ఆపిల్ కంప్యూటర్స్ ని  ప్రారంభించారు .  ఇలా కంపెనీ ప్రారంభం  అయిన    మొదటి  రోజుల్లో  ఇద్దరూ  స్టీవ్ లు  కాక   Ron Wayne    అనే   మూడో పార్టనర్ ఉండేవారు .  ఈయన  ఇద్దరు  స్టీవ్ ల కన్నా వయస్సులో   పెద్ద ,  కంపెనీ  ఎకౌంటు  వ్యవహారాలు  ఈయన  చూసేట్లు  గా  ఒప్పందం  చేసుకున్నారు.  కంపెనీ లో ఇద్దరు  స్టీవ్ ల వాటా  చెరో  45% అయితే , రాన్  వాటా 10 % . కానీ కంపెనీ ప్రారంభం అయిన  కొన్ని  వారాల్లోనే  అప్పటికే  కుటుంబ బాధ్యతలు  ఉన్న   రాన్ నమ్మకం లేని రిస్క్  తీసుకోలేక కంపెనీ ని వదిలేసారు . 

Apple-1 Logo
ఆపిల్ 1 లోగో 
ఆపిల్ పేరు వెనక కథ : ఒక టెక్నాలజీ కంపెనీ కి ఆపిల్ అని పేరు పెట్టడం వెనక కథ ఏమిటో తెలుసుకోవాలని మనలో చాలా మంది కి ఆసక్తి కదా? దీనికి కారణం అప్పటికే ఉన్న చాలా టెక్నాలజీ కంపెనీల పేర్లు పలక టానికి కష్టం గా ఉండటం తో త్వరగా  జనాల్లోకి వెళ్ళాలి అంటే ఈజీ గా పలికే పేరు ఉండాలి అని నిర్ణయం తీసుకున్నారు . కానీ కంపెనీ రిజిస్టర్ చేసే చివరి నిమషం వరకు ఏ పేరు తట్టలేదు . దాని తో స్టీవ్ తన కష్ట కాలం  లో   ఏ   పళ్ళు తిని తన ఆకలి తీర్చుకున్నాడో అదే ఆపిల్ పేరు పెట్టాలి అని నిర్ణయం తీసుకున్నారు . అంతే కాకుండా ఆపిల్ చాలా న్యూట్రియస్ విలువలున్న పెర్ఫెక్ట్ పండు అని , ఇంకా మిగలిన పండ్ల తో పోలిస్తే అందమైన ప్యాకింగ్ తో ఉండి , త్వర గా పాడవదు అన్న అభిప్రాయం తో కంపెనీ కి ఆ  పేరు పెట్టాలి అన్న నిర్ణయం తీసుకున్నారు .  ఇలా  ప్రింటెడ్  సర్క్యూట్  బోర్డులు  తయారు చేసి అమ్ముదామని  మొదలైన  ఆపిల్  కంపెనీ కి మొదటి ఆర్డర్ "The Byte Shop "  అనే  కంప్యూటర్ షాప్  నుంచి  50  పూర్తి  గా  ఎసెంబుల్ చేసిన కంప్యూటర్స్ కోసం వచ్చింది .  దీని కి గుర్తు గా ఆ తరవాత  ఆపిల్ 2  రిలీజ్  చేసే ముందు  తయారుచేసిన  ఆపిల్ లోగో లో ఒక  పక్కన  ఉన్న  bite తో డిజైన్  చేసారు.   అంటే ఆ bite ,   byte  కి   గుర్తు . 
ఇలా 1976 ఏప్రిల్ 1 ప్రారంభం అయిన  ఆపిల్ కంప్యూటర్స్ జూలై 1976 లో   మొదటి ఆపిల్  1 ని   666.66 $  కి అమ్మడం  మొదలు పెట్టింది.  తయారు  చేసిన 200 ల ఆపిల్ 1  లలో  175  కంప్యూటర్స్ ని 10 నెలల  కాలం లో అమ్మ గలిగారు. 
అదే  సమయం లో   Mike Markkula (Apple's Angel Investor) అనే  మిలియనీర్  ఆపిల్  కంప్యూటర్స్ లో    పెట్టిన  క్వార్టర్ మిలియన్ డాలర్ల పెట్టుబడి  ఆపిల్ కంప్యూటర్స్,   ఆపిల్ - 2  వైపు గా అడుగులు వేయటానికి  ఉపయోగపడింది . 1977 లో ఆపిల్ కంప్యూటర్స్  , మొట్టమొదటి  user friendly   కలర్   డిస్ప్లే    ఉన్న   పర్సనల్ కంప్యూటర్  ని    రిలీజ్ చేసింది .  అప్పుడే   రిలీజ్ అయిన  VisiCalc, అనే  మొట్టమొదటి  మైక్రో computers  కోసం  తయారు చేసిన  spreadsheet    ఒక్క సారి గా ఆపిల్ కంప్యూటర్స్   బిజినెస్  ని  నెలకి 1000  units  నుంచి 10000 units  కి పెంచింది .  ఇలా   1978, 79 , 80 లలో  చవి చూసిన   సక్సెస్  తో 1980 డిసెంబర్ 12 న  ఆపిల్ కంప్యూటర్స్  Inc . పబ్లిక్  ఇష్యూ కి వెళ్ళింది . అప్పటి  కంపెనీ  విలువ  1.8 బిలియన్  డాలర్లు . 

కంపెనీ మానేజింగ్  డైరెక్టర్  గా   ఆధునిక  మార్కెటింగ్  కిటుకులు  తెలిసిన  చరిస్మాటిక్  వ్యక్తి  ఉండాలి అన్న అవసరాన్ని  గుర్తించిన  Mike Markkula ,  జాబ్స్  దానికి  సరైన వ్యక్తి  గా  పెప్సి మేనేజర్ గా పనిచేస్తున్న John  Sculley ని గుర్తించారు . 

John  Sculley ని ఆపిల్ లో చేరటానికి ఒప్పించటానికి  స్టీవ్  వాడిన  ఈ క్రింది  వాక్యం  తరవాత  కాలం లో  బాగా   ఫేమస్  అయ్యింది   :-)  

Do you want to sell sugared water for the rest of your life or do you want to come with me and change the world?”

(అసలు   సిసలు కార్పొరేట్  యుద్దాలు  తరవాత భాగం లో అప్పటి వరకు) 

"So when a good idea comes, you know, part of my job is to move it around, just see what different people think, get people talking about it, argue with people about it, get ideas moving among that group of  100 people, get  different people together to explore different aspects of it quietly, and, you know" ... just explore things
- Steve Jobs

-శ్రావ్య 

(Image Credit : Google images)

Recommendations

7 comments :

Raj said...

అలా జరిగిందా Apple నామకరణం.. భలే భలే..

Unknown said...

baagundi..

..nagarjuna.. said...

ఆఖరులో కోట్ చేసిన టెక్స్ట్ చదివాక ఎందుకో స్టీవ్ పై గౌరవం పెరుగుతుంది నాకు...

ఫోటాన్ said...

Next Part Please :)

Raj said...

(we)iWaiting :)

Sravya V said...

@రాజేంద్ర , @సునీత గారు , @నాగార్జున , @ఫోటాన్ థాంక్ యు ఫ్రెండ్స్ :-)
@రాజేంద్ర పబ్లిష్ చేస్తున్నా :-)

Sravya V said...

@UG శ్రీరామ్ గారు మీరు పంపిన విడియోలు చూసానండి . తప్పకుండా ప్రయత్నం చేస్తాను వాటి మీద రాసేందుకు :-) మీ ప్రోత్సాహానికి చాల చాల థాంక్స్ !
రిప్లై చేయటం కొంచెం ఆలస్యం అయింది క్షమించేయండి :-)

Post a Comment