The heaviness of being successful was replaced by the lightness of being a beginner again, less sure about everything. It freed me to enter one of the most creative periods of my life.
- Steve Jobs
1980 డిసెంబర్ లో పబ్లిక్ ఇష్యూ కి వెళ్ళిన ఆపిల్, ఫోర్డ్ కంపెనీ (1956) తరవాత అమెరికా చరిత్ర లో అతి పెద్ద సక్సెస్ చూసిన కంపెనీ గా అత్యంత ఆదరణ పొందింది . దానితో పాటే 1982 Feb లో టైం మాగ్జైన్ కవర్ పేజ్ మీద స్టీవ్ ఫోటో ని ప్రింట్ చేసింది. దీనితో 27 యేళ్ళ స్టీవ్ జాబ్స్ కి, అమెరికా Young Entrepreneurs సింబల్ గా ఇమేజ్ వచ్చింది . కానీ రోజులు ఎప్పుడూ ఒకే రకం గా ఉండవు కదా, క్రమేణా తరవాతి రోజులలో ఆపిల్ నష్టాలు చవి చూడాల్సి వచ్చింది . దానితో పాటే స్టీవ్ కూడా కొన్ని చేదు అనుభవాలు చూడాల్సి వచ్చింది. అవి :
- 1980 మే లో ఆపిల్ రిలీజ్ చేసిన ఆపిల్ III సీరియస్ స్టెబిలిటీ సమస్యల తో మార్కెట్ లో ఫెయిల్ అవ్వడం, ఇది కంపెనీ పైన తీవ్రమైన ఒత్తిడి పెంచింది.
- Feb . 7 1981 న వోజ్నిక్ నడుపుతున్న Beechcraft Bonanza A36TC క్రాష్ అవ్వటంతో ఆరోగ్యపరం గా ఆపిల్ నుంచి దూరం గా ఉండాల్సి వచ్చింది.
- 1979 లో స్టీవ్ Xerox Palo Alto Research Center లో చూసిన మౌస్, GUI (Graphical User Interface ) టెక్నాలజీ ఆధారం గా తన ఊహలకి రూపకల్పన చేయాలి అని మొదలు పెట్టిన లిసా ప్రాజెక్ట్ కి కంపెనీ అంతర్గత సమస్యలతోదూరంగా ఉండాల్సి వచ్చింది.
- లిసా ప్రాజెక్ట్ నుంచి దూరం జరిగిన స్టీవ్, మాక్ (Macintosh) ప్రాజెక్ట్ ని లీడ్ చేస్తుండటంతో అది కాస్తా లిసా, మాక్ టీం మధ్య అంతర్గత కాంపిటీషన్ గా మారింది .
- అదే సమయంలో పర్సనల్ కంప్యూటర్ రంగంలో ఆపిల్ సక్సెస్ ని చూసిన IBM, తన IBM PC తో మార్కెట్ లో ఆపిల్ కి అతి పెద్ద పోటీదారుగా మారింది.
- IBM PC దెబ్బతో లిసా, మాక్ (first model) రెండూ నష్టాలు చూడాల్సి వచ్చింది . దీనికి ప్రధాన కారణాలు 1) IBM PC తో పోల్చితే ఖరీదు ఎక్కువ కావటం ఒక కారణం అయితే . ఆపిల్ - ii వరకు ఓపెన్ ఆర్కిటెక్చర్ వాడిన ఆపిల్ , మాక్ తో క్లోస్డ్ ఆర్కిటెక్చర్ ని వాడటం తో up gradation కష్టం కావటం 2)128 kilobytes of main memory తో తయారైన మాక్ మొదటి మోడల్ కి హార్డ్ డిస్క్ కానీ రెండోవ ఫ్లాపీ డ్రైవ్ కానీ లేకపోవటం తో సిస్టం , ప్రోగ్రాం మధ్య స్విచ్ కావాల్సిన అవసరం ఉండేది.ఇలాంటి సమస్యలతో IBM PC తో పోల్చితే అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడి , వాడటానికి సులువు గా ఉండి, తరువాతి కాలం లో కంప్యూటింగ్ face నే మార్చేసిన మాక్ మార్కెట్ లో వెనుకంజ వేయాల్సి వచ్చింది.
ఇలా వరుస ఫెయిల్యూర్స్, అంతర్గత వివాదాలతో ముదురుతున్న సమస్యలని పరిక్షరించడానికి ఆపిల్ మేనేజ్మెంట్ ఏప్రిల్ 1985 లో re-organization దిశ గా అడుగులు వేసింది. Jean-Louis Gassée ని మాక్ టీం కి మానేజర్ గా నియమించారు. కొత్తగా R & D డిపార్టుమెంటు ప్రారంభించాలి అన్న స్టీవ్ ప్రతిపాదనకి, రాత పూర్వకమైన గారెంటీ అడగటం తో అప్పటికే సరైన సంబంధాలు లేని స్టీవ్, Sculley ల మధ్య పర్సనల్ వార్ కి దారి తీసింది, మానేజెమెంట్ Sculley కి మద్దతు గా నిలవడం తో 1985 సెప్టెంబర్ లో తన సన్నిహితులతో ఆపిల్ నుంచి బయటికి వచ్చేసాడు.
At 30 I was out. And very publicly out. What had been the focus of my entire adult life was gone, and it was devastating. I really didn't know what to do for a few months. I felt that I had let the previous generation of entrepreneurs down — that I had dropped the baton as it was being passed to me. I met with David Packard and Bob Noyce and tried to apologize for screwing up so badly. I was a very public failure, and I even thought about running away from the Valley.
At 30 I was out. And very publicly out. What had been the focus of my entire adult life was gone, and it was devastating. I really didn't know what to do for a few months. I felt that I had let the previous generation of entrepreneurs down — that I had dropped the baton as it was being passed to me. I met with David Packard and Bob Noyce and tried to apologize for screwing up so badly. I was a very public failure, and I even thought about running away from the Valley.
-Stanford Commencement Address, 12 Jun 2005
ఇలా ఆపిల్ నుంచి బయటికి వచ్చిన స్టీవ్ ఒక్క దాన్ని తప్ప, తన మిగిలిన ఆపిల్ స్టాక్స్ ని అన్నిటి ని అమ్మేసాడు. ఈ ఒక్క స్టాక్ ని ఉంచకోవటం వెనక రకరకాలైన కథనాలు ఉన్నాయ్ :-) ఈ వచ్చిన డబ్బు తో బిజినెస్, రీసెర్చ్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషనల్ అవసరాలకి అనుగుణం గా పవర్ఫుల్ కంప్యూటర్ ని డిజైన్ చేయాలి అన్న ఉద్దేశ్యం తో Next అనే హార్డువేర్ సాఫ్ట్వేర్ కంపనీ ని రిజిస్టర్ చేసాడు. 1985 లో రిజిస్టర్ చేసినప్పటికి, కంపెనీ రిజిస్టర్ చేయగానే 6 కో-ఫౌండర్స్ అయిన తన ex -employees ని ఆపిల్ కంపెనీ టెక్నాలజీ దొంగిలించారు అన్న ఆరోపణ తో sue చేయటం తో ఒక సంవత్సరం పాటు ఈ ప్రోడక్ట్ పైన వర్క్ చేసే వీలు లేకపోయింది. ఈ సమయాన్ని, "A " player only works with "A" అన్న పాలసీ నమ్మే స్టీవ్ జాబ్స్ తన డ్రీం టీం ని రిక్రూట్ చేయటానికి వాడుకున్నాడు . Next కంపెనీ గురించి సిలికాన్ వాలీ లో బోలెడంత హైప్ ఉండేది . దానికి తగ్గట్లే Next working environment , సౌకర్యాలు, పే ఉండేవి. స్టీవ్ 1988 అక్టోబర్ లో తన మొదటి "Next Cube" presentation ని ఇచ్చారు. ఈ presentation చివరిలో వయలినిస్ట్ తో పాటు గా Next Cube పాడిన డ్యూయట్ తో మొదటిసారి గా కంప్యూటర్ సౌండ్ ఎబిలిటీ ని ప్రపంచానికి పరిచయం చేసాడు . టెక్నాలజీ పరం గా విపరీతం గా ఆకర్షించిన Next Cube ఖరీదు ఎక్కువ కావటం తో కేవలం 50,000 యూనిట్స్ మాత్రమే మార్కెట్ చేయగలిగారు. కానీ తరవాత కాలం లో ఈ టెక్నాలజీ ఈ రోజు మనం చూస్తున్న web server, web browsers డిజైన్ కి ఫౌండేషన్ గా ఉపయోగపడింది. Next Cube మార్కెట్ లో అనుకున్నంత సక్సెస్ సాధించలేకపోవటం తో Next ని కేవలం సాఫ్ట్వేర్ సేవలకి మాత్రమే పరిమితం చేసి , తన దృష్టి ని Pixar వైపు మళ్ళించాడు.
Next ని ప్రారంభించిన స్టీవ్ జాబ్స్ అదే సమయం లో (1986 లో) హాబీ గా ఇప్పుడు Pixar animanation studios గా అని పిలుస్తున్న అప్పటి Lucasfilm అనే కంపెనీ లో అనిమేషన్ విభాగాన్ని కొనడం తో పాటు, 5 వేల మిలియన్ డాలర్లని అదే కంపెనీ లో పెట్టుబడి పెట్టాడు. Pixar Image Computers ని అమ్మాలి అన్న ఉద్దేశ్యం తో ప్రారంభించిన అది అంత గా ఆశాజనకం గా లేకపోవటం తో, 1990 లో కేవలం కార్టూన్ సినిమా తయారీ మీద దృషి పెట్టాలి అని నిర్ణయం తీసుకున్నాడు. అలా నిర్ణయించిన తర్వాత Pixar డిస్నీ కోసం 30 మిలియన్ డాలర్ల తో ప్రొడ్యూస్ చేసిన "Toy Story " (worlds first computer animated feature film) 360 మిలియన్ డాలర్ల సంపాదించింది. నిజానికి ఈ సక్సెస్ అప్పటికే మిలియన్ల డాలర్లు ఖర్చు పెట్టినా Next, PIG కంప్యూటర్స్ అనుకున్నంత గా సక్సెస్ కాకపోవటం తో ఫైనాన్షియల్ సమస్య లతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న స్టీవ్ ని ఒక్కసారి గా ఒడ్డున పడేసింది. "Toy Story " సక్సెస్ తో, Pixar 29 నవంబర్ 1995 లో పబ్లిక్ ఇష్యూ కి వెళ్ళింది. తరవాత 2006 లో Walt Disney తో మెర్జ్ అయ్యింది . దీనితో డిస్నీ లో స్టీవ్ మేజర్ షేర్ హోల్డర్ అయ్యారు. ఇవాళ Pixar, CGI అనిమేషన్ రంగం లో నెంబర్ వన్ అని మనందరికీ తెలిసిన విషయమే.
How Steve reinvented Apple ? - Wait Wait it will be in next part :-)
-శ్రావ్య
Apple has some tremendous assets, but I believe without some attention, the company could, could, could — I'm searching for the right word — could, could die.
-Steve Jobs(18 August 1997)
(Images credit: Google Images)
World's first computer animated feature film
Recommendations :
http://youtu.be/tBjo5-u_mHo
http://youtu.be/0lvMgMrNDlg
http://youtu.be/ZImohBzSRDU
8 comments :
<>
ఏమిటండీ అవీ?? చెప్పలేదు..
It is very good move that he became a part of Pixar instead starting his own company again.. I really appreciate that move..
Toy story series is still one of the movies that I keep in my hard disk to watch them once in a while..
<>
ఏమిటండీ అవీ?? చెప్పలేదు..
@రాజేంద్ర మీరు కామెంట్ లో కోట్ చెయ్యాలి అనుకున్న టెక్స్ట్ రావటం లలేదు అనుకుంటా :-) నాకు అర్ధం అయ్యింది మీరేమి అడుగుతున్నరో :-)
ఈ ఒక్క స్టాక్ ని ఉంచకోవటం వెనక రకరకాలైన కథనాలు ఉన్నాయ్ :-) - దీని గురించే కదా ?
------------------------------------------
౧. ఆ ఒక్క స్టాక్ ఉంచుకోవటం తో ఆపిల్ బోర్డ్ మీటింగ్ అటెండ్ అవటానికి అవకాశం ఉంటుంది .
౨. ఆపిల్ అంటే ఉన్న సెంటిమెంట్ తో ఆ ఒక్క స్టాక్ అన్నా ఉంచుకోవాలి అనుకున్నాడు .
౩. ఎప్పటికైనా తిరిగి ఆప్లె కి రావాలి అన్న సెంటిమెంట్ తో ఆ స్టాక్ అమ్మలేదు
వీటన్నిటి లోకి నమ్మ దగినది మొదటి కారణం అని చాలా మంది తో పాటు నా నమ్మకం కూడా :-)
బాగా రాస్తున్నారు శ్రావ్యా... తరువాతి భాగం కోసం ఎదురు చూస్తున్నాను.
yeah..waiting.. ;)
nice series sravyaji...
steve_jobs_how_to_live_before_you_die
అని ted.com lo ఇవాళ ఉదయమే ఒక వీడియో చూసాను స్టీవ్ జాబ్స్ గారిది. ఆయన హరే కృష్ణ టెంపుల్ లో కడుపునిడా వారానికి ఒకమారైనా భోజనం చేయటానికి 7 కిలోమీటర్లు నడచి వెళ్ళే వారంట.
http://youtu.be/UF8uR6Z6KLc
see this video also
Nice Article, I will share this link to my friends.
thanks
?!
I am waiting for your next post(part) also
thanks
@రాజేంద్ర , @వేణు శ్రీకాంత్ గారు , @రాజ్ కుమార్ , @ఎందుకో ఏమో గారు , @శ్రీకాంత్ గారు మీ అందరి పోత్సహకర వాఖ్యలకి చాల చాల థాంక్స్ అండి :-)
Post a Comment