Subscribe:

Wednesday, November 14, 2012

Steve Jobs(1955-2011) - 5/6


I remember sitting in his backyard in his garden one day and he started talking about God. He said, "Sometimes I believe in God, sometimes I don't. I think it's 50-50 maybe. But ever since I've had cancer, I've been thinking about it more. And I find myself believing a bit more. I kind of-- maybe it's 'cause I want to believe in an afterlife. That when you die, it doesn't just all disappear. The wisdom you've accumulated. Somehow it lives on. Then he paused for a second and he said 'yeah, but sometimes I think it's just like an on-off switch. Click and you're gone.' He said—and paused again, and he said, "And that's why I don't like putting on-off switches on Apple devices.

జనవరి 2000 లో సీఈఓ గా , స్టీవ్ జాబ్స్  పూర్తి స్థాయి  బాధ్యతలు చేపట్టిన తరవాత ఆపిల్ చేసిన రిలీజ్స్  లో Mac OS X  మొట్టమొదటి  అతి పెద్ద రిలీజ్. ఇది NEXTSTEP ఆధారితంగా డిజైన్ చేయబడిన మాక్ OS.  సెప్టెంబర్ 13 న  Mac OS X పబ్లిక్  బీటా వెర్షన్ ని (Kodak ) రిలీజ్ చేసిన యాపిల్  మార్చ్ 24 2001 న పూర్తి స్థాయి Mac OS X 10.0  (ఛీతా)  ని  రిలీజ్ చేసింది. ప్రస్తుతం (2012) నడుస్తున్న వెర్షన్  OS X 10.8 (Mountain Lion). మొదటి వెర్షన్ లో కొన్ని పెర్ఫార్మెన్స్ కి సంబంధించిన ఇష్యూస్ ఎదుర్కొన్నప్పటికీ సాధారణం గా వాడే గ్రే కలర్  బదులు translucent కలర్స్ వాడటం,  angles  బదులు గా సర్కిల్స్ వాడటం వంటి  వాటితో  సరికొత్త గా తయారుచేసిన  User Interface (ఆక్వా) తో  మార్కెట్ లో మంచి గుర్తింపు పొందటమే  కాకుండా ఆపిల్ సక్సెస్ లో కీ రోల్ పోషించింది / పోషిస్తుంది.
1980 లలో  డేటాబేస్, spread sheet ప్రోగ్రాం లతోను, 1990 ల లో ఇంటర్నెట్ తోనూ  పెను మార్పులు సంతరించుకున్న పర్సనల్ కంప్యూటింగ్ రంగం లో,  2000 తోలి రోజుల్లో స్తబ్దత నెలకొంది. (దీనికి  dot-com bubble కూడా ఒక కారణం)అంతే కాకుండా ఇంటర్నెట్ సక్సెస్ చూసిన చాలా మంది experts  భవిష్యత్తు లో  పర్సనల్ కంప్యూటర్ కేవలం ఒక టెర్మినల్ device గా మారిపోతుంది అని అభిప్రాయపడ్డారు. కానీ visionary అయిన  స్టీవ్ జాబ్స్ ఆలోచన  దీనికి భిన్నం గా ఉంది.  ఆ ఆలోచనే 2000 సంవత్సరం లో మొదలై  2001సంవత్సరంలో మాక్ వరల్డ్ San  Francisco లో పరిచయం చేసిన  Digital Hub గా రూపుదిద్దుకుని  పర్సనల్ కంప్యూటర్ భవిష్యత్తు ఏమిటి అనే దానికి  సమాధానమయ్యింది. PDAs , DVD వీడియో ప్లేయర్స్ , డిజిటల్ కామెరాస్, వీడియో కామెరాస్,  పోర్టబుల్ మ్యూజిక్ ప్లేయర్స్ వంటి డిజిటల్ devices ని మాక్ కి కనెక్ట్ చేసి డిజిటల్ ఫైల్స్ ని షేర్ చేయటం ద్వారా టెక్స్ట్, ఇమేజెస్,  వీడియో, సౌండ్ mix చేయగలిగే సౌకర్యం కలిగించటం అనేది ఈ Digital Hub వెనక ఉన్న ఐడియా. నిజానికి ఈ Digital Hub ప్రధాన ఉద్దేశ్యం  విపరీతమైన పోటీ ఉన్న PC మార్కెట్ లో ఆపిల్ షేర్ ని పెంచుకోవటం, ఈ కాన్సెప్ట్ విజయవంతం కావటం తో  స్టీవ్  ఉద్దేశ్యం నేరవేరింది.
కస్టమర్స్ కి దగ్గర కావాలి అన్న ప్రయత్నంలో భాగంగా  1991 మే 15 న ఆపిల్ తన మొదటి రిటైల్ స్టోర్ ని ప్రారంభించింది. designing అంటే అత్యంత శ్రద్ద చూపించే స్టీవ్ జాబ్స్ ఆధ్వర్యం లో ఈ రిటైల్ స్టోర్స్  ఇన్నోవేటివ్ ఇంటీరియర్స్, జీనియస్ బార్ ఇంకా personalized selling approach, కస్టమర్స్ డైరెక్ట్ గా ఆపిల్ devices ని వాడి చూసే అవకాశం ఉండటం తో సహజం గానే Darlings of the retail computer industry గా మారాయి. సంవత్సరానికి సుమారుగా 75 మిలియన్ల మందిని,ఈ ఆపిల్ రిటైల్ స్టోర్స్ ఆకర్షిస్తున్నాయి అని అంచనా.
డిజిటల్ లైఫ్ స్టైల్ లో భాగం గా అప్పటికే మార్కెట్ లో ఉన్న డిజిటల్ కామెరా, camcorder లాగా ఒక మంచి compelling product ఏదీ డిజిటల్ మ్యూజిక్ ప్లేయర్ రంగం లో లేకపోవటం స్టీవ్ జాబ్స్ దృష్టిని ఆకర్షించింది. దానితో  iPod(i is common Apple's prefix , pod stands for portable open database - the name of software that runs iPod)  విడుదల కి రంగం  సిద్దం  అయ్యింది. కేవలం 9 నెలల  కాలం లో రూపుదిద్దుకున్న iPod ని మొదటిసారిగా అక్టోబర్ 2001 (హాలిడే సీజన్) లో విడుదల చేసారు . నిజానికి మొదట్లో  అది కేవలం  సెప్టెంబర్ 11 ట్విన్ టవర్స్  అటాక్స్ జరిగిన ఆరు వారాల వ్యవధి లోనే కావటం తో ఇంకా అదే షాక్ లో ఉన్న  ప్రజలని అంతగా ఆకట్టు కోలేదు. కానీ క్రమేపీ విండోస్ మెషిన్ తోకూడా చాలా ఈజీ గా మ్యూజిక్ ని ఈ  ప్లేయర్ లోకి డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉండటం,  gorgeous లుక్, బటన్స్ లాంటివి ఏవీ లేకుండా చిన్న వీల్ తో కావాల్సిన విధం గా మ్యూజిక్ ని కంట్రోల్ చేసే అవకాశం, "a thousand songs in your pocket" అన్న ఆపిల్ ట్యాగ్ లైన్ iPod సూపర్ హిట్ కావటానికి దోహదం చేసాయి.  నిజానికి iPod సక్సెస్ iMac సేల్స్ ని పెంచింది .  ఇలా మ్యూజిక్ రంగం లోకి అడుగు పెట్టిన ఆపిల్ తరవాత కాలం లో మ్యూజిక్ పైరసీ ని ఆపేందుకు , లీగల్ సొల్యూషన్  కనుక్కునే ప్రయత్నం లో ఆన్లైన్ మ్యూజిక్ స్టోర్ దిశ గా అడుగులు వేసింది.  స్టీవ్ జాబ్స్ తన కున్న negotiation స్కిల్స్ తో మ్యూజిక్ కంపెనీలని దీనికి ఒప్పించటం లో  సఫలం అయ్యాడు.28 ఏప్రిల్ 2003 న  ఇలా మొదలైన  iTunes  మ్యూజిక్ స్టోర్ Wal-Mart తరవాత అతి పెద్ద మ్యూజిక్ రిటైల్ స్టోర్ గా మారింది. 2008 నాటికి ఆపిల్ రెవిన్యూ లో సగభాగం iPod, iTunes మ్యూజిక్ స్టోర్ సేల్స్ దే. అంతే కాకుండా  2011 లో స్టీవ్ జాబ్స్ కి మ్యూజిక్ రంగం లో  విశిష్ట  కృషి చేసిన వారికి ఇచ్చే ప్రతిష్ఠాకరమైన Grammy అవార్డు సంపాదించి పెట్టడం తో పాటు జాబ్స్ కిష్టమైన బీటిల్స్ మ్యూజిక్ ని తన జీవిత కాలం లో iTunes స్టోర్ అందించే సౌకర్యాన్ని కల్పించింది . 
(తరవాత కాలం లో ఆపిల్ విడుదల చేసిన iPod వివరాలు ఇక్కడ చూడొచ్చు .)

Apple - Steve Jobs introduces the ipod - 2001

ఇలా ఆపిల్ సక్సెస్ బాట లో సాగిపోతున్న సమయం లో 2003 స్టీవ్ జాబ్స్ ని తిరిగి ఒడిదుడుకులకి గురిచేసింది. అక్టోబర్ 2003 లో రొటీన్ గా abdominal స్కాన్ అటెండ్ అయిన సమయం లో డాక్టర్స్ pancreas లో ట్యూమర్ ఉంది అని గమనించారు. సర్జరీ చేసి ట్యూమర్ తొలిగిస్తే పది సంవత్సరాల వరకు ఎటువంటి ప్రమాదం ఉండదు అన్న డాక్టర్ల మాటలని పట్టించుకోని స్టీవ్, తన స్పెషల్ డైట్ తో క్యూర్ అవుతుంది అన్న నమ్మకం తో అలాగే 9 నెలల కాలం గడిపేసాడు. ఇలా దాదాపు తొమ్మిది నెలలు గడిచాకా కుటుంబసభ్యులు, ఆపిల్ టాప్ management నుంచి వస్తున్న తీవ్రమైన ఒత్తిడి , అలాగే తన ఆరోగ్యపరిస్థితి ఏ మాత్రం సరిగా కాకపోవడం తో సర్జరీ కి ఒప్పుకున్నాడు. ఆగష్టు 2004 లో స్టాన్ఫోర్డ్ మెడికల్ సెంటర్ లో ఈ ఆపరేషన్ జరిగిన అనంతరం, స్టీవ్ ఆరోగ్య విషయం న్యూస్ పేపర్స్ ద్వారా ఆపిల్ ఎంప్లాయిస్ కి, అలాగే స్టాక్ హోల్డర్స్ తో పాటు ప్రపంచానికి తెలిసింది. దీనితో షాక్ కి గురైన షేర్ హోల్డర్స్ ఈ పరిస్థితి ముందే తెలియజేయాల్సింది అని వాదించినప్పటికీ, చాల మంది లాయర్లు అలా తెలియజేయటం అన్నది తప్పనిసరి కాదు, అలాగే అది స్టీవ్ జాబ్స్ కున్న "right to protect privacy" గా అభిప్రాయపడటంతో ఆ వివాదం ముగిసింది.

స్టీవ్ జాబ్స్ మాటల్లో తన ఆరోగ్య పరిస్థితి :
About a year ago I was diagnosed with cancer. I had a scan at 7:30 in the morning, and it clearly showed a tumor on my pancreas. I didn't even know what a pancreas was. The doctors told me this was almost certainly a type of cancer that is incurable, and that I should expect to live no longer than three to six months. My doctor advised me to go home and get my affairs in order, which is doctor's code for prepare to die. It means to try to tell your kids everything you thought you'd have the next 10 years to tell them in just a few months. It means to make sure everything is buttoned up so that it will be as easy as possible for your family. It means to say your goodbyes.

I lived with that diagnosis all day. Later that evening I had a biopsy, where they stuck an endoscope down my throat, through my stomach and into my intestines, put a needle into my pancreas and got a few cells from the tumor. I was sedated, but my wife, who was there, told me that when they viewed the cells under a microscope the doctors started crying because it turned out to be a very rare form of pancreatic cancer that is curable with surgery. I had the surgery and I'm fine now.
Steve Jobs, Stanford Commencement Address, 2005

రికవర్ అవ్వడానికి ఒక నెల రోజుల పాటు సెలవు లో ఉన్న స్టీవ్, అదే సంవత్సరం (2003)  సెప్టెంబర్ లో తిరిగి తన బాధ్యతల్ని చేపట్టాడు. 
2003 - 2006 మధ్య కాలం లో ఆపిల్ తీసుకున్న కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు :
  • 2002 లో ఎడ్యుకేషన్ మార్కెట్ కోసం  రిలీజ్ చేసిన eMac (cheaper version of iMac ) ని discontinue  చేసి, అదే అవసరాలు తీర్చటం కోసం Mac Mini ని 2005 లో రిలీజ్ చేయడం.
  • జూన్ 2005 లోజరిగిన Apple's Annual Conference (WWDC ) లో భవిష్యత్తు లో IBM processors  బదులు Intel processors కి  స్విచ్ అవుతున్న నిర్ణయాన్ని ప్రకటించడం. 
  • 2006 లో Cupertino లో ఆపిల్ తన రెండవ కాంపస్ ని నిర్మించాలి అన్న నిర్ణయాన్ని ప్రకటించడం .
మరి 2006 తరవాత ఏమి జరిగింది ? అది వచ్చే భాగం లో :-)

- శ్రావ్య
  
No one wants to die. Even people who want to go to heaven don't want to die to get there. And yet, death is the destination we all share. No one has ever escaped it, and that is how it should be, because death is very likely the single best invention of life. It's life's change agent. It clears out the old to make way for the new.







Steve Jobs, Stanford Commencement Address, 2005

(Images Source : Google Images) 

Recommendations 
Steve Jobs introduces the "Digital Hub" strategy at Macworld 2001
Macworld New York 2001-The Apple Retail Store Introduction

7 comments :

sndp said...

baga rastunaru andi..:)

రాజ్ కుమార్ said...

so far soooo good. sravyaji..
but in next part...;(

వేణూశ్రీకాంత్ said...

బాగుంది శ్రావ్యా... ఐపాడ్ లో పాడ్ అంటే ఏమిటో ఎపుడూ ఆలోచించనే లేదు:) ఇంట్రెస్టింగ్ టు నో దట్.

సంతు (santu) said...

:) =D

సంతు (santu) said...

:) =D

Sravya V said...

@sndp , @రాజ్ , @ సంతోష్ Thank you very much :-)

Sravya V said...

@ వేణు జీ మీ కామెంట్ ఎందుకో స్పాం లోకి వెళ్లి పోయింది, ఈ రోజే చూసి దాన్ని బయటికి లాగాను :-) Thank you :-)

Post a Comment