Subscribe:

Sunday, January 20, 2013

గమ్యం


Prologue 
సాయంత్రం నుంచి అదేపనిగా వర్షం కురుస్తుంది ,  ఒక రెండు గంటల నుంచి చల్లని,  చీకట్లో కూర్చుని ఉన్నాను.  ఒక పది పదిహేనేళ్ళ కిత్రం టీవీలు, హ్యాండ్ ఫోన్లు,  mp 3 ప్లేయర్స్ , టాబ్లెట్స్ ఇలాంటివి, ఇంతగా  మన నేస్తాలు కాకముందు  ఏమి చేసేవాళ్ళు ఇలా ఉండాల్సివస్తే.....

ఏమో,  ప్రస్తుతం నేనైతే నా ఆలోచనలలో మునిగిపోయాను !

అయ్యో ఇదేంటి?  హ్మ్  చూసుకోకుండా  కాఫీ కప్పుని  తోసేసానా ?

అబ్బా ఇప్పుడీ మీదొలికిన  కాఫీని వదిలించాలా ... హ్మ్  బద్దకస్తులకి పనెక్కువని ఊరికే అన్నారా మరి !

అవునూ ప్రాణం ఉంది కాబట్టి ఈ శుభ్రం, చిరాకు,  సున్నితం వగైరా వగైరా అదే పొతే .......

అవునూ మట్టిలో కలిసిపోవటమో, బూడిద గా మారటమో ఏదో ఒకటి జరుగుతుంది కదా .. మరి అప్పుడు ఇవేవి తెలియవేమో ? హ హ బావుంది  అవునూ... ఇంతకీ మరణం అంటే ...

Few Thoughts
ఈ మరణం అనే inevitable thing, ఎప్పుడు, ఎలా జరుగుతుందో ఖచ్చితంగా తెలియకపోయినా, మనం పుట్టగానే (కొన్నిసార్లు పుట్టకముందే కూడా) ఒక తప్పనిసరిగా ఏదో ఒకరోజున జరగాల్సిన తంతుగా నిర్ణయం అయిపోయిటుంది అనుకుంటా. ఆల్బర్ట్ ఐన్ స్టీన్ theorized చేసినట్లుగా "Energy can't be created or destroyed it, can only be changed from one form to another" అనే కాన్సెప్టో , శ్రీకృష్ణ పరమాత్మ గీత లో చెప్పినట్లుగా ఆత్మకి నశింపులేదు అన్నది ఇక్కడ వరిస్తే ... బాబోయ్ మరీ కాంప్లికేట్ అయ్యేట్లు ఉంది కాసేపు వీళ్ళిద్దరిని పక్కన పెట్టాల్సిందే లాభం లేదు.


ఎక్కడున్నాను?  ఆ అదే పుట్టుక అనేది మొదలైతే , చావు అనేది ముగింపు అని కదా?అదే నిజం అయితే, ఈ పుట్టుక & చావు అనే రెండు బిందువులని కలుపుతూ సాఫీ గా సాగిపోయే సరళరేఖలానో , ups & downs ఉండే సైన్ వేవ్ లానో, లేదూ ఇంకా క్రేజీగా గజిబిజి గందరగోళంగా ఉండే మహా తిక్క గా ఉండే గ్రాఫో గీస్తే అది జీవితం అవుతుంది. దీన్ని ఎలా గీస్తామా అనేది మన ఇష్టం. అంతేనా? అంతా మనిష్టం నిజంగా ? suppose for suppose నేను ఏ ప్రధానమంత్రి నో అయిపోవాలని గ్రాఫ్ గీద్దామని కూర్చుంటే అవుతుందా? ఉహు అమ్మో కాదు!  ఎక్కడో exceptional గా ఉండేవాళ్ళు అయితే ఇది కూడా సాధ్యమే,  కానీ చాలా వరకు ...... మన  మీద ప్రభావం చూపించే కుటుంబనేపద్యం, చుట్టూ ఉన్న సమాజం,   తలరాత (నమ్మేవాళ్ళైతే )  లాంటి external ఫాక్టర్స్ ప్రభావం కూడా ఆ గ్రాఫ్ మీద ఉంటుంది, తప్పదు.   సరే ఈ  గ్రాఫ్ ల గురించి మాట్లాడాలి అంటే నాతొ అయ్యే పనేనా?  ఒక్కొక్కరిది ఒక్కొక్క unique శైలి ఆ గ్రాఫ్ గీయటంలో, అందుకే కాసేపు దాన్ని వదిలేసి అందరం  కామన్ గా తప్పనిసరిగా చేరాల్సిన  చివరి బిందువు గురించి చూద్దాం ...


ఈ ముగింపుని  బేసిక్ గా రెండు రకాలుగా  కాటగరైజ్ చేయొచ్చేమో. ఒకటి సహజమైనది అయితే రెండోది అసహజంగా ఉండే  ముగింపు. సహజమైన ముగింపుకి రకరకాల జబ్బులు,వృదాప్యం లాంటివి కారణాలయితే, ఇక అసహజం గా పలికే ముగింపుకి కారణాలు ఎన్నో ! అందులో కొన్నిటికి  మన మీద మనకి విరక్తి తో కలిగే కారణాలు అయితే, కొన్ని వేరే వాళ్లకి మన మీద కలిగే విరక్తి తో పుట్టిన కారణాలు అయిఉండొచ్చు.మరికొన్ని,  ఎంత  నాగరిక సమాజంలో బ్రతుకుతున్నా,  అంతర్లీనంగా  ఇంకా ఆ  పశు ప్రవృతి మాత్రం ఇంకా పూర్తి గా పోలేదు సుమా,  అని చెప్పటానికి సజీవ సాక్ష్యంగా నిలిచిపోయేవి   

అవునూ .... ఇలా అసహజం గా ఎవరికీ వాళ్ళు పలికే ముగింపుల గురించి ఆ సోషియాలజీలో ఏదో చదివిన గుర్తుంది .  Emile Durkheim, అనే  ఫ్రెంచ్ సోషియాలజిస్ట్ కదా,  ఆత్మహత్యలు నాలుగు రకాలు అని చెప్పింది.  అవేంటి ? ఆ ఆ ఆ ... గుర్తొచ్చాయి.
1.Egoistic suicide 2. Altruistic suicide 3. Anomic suicide 4. Fatalistic suicide

హ్మ్ పేర్లు చూడగానే అలాంటి ఆత్మహత్యలు ఎందుకు జరుగుతాయో అర్ధం అయ్యేట్లుగా భలే పెట్టారే. అసలు వీటన్నిటిలో ఆ Altruistic suicides ఇవి మాత్రం ఇంటరెస్టింగ్. నిజానికి వీటినే మనం వీరమరణం, జాతి గర్వించే త్యాగం ఇలా అంటాం అనుకుంటా . అప్పుడెప్పుడో 1971 లో జరిగిన ఇండో - పాక్ వార్ లో చనిపోతానని తెలిసీ పాకిస్తాన్ కాంప్ లోకి MiG వార్ ఫ్లైట్ తో దూసుకుపోయి మన విజయానికి కారణమయిన  Neeraj Kukreja గురించి అప్పుడే కదా తెలుసుకున్నా! నీరజ్ కాకుండా భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు వీళ్ళందరి మరణాలు ఇదే కోవా లోకి వస్తాయేమో .  హ్మ్ ధైర్యం , తన తోటి మనుషులు అంటే ప్రేమ,  నమ్మిన విషయం మీద గౌరవం ఇలాంటివన్నీ ఏ  స్థాయి లో ఉంటే అలా చేయగలిగారో వాళ్ళు !  హ్మ్, అలా చేయడం కాదు కదా , కనీసం  వీళ్ళ త్యాగాలు మనలో ఎంతమందిమి ఇంకా గుర్తుంచుకోగలుగుతున్నామ్? నిజానికి ఇలాంటి వాళ్ళ త్యాగాలు ,మరీ  ఈ స్థాయిలో ప్రాణాలు బలిపెట్టడం, కాకపోయినా తమ స్వంత లాభం చూసుకోకుండా సొసైటీ కోసం ఏ రకంగానైనా కష్టపడే వాళ్ళని గుర్తించకపోవటం మహానేరం. ఆ గుర్తింపు, గౌరవం లేకనే ఎక్కువ గా  ఎవరి స్వార్ధం వాళ్ళు చూసుకునే పరిస్థితులలో బ్రతకాల్సిన రోజులు వచ్చాయనుకుంటా. అబ్బా అబ్బా  కాసేపు కూడా ఒకటే విషయం మీద focused గా ఆలోచించలేను, అప్పుడే దారితప్పి ఎక్కడికో వెళ్ళే సూచనలు కనపడుతున్నాయి come to  the  point.   

ఆత్మహత్య చాలా దేశాల్లో నేరం. మిగిలిన దేశాలలో ఎలా ఉందో కానీ,  సింగపూర్ లో మాత్రం ఇలా చనిపోతే  కాఫిన్ లో పెట్టె ముందు సంకెళ్ళు వేసి మరీ పెడతారు . ఇది విన్నప్పుడు మొదట అర్ధం కాలేదు కానీ , తరవాత తెలిసింది,  సంకెళ్ళు వేయటం  ద్వారా  ఒక నేరస్తుడి గా మరణించాం  అని.  హ్మ్ !ఇక్కడ ఇలా ఉంటె స్విట్జర్లాండ్ , కొలంబియా, మెక్సికో ఇలా కొన్ని దేశాల్లో ఆత్మహత్య నేరం కాదట.  అందుకే కేవలం ప్రశాంతంగా, ఇంకా లీగల్ గా  ఆత్మహత్య చేసుకుని చనిపోవటానికి ఈ దేశాలకి టూరిజం పేరుతొ వెళ్లి అక్కడ జీవితానికి ముగింపు పలికే వాళ్ళు కూడా బోలెడు మంది. ఈ టూరిజంని సూసైడ్ టూరిజం/ డెత్ టూరిజం / euthanasia tourism అని అంటారట. 

ఇవన్నీ కాకుండా ఇంకో రకమైన  ముగింపులు,  కొన్ని నేరాలకి ప్రభుత్వాలు విధించే మరణశిక్షలు. అబ్బా అబ్బా ఎన్నెన్ని వాదనలు, డిస్కషన్స్ ఈ శిక్ష గురించి. ఎవరు ఏమన్నా  కొన్ని రకాల నేరాలకి ఈ కాపిటల్ పనిష్మెంట్  ఉండాల్సిందే, తప్పదు . హ్మ్ ఇప్పటి పరిస్థితులు చూసి ఇంత గట్టిగా ఉండాలి అనుకుంటున్నా కానీ, ఏథెన్సు నగరం సోక్రటీసుకి విధించిన  మరణశిక్ష అది గుర్తొస్తే ఒక్కసారిగా ఎలాగో అనిపిస్తుంది. 

సోక్రటీస్ ఎంత  ధీరోదాత్తంగా జీవించాడో మృత్యువుని  కూడా అంతే ధైర్యంగా ఆహ్వానించాడు.  తనకి వేసిన మరణశిక్షని విషం ఇవ్వడం ద్వారా అమలుపరిచారు. ఈ విషాన్ని హెంలాక్ అనే పూలనుంచి తీసేవారట. ఆయనకు మరణశిక్ష విధించారని తెలిసిన బాధపడుతున్న హితులుకి ఆయన చెప్పిన మాటలు - "మీరు బాధపడాల్సింది ఇప్పుడు కాదు, నేను ఏ రోజు పుట్టానో ఆ రోజున, ఎందుకంటే మనిషి పుట్టుక ఎప్పుడు మొదలైందో అప్పుడే మరణం కూడా మొదలయింది"  అని. మరణానికి సిద్ధంగా ఉన్న తను స్టెషికోరోస్ అనే కవి రచించిన అతి కష్టసాధ్యమైన పాటను ఎవరో పాడుతుండగా విని ఆ పాటను తనకు నేర్పించమని ఆ గాయకుడిని అడిగాడు. ఆ  గాయకుడు "మరణానికి సిద్ధంగా ఉన్న నువ్వు ఈ  పాట నేరుచుకోని ఏం సాధిస్తావు?" అని అడిగితే ,  అందుకు సోక్రటీస్ సమాధానం - "ఇంకో విషయం నేర్చుకోని మరణించాలని ఉంది" అని. ఆ  సమాధానానికి అబ్బురపడిన ఆ గాయకుడు ఆ పాటను అతనికి నేర్పించాడు. ఆ పాట నేర్చుకున్న తరువాతే సోక్రటీస్‌ ప్రశాంతంగా విష పానీయాన్ని త్రాగాడు. ఆ మందు పనిచేసేందుకు కొద్దిగా నడిచాడు. కొంచెంసేపైన తరువాత మరణించాడు.  
సోక్రటీస్ మరణాన్ని వివరించే చిత్రం 
(Source
హ హ నాకు తెలుసు ఇక్కడి దాకా చదివారు అంటే , మీ చెయ్యి తలని పట్టుకుంది అని.  పర్వాలేదు భయపడకండి,  అయిపొయింది ఇక ఆ చెయ్యి  తీసేయొచ్చు, నేను కూడా కాఫీ మరకని వదుల్చుకోవటానికి వెళుతూ ఈ ఆలోచనలకి full stop పెడుతున్నా.

Epilogue

నిజం గానే వర్షం పడుతుంది కానీ , చీకట్లో కూర్చుని ఆలోచించేసాను అన్నది మాత్రం కొంచెం మెలోడ్రామా అన్నమాట. నిజానికి కాఫీ పడితే అది వదుల్చుకోవటానికి వాష్ రూం కి పరిగెడతాం, కానీ అక్కడే కూర్చుని ఆలోచిస్తామా? :-) కాపీ కప్పులోనో, కడుపులోనో ఉండాలి అప్పుడే అందం చందం అంతే కానీ మీద పడితే? In other words ఏది ఎక్కడ ఉండాలో, ఎంతలో - అక్కడే ఉండాలి, అంతే ఉండాలి అప్పుడే దానికి విలువ, అపభ్రంశపు స్థానచలనం వస్తువు విలువ పోగొడుతుంది. ఇదే లైన్స్ లో పుట్టిన ప్రతి ఒక్కరికి గౌరవంగా మరణించే హక్కుంది. ఆ హక్కుని గౌరవించటం మన కనీస కర్తవ్యం. ఒక 5 / 6 ఏళ్ళ క్రితం రోజులని గుర్తుచేసుకుంటే, ఎక్కడ చివరిదశలో ఉన్న గొప్ప వ్యక్తుల ఫొటోస్ కానీ, లేదూ accidents లో మరణించిన తరవాత చెల్లాచెదరైన పార్హివదేహాలు వంటివి గానీ చూసిన గుర్తులు ఉండవు. కానీ ప్రస్తుతం మన మెయిన్ స్ట్రీం మీడియా ఈ వార్తల నుంచి బ్రెడ్ & బట్టర్ సంపాదించుకునే ప్రయత్నం లో ఉంది కాబట్టి ఇటువంటి నియమాలకి తిలోదకాలు ఇచ్చింది. అలా న్యూస్ ని ప్రెజెంట్ చేసే మీడియా వార్తలు చూస్తే ఏమి చెప్పాలో అర్ధం కాదు. 24X 7 సామాజ సంక్షేమం కోసం పాటు పడుతున్న మీడియా హౌసులు కనీసం ఈ విషయంలోనన్నా కొంచెం విజ్ఞత తో వ్యవహిరిస్తే బావుండు .-శ్రావ్య 

12 comments :

..nagarjuna.. said...

హేవిటో... ఈ తాత్విక జ్ఞావవృష్టి నాకెప్పుడూ అర్దమయ్యి ’చావదు’ :|

రసజ్ఞ said...

హమ్మయ్యా! కాఫీ అలవాటు లేకపోవడం ఎంత మంచిదయ్యిందో, ఇలాంటి ఆలోచనలు ఎప్పుడూ రాలేదు :)
"ఇంకో విషయం నేర్చుకోని మరణించాలని ఉంది" మాటల్లేవ్, ఈ వాక్యం దగ్గర చాలా సేపు ఆగిపొయాను.

Anonymous said...

చిన్నగా వర్షం పడుతోంది. కమ్మటి మిర్చీ బజ్జీలు తింటూ మీ మృదుమధురంగా మీ మరణమృదంగం వింటూ వీకెండ్ గడిచిపోయింది. కర్తవ్యం దైవమాహ్నికం, పనికెళ్ళాలి. చచ్చేవరకూ పని చేయాలి తప్పదు అన్నాడు గీతలో కృష్ణపరమాత్మ, ఏమిటో! ఎందుకో! :)

కొత్తావకాయ said...

"ఏది ఎక్కడ ఉండాలో, ఎంతలో - అక్కడే ఉండాలి, అంతే ఉండాలి అప్పుడే దానికి విలువ, అపభ్రంశపు స్థానచలనం వస్తువు విలువ పోగొడుతుంది. ఇదే లైన్స్ లో పుట్టిన ప్రతి ఒక్కరికి గౌరవంగా మరణించే హక్కుంది. ఆ హక్కుని గౌరవించటం మన కనీస కర్తవ్యం. ఒక 5 / 6 ఏళ్ళ క్రితం రోజులని గుర్తుచేసుకుంటే, ఎక్కడ చివరిదశలో ఉన్న గొప్ప వ్యక్తుల ఫొటోస్ కానీ, లేదూ accidents లో మరణించిన తరవాత చెల్లాచెదరైన పార్హివదేహాలు వంటివి గానీ చూసిన గుర్తులు ఉండవు. కానీ ప్రస్తుతం మన మెయిన్ స్ట్రీం మీడియా ఈ వార్తల నుంచి బ్రెడ్ & బట్టర్ సంపాదించుకునే ప్రయత్నం లో ఉంది కాబట్టి ఇటువంటి నియమాలకి తిలోదకాలు ఇచ్చింది. అలా న్యూస్ ని ప్రెజెంట్ చేసే మీడియా వార్తలు చూస్తే ఏమి చెప్పాలో అర్ధం కాదు. 24X 7 సామాజ సంక్షేమం కోసం పాటు పడుతున్న మీడియా హౌసులు కనీసం ఈ విషయంలోనన్నా కొంచెం విజ్ఞత తో వ్యవహిరిస్తే బావుండు."

Claps Claps! Very well said శ్రావ్యా!

రాజీవ్ మరణించినప్పుడు ఇండియా టుడేలో వార్తాకథనం, ఫొటోలు చూసి వణికిపోయిన జ్ఞాపకం ఇంకా అలాగే ఉంది. ఇప్పుడలాంటివి సామాన్యం అయిపోయాయి. చూసినా కళ్ళు తిప్పేసుకుని పోస్ట్ మ్యూట్ చేసుకుపోతున్నాం. లేదా నా బోంట్లు "న్యూసెందుకు చూడరండీ..?" అంటే ఇదీ కారణం అని చెప్పి తప్పించుకుపోతాం. ID చానెల్ లో సైతం ఏ కథనంలోనూ చుక్క నెత్తురు చూడక్కర్లేదు. కౌన్ బనేగా కరోడ్ పతి నుండీ Cash cab, What not to wear దాకా కాపీ కొట్టిన మన ఛానల్స్.. ఇలాంటి విషయాలెందుకు నేర్చుకోవో!!

srinivasarao vundavalli said...

సామాజిక స్పృహ ఉన్న వార్తా చానళ్ళు ఎన్ని ఉన్నాయండి, ఉన్నవాటన్నిటికి సంపాదన మీదే దృష్టి కదా!!

ఫోటాన్ said...మీ దగ్గర చాలా సబ్జెక్టు(లు) వున్నాయి, అన్నిటినీ బాగా రిలేట్ చేసి రాసారు.
మరో మాట లేకుండా, 'వాకింగ్ వికిపీడియా' అని కుడా పిలవచ్చు మిమ్ములను :)

న్యూస్ ఛానల్స్ కి మంచి సలహా ఇచ్చారు :)

ఫోటాన్ said...

మీ పోస్ట్ చూసే ముందు, డా. రమణ గారి పోస్ట్, వేణు గారి పోస్ట్ చూసి వచ్చాను, వాటితో పాటు మీ పోస్ట్ కుడా కలిసి ఈరోజు నన్ను భావోద్వేగ పూరిత ఆలోచనల్లోకి తీసుకెళ్ళాయి.
పోస్ట్ బాగుంది.

Sravya Vattikuti said...

@నాగార్జున హాప్పీస్ కదా అర్ధం కాకపొతే :-)
@రసజ్ఞ హ హ భలే వారు కాఫీ నే ఒలకపొసుకొవాలా ?:P థాంక్ యు !
@అనాన్ గారు హ హ నిజమే ఎందుకో అలా :-) థాంక్ యు !
@కొత్తావకాయ గారు థాంక్స్ అండి . నిజమే చూసి desensitize అవుతున్నాం !
@శ్రీనివాస్ ఉండవల్లి గారు హ్మ్ , సంపాదన మీద ద్యాస కొద్దో గొప్పో తప్పులేదు కానీ , మరీ ఈ స్థాయి లో అంటేనే కొంచెం బాదేస్తుందండి !
@ఫోటాన్ హ హ అలా ఏమి కాదులే :-) థాంక్స్ !

నవజీవన్ (NAVAJEEVAN) said...

ఆత్మహత్య మీదా చాలానే ఆలోచించారు ..! అలాగే మరణం గురించి కూడా బహు చక్కగా విశ్లేషించారు. అలాగే సోక్రటిస్ తదితర వ్యక్తుల గురించి కూడా ప్రస్తావించారు ..మొత్తానికి ఈ టపా ద్వారా మాకు మంచి సమాచారాన్ని ఇచ్చారు .

Sravya Vattikuti said...

@నవజీవన్ గారు థాంక్ యు అండి !

చాతకం said...

ప్రధానమంత్రి అవటం పెద్ద గొప్ప విషయం కాదు. గ్రాఫు గీయ్యటం మొదలుపెట్టడమే ఒక పెద్ద పని. ఒక్కసారి మొదలు పెట్టామంటే దానంతట అదే వస్తుంది. ప్రధాన మంత్రి కాక పోయినా ఏదో ఒక గ్రాఫ్ వస్తుంది కదా. అది చాలు. ఏ గ్రాఫూ లేక పొవటం కన్నా ఏదో ఒకటి నయం కదా.

హమ్మయ్య. నాకు కాఫీ అలవాటు లేదు. ;) ఎవరక్కడ? కొంచెం లైటు వేయండి ఇక్కడ. మనం బద్దకస్తులు కదా. అదొక పని మరి.

నాకు మాత్రం నేనెప్పుడో చదివిన 'నేను ఎవరూ అనే రమణ మహర్షి పుస్తకం గుర్తుకు వచ్చింది ఇది చదివిన తరువాత.

Thank you for sharing your thoughts.enjoyed reading this.

Sravya Vattikuti said...

@చాతకం గారు హ హ భలే చెప్పారు , "ఏ గ్రాఫూ లేక పొవటం కన్నా ఏదో ఒకటి నయం కదా" కరెక్ట్ గా చెప్పారు ! కాఫీ అలవాటు లేకపోయినా ఏమి లాభం లేదు పైన రసజ్ఞ గారికి చెప్పా చూడండి :-) థాంక్ యు అండి మీ పోత్సహకరమైన వాఖ్యకు !

Post a Comment