Subscribe:

Sunday, February 17, 2013

ప్రేమలేఖ


హాయ్ ,

ఉరుములు, పిడుగులు లేకుండా ఎప్పుడూ లేని  ఈ లేఖల గోల ఏంటీ కొత్తగా అని ఆశ్చర్యపోతున్నావా? ఉంది ఉంది దానికో కారణం ఉంది. 

ప్రేమలేకుంటే  ఉదయమైనా  చీకటేనంటా,  ప్రేమ తోడుంటే మరణమైనా జననమంటా  - అబ్బా ఇలా చెవిలో  జొరీగల్లా  గోల పెట్టె వాళ్ళని చూస్తుంటే అదేదో సినిమాలో చిరంజీవి చెప్పినట్లు 

కరెక్టే ప్రేమ గురించి  నాకేం తెలుసు 
లైలా మజ్నులకి తెలుసు 
పారు దేవదాసులకి తెలుసు  
ఆ తరవాత తమరికే తెలుసు 

ఇలా అరిచి చెప్పాలి అనిపిస్తుంది, కానీ అలా చెప్తే మరీ గయ్యాళి అని అంటారు కదా?  అందుకే నాకు నీమీదున్న   ప్రేమని అక్షరబద్ధం చేసి నాకు ఒక ప్రేమ కథ ఉందోచ్చ్, అని అందరికీ చాటి చెప్పాలని నిర్ణయించుకున్నా. అర్ధం అయ్యింది కదా ? మరి కాస్త ప్రశాంతం గా కొంచెంసేపు  ఈఅక్షరాల ఉప్పెనని  తట్టుకో .

అవును మొదటిసారి ఎప్పుడు చూసాను నిన్ను? ఊ ఊ..  గుర్తొచ్చింది స్కూల్ excursion పేరుతొ కదా ఇంట్లో అందరి ప్రాణాలు తీసి మరీ నిన్ను చూడటానికి వచ్చాను.  అమ్మ వాళ్లకి ముందే తెలిసిపోయినట్లుది నిన్ను చూస్తే  నే నీమాయలో పడిపోతానని అందుకే ఎన్ని జాగ్రత్తలు చెప్పి పంపారనుకున్నావ్? అయినా సరే నీ మాజిక్ ముందు ఆ జాగ్రత్తలన్నీ బలాదూర్. ఇక ఆ తరవాత ఏముందీ?  నేను నీ మాయలో పడిపోయా అనుకో. నవ్వకోయ్ అప్పటి నుంచి నువ్వు మాత్రం ఏం  తక్కువ చేసావ్ ?  నీ గాలి సోకకుండా ఉండేంత దూరం నేను వెళ్ళిపోయినా, సెలవల పేరుతొ  నేను ఎక్కడి వెళితే అక్కడికి  నాకన్నా ముందే వెళ్లి అక్కడ నాకోసం తిష్ట వేసేవాడివి కాదా? ఎక్కడి  బాపట్ల, మచిలీపట్నం, ముంబై, రామేశ్వరం, చివరికి ఈ చివరి కొసనున్న  కన్యాకుమారి,  అక్కడికి వెళ్ళినా నన్ను వదలలేదు కదా ? 

ఆఖరికి,   దేశం కానీ దేశం వస్తుంటే ఇక్కడ నేను  ఒంటరిగా ఏమి దిగులు పడతానో అని  తోడూగా ఉండటానికి నాకన్నా ముందే వచ్చేసావ్ కదా? ఏ  మాటకామాటే చెప్పాలి,  ఎవరూ లేకపోయినా నువ్వు గల గల చేప్పే కబుర్లు వింటూ, నిన్ను చూస్తూ అలా నేను ఎన్ని గంటలైనా గడపగలను తెలుసా?  గంభీరం ఉండే నీ రూపు చూసి కొంతమందికి  భయమేస్తుందట, నాకేమో చచ్చేంత ఇష్టం!  అసలు ఆరూపం చూసే కదా నీ మాయ లో పడిపోయా.  అవునూ, నాకొక అనుమానం అన్నన్ని బడబాగ్ని లాంటి  రహస్యాలు కడుపులో ఎలా దాచుకుంటావ్ నువ్వు అదీ పైకీ ఏమి తెలియనట్లు గా ఉంటూ?

ఇన్నేసి  పొగడ్తలు వింటూ మహా ఆనందంతో ఉప్పొంగిపొతున్నావ్ కదా? అసలు నీలో నచ్చనిది ఏమీ లేదు అని పొరపడకు, ఉంది నచ్చనిది కూడా ఉంది. అయ్యో అప్పుడే అలక ఒక్కటే కదా నచ్చదు అంది, అంతమాత్రానికే ఇంత అలక? మరి కోపం వస్తే చాలు,  ఏం పట్టకుండా ముందూ వెనక చూడకుండా,  ఊరు వాడ  ఏకం చేసేసే నీ ఉద్రేకం చూస్తే నాకు బాధగా ఉండదా? అయినా నువ్వు మాత్రం ఏమి చేస్తావులే కోపం ప్రకృతి ధర్మం. పేదవాడి కోపం పెదవికి చేటని, నాలాంటి వాళ్లకి  కోపం వస్తే ఏమి చేయలేం. మరి నువ్వంటే అలా కాదు కదా,  ఎంతో మంది బాగోగులు  చూస్తుంటావు,  అద్భుతమైన నిధి నిక్షేపాలు కడుపులో దాచుకుంటావు, నాలాంటి బోల్డు మందికి సంతోషాన్ని పంచుతుంటావు, అందుకే నీ కోపం చెలియలికట్ట దాటుతుంటే అది ప్రళయమే. కొంచెం ఆ కోపాన్ని తగ్గించుకోవూ ప్లీజ్? అప్పుడు ఇంకెంతమందికో నచ్చేస్తావ్ తెలుసా ?

హ్మ్ , ఇలా నిన్ను పొగుడుతూ , నీ గురించే ఆలోచిస్తూ ఉంటె ఎన్ని రోజులైనా సరిపోవు నాకు . అయినా  ఇలా నీ మీద ప్రేమతో, నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావ్ అన్న ఆనందంతో పొంగిపోతుంటా కానీ, ఒక్కొక్కసారి ఎంత భయమేస్తుందో తెలుసా? భయం దేనికి అంటావా?  భయం కాక మరి ఏంటి? ఆ యమున, కృష్ణవేణి ఇలా బోలెడుమంది అందగత్తెలు  హొయలు పోతూ నీ చూట్టునే తిరుగుతుంటే వాళ్ళ మాయలో పడి నన్ను అసలే మర్చిపోతావేమో అని దిగులేయదా మరి?

హలో హలో మరీ సంబరపడిపోకు,  నన్ను ఉడికించటానికి ఒక కారణం దొరికింది కదా అని. ఆ పప్పులు ఏమీ ఉడకవు.  నన్నే గుర్తుంచుకో,  నన్నే ప్రేమించు అని నీ వెంట నేనేమి పడటం లేదు. నువ్వంటే నాకు ఇష్టం, పిచ్చి అది నిజం!  నువ్వు నన్ను ఇష్టపడు, పడకపో, అసలు ఆ మాటకొస్తే నువ్వేమి ఫీల్ అవుతావో  నాకేమి సంబంధం? నీ ఇష్టం వచ్చినట్లు ఉండు,  నేను మాత్రం నిన్ను ప్రేమిస్తూనే ఉంటా అంతే :P 

బోలెడంత ప్రేమతో 
శ్రావ్య 


ఇంతకీ ఎవరినబ్బా శ్రావ్య ఇంత దబాయించి మరీ ప్రేమిస్తుంది అని ఆశ్చర్యపోతున్నారు కదా, ఇదుగో ఎప్పుడూ నా వెన్నంటే ఉండే  ఇతన్నే :-) ఇక వింటున్నా కదా అని నా చెవిలో జోరీగల్లా  కాదు కానీ , అద్భుతంగా గోల పెడుతున్నది ఎవరో తెలుస్కోవాలంటే ఇక్కడ చూడండి. 



  

27 comments :

ఫోటాన్ said...

:))

రాజ్ కుమార్ said...

నాకు ముందే తెలిసిపోయిందిగా ;)హిహిహి

సిరిసిరిమువ్వ said...

నువు చూడూ చూడకపో
నువు చూడూ చూడకపో నే చూస్తూనే ఉంటా
మాట్టాడూ ఆడకపో మాట్టాడుతునే ఉంటా
ప్రేమించూ మించకపో ప్రేమిస్తూనే ఉంటా
నా ప్రాణం నా ధ్యానం నువ్వే లెమ్మంటా
నువు చూడూ చూడకపో నే చూస్తూనే ఉంటా...

ఈ పాట గుర్తొచ్చింది శ్రావ్యా నీ టపా చూస్తే :)

వేణూశ్రీకాంత్ said...

హహహ అద్భుతంగా ఉంది శ్రావ్యా మీ ప్రేమకథ :-) తన ఫోటో కూడా బ్రహ్మాండం :-)
>> నువ్వు నన్ను ఇష్టపడు, పడకపో, అసలు ఆ మాటకొస్తే నువ్వేమి ఫీల్ అవుతావో నాకేమి సంబంధం? నీ ఇష్టం వచ్చినట్లు ఉండు, నేను మాత్రం నిన్ను ప్రేమిస్తూనే ఉంటా అంతే <<
భలే చెప్పారు ఇంతకన్నా ఉన్నతమైన ప్రేమ ఈ ప్రపంచంలో ఉండదు :-)

జ్యోతిర్మయి said...

అమరప్రేమ...బావుందండి.

నిషిగంధ said...

:)))))

Good selection, Sravya!

నువ్వు మచిలీపట్నం, రామేశ్వరం అనగానే అర్ధమైపోయిందనుకో ;-)

Anonymous said...

కొంచెం బొద్దుగా వున్నా హార్మోనియం వాయించేఅతను బానే వున్నాడండి. మంచి సెలెక్షన్. :P

Sravya V said...

అనానిమస్ గారు ,
ఇదుగో నండి ఇలా అర్ధమయ్యి పూడుస్తుంది అనే తెంగ్లిష్ లో రాస్తా అంటా , మీరేమో బెత్తం పుచ్చుకుంటారు . ఇప్పుడే చూడండి నేను ఫోటోలో అతని గురించి రాస్తే మీరేమో వీడియో లో అతని గురించి మాట్లాడుతున్నారు . హ్మ్ ! పర్వాలేదు లెండి మీకు నచ్చాడు కదా కావాలంటే అతని వివరాలు మీకు పంపుతా :-)

Sravya V said...

@ఫోటాన్ , @శశి గారు మీ చిరునవ్వులకి థాంక్స్ :-)
@రాజ్ కుమార్ హ హ తెలిసిపోయినా ఏమి తెలియనట్లు ఆక్ట్ చేయాలి :-) థాంక్స్ !
@సిరిసిరిమువ్వ గారు హ హ థాంక్స్ అండి !
@వేణు శ్రీకాంత్ గారు మరి మీరు కూడా ఫ్యాన్ , AC కదా అందుకే ఫోటో కూడా నచ్చేసింది :-) థాంక్ యు వేణు జీ :-)
@జ్యోతిర్మయి గారు థాంక్స్ అండి :-)
@నిషి హ హ అయితే క్లూలు మరీ దారుణం గా ఇచ్చేసానన్న మాట :-) నచ్చినందుకు బోలెడు థాంక్స్ :-)

Unknown said...

బాగుంది శ్రావ్య గారు...ఉప్పెనంత సముద్రానికి నీరాజనం నీరాజనమే :)

బంతి said...

ప్రేమ ఎంత మధురం ప్రేమికుడు అంత కఠినం
చేసినాను ప్రేమక్షీర సాగారమథనం మింగినాను హలాహలం
నాకైతే ఈ పాట గుర్తొచ్చిందండి :-)

సుజాత వేల్పూరి said...

చాలా బాగా రాశావు శ్రావ్యా!! కొత్త భావాల్ని సరికొత్త గా ప్రెజెంట్ చేశావు ఎప్పటిలాగే!

అన్నట్లు నీరాజనం సినిమాలో ఈ పాట నాకు అన్ని పాటలకంటే ఇష్టం! అందులో వాడిన హార్మోనియం చూశావా? అది , కొద్దిగా ఫ్లూట్, తబలా తప్ప ఇంకేమీ హంగులు ఉండవు. హార్మోనియం ని ఈ స్థాయిలో వాడిన పాట కొత్త పాటల్లో ఒక్కటి కూడా కనిపించదు. ఇది నీ పాటల బ్లాగ్ లో పెట్టదగ్గ పాట :-)

జయ said...

>>>>నువ్వేమి ఫీల్ అవుతావో నాకేమి సంబంధం? నీ ఇష్టం వచ్చినట్లు ఉండు, నేను మాత్రం నిన్ను ప్రేమిస్తూనే ఉంటా అంతే :P<<<< సూపర్...'నేను ప్రేమిస్తూనే ఉంటాను, పోయేదేముంది....మహా అయితే వాళ్ళూ ప్రేమిస్తారు'. బాగుంది కదూ:)

చాతకం said...

LOL. George Clooney it is, right? ;)
Oceans 11,12,13? I am a big fan too ;)

Ennela said...

saagara theera sameepaanaa taragani "sraavya" sudhaa madhuram!

Sravya V said...

@చాతకం గారు మీ కామెంట్ అర్ధం కాలేదు, George Clooney ది ఏదన్నా మూవీ ఉందా, తెలియదండి నాకు !

Anonymous said...

హార్మోనియం పాట OP Nayyar 40ఏళ్ళక్రితం పాటకు నాసిరకం కాపీలా వుంది. మనకు అర్థమయ్యేలా తెంగ్లీష్‌లో చెప్పుకోవాలంటే, ఈసాంగుకు ఆసాంగుకు, ఫాక్ష్‌కు స్నేక్ వర్‌ల్డుకు వున్నంత డిఫరెన్స్ వుంది. :)

Sravya V said...

@అనానిమస్ గారు, లాభం లేదు ఏదో అయ్యింది మీకు ఈ రోజు :-) ఆ హార్మోనియం పాటే మీరు నేను పుట్టక ముందు విన్న O .P . నయ్యర్ అద్భుతమైన పాట :-) తెంగ్లిష్ లో చెప్పమన్నారా ఇంకోసారి :-)

Anonymous said...

ఆ పాట ఈ పాట కాదని ఖచ్చితంగా చెప్పగలను. రఫీ ఎక్కడ, బాల సుబ్బి ఎక్కడ? అదే, ఫాక్ష్ వేర్? సెర్పెంట్ వరల్డ్ వేర్? ఆ పాటలో బిచ్చగాళ్ళు ఇలా అడవుల్లోకి హార్మోనియంతో వచ్చి వేధించడం వుండదు. బీచ్‌లో, జనాలుండే చోట మాత్రమే వేధిస్తారు. సరే, తెంగ్లీషులో చెప్పండి, ఏమన్నా నాకు అర్థమవుతుందేమో ప్రయత్నిస్తాను.

Sravya V said...

అమ్మయ్య తెంగ్లిష్ లో చెప్పారు కదా ఇప్పుడు చక్కగా అర్ధం అయ్యింది :-) మీరు హిందీ వెర్షన్ చెబుతున్నారు అనుకుంటా, నాకు దాని గురించి తెలియదు అండి .ఇది తెలుగు లో OP నయ్యర్ సంగీతం అందించిన సినిమా . పాటలు హిట్ కానీ సినిమా ఫట్ అని మాత్రమే తెలుసు నాకు . అసలు అయినా ఆ విడియో వినకుండా చూసినందుకు నా సానుభూతి మీకు ! పోరపాటు నాదే mention చేసి ఉండాల్సింది పొరపాటున చూస్తే నాది కాదు బాధ్యత అని .
మీకు మరీ ఎంత ప్రేమ ఎక్కువైతే మాత్రం అన్ని మంచి పాటలు పాడిన బాలుని అలా పిల్చేస్తారా ? భలే వారు సుమా !

Sravya V said...

@శేఖర్ థాంక్స్ :-)
@బంతి హ హ లిరిక్స్ మార్చి మరీ గుర్తు వచ్చిందా :-) థాంక్స్ !
@సుజాత గారు మీకు నచ్చినందుకు సంతోషం గా ఉందండి ! థాంక్ యు !
ఈ పాట నాకు కూడా చాలా ఇష్టం అండి . తప్పకుండా మ్యూజిక్ బ్లాగ్ లో పెడతాను !
@జయ గారు హ హ అయితే ఈ పొలసీ మీకు నచ్చింది అన్నమాట , థాంక్స్ అండి :-)
@ఎన్నెల గారు హ హ థాంక్స్ , చాలా కాలానికి కనపడుతున్నారు :-)

చాతకం said...

When you love the ocean, You must also be liking George clooney too. ;) You need to see movies oceans 11, oceans 12, oceans 13 all acted by George Clooney whose name in those movies is "ocean" and with help of 11,12,13 guys he goes on to rob casinos. ;)

rajachandra said...

bagundi andi.. baga rasaru...

Sravya V said...

@చాతకం గారు ఓహ్, sounds interesting, ఈ వీకెండ్ కుదిరితే చూసేయాలి అయితే :-) Many thanks for suggesting !
రాజాచంద్ర గారు థాంక్స్ :-)

శ్రీనివాస్ పప్పు said...

ఇంతకీ నువ్వు రాసింది బావుందనాలా,లేదనాలా!!

Pranav Ainavolu said...

:)

Sravya V said...

@పప్పు శ్రీనివాసరావు గారు బ్లాంక్ చెక్ ఇచ్చినట్లు గా రాసారు గా కామెంట్ :-) థాంక్ యు !
@ప్రణవ్ థాంక్స్ :-)

Post a Comment