యాకుందేందు తుషార హార ధవళా యా శుభ్ర వస్త్రా వృతా
యా వీణా వరదండ మండిత కరా యా శ్వేత పద్మాసనా !
యా బ్రహ్మ చ్యుత శంకర ప్రభ్రుతి భిర్దే వై స్సదా పూజితా
సామాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యా పహా !!
****
What is myth?
A myth is a story that may or may not be true.
Myths are generally very old. This means there are no records or other
proof that they happened. We know about them from older people telling
them to younger people. Some myths may have started as 'true' stories
but as people told and re-told them, they may have changed some parts,
so they are less 'true'. They may have changed them by mistake, or to
make them more interesting. (Source : Wikipedia)
What is history?
History
is the study of the past, specifically how it relates to humans. It is
an umbrella term that relates to past events as well as the discovery,
collection, organization, and presentation of information about these
events. History can also refer to the academic discipline which uses a
narrative to examine and analyse a sequence of past events, and
objectively determine the patterns of cause and effect that determine
them. (Source: Wikipedia)
ఈ రెండిటిని కలగలిపితే ఏమవుతుందో పెంగ్విన్
పబ్లిషర్స్ ఇండియన్ మార్కెట్ నుంచి వెనక్కి తీసుకున్న 'The Hindus'
పుస్తక రచయిత్రి Wendy Doniger మాటల్లో చూస్తే :
Myth has been called “the
smoke of history, and my intention is to balance the smoke of myth with
the fire of historical events, as well as to demonstrate how myths too
become fires when they do not merely respond to historical events (as
smoke arises from fire) but drive them (as fire gives rise to smoke).
Ideas are facts too; the belief, whether true or false,that the British
were greasing cartridges with animal fat started a revolution in India.
For we are what we imagine, as much as what we do. --
( Source: The Hindus: An Alternative History).
ఈ 'The Hindus An Alternative History ' అనే పుస్తకంలో తనేమి చెప్పబోతున్నారో వెండీ ఇలా వివరించారు :
"The
image of the man in the moon who is also a rabbit in the moon, or the
duck who is also a rabbit, will serve as a metaphor for the double
visions of the Hindus that this book will strive to present."
***
*** ***
ఓహ్
అంటే ఇది కొన్ని myths ని , హిస్టారికల్ ఫాక్ట్స్ తో seamless గా కలిపి
గతాన్ని construct చేస్తూ , అత్యంత energetic, exciting శైలిలో రాయబడిన
పుస్తకమా ?
అసలు
ఆ మాటకొస్తే టైటిల్ లోనే 'Alternative History ' అని ఉంది
కదా, హిందూ మతం మీద గతంలో ఇటువంటి కథనాలు కోకొల్లలుగా వస్తే లేని రభస
ఇప్పుడు ఎందుకూ అని eyebrows రైజ్ చేస్తున్నారు కదూ ?! నిజమే గతం లో
వచ్చాయి
, భవిష్యత్తు లో కూడా వస్తాయి అందులో సందేహం లేదు . కానీ ఈ పుస్తకం
రాసినది ఎవరూ ?
అమెరికాలో భారతీయ శాస్త్రాన్ని గత 50 యేళ్లుగా అధ్యయనం చేస్తూ, ప్రస్తుతం
యూనివర్సిటీ ఆఫ్ షికాగోలో హిస్టరీ ఆఫ్ రెలిజియన్స్ విభాగంలో సర్వీస్
ప్రొఫెసర్ గా పనిచేస్తున్నవారు. ఇంకా చెప్పాలి అంటే మెటామారఫికల్ గా
'I’ve labored all my adult life in the paddy fields of Sanskrit' అని తన
గురించి తను చెప్పుకున్న రెలిజియస్ స్టడీస్ లో పని చేస్తున్న ప్రొఫెసర్.
వీటిని దృష్టి
లో పెట్టుకుని చూస్తే మన చరిత్ర, సంస్కృతుల మీద భవిష్యత్తు లోను /
ప్రస్తుతం - జరిగే'/ జరగబోయే అనేక పరిశోధనల మీద ఈ పుస్తక ప్రభావం తప్పక
ఉంటుంది కాబట్టి, సహజంగానే ఎక్కువ ఆస్తక్తిని రేకెత్తించటం పెద్ద
ఆశ్చర్యపడాల్సిన విషయం కాదు .
అకడమిక్ దృక్కోణంలోని
ఈ పుస్తక ప్రాధాన్యతని పక్కన పెట్టి, నా పర్సనల్ రీడింగ్ ఎక్స్పీరియన్స్
కి వస్తే ఇందులో నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తిన విషయాలకీ, అబ్బురపరచిన
అంశాలకి, అసహనం తో కుదిపేసిన అంశాలకి కొదవలేదు. అందులో కొన్ని:
- ఒక బ్రాడ్ వ్యూ తో దరిదాపు 50 BCE నుంచి - ప్రస్తుతకాలం వరకు వేల ఏళ్ళ చరిత్రని నిక్షిప్తం చేస్తున్న ఈ పుస్తకంలో రచయిత్రి 1922 ప్రాంతంలో గుజరాత్ లోని ఆదివాసీల 'Devi movement' ని, తరవాత కాలంలో గాంధీజీ "Nationalist movement' ని, 1990 లో ఆంధ్రప్రదేశ్ లోని ఒక చిన్న ప్రాంతమైన దూబగుంట (నెల్లూరు జిల్లా) లో మొదలైన Antiliquor campaign ఒక త్రెడ్ తో కలిపి చూపించటం చాలా అబ్బురపరిచింది. అయితే వెను వెంటనే గాంధీజీ గురించి mention అంశాలు చిరాకు తెప్పించాయి. గాంధీజీ, తనకు సంబంధించిన వివాదస్పద అంశాలని కూడా తన ఆటో బయోగ్రఫీలో చెప్పుకున్నారు (Infact, he was too harsh on himself). అవి తెలిసిన ప్రపంచానికి కొత్తగా ఎవరైనా అయన గురించి కొత్తగా చెప్పేందుకు ఏముంటుంది?! ఒకవేళ చెప్పినా అవి పెద్దగా ఆశ్చర్యం కలిగించవు అని నాకో అభిప్రాయం ఉండేది. కానీ ఈ పుస్తకంలో వెండీ గాంధీజీ ancient Tantric techniques ప్రాక్టీస్ చేసారు అని చెప్తూ నన్ను ఆశ్చర్యపరిచారు. (రచయిత్రి మాటల్లో : Gandhi was a one-man strange bedfellow. His insistence on celibacy for his disciples caused difficulty among some of them, as did his habit of sleeping beside girls young enough to be called jailbait in the United States, to test and/or prove his celibate control or to stiffen his resolve. But this practice drew not so much upon the Upanishadic and Vaishnava ascetic traditions, which were the source of many of Gandhi’s practices, as upon the ancient Tantric techniques of internalizing power, indeed creating magical powers, by first stirring up the sexual energies and then withholding semen.) ఏ ఆధారాలతో ఈ మాటలు చెప్పారో తెలియదు.
- December 6, 1992 న అయోధ్య లో జరిగిన Babri-Masjid-Rama-Janma- Bhumi ఇష్యూ లో అప్పట్లో టీవీ లో ప్రసారమవుతున్న 'రామానంద్ సాగర్ రామాయణ్' కూడా ప్రభావం చూపించింది అని రూమర్ (కేవలం రూమర్ మాత్రమే) ఉంది. అంత చిన్న విషయం రచయిత్రి దృష్టికి రావటం నన్ను ఆశ్చర్యపరిస్తే, వెంటనే ఆ disputed ల్యాండ్ లో గుడి ఉండేది అని ఆర్కియాలజీ డిపార్టుమెంటు నిర్ధారించిన విషయాన్ని myth గా చెప్పటం అసహనాన్ని కలిగించిది .
- ఇక SHIVA, THE SKULL BEARER అని చెప్తూ శివ, బ్రహ్మ, సరస్వతుల గురించిన కథనం ఎంత వరకూ నిజమో, అసలు ఆ మాటకొస్తే నిజమో/ కాదో చెప్పే పరిజ్ఞానం నాకు లేదు కానీ, ఈ కథనం నేను ఇంతకూ ముందు ఎప్పుడూ వినని వెర్షన్ .
ఈ కధనాలలో నిజమెంతుందో చెప్పగలిగే, అలాగే రచయిత్రి తను
పరిశోధించిన అంశాలని అన్వయించిన తీరు సరైనదో లేదో నిర్ధారించగలిగే
అకడమిక్ పరిజ్ఞానం గానీ, అసలు ఆ మాటకొస్తే పేరు లోనే alternative history అని
ఉంది కదా వెండీ రాసిన విషయాలకి ఆధారాలు కావాలా అన్న ప్రశ్నకి సమాధానం కానీ
నా దగ్గర లేవు. కాబట్టి , 'నాకు తెలిసిన / విన్న కొన్ని విషయాలతో
పాటూ, ఎప్పుడూ వినని కథనాలతో, కొంత ఆశ్చర్యాన్ని & అసహనాన్ని
కలిగిస్తూ ఒక bumpy ride తీసుకున్న అనుభూతిని ఈ పుస్తకం కలిగించింది' అని చెప్తూ, ఇక్కడితో పుస్తకం లోని విషయాలని ప్రస్తావించటం ఆపేస్తాను .
ఇహ ప్రస్తుత వివాదానికి దారి తీసిన విషయాలకి వస్తే :
2009
లో పెంగ్విన్ పబ్లిషర్స్ ప్రచురించిన ఈ పుస్తకంలోని కొన్ని అంశాలు
అభ్యంతరకరం అని, అవి హిందువుల ఫీలింగ్స్ ని 'hurt' చేసేవిగా ఉన్నాయని
2011 దీనా నాథ్ బాత్ర (Head of Shiksha Bacho Andolan) 'IPC 295 A' క్రింద lawsuit ఫైల్ చేసారు (లీగల్ నోటీసు వివరాలు ) .
IPC 295 A ఏమి చెప్తోంది :
"295A. 5[ Deliberate and malicious acts intended to outrage religious
feelings of any class by insulting its religion or religious beliefs.--
Whoever, with deliberate and malicious intention of outraging the
religious feelings of any class of 6[ citizens of India], 7[ by words,
either spoken or written, or by signs or by visible representations or
otherwise] insults or attempts to insult the religion or the religious
beliefs of that class, shall be punished with imprisonment of either
description for a term which may extend to 8[ three years], or with
fine, or with both.] "
(Source)
2011 లో లీగల్ సూట్ ఫైల్ చేస్తే దరిదాపు 3 ఏళ్ళ తరవాత 2014 Feb లో పెంగ్విన్ పబ్లిషర్స్ కోర్ట్ బయట ఇండియన్ మార్కెట్ నుంచి ఈ పుస్తకాన్ని recall చేస్తాం అని 'Shiksha Bacho Andolan' తో కుదుర్చుకున్న ఒప్పందంతో ఈ కేసు కి కోర్ట్ లో తెరపడింది . (ఒప్పందం వివరాలు ఇక్కడ) .
పెంగ్విన్ పబ్లిషర్స్ పుస్తకాన్ని మార్కెట్ నుంచి ఉపసహరించుకోవటం మీద రచయిత్రి అభిప్రాయం :
"The true villain of this piece," she said, is "the Indian law that
makes it a criminal rather than civil offence to publish a book that
offends any Hindu, a law that jeopardises the physical safety of any
publisher, no matter how ludicrous the accusation brought against a
book." (Source) .
పెంగ్విన్ పబ్లిషర్స్ , 'Shiksha
Bacho Andolan' కుదుర్చుకున్న out of court ఒప్పందంతో ఈ వివాదం
ముగిసిపోయిందా?! లేదు అలా జరగలేదు. ఆశ్చర్యంగా పుస్తకంలోని విషయాలు
అభ్యంతకరంగా ఉన్నాయి అని కోర్టులో 'లా సూట్' ఫైల్ చేసిన నాటి కన్నా,
మార్కెట్ నుంచి వెనక్కి తీసుకున్నారు అని తెలిసిన రోజున అతి పెద్ద వివాదానికి తెర లేచింది.
'Right to free speech', ఇంకా మతపరమైన విషయాల పట్ల పెరిగిపోతున్న
హిందువుల అసహనం వంటి విషయాల మీద ప్రింట్ మీడియాలోను, ఎలక్ట్రానిక్ మీడియా
లోను , of course obvious గా ఇంటర్నెట్ లోను చర్చలు విసృతమయ్యాయి.
ఈ చర్చలలోని అంశాలలోకి వెళ్ళే ముందు, అసలు
పుస్తకం లోని విషయం మీద
కోర్టు ద్వారా కాకుండా కౌంటర్ arguments తో వేరే పుస్తకం ద్వారా కానీ,
క్రిటిక్ రివ్యూ
ద్వారా కానీ ఎదుర్కునే ప్రయత్నం చేయకుండా, ఇంత ఆందోళనకి దారితీసి కోర్టు
తలుపులు తట్టాల్సినదిగా ప్రోవోక్ చేసే పరిస్థితులు ఎందుకు వచ్చాయో ఒకసారి
చూద్దాం.
దురదృష్టవశాత్తు
పురాతనమైన నాగరికతలలో ఒకటిగా చెప్పబడుతున్న మన గత కాలపు చరిత్రకి
సంబంధించిన ఆధారాలు జాగ్రత్తగా రికార్డు చేయబడలేదు, దీనికి తోడుగా
విదేశీదాడుల్లో కొల్లగట్టబడిన, నాశనం చేసిన ఆధారాలు తక్కువ కాదు. అంతే
కాకుండా హిస్టరీని, మైథాలజీని విడిగా చూడకపోవటంతో చరిత్ర కాస్తా ఫిక్షన్ గా
మారింది. దీనితో ఒకే సంఘటనకి సంబంధించిన అనేక కథనాలు లభ్యం అవుతాయి. ఇక గత
కాలాన్ని వదిలి ప్రస్తుతానికి వస్తే : According to Article
28.1 of The Constitution of India : “No religious instruction
shall be provided in any educational institution wholly maintained out
of State funds.” దీనితో ప్రభుత్వం నుంచి ఆర్ధికపరమైన సహాయం అందకపోవటం
పోవటంతో, రాజకీయంగా, ఆర్ధికంగా , సామాజికంగా ప్రధాన పాత్ర పోషిసిస్తున్న
మతం గురించి authentic గా అధ్యనయం చేసే అవకాశాలు తక్కువ. ఈ vacuum ని
పూరించటానికి వేరే దేశాల institutions చేసే రెలిజియస్
స్టడీస్ అధ్యనయనాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి. పైగా తలకి మించిన ఆర్ధిక,
రక్షణ సమస్యలు ఎదుర్కుంటున్న అభివృద్ధి చెందుతున్న దేశం ఇటువంటి రెలిజియస్
స్టడీస్ మీద ఎంత వరకూ ఖర్చు పెట్టగలదు? ఇదో ప్రధాన సమస్య. ఇటువంటి
పరిస్థితుల్లో poor historiography & inaccuracies (ఉన్నాయనివిమర్శలు ఎదుర్కుంటున్న పుస్తకం ఎంత alternative history అని పేరు పెట్టినా, తరువాతి కాలంలో
అసలు చరిత్రకి ఒక రిఫరెన్స్ గా మారే ప్రమాదం ఉంది అన్న ఆందోళనలు సహజం. ఈ
ఆందోళనలని మత మౌడ్యంగా కన్నా, ఇప్పటి వరకూ చరిత్ర పట్ల పెద్దగా ఆసక్తి
చూపని ఒక మతం, దాని వల్ల జరుతున్న నష్టాలని గురిస్తున్న పరిణామక్రమం లోని
భాగంగా ఈ ఆందోళనలని చూడాలి అని నా అభిప్రాయం .
ఏ పుస్తకానైనా
నిషేధించటం, తగులబెట్టటం వంటి చర్యలు ఏ సివిలైజ్డ్ సొసైటీకి ఆమోదయోగ్యం కాదు.
ఇది తప్పక అందరూ అంగీకరించే / అంగీకరించాల్సిన సత్యం. కానీ 'మతపరమైన
విషయాల పట్ల హిందువుల అసహనం ప్రమాదస్థాయి లో పెరిగిపోతుంది' అని
ప్రింటింగ్ మీడియా లోను, ఎలక్ట్రానిక్ మీడియా లోను ఉదారవాదులు చేస్తున్న
విపరీత ప్రచారంలో నిజమెంత? అలాగే ఏ ఆంక్షలు లేని 'free speech' అమలు
పరచటానికి భారతదేశంలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా?(ఫ్రీ స్పీచ్ అంటూ
24X 7 lectures దంచే సో కాల్డ్ ఉదారవాదులు , సెలబ్రిటీస్ తమ దాకా వస్తే
సోషల్ మీడియా లోని కామెంట్ల మీద కూడా పోలీసులకి పిర్యాదులు చేసే సంఘటనలు
వేళ్ళ మీద లెక్క పెట్టె కన్నా ఎక్కువే) అన్నవి పరిశీలిస్తే :
1. 'మతపరమైన
విషయాల పట్ల హిందువుల అసహనం ప్రమాదస్థాయి లో పెరిగిపోతుంది' అన్న ఆరోపణల్లో నిజం : ఇది
ఇప్పటివరకూ ఇండియా లో బాన్ చేసిన / బాన్ చేయాలని చాలెంజ్ చేసిన పుస్తకాల
లిస్టు . ఈ లిస్టు చూస్తే ఈ ఆరోపణల్లో నిజమెంతో తెలుసుకోవచ్చు . ఇక గత
కొద్ది సంవత్సరాలుగా అమాయకుల ప్రాణాలను టార్గెట్ చేస్తూ జరుతున్న దాడుల
గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిజంగా హిందువుల్లో ఈ లిబరల్స్
చెబుతున్న స్థాయిలో మతమౌడ్యం వెర్రి తలలు వేస్తుంటే ఈ మాత్రం ప్రశాంతత
కూడా ఉండేది కాదేమో ఈ దేశంలో. ఇక అదృష్టవశాత్తు ఈపుస్తక విషయంలో ఎటువంటి
హింసాత్మక చర్యలు, రచయిత తలకి వెల కట్టటం వంటి అనాగరిక చర్యలకి పాల్పడటం
వంటివి జరగలేదు. అలాగే లీగల్ ప్రొసీడింగ్స్ చివరి వరకూ జరిగి ఉంటె ఏమి
జరిగేదో తెలియదు కానీ, ప్రస్తుతం మాత్రం పుస్తకాన్ని బాన్ చేయలేదు, కేవలం
మార్కెట్ నుంచి వెనక్కి తీసుకున్నారు. ఒకవేళ బాన్ చేసి ఉంటె ఇలా పుస్తకం
గురించిన చర్చలు, టెక్స్ట్ కోట్ చేయటం కూడా నేరమే అయి ఉండేవి.
2.
ఆంక్షలు లేని 'free speech' : భారతదేశం demographics ని పరిశీలిస్తే
ఎల్లలు లేని 'free speech ' hate speech గా రూపుదిద్దుకుని తీవ్రమైన
నష్టాన్ని కలిగిస్తుంది అని చెప్పటానికి పెద్దగా సర్వేలు , రీసెర్చ్ లు ,
అనాలసిస్లు అక్కరలేదు . ఇప్పటికే ఒక సెక్యులర్ దేశంగా చాటి చెప్పుకోవటానికి
నానారకాల విన్యాసాలు చేస్తున్న దేశానికి ఇదో పెద్ద ఓవర్ బర్డెన్. ఆంక్షలు
లేని ఫ్రీ స్పీచ్ కన్నా ఒక మామూలు మనిషి సుఖంగా, సేఫ్ గాను బ్రతకటానికి
కావాల్సిన communal harmony అనేది ముఖ్యం. ఇప్పుడు నేను చెప్పబోయేది ఈ
పుస్తకం తో సంబంధం లేని అంశం అయినప్పటికీ ప్రస్తావించకుండా ఉండలేని అంశం.
అమాయకుల ప్రాణాలు కోల్పోయే అవకాశమున్న సంఘటనల కన్నా పోలిస్తే myths
ఆధారంగా రాయబడిన పుస్తకం మార్కెట్ నుంచి వెనక్కి తీసుకోవటం అనేది పెద్ద
అంశంగా గుర్తించి వెల్లువెత్తిన లిబరల్స్ స్పందన నాకు ఆశ్చర్యాన్ని
కలిగిచింది.
ఇక,
ఈ పుస్తకం లో అంశాలు మీద లీగల్గా proceed అవ్వడం అనేది అలనాటి సోక్రటీస్
కి వేసిన మరణ శిక్ష , గలీలియో కి వేసిన జీవిత ఖైదు తో పోల్చే వారికి ఒక
రిక్వెస్ట్ : Guys , సోక్రటీస్ & గలీలియో
అనేవాళ్ళు myth కాదు ఈ భూమి మీద మనలానే flesh and blood తో బ్రతికిన
మనుషులు . వాళ్ళ పరిశోధనలకి విలువనిద్దాం . తాము నమ్మిన దాని కోసం
మరణానికి , జీవిత ఖైదుకి కి సిద్దపడిన వారిని , నా పుస్తకం మీద లీగల్ గా
కేసు వేసారు కాబట్టి నేను ఇండియా రాను ఇక మీదట అనే సిల్లీ స్టేట్మెంట్స్
ఇచ్చే వాళ్ళతో కంపేరు చేసి విలువని తగ్గించొద్దు అని .
Finally
, Wendy Doniger has a right to say whatever she wants to say and
publish it . I
will defend her right. However, it does not mean to ask Batra should
not exercise his right and keep silent if he find her work is rubbish.
- శ్రావ్య
Btw,
I totally forgot to mention one thing above , కోర్టులో కేస్ వేసి ,
లీగల్గా ప్రొసీడ్ అయ్యి బాత్రా , వెండీ పుస్తకానికి ప్రాముఖ్యతని తెచ్చి,
సేల్స్ పెంచారు . ఇది అక్షరాలా అంగీకరించాల్సిన విషయం, సందేహం ఏ మాత్రం
లేదు. కాకపోతే ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్న వాళ్ళు మరచిపోతున్న ఒక
ముఖ్యమైన విషయం ఏంటి అంటే, బాత్రా వెండీ పుస్తకానికి తెచ్చిన ప్రాముఖ్యత
కన్నా ఇంకా కనీసం రెండో మూడో రెట్లు ఎక్కువ ప్రాముఖ్యత 'IPC 295 A' కి ఈ చర్చల ద్వారా వచ్చింది అని. ఇప్పుడు నాలాంటి సామాన్యులకి కూడా ఏదన్నా పుస్తకం నచ్చకపోతే ఏమి చేయాలి అనే awareness వచ్చింది :-)
References :
The Hindus: An Alternative History
A Passion for Hindu Myths
Beheading Hindus
Meeting the book ban man
హిందూమత చరిత్రలో ప్రత్యమ్నాయ కథనాలకు ఆస్కారం లేదా?
Wendy Doniger 'On Hinduism'
Here comes the book police
(తోలి ముద్రణ మాలిక మాగజైన్ మే 2014 ఇష్యూ లో ఇక్కడ)