Subscribe:

Thursday, November 12, 2015

Human Induced Weather Enhancement !

ది కురుక్షేత్ర సంగ్రామంలో పదునాల్గోవరోజు ...

తన ప్రియపుత్రుడైన అభిమన్యుని మరణానికి కారణమైన జయద్రథుని(సైంధవుని) సూర్యాస్తమయం లోపు సంహరించలేకపొతే, రాజులందరూ చూస్తూండగానే గాండీవంతో సహా అగ్నిప్రవేశం చేస్తానని శపథం చేసిన అర్జునుడు యుద్ధభూమిలో మహోగ్రంగా చెలరేగుతున్నాడు. అర్జునుని ఈ శపథం గురించి తెలుసుకున్న కౌరవసైన్యం యావత్తు జయద్రథునికి రక్షణకవచంగా ఏర్పడి అర్జునుడి కంటపడకుండా కాపాడుతోంది. అప్పటికే ఒక అక్షౌహిణి కౌరవ సైన్యాన్ని తుదముట్టించిన అర్జునుడు, సుమారు మధ్యాహ్న సమయానికి కర్ణ, అశ్వద్ధామ, ద్రోణ వంటి యోధానుయోధుల పరిరక్షణలో ఉన్న జయద్రథుణ్ణి కనుగొన్నాడు. రక్షణవలయంగా నిలిచిన ఈ వీరాధివీరులందరినీ జయించే క్రమంలో భీకరంగా జరుగుతున్న యుద్ధంతో కాలాతీతం అవుతుంది. కర్తవ్యనిర్వహణలో అలసిన సూర్యభగవానుడు విశ్రమించటానికి నెమ్మదిగా పడమటికొండల పైకి చేరుకోబోతున్నాడు. అది గమనించిన శ్రీకృష్ణుడు, సుదర్శనచక్రాన్ని సూర్యబింబానికి అడ్డుగా నిలిపి సూర్యాస్తమయం అయిపోయిందనే భ్రాంతిని కల్పించాడు. ఆ మాయతిమిరంలో పూర్తిగా మునిగిపోయిన కౌరవవీరులు సూర్యుడస్తమించాడని భ్రమించి విజయగర్వంతో ఉప్పొంగిపోయారు. ఆశ్చర్యానందాల నడుమ సైంధవుడు రక్షణ కవచం నుండి బయటికివచ్చి తలఎత్తి పడమర దిక్కు ఆశ్చర్యంతో చూస్తూ నిలిచాడు. వెనువెంటనే శ్రీకృష్ణుడు సుదర్శన చక్రాన్ని ఉపసంహరించడం, అర్జునుడు జయద్రథుని సంహరించడం జరిగిపోయాయి.

                                                         ***     ***    ***    ***    ***

సూర్యాస్తమయం అవ్వకుండానే, అయ్యిందన్న భ్రాంతిని కలిగించి, శత్రువుని ఏమార్చటమా? What a brilliant War Technique ! 

కురుక్షేత్ర సంగ్రామం....  అంటే దరిదాపు 10th century BCE ప్రాంతంలో జరిగివుండొచ్చూ అని హిస్టారియన్స్ అభిప్రాయపడుతున్న యుద్ధం. ఈ యుద్ధవర్ణనలోనే ఇటువంటి amazing war strategy  గురించిన ప్రస్తావన ఉంటె, మరి మోడరన్ టైమ్స్ లో జరిగిన యుద్దాలలో ఇలాంటి టెక్నిక్స్ వాడాలన్న ఆలోచన ఎవరూ చేయకుండా ఉంటారా? పోనీ... యుద్దాలలో కాకపోయినా రికార్డు స్థాయిలో మంచుకురవటంతో, temperatures ఫ్రీజింగ్ పాయింట్ కన్నా తక్కువకు వెళ్ళిపోయి తద్వారా వచ్చే చల్లటిగాలులతో వణికిపోయేప్పుడో, భగ భగమని మండుతూ తన ప్రతాపాన్ని చూపించే సూర్యభగవానుడిని ధాటికి విలవిలలాడేప్పుడో... ఇవన్నీ కాదుకానీ చక్కగా  చల్లటి వేసవికాలాలు & గోరువెచ్చటి శీతాకాలాల కోసం ఇలాంటి Weather modification టెక్నిక్స్ వాడితే ఎలా ఉంటుందో అన్నఆలోచన ఎవరికీ వచ్చి ఉండదా?

ఎందుకు రాలేదు?  ఆలోచన రావటమే కాదు,  వచ్చిన ఆలోచనను అమలులో పెట్టటం కూడా జరిగింది. అదెలాగా అంటే .....

US's Operation Popeye
అది 1967 - 1972 మధ్యకాలం.  ఫ్రాన్స్ వియత్నాం మీద యుద్ధం ప్రకటించింది. అనేకానేక యితర కారణాలతో పాటు ఫ్రాన్స్ - అమెరికాల మధ్య మిలిటరీ & ఎకనామిక్ ఎయిడ్ ఒడంబడిక (ట్రీటీ) ఉండటంతో, ఫ్రాన్స్ కు సపోర్ట్ గా  పెంటగాన్   తన ముక్కు దూర్చటంతో పాటు   US Air Force  ఆధ్వర్యంలో,    వియత్నాం అయుధాలు, ఆహారం, ఇతరత్రా  ఎక్విప్మెంట్  సైన్యానికి అందజేయటానికి  సప్లై రూట్ గా వాడుతున్న    "Ho Chi Minh Trail" లో  ప్రతికూల వాతావరణాన్ని సృష్టించి శ్రతువుని ఇరుకున పెట్టాలని నిర్ణయం తీసుకోవటమే కాకుండా దానికి  అధికారికంగా   "Operation Popeye" అని నామకరణం చేసింది.  ఈ ఆపరేషన్ ప్రదానలక్ష్యం -  అతి ముఖ్యమైన Ho Chi Minh Trail ప్రాంతంలో  common  form of chemical weather modification గా చెప్పబడుతున్న క్లౌడ్ సీడింగ్  టెక్నిక్ ద్వారా monsoon season ను పొడిగించి,  తద్వారా  ఎక్కువ   వర్షపాతం నమోదయ్యేట్లు చేయటం.  ఈ అధికంగా కురిసే వర్షాలతో ఎక్కువ రోజులు నీళ్ళతో నాని పోవటంతో నేలంతా బురద బురదగా  (saturated  soil ) గా ఆవ్వడం,   రోడ్లు  దెబ్బతిని  transportation కు  పనికిరాకుండా పోవటం, నదులు దాటటానికి వాడే కట్టలు కొట్టుకుని పోవటం, Land  slides / land slips  ఏర్పడటం లాంటివి జరిగి  సప్లై చైన్  బ్రేకవుతుంది. ఇహ End  result గా  మిలిటరీకు వచ్చే సహాయం  ఆగిపోవటంతో  శత్రువు ఇరుకున పడతాడు. ఈ లక్ష్యాలకు తగినట్లుగానే ఈ ఆపరేషన్కు "Make mud, not War"  అన్న సోగ్లన్ ను వాడారు.     Operation Popeye కోసం అమెరికా  దరిదాపు 3000 సార్లు  విమానాలని   Ho Chi Minh Trail  ఉపరితం  లోకి పంపింది.   గాలిలోకి ఎగిరిన ఈ విమానాల పని ఏంటంటే silver iodide particles ను  మేఘాల మీద వెదచల్లటం. దానితో Metalhalogen compound అయిన ఈ సిల్వర్ అయోడైడ్ (తరవాత కాలంలో సిల్వర్ అయోడైడ్ వాడటం వల్ల ఆ ప్రాంతంలో నివసించే ప్రజలకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉందని, దాని  బదులు  పొటాసియం అయోడైడ్ /డ్రై ఐస్ /లిక్విడ్ ప్రొపేన్/ ఇంట్లో వాడే టేబుల్ సాల్ట్ లాంటి hygroscopic  కెమికల్స్ ను  దీని కోసం వాడొచ్చు అని తేల్చారు)  మేఘంలోని  నీటిఆవిరిని ఆకర్షించి ఒక పెద్ద నీటిబిందువుగా  మారుస్తుంది. ఇలా  నీటిబిందువులుగా  మారిన ఆవిరి  బరువు ఎక్కువటంతో వర్షంగా భూమిమీదకి పడుతుంది. థాయిలాండ్ భూభాగంలోని  Udorn Royal Thai Air Force Base  వియత్నాం బోర్డర్ కు దగ్గరగా ఉండి అనుకూలంగా ఉండటంతో, అక్కడ నుంచి aircrafts ను ప్రయొగించారు.     మొత్తానికి యుద్ధపు అంతిమ ఫలితం అమెరికా, ఫ్రాన్స్ లకు నిరాశనే మిగిల్చినా అధికారికంగా Defense Intelligence Agency  వేసిన లెక్కల ప్రకారం  "Operation Popeye"  వల్ల  ఆ ప్రాంతంలో 30%  వర్షపాతం పెరిగినట్లుగా తేల్చారు.   ఇక ఈ యుద్ధం  మొట్టమొదటిసారిగా 'Weather Modification"   అనే  ఆయుధాన్ని  వాడిన యుద్ధంగా చరిత్రకెక్కింది.  అయితే  అత్యంత రహస్యంగా మొదలైన ఈ ఆపరేషన్ 1971 లో ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్ తో వెలుగుచూడటంతో పొలిటికల్ కాంట్రవర్సీకి దారి తీసి  US గవర్నమెంట్ 1977 లో  United Nations  ప్రతిపాదించిన Convention on the Prohibition of Military or Any Other Hostile Use of Environmental Modification Techniques  అగ్రిమెంట్ సైన్ చేయటంతో ముగిసింది.
Rain Prevention by China  in 2008 Olympics
అమెరికానేమో తన విజయ పరంపర కొనసాగించటానికి 'వాన వాన వల్లప్పా' అని బ్రతిమలాడి వియత్నాం మీద నీళ్ళని కుమ్మరిస్తే,  చైనా ప్రతిష్టాత్మకంగా తను నిర్వహిస్తున్నా ఒలింపిక్ గేమ్స్ లో గడబిడ జరక్కుండా ఉండటానికి 'రైన్ రైన్ గో అవే' అంటూ దూరంగా తోసేసింది. అదెలాగా అంటే, 2008  సమ్మర్ ఒలింపిక్స్ ని చైనా నిర్వహించింది.   అందులో భాగంగా  ఓపెనింగ్ సెర్మనీ కోసం  ఈ   ఒలింపిక్స్ కోసం ప్రత్యేకంగా 400 మిలియన్ల డాలర్స్ తో బీజింగ్ లో నిర్మించిన "Bird's nest"  అనే  91,000 సీట్స్ ఉన్న స్టేడియం ను ఎన్నుకుంది.  One of the key engineering marvels in the world  అని  చెప్పబడే ఈ స్టేడియం ఓపెన్ రూఫ్ స్టేడియం, దానితో వర్షం నుంచి ఈ స్టేడియం రక్షణ కోసం  weather modification  technology ను meteorological umbrella గా మార్చే బాధ్యతను 37,000   మంది ఎంప్లాయిస్ పని చేస్తున్న తన Beijing Weather Modification Office కి అప్పగించింది. ఈ సంస్థ 30 ప్లేన్స్,  4,000 రాకెట్ లాంచర్స్,  7,000  anti-aircraft guns సహాయం తో  కెమికల్స్ మేఘాల పైకి పంపి  వర్షంగా మారబోయే  రైన్ droplets ని  ష్రింక్ చేయటంతో ఆ స్టేడియం ప్రాంతాన్ని  వర్షం భారీన పడకుండా కాపుకాసింది. 
Russian way  of Weather Modification 
1980 అంటే సోవియట్ యూనియన్ పీరియడ్ లో  మాస్కో లో వింటర్ సీజన్ లో భారీగా  స్నో ను  కంట్రోల్ చేయటానికి స్పెషల్ సర్వీస్ ఉండేది.  ఈ సర్వీసు పని  8  - 10  ప్లేన్స్  సహయంతో మాస్కో చుట్టుపక్కల   most precipitation  ఉన్న మేఘాల్ని గుర్తించటం  వాటిమీద crystallizing  salts ను చల్లటం.  సో  ఈ మేఘాలు ఇంకా మాస్కో చేరకముందే  స్నో కురిసేది, దానితో  20 - 40 %  వరకూ మాస్కో లో స్నో ఫాల్ ను తగ్గించెవారు. తర్వాత  గోర్భచేవ్  రిఫార్మ్స్ పీరియడ్ లో  నిధుల కొరత మూలంగా ఆపెసారు.  కానీ ఆ కాలం నుంచీ  ఇప్పటి   రష్యా ప్రభుత్వం  వరకునూ Victory Day, City Day,  Russia Day లాంటి స్పెషల్ అకేషన్స్ లో  rain  prevention methods ని మాత్రం వాడుతూనే వస్తున్నారు.   గంటకి $6000  పే  చేస్తే పెళ్లి లాంటి ప్రైవేటు పార్టీస్  రోజున  sunshine  guarantee  అనే ప్రైవేటు  కంపనీలు ఉన్నాయట ఇప్పుడు :-) 

ప్రస్తుతం Weather Modification Technology  లో అగ్రస్థానం లో  నిలిచిన  దేశాలు ప్రత్యక్షం గా ఈ టెక్నాలజీ పబ్లిక్ కు demonstrate చేసిన  ప్రధానమైన & బాగా ప్రచారం పొందిన సంఘటనలలో ఇవి కొన్ని. అయితే ఇవే కాకుండా,    Beijing Weather Modication Office -  1995 -  2003  మధ్యకాలం లో  precipitation 1/8 లెవెల్ కు పెంచి,    వర్షపాతాన్ని  7.4 ట్రిలియన్ క్యూబిక్ ఫీట్ పెంచటం ద్వారా  వర్షాభావ పరిస్థితులనుంచి గోధుమ పంటను కాపాడినట్లు గానూ,   1997  చైనీస్ న్యూ ఇయర్ డే  సెలబ్రేషన్ కోసం బీజింగ్ లో భారీ ఎత్తున స్నో ఫాల్ ను కురిపించినట్లుగానూ  official గా క్లెయిమ్  చేసింది. ప్రస్తుతం ఈ సంస్థ hail stroms, dust storms లను ఆపే రక్షణ వ్యవస్థ ని రూపొందించే పనిలో ఉంది. అలాగే అమెరికా  తను  తరచూ ఎదుర్కునే హర్రికేన్స్ నుంచి కాపాడుకోవటానికి "Hurricane Modification"  రూపొందించే పనిలో ఉంది. ఇప్పటి వరకు  లేజర్స్ వాడి hurricanes గా మారే lightning డిశ్చార్జ్ చేయటం,  లిక్విడ్ నైట్రోజెన్ ను సముద్రంలో పోయటంతో హీట్ ఎనర్జీని  తగ్గించి హర్రికేన్ ఏర్పడకుండా చూడటం లాంటి ప్రయోగాలు చేస్తుంది. వీటితో పాటు  California, Colorado, Georgia, Hawaii, Idaho, Illinois, Iowa, Kansas, Montana, Nevada, New Mexico, North Dakota, Oklahoma, Oregon, South Dakota, Texas, Utah, Washington, Wyoming states లో   క్లౌడ్ సీడింగ్ చేస్తుంది. Basically Cloud seeding is no longer considered as a fringe science, and is considered as a mainstream tool.   ఇహ  ఈ మూడు దేశాలు కాకుండా  మిగిలిన ప్రపంచం ఈ విషయంలో ఏమి చేస్తుందా అని ఒకసారి చూస్తే ఇంత భారీ స్థాయిలో కాకపోయినా కొన్ని మిగిలిన దేశాలు కూడా ఈ వైపుగా అడుగులు వేస్తూనే ఉన్నాయి.  1950 లో  Project Cumulus పేరుతొ UK  క్లౌడ్ సీడింగ్ తో  weather modification వైపుగా మొదటి ప్రయత్నం చేసింది.  దీని ఫలితాలను అధికారికంగా ప్రకటించకపోయినా 16th ఆగష్టు 1952 న  24 గంటల్లో కురిసిన 229 millimeters భారీ వర్షం కారణంగా 35 మంది చనిపోయారు, అనేక బిల్డింగ్స్, bridges నాశనం అయ్యాయి,    BBC లెక్కల ప్రకారం ఇది  మాములు కన్నా 250 టైమ్స్ అధికంగా నమోదయ్యింది. ఈ భారీ వర్షానికి కారణం Project Cumulus అని ఒక conspiracy theory ప్రచారంలోకి వచ్చింది కానీ ఎక్స్పర్ట్స్ మాత్రం దీన్ని నాన్సెన్స్  క్రింద కొట్టిపారేసారు.  1956- 1985 వరకు కెనడా Alberta Hail Project  అన్న పేరుతొ ఒక రిసెర్చ్ ప్రాజెక్ట్ చేపట్టింది.  దీని ప్రధాన లక్ష్యం hailstorms నుంచి రక్షణ కల్పించే దిశగా  టెక్నాలజీ రూపొందించటం. రీసెర్చ్ వివరాలు ఇక్కడ. ఆస్ట్రేలియా 1960 మొదలుపెట్టి  ఇప్పటివరకూ టాస్మేనియా లో చేస్తున్న  క్లౌడ్ సీడింగ్   30 % అధికంగా  వర్షపాతం నమోదవుతుంది.  జర్మనీ వైన్ గ్రోయింగ్  ఆక్టివిటీ ఎక్కువగా ఉండే  సథరన్ బ్రవేరియా ప్రాంతం లో రీజినల్ లెవెల్ లో ఈ క్లౌడ్ సీడింగ్ చేస్తుంది. జపాన్ కు చెందిన Japanese Artificial Rainfall Research Corporation   1961 - 1967 ల మధ్యకాలం లో  క్లౌడ్ సీడింగ్  పైన రీసెర్చ్ చేయటానికి 5 ఏళ్ళ ప్రాజెక్ట్ చేపట్టింది, ప్రస్తుతం hazard prevention  మీద రీసెర్చ్ ఫోకస్ చేసింది.   ఫ్రాన్స్ , స్పెయిన్ లలో  నాన్ ప్రాఫిట్ లోకల్  కంపెనీల సాయంతో 1950 నుంచి క్లౌడ్ సీడింగ్ చెస్తున్నారు. రీసెంట్ గా  ఫ్రాన్స్ లో  Oliver's  Travels అనే కంపెనీ £100,000 పే  చేస్తే పెళ్ళిలాంటి స్పెషల్ డే న  క్లియర్ స్కై గారెంటీ అనే luxury సర్వీస్ ఆఫర్ చేస్తున్నట్లు  ప్రకటించింది.  ఇహ మన భారతదేశానికి వచ్చేస్తే 1983 - 87 &  1993 - 94 లో తమిళనాడు లోను,  2003 , 2004 లో కర్ణాటక & మహరాష్ట లోను  క్లౌడ్ సీడింగ్ ఆపరేషన్స్ చేసారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2003 - 2008 monsoon  సీజన్ లో క్లౌడ్ సీడింగ్ చేసారు .  వివరాలు ఇక్కడ

Not to digress, but  అసలు  సంగతొకటి చెప్పాలిక్కడ.   నిజానికి  ఈ సో కాల్డ్ weather modification కథా కమామీషు,  దీనికి related గా  ఎవరెవరు  ఏమేమి చేస్తున్నారా అని నేను తొంగి చూడటానికి ఒక  కారణం ఉంది.  అది ఏంటంటే,  

ఆగష్టు   9th 2015 -  సింగపూర్  నేషనల్ డే,  అందునా గోల్డెన్ జూబ్లీ  celebrations,  ఆ పైన హాలిడే. ఇహ నేను physically  రోడ్డున పడ్డాను. Mentally  :   Singapore  - A  tiny country, ఈ  50 ఏళ్ళలో ప్రతికూల పరిస్థితులల్ని ఎదుర్కుని  మిగిలిన ప్రపంచం తో పోటీపడటానికి   అవసరమైన world class infrastructure ని  దరిదాపు సమకూర్చుకుంది,  now  SG@50 -  What Lies Ahead? అన్న ఆలోచనలో పడ్డాను. వెంటనే నా మైండ్ లోకి వచ్చినది  వేడిగా humidity  తో అవుట్ డోర్ ఈవెంట్స్ కు అంతగా  అనుకూలంగా ఉండని  వాతావరణం.  అబ్బా..  ఈ   వాతావరణాన్నికొంచెం చల్లటి గాలులతో ఆహ్లాదకరంగా ఉండేట్లు మార్చుకునే ప్రయత్నం ఏవైనా  ఎంత బావుంటుందో అని అనుకుంటూ ఉన్నాను,  అంతలోనే పాపం దాహమేసినట్లుంది నీళ్లు త్రాగేసి  ఆ భారంతో నెమ్మదిగా  కదులుతూవున్న ఒక మేఘాల గుంపొకటి సూర్యుడికి అడ్డుగా రావటంతో  సడన్ గా వాతారణంలో మార్పు. అప్పుడు తళుక్కున  మెరిసిందో మెరుపు. Wait...  Wait ... ఆ మెరుపు  ఆకాశంలో కాదు  నా  మెదడులో అదేంటంటే  " Artificial గా మేఘాలని  generate చేసి వాటితో  సూర్యుడి ప్రతాపానికి కొంచెం అదుపు చేసి " ఈలాంటి వాతావరణం భారీ నుంచి  ఉపశమనం కలిగించొచ్చుగా అని  :-)  అయితే  బేసిక్ గా మనకొచ్చిన బగ్ ఈ ప్రపంచంలో ఎవరికో ఒకరి వచ్చే ఉంటుంది  let us see  వాళ్ళేం చేసారో అని గూగుల్ చేసే  టైపు బ్రెయిన్  కాబట్టి, అచ్చూ అలాగే  ఈ బోడి ఐడియా కూడా ఎవరికో రాకుండా ఉంటుందా అని  యధాప్రకారం గూగుల్ చేసా. 

Yes  నిజమే   నా అంచనా 100 % కరెక్ట్.  To be true  ఇలా artificial గా మేఘాల వంటివాటిని  ఏర్పాటుచేసి  భూమి  absorb  చేసుకునే  సోలార్ ఎనర్జీ తగ్గించటానికి  'Solar Radiation Management' అనే బాగా పాపులర్ అయిన  Climate Engineering Project . 'Global Warming' ఎదుర్కోవటానికి   సొల్యూషన్ గా  చెప్తున్న రెండు   'Global cooling' మెకానిజమ్స్  లో ఇది ఒకటి.  ఆ  రెండో మెకానిజమేమో  Green House Gas Removal.  Solar Radiation Management లో artificial క్లౌడ్స్ సృష్టించటం / సల్ఫేట్ పార్టికల్స్ కానీ aerosols కానీ  stratosphere లోకి ఇంజెక్ట్ చేయటం  ద్వారా    భూమి  absorb చేసుకునే  సూర్యశక్తిని తగ్గించటం  ద్వారా వేడిని తగ్గించే ప్రయత్నం చెస్తారు.  ఆ రెండోవ మెకానిజం అయిన Green House Gas Removal  లో గ్లోబల్ వార్మింగ్  కారణంగా  చెప్తున్న  గ్రీన్ హౌస్  గ్యాసెస్  ( water vapor, carbon dioxide, methane, nitrous oxide, and ozone) ను భూవాతావరణం లోంచి తొలిగించే ప్రయత్నం ద్వారా వేడిని తగ్గించే ప్రయత్నం చేస్తారు. ఇప్పటి వరకూ జరిగిన స్టడీస్   'Solar Radiation Management'  గ్లోబల్ వార్మింగ్ ను delay చేయటానికి  నమ్మదగిన, కాస్ట్ ఎఫెక్టివ్  సొల్యూషన్ గా చెబుతున్నాయి.   15 June 1991 న ఫిలిపైన్ కు చెందిన Luzon అనే ఐలాండ్ లోని Mount Pinatubo  అనే అగ్ని పర్వతం పేలింది.  ఇది  20 వ శతాబ్దం రెండవ అతి పెద్ద erosion.  ఈ ప్రేలుడు ప్రభావం ఇంచుమించు ప్రపంచం మొత్తం మీదా ఉంది. ఈ అగ్నిపర్వతపు ప్రేలుడు దరిదాపు 10,000,000,000 టన్నుల మాగ్మా, 20,000,000 టన్నుల సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇంకా పెద్ద మొత్తంలో మెటల్స్ & మినరల్స్ భూమి మీదకి రావటానికి కారణం అయ్యింది. ఈ జెనరేట్ అయిన సల్ఫ్యూరిక్ యాసిడ్    haze   ఒక గ్లోబల్ లేయర్ లాగా form కావటం తో 1991-1992  భూవాతావరణ ఉష్ణోగ్రత  0.5°C  తగ్గింది.  ఈ స్టాటిస్టిక్స్ ఆధారంగా aerosols కానీ  stratosphere లోకి ఇంజెక్ట్ చేయటం  ఎఫెక్టివ్ గ్లోబల్ కూలింగ్ సొల్యూషన్ గా భావిస్తున్నారు.  ఏరోసోల్స్ ను స్ట్రాటోస్ఫియర్ లోకి పంపటానికి సల్ఫర్ ను జెట్ ఫ్యుయల్స్ లో యాడ్ చేయటం ,  ఆర్టిలరీ షెల్ల్స్  గాలిలోకి పంపటం ద్వారా చెయ్యొచ్చన్న ప్రపోజల్స్ తో ఈ ప్రాజెక్ట్ కాస్ట్ $25-50 billion per year గా లెక్కలు కట్టారు. సల్ఫర్ ని స్ట్రాటోస్ఫియర్ లోకి పంపటం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ , availability తో సల్ఫర్ లాంటి ఈక్వేషన్స్ ఇంకా తేలకపోవటంతో ఇప్పటి వరకూ ఏ దేశమూ ప్రాక్టికల్గా ఈ వైపు వెళ్ళలేదు.  

Artificial cloud  generation  గురించి మరన్ని వివరాలు ఇక్కడ. ఈ Artificial cloudగురించి తెలుస్కుంటున్నప్పుడు పాతదే కానీ ఒక  ఇంటరెస్టింగ్ న్యూస్  తెలిసింది  :-) అదేంటంటే Tech savvy, innovative  visionary  అయిన మైక్రోసాఫ్ట్  కో-ఫౌండర్  బిల్ గేట్స్  సీ వాటర్ ను ఆకాశంలోకి  పంప్  చేయటంద్వారా  మేఘాలు సృష్టించి  UV rays  బ్లాక్  చేసే దిశగా చేసే ప్రయోగాలకి  5 మిలియన్ డాలర్స్  ఫండింగ్ చేసారు

అబ్బా ఇప్పుడు ఇదంతా బోర్ ఎవరు చదువుతారు అనుకుంటే ఇదుగోండి  Artificial clouds  - cloud seeding in a nutshell లాగా ఈ  NASA's  వీడియో చూసేయండి :-)


Well,   వర్షాలు,  స్నో కురవటాలని ఎక్కువ తక్కువ చేయటం,   సూర్యుడి  ప్రతాపాన్ని కంట్రోల్ చేసే దిశగా అడుగులు వేయటం వంటి వాటి  మీద జరుతుగున్న ఈ  బోలేడన్నీ ప్రయోగాలు,  అప్పుడప్పుడు ఆశాజనకంగా అనిపిస్తున్న వాటి  రిజల్ట్స్ వీటిని బేస్ చేసుకుని మనిషి weather control  చేయగలిగే స్థాయికి వచ్చేసినట్లు చెప్పగలమా ? ఈలాంటి  ప్రశ్న వస్తే answer  is big NO.  ప్రస్తుతం హ్యూమన్ రేస్ చేస్తున్న ప్రయోగాలు వాటి ఫలితాలు కేవలం  "barely scratching the surface" అంటామే ఆ స్థాయిలోనివి. Weather patterns చాలా చాలా complex patterns మాత్రమే కాదు  highly unpredictable కూడాను.  మరీ ముఖ్యంగా ఈలాంటి ప్రయోగాలతో weather natural cycle ని టచ్ చేయటంతో వచ్చే నెగటివ్ సైడ్ ఎఫెక్ట్స్ నీ సరిగా  assess చేయకపోతే కలిగే నష్టం ఊహించలేనంతగా ఉంటుంది . అందుకే  ప్రస్తుత ప్రయోగాలు, అలాగే ఈ patterns    విశ్లేషణలు  Weather ను కంట్రోల్ చేయటం అటుంచి  modification category లో కూడా వేయలేమేమో కానీ,   వీటిని   little enhancement to existing weather అని మాత్రం ఖచ్చితంగా  చెప్పొచ్చు.  నిజానికి మనం చేస్తున్న ప్రయోగాలే మహాభారతం లో వాస్యుడు వర్ణించిన 'సూర్యాస్తమయ' టెక్నిక్ కూడా enhancement గానే చెప్పలేమో.  కేవలం సూర్యాస్తమయ సమయానికి కొద్దిగా ముందుగా ఆ టెక్నిక్ వాడబట్టి సరిపోయింది, అదే  యుద్ధం ముందే  ముగించేసి రెస్ట్  తీసుకుందాం అని అలోచించి ఏ మధ్యాహ్న  టైం లోని వాడి  ఉంటె మొదలుకే  మోసం వచ్చి శత్రువు జాగర్త పడి ఉండేవాడు :-)     

Anyway, may be in long term we will able to develop technologies  to modify weather or even to the extent to control it completely. అలాంటి రోజు  వస్తే  ఏ matrix  సినిమాలోనో చూసిన వింతలూ విశేషాలు రియల్ లైఫ్ లోనూ కనిపిస్తాయి.  అలాగే సింగపూర్ లాంటి small in size, pragmatic leadership, ఖర్చు పెట్టగలిగినంత డబ్బు,  ఉన్న దేశానికి  humid గా ఉండే వాతావరణాన్ని  చల్లటి ఆహ్లాదమైన వాతావరణం గా  మార్చటం పెద్ద ఛాలెంజ్ కాదు. కాబట్టి  నేను బ్రతికి బాగుండగానే  అలాంటి రోజు ఒకటి  రావాలని కోరుకుంటూ ఉంటాను మరి ఇహ. (ఓహ్  ఎవరది "Remember that sometimes not getting what you want is a wonderful stroke of luck"  అని అంత పెద్ద resounding వాయిస్ తో ఏదో చెప్పటానికి విపరీతంగా  ట్రై చెస్తున్నారు? No I am not listening to  anything , I already turned on my  deaf year to this kind of reminders :-))
- శ్రావ్య 
  

Sources :
http://study.com/academy/lesson/the-water-cycle-precipitation-condensation-and-evaporation.html
https://www.quora.com
http://www.theatlantic.com/technology/archive/2015/02/the-science-behind-human-controlled-weather/385601/
http://www.bbc.com/news/uk 
https://en.wikipedia.org
https://www.nasa.gov/

Sunday, August 16, 2015

Sembawang Hot Spring - A hidden natural gem of Singapore.


నోట్లోకి నాలుగువేళ్ళూ  వెళ్ళటం  కోసం పన్జేసే పన్లేకపోతే ...  అంటే,  సో కాల్డ్  వీకెండ్ తో పాటు అదనంగా ఒకరోజో/ రెండు రోజులో హాలిడేస్ వస్తే ... 
నాకు 
ఒక్కోసారి  గడపకూడా దాటకుండా ఇంట్లోనే ఉండటం ఇష్టం 
కొన్నిసార్లు బాగా జనాలతో రద్దీ గా ఉండే లోకల్ మార్కెట్ తిరగటం ఇష్టం 
మరికొన్నిసార్లు బాగా  పాంపెర్ చేసే హై ఎండ్  luxury మాల్స్ లో పడి తిరగటం ఇష్టం 
ఇంకాకొన్నిసార్లు, యు సీ,  నువ్వు ఎన్ని వేషాలు వేసినా నీ అసలు రూట్స్ ఇవి సుమా గుర్తు చేసేట్లుగా ఉండే పచ్చని ప్రకృతిలో ఒంటరిగా గడపటం మరీ ఇష్టం. 
ఇక్కడకి దాకా చదివారంటే, ఆ పైన రాసినదంతా పోస్ట్ మొదలెట్టటానికి రాసిన  ఫిల్లింగ్ మెటీరియల్ అని ఈపాటికి  అర్ధమయ్యే ఉంటుంది ☺☺☺☺☺.  మీరు 100% కరెక్ట్. అసలు విషయం తెలిసిపోయింది కాబట్టి  సోది వదిలేసి అసలు విషయానికి వస్తే,  నేను చూసిన చిన్ని 'Hot Spring ' గురించి చెప్పటం ఈ పోస్ట్ ఉద్దేశ్యం.  ఆవునూ, ఇంతకీ    Hot Spring ని    తెలుగులో ఏమంటారు చెప్మా ?  'వేడినీటి బుగ్గ ' / 'వేడి నీటి ఊట' అనా ? అమ్మో ఇప్పుడు బుగ్గ అనాలో ఊట అనాలో అని ఆలోచిస్తుంటే,   అసలు విషయం వదిలి ఇంకెటో మళ్ళీ వెనక్కి తిరిగిరాలేనంత దూరం వెళ్ళే  సూచనలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.  కాబట్టి , ఏమనాలో...  ఎలా రాయాలోనన్న...  గడబిడల గుబుళ్ళన్నీ  బాషాభిమానులకి/ భాషావేత్తలకి  వదిలి  అసలు సంగతిలోకి ఎగిరిపొతే ఎంత బావుంటుంది,  అందుకే I will do it right now ☺.  

Btw, Hot Spring అనే మాట మొదటిసారి వింటూ ఇక్కడకొస్తే, 'Hot spring'  అంటే  సహజంగా భూమిలోంచి ఎగసిపడే వేడినీటి ఊట. ప్రపంచంలోని కొన్ని fascinating హాట్ స్ప్రింగ్స్ వివరాలు ఇక్కడ.  ఇండియా లోని హాట్ స్ప్రింగ్ వివరాలు ఇక్కడ 

***    ***    ***    ***    ***


సింగపూర్ మెయిన్ ల్యాండ్ లోని  ఈ Sembawang హాట్ స్ప్రింగ్ వివరాలోకి వస్తే, టోక్యో లోని Onsen US Yellowstone's famous Grand Prismatic Spring లాగానో  ఊహించుకుని ఇక్కడికి వెళితే / దీని గురించి  తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా కొంచెం నిరాశ కలుగుతుంది. ఎందుకంటే, ఈ hot spring వాటంత గ్రాండ్ లుక్ తో ఉండదు, అంత పెద్దది కూడా కాదు. ఈ రైట్ సైడ్ పిక్ లోవున్న వివరాలు హాట్ స్ప్రింగ్ ఎంట్రన్స్ లో కనిపిస్తాయి. అక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్ళగానే చూట్టూ ఇటుకలతో కట్టిన గోడలతో మూడువైపులా పూర్తిగా గోడతో కవర్ చేసి, ఒకవైపు మాత్రం ఐరన్ గ్రిల్ల్స్ తో లాక్ చేసి ఉన్న చిన్న రూం లాంటిది కనిపిస్తుంది. ఆ గ్రిల్ల్స్ దగ్గరగా వెళ్లి చూస్తే, లోపల  సిమెంట్ తో కట్టిన చిన్న బావి కనపడుతుంది.  అదే  ఒరిజినల్ హాట్ స్ప్రింగ్.  1960 ప్రాంతంలో ప్రమాదవశాత్తు చిన్నబాబు బావిలో పడిపోవటంతో ఇలా చుట్టూ గోడలు కట్టి ఇలా సీల్ చేసారు అని చెప్తారు. మొదటిసారిగా వెళితే వెనుకవైపు గోడమీద హాట్ స్ప్రింగ్ ప్రాపర్టీ ని vandalize చేయటానికి ప్రయత్నం చేసేవారు  evil curse కు బలవుతారు  అని హెచ్చరికగా  రాసిన ఒక  spooky వెన్నులోంచి కొంచెం వణుకు తెప్పిస్తుంది కూడాను. (ప్రస్తుతం మినిస్ట్రీ అఫ్ డిఫెన్సు  కంట్రోల్ లో ఉన్న ఈ ల్యాండ్ లో ఇటువంటిది ఎవరు రాసారో అన్నది మిస్టరీ కానీ :-))
హాట్ స్ప్రింగ్ వాటర్  పొగలు కక్కుతూ వేడిగా ఉండటంతోపాటు, మినరల్స్ ఉండటం వల్ల  కొద్దిగా alkaline లక్షణాలతో ఉంటుంది. అలాగే sulphide కంటెంట్  టాప్ వాటర్ తో పోల్చితే 3 టైమ్స్ ఎక్కువ ఉంటుంది (Anyway, tests proved that the water was safe for consumption.).

ఆ పరిసరాలలోకు వెళ్ళగానే సల్ఫర్ వాసన మన ముక్కుపుటలను తాకుతుంది. వీటివల్లనో ఏమో తెలియదు కానీ, ఈ వాటర్ కు వంటినొప్పులు, కొన్ని రకాల స్కిన్ డిసీజెస్ ని తగ్గించే గుణం ఉంది అని నమ్ముతారు. ముఖ్యంగా ఈ వాటర్ లో పాదాలను సోక్ చేయటం వలన / ఈ నీటితో స్నానం చేస్తేనూ అదృష్టం వస్తుంది అని కూడా నమ్ముతారు. అందుకే,  ఈ క్రింది పిక్చర్ లోలా ఆ  బావికి మూడు వైపులా, ఈ బావిలోని  స్ప్రింగ్ వాటర్ పైపుల ద్వారా వచ్చే ఏర్పాటు చేసారు. వేడిగా పొగలు కక్కుతున్న నీళ్ళు ఆ బకెట్స్ లోకి పడుతూ ఉంటె, ఎవరికీ కావాల్సిన నీళ్ళు  వాళ్ళు తీసుకుని అవి సరిపడే వేడికి చల్లారేవరకు, చుట్టూ ఉన్న చల్లని చెట్ల నీడలో ఒక చైర్ వేసుకుని కూర్చుని వెయిట్ చెస్తూ  ఉండటమే. పొరపాటున చూసుకోకుండా ఆ వేడి వేడి నీటిలో చెయ్యో, కాలో పెట్టామా ఇహ అంతే, తాట ఊడి వస్తుంది అంటారే అది ప్రాక్టికల్ గా కనపడుతుంది మన నోట్లోంచి కెవ్వుమని కేక ఇంకా బయటికి కూడా  రాకముందే .
Recent times  లో,   అదృష్టం వస్తుంది అనే నమ్మకం కొంచెం పలచనబడి రద్దీ తగ్గింది  కానీ, ఒక 5 -6 ఏళ్ళ క్రిత్రం వరకూ కూడా ఇక్కడకు  దగ్గరలో ఉన్న క్రాంజీ race course కి పందాలు కాయటానికి వెళ్ళేవాళ్ళు, అలాగే  లాటరీ టికెట్స్ కొని అదృష్టం పరీక్షించుకునే వాళ్ళు ఆయా పనులు చేయటానికి వెళ్ళేముందు ఇక్కడికి వచ్చి స్నానం /  పాదాలు సోక్ చేసుకుని వెళ్ళే వాళ్లతో ఒక వెలుగు వెలుగుతూ ఉండేదట ఈ హాట్ స్ప్రింగ్ ప్రాంతం. ఇప్పుడు అంతగా రద్దీ లేదు కానీ,  సరదాగా  గ్రీనరీ చూడటానికి వచ్చి  పాదాలు సోక్ చేసుకుంటూ బుక్ చదువుతూ టైం ప్సేండ్ చేసేవాళ్ళో /   సైక్లింగ్ కి batches గా వెళ్లి చివరిగా ఇక్కడకి వచ్చి కొద్దిసేపు ఆ వేడినీటిలో పాదాలు సోక్ చేసుకుని లేదూ స్నానం చేసి వెళ్ళేవాళ్ళతో సందడి సందడిగానే ఉంటుంది. వీటితో పాటు నాకు అక్కడ గమ్మత్తుగా అనిపించిన మరో విషయం కూడా ఉంది. అది  ఏంటంటే, కొంతమంది రా ఎగ్స్ తెచ్చి వాటిని ఆ వేడినీటిలో వేసి కొద్దిసెపయిన తర్వాత ఆ పై పెంకు వలుచుకుని తినడం. అది చూసిన తర్వాత గూగుల్ చేస్తే నాకు తెలిసిన విషయం అలా ఎగ్ ను హాట్ స్ప్రింగ్ వాటర్ లో ఉడకపెట్టటం అనేది 'onsen tamago'   అనే జపనీస్ traditional ఫేమస్  recipe అని, దానికి జపనీస్ క్యుజిన్ లో మంచి గిరాకీ అనీను ☺.

 

ఇది ఈ హాట్ స్ప్రింగ్ ప్రస్తుత అంటే 2015 లో నేను వెళ్ళినప్పటి పరిస్థితి .  మరి అసలు ఒక హాట్  స్ప్రింగ్ అనేది ఒకటి ఉందని ఎప్పుడు ఎలా తెల్సింది, అలా తెలిసినప్పుడు ఇక్కడ ఎలా ఉండేది?  అప్పటినుంచి ఇప్పటి వరకు వచ్చిన ఇక్కడ ఏమన్నా మారిందా అనే వివరాలలోకి చూస్తే ... 

1908 లో మొట్టమొదటిగా Municipal ranger,  W.A.B. Goodall  ఈ హాట్ స్ప్రింగ్ ని డిస్కవర్ చేసారట, దాంతో ఆ అయిన ల్యాండ్ ఓనర్ అయిన చైనీస్ బిజినెస్ మాన్ ఈ వాటర్ 'safe for consumption' అన్న టెస్ట్ రిజల్ట్స్ తరవాత   బిజినెస్  చేయటానికి అనువుగా ' Singapore Natural Mineral Hot Springs Company' అనే కంపెనీ స్టార్ట్ చెసారు.  ఇదే కంపెనీ పేరు తరువాత కాలంలో 'Singapore Hot Springs Limited' గా మార్చారు. 1909 లో ఈ నీళ్ళని '“Zombun” అన్న బ్రాండ్ పేరుతొ బాటిల్స్ లో అమ్మటానికి ' ఈ కంపెనీ అమ్మడం మొదలుపెట్టింది.  1921 లో  Fraser and Neave Limited (F&N) ఈ కంపెనీ ని టేక్ ఓవర్ చేసి “Zom”,   “Vichy Water” అనే బ్రాండ్ పేర్లతో అమ్మడం మొదలెట్టింది. ఈ కంపెనీ + ఏరియా కు    'Seletar Hot Springs'  అనే పేరు పెట్టి టూరిస్ట్ స్పాట్  గుర్తించి పబ్లిక్ కు ఓపెన్ చేసారు. ఇప్పటికీ ఈ చుట్టుపక్కల ప్రదేశాన్ని ఇదే పేరుతొ పిలుస్తారు.  ఆ తర్వాత 1942 – 1945 మధ్యకాలంలో సింగపూర్ జపాన్ అధీనం లో ఉన్నప్పుడు,  ఈ ప్రాంతమంతా జపాన్ ఉన్నతాధికార్లకు thermal bath heaven గా ఉండేదట, వాటిలోకి  సామాన్యులకి ప్రవేశం ఉండేది కాదుట. 1944. లో జపాన్ కు వ్యతిరేకంగా Allied Forces   జరిపిన బాంబింగ్ లో ఆ నిర్మాణాలన్నీ నాశనం అయ్యాయట. 
 
రెండవ ప్రపంచయుద్ధం తరవాత వెంటనే  F & N కంపెనీ, ఈ హాట్ స్ప్రింగ్ ను  తిరిగి తన అధీనంలోకి తీసుకుంది. కానీ 1960 ప్రాంతం లోనే కొద్ది రిపేర్స్ చేసి మళ్ళీ హరీ ఎత్తున నీటిని విడుదల చేయటం మొదలుపెట్టి, 1967 ప్రాంతంలో spas, restaurants తో కూడిన recreational కాంప్లెక్స్ కట్టాలని ప్లాన్ చేసింది కానీ అది ఎందుకో materialize అవ్వలేదు.  1985  లో సింగపూర్ గవర్నమెంట్ మిలిటరీ అవసరాల కోసం ఈ చుట్టు పక్కల ప్రాంతంతో పాటు, ఈ స్థలాన్ని కూడా స్వాధీనం చెసుకుంది. ప్రస్తుతం ఈ ప్రాంతం సింగపూర్ డిఫెన్సు మినిస్ట్రీ అధీనంలో ఉంది,  సింగపూర్ పబ్లిక్ చేసిన అప్పీల్ కి అనుకూలంగా స్పందించి  కేవలం ఈ హాట్ స్ప్రింగ్ కొద్ది ప్రాంతాన్ని మాత్రం   ఎటువంటి  restrictions లేకుండా పబ్లిక్ కి ఓపెన్ చేసింది (చుట్టూ  ఉన్న మిగిలిన ప్రాంతం లోకి అనుమతి లేదని  ఈ పక్క పిక్చర్ లోలా  హెచ్చరికలు కనిపిస్తాయి ).  2002 లో ఆ  పైన పిక్చర్ లో చూసినట్లు వాటర్ వచ్చే మెటల్ పైప్స్ ఏర్పాటు చేసారు.  
  

(వాటర్ టెస్ట్ రిజల్ట్ రిపోర్ట్ ,   బాటిల్డ్ వాటర్ అమ్మకానికి సంబంధించిన పేపర్  యాడ్, 1967 లో అధికారుల ఫ్యాక్టరీ సందర్శన,  చుట్టూ గోడలు కట్టక ముందు బావి, పిల్లలు ఆడుకుంటున్నా అప్పటి పరిసరాలను ఈ క్రింది  పిక్చర్స్ లో చూడొచ్చు. పెద్దవిగా చూడటానికి డబల్ క్లిక్ చేయండి .  Picture Credits : Singapore National Archives)





 (Source  : Singapore National Archives

గతం లోంచి వర్తమానం లోకి వచ్చేస్తే.. అదృష్టం, ఆరోగ్యప్రయోజనాలు వంటివి పక్కన పెడితే, (I don't believe in all those anyway) ఈ హాట్ ప్శ్రింగ్ కి వెళ్ళే దారి, అక్కడ thick vegetation,  నిశ్శబ్దంగా ఉండి  కేవలం అప్పుడప్పుడు పక్షుల chirping మాత్రమే వినిపిస్తూ ఉండే పచ్చని పరిసరాలు నాకు చాలా చాలా నచ్చాయి. నిజానికి ఎప్పుడో చిన్నప్పుడు మా ఊర్లో ఎక్కువ ఎండలేనప్పుడు  కేవలం మందు చల్లే spray tanks చేసే చప్పుడు మాత్రమే బాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగా వినిపిస్తూ  ఉంటే పచ్చని పొలాల గట్లమీద నడిచిన అనుభూతి మరోసారి అనుభవం లోకి వచ్చింది. నేను అప్పుడు చూసిన కుప్పల కుప్పల కుక్కగొడుగులు, పక్కన పారుతున్న చిన్న కాలువ లాంటిది మళ్ళీ ఇంకోసారి ఈ హాట్ స్ప్రింగ్ వెళ్ళే దారిలో కనపడి నిజంగా అక్కడే ఉన్నానేమో  అన్నకొద్దిపాటి  భ్రమ కలిగించాయి. I thoroughly enjoyed this foray.  ఇంకోసారి హాలిడే వచ్చినప్పుడు ఇలాంటి ఎక్కువ పాపులర్ కానీ ఇంకో ప్లేస్ గురించి తెలుసుకోవాలి మళ్ళీ :-)
- శ్రావ్య 
 
 

Saturday, June 6, 2015

అమరావతి - The people's capital






"మన రాజధానిని ఎవరు లాక్కోకుండా చూడాలని కోరుకుంటున్నా"   ఇది ఒక చిన్నారి ఆంధ్ర ప్రదేశ్  ముఖ్యమంత్రి తో పంచుకున్న ఆవేదన. నిజానికి ఈ ఆవేదన కొన్ని కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల  మనస్సు లోంచి వచ్చిన బాధ .

భవిష్యత్తు తరాలని ఇటువంటి ఆవేదనలు, అనుమానాల నుంచి దూరం చేయాలన్న సంకల్పం,  తమ రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చేలా అభివృద్ది చేసుకోవాలన్న రాజధాని ప్ర్రాంత ప్రజల తపనలతో, భవిష్యత్ లో ఎంత ఉపయోగకరమో అన్న దానిపై ఏ గ్యారంటీ  లేకపోయినా స్వచ్చందంగా ముందుకు వచ్చి తమ ఎకరాలెకరాల భూమిని ప్రభుత్వం చేతుల్లో పెట్టిన రాజధాని ప్రాంత రైతుల త్యాగం విలువకట్టలేనిది.  అమరావతికి తిరిగి ఊపిరిలూదబొతున్న  రాజులు వీరే . వీళ్ళకి ఎన్ని చేసినా ఏమిచ్చినా రాబోయే తరాలు వీళ్ళ రుణం తీర్చుకోలేవు.

*** *** ***


ధరణికోట : మొదటి నాగరికత కు నెలవైన నేల. అఖండ భారతవాహినిలో అతి పెద్ద సామ్రాజ్యానికి అధిపతులు అయిన ఆంధ్ర శాతవాహనులు రాజధాని. వేల సంవత్సరాల క్రితమే కృష్ణా నది తీరంలో దాదాపు 12కి,మీ పోడవు తో పడమటి దిక్కున మెరిసిన కోట.  తిరిగి 19 వ శతాబ్దంలో   తీవ్ర కరువుకాటకాలతో సతమతవుతున్న ప్రజలని అక్కున చేర్చుకుని  రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడి హయాంలో  'అమరావతి'  గా   మరోసారి వెలుగులు విరజిమ్మిన నేల ఇది. 

మళ్ళీ ఇన్ని సంవత్సరాలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమదీ అనుకునే రాజధాని నిర్మించుకోబోతున్న తరుణం లో ఈ సరికొత్త నగరానికి 'అమరావతి' అని పేరు పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం  అభినందనీయం.   

 
సింగపూర్ మాస్టర్ మాస్టర్ ప్లాన్ - ఆంధ్ర కాపిటల్ - లాండ్ పూలింగ్  అంటూ ఫన్ చేయటం favourite pastime గా మారిన జనాల చేసే తమాషాలని వమ్ము చేస్తూ ప్రణాళిక ప్రకారం పని చేసుకుంటూ పోతున్న ప్రభుత్వం మరింత కర్తవ్యదీక్షతో ముందుకు సాగాలని, ఈ అమరావతి పునర్వైభవంతో నలు దిక్కులా  విస్తరించి, ఆధునిక నాగరికతకు - గత  సంస్కృతికి మధ్య వారధిగా నిలిచి, ఆంధ్రప్రదేశ్ ప్రజల  కీర్తి ప్రతిష్టలను, ప్రపంచానికి చాటి చెప్తూ  భవిష్యత్తు  తరాలకి భద్రతనందించే మహానగరంగా ఎదగాలని కోరుకుంటున్నాను.


I am proud to say I love Andhra Pradesh. 
                                                       -శ్రావ్య
 

Sunday, March 29, 2015

When Great Trees Fall - A poem of Maya Angelou...!!


When great trees fall,
rocks on distant hills shudder,
lions hunker down
in tall grasses,
and even elephants
lumber after safety.

When great trees fall
in forests,
small things recoil into silence,
their senses
eroded beyond fear.

When great souls die,
the air around us becomes
light, rare, sterile.
We breathe, briefly.
Our eyes, briefly,
see with
a hurtful clarity.
Our memory, suddenly sharpened,
examines,
gnaws on kind words
unsaid,
promised walks
never taken.

Great souls die and
our reality, bound to
them, takes leave of us.
Our souls,
dependent upon their
nurture,
now shrink, wizened.
Our minds, formed
and informed by their
radiance,
fall away.
We are not so much maddened
as reduced to the unutterable ignorance
of dark, cold
caves.

And when great souls die,
after a period peace blooms,
slowly and always
irregularly.  Spaces fill
with a kind of
soothing electric vibration.
Our senses, restored, never
to be the same, whisper to us.
They existed.  They existed.
We can be.  Be and be
better.  For they existed.


                                                              -  Maya Angelou

Sunday, February 8, 2015

Thou art the Flower that never shall wither !



సలేమయ్యిందంటే .....
ఉహు ఏమి కాలేదు . చైనీస్ న్యూ ఇయర్ రాబోతుంది కదా, సిటీ అంతా traditional decorations తో కళకళలాడిపోవటానికి నెమ్మదిగా ముస్తాబవుతుంది. నేను కల్చరల్ / రిలీజియస్ gatherings లో పెద్ద ఆక్టివ్ గా పార్టిసిపేట్ చేయటానికి అంతగా ఇష్టపడను కానీ, passive గా... అంటే dazzling festive decorations, vibrant డ్రెస్సింగ్ తో సందడి సందడి గా ఉండే crowded celebrations చూడటం , అలాగే పండుగ రోజుల్లో పాటించే చిన్న చిన్న traditional customs వెనక ఉండే mythological stories వినడం లాంటివి చాలా చాలా ఎంజాయ్ చెస్తాను. And I believe that,  the best time to indulge oneself socially is during festivals. 
 
ఇదంతా అలా ఉంచితే, though my exposure to different cultures is quite limited, more and more I think of different cultures, the more I am amazed of commonalities at their root  level despite of all superficial differences at the surface level. వేరే వేరే కల్చర్స్ కి సంబంధించిన mythological స్టోరీస్ విన్నప్పుడల్లా వాటిలోని mythological similarities మరింతా బలంగా నువ్వనుకునేది నిజమే సుమా అని చెబుతునట్లుగా అనిస్తుంది. ఓహ్ అసలు విషయం వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోతున్నా differences / similarities ఉన్నాయా, ఉంటె ఎందుకు అనేది పెద్ద debatable topic కాబట్టి అది వదిలేసి మళ్ళీ అసలు విషయానికి వస్తే ...

చైనీస్ oranges prosperity కి గుర్తు అని నమ్ముతారు, అందుకే  చైనీస్ న్యూ ఇయర్ కి oranges ని gift  exchange లాగా షేర్ చేసుకోవటమే కాక  కాకుండా మాల్స్ , ఇళ్ళు, ఇంకా దరిదాపు అన్నీ ఆఫీసులు కూడా  బోన్సాయ్ ఆరంజ్ ట్రీస్ / పళ్ళతో ఉన్న ఆరంజ్ కొమ్మలు కుండీలలో ఉంచిన arrangements కానీ decorate చేస్తారు.   అందుకే ఈ సీజన్ వచ్చింటే చాలు ఎక్కడ చూసినా బంగారం లాగా మెరిసే పోయే oranges  తో markets నిండిపోతే,  నర్సరీస్ ఈ ఆరంజ్ బోన్సాయ్ ట్రీస్ తో కళ కళ లాడుతూ ఉంటాయి.  ముందే చెప్పా కదా నాకు ఈ decorations చూడటం మహా ఇష్టం అని అందుకే దగ్గరలో ఉన్న నర్సరీ కి వెళితే ఆరంజ్  decorations తో పాటు రకరకాల పూల మొక్కలూ కనిపించాయి. పూలు చూసి మురిసిపోని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి?  అందుకే నా సెల్ ఫోన్ కామెరా కొన్నిటిని బంధించి తెచ్చి ఇక్కడ పెదుతున్నా. పైన నేను ఏదేదో చెప్పినా అసలు సిసిలు పోస్టు లక్ష్యం ఇదే  :-))).
***
నర్సరీలో అమ్మకానికి అమ్మకానికి సిద్ధంగా ఉన్న బోన్సాయ్ చెట్లు / arrangements.

ఆరెంజ్ ట్రీ తో పాటు ఈ మొక్కలని కూడా decoration లో వాడతారు .

రకరకాల ఆర్కిడ్స్




Sunflowers.   ఈ మొదట్లో ఉన్న రెండు పువ్వులు మరీ బొత్తిగా undisciplined అనుకుంటా,
సూర్యుడి వైపు చూడకుండా దిక్కులు చూస్తున్నాయి :-)



వీటిని 'సీతమ్మ వారి జడబంతి పూలు' అనేవాళ్ళం, అదే నాకు తెలిసిన పేరు. వేరే ఏరియాస్ లో 
ఏదో వేరే పేరు ఉండే ఉంటుంది . ఈ మొక్క ఆకులని రుబ్బి అరచేతిలో 
పెట్టుకుంటే గోరింటాకు అంత మంచి డార్క్ కలర్ లో కాదు కానీ, లైట్ కలర్ లో పండుతుంది. 
చిన్నప్పుడు చేసిన సవాలక్ష ప్రయోగాల్లో ఇదీ ఒకటి :-)

బోగన్ విల్లా  / కాగితం పూలు (స్వగతం  :  మరి పూలే కనపడుతున్నాయి,  కాగితం కనపడదే ) ?

హైడ్రాంజియాస్

గన్నేరు జాతిలాగా ఉన్న బోన్సాయ్

పేరు ఏంటో చూడటం మర్చిపోయా , ఏదో బోన్సాయ్ :-)

ఈ మొక్క పేరు తెలియని వాళ్ళు ఉంటారా, అబ్బే నో ఛాన్స్  :-)


East or West ఆ మాటకొస్తే  anywhere in the world ఇది లేని నర్సరీ నర్సరీ నే కాదు :-)

Petunias


కాటన్
 

చేమంతి





వీటి పేరేంటో తెలీదు :-(


గులాబీలు

మొక్కలు కాదు కేవలం పూలే :-)





పార్కింగ్ 

ఆ పై ఫోటో ఎక్కడ నుంచి తీసాను ? ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జి పై నుంచి :-)

                                                           ఈ నర్సరీ  వెళ్ళాలంటే ఇదే దారి  :-)

ఇన్ని పూలు చూసాకా, నేను ఎంతో  ఇష్టం గా  పెంచుతున్నా... 
మా ఇంటి మల్లె మొక్క ని చూడకపోతే ఎలా?! అందుకే  అది ఇక్కడ :-)

-శ్రావ్య

PS : ఎప్పుడో casual డిస్కషన్ లో మీకు పూలు బాగా దొరుకుతాయా?! అని అడిగినందుకు, నిషిగంధ కి మా  ఊర్లో పూలే కాదు,  ఎక్కడెక్కడి రకాల మొక్కలు కూడా దొరుకుతాయి పెంచుకోవటానికి అని  చూపించటానికి ఈ పోస్ట్ . యా యా of course కొంచెం బడాయిగానే :P