Subscribe:

Sunday, July 17, 2011

అర్జెంట్ గా గొప్పవాళ్ళు కావటం ఎలా ?

ఈ మధ్య నేను కొంచెం లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తునట్లు గా నాకు అనుమానం గా ఉంది . సో...ఇప్పుడు నాకున్న ఏకైక ద్యేయం రాత్రికి రాత్రికి గొప్ప దాన్ని కావటం . ఇలా కావటానికి నాలో మిడి మిడి జ్ఙానాన్ని తట్టిలేపి కొన్ని ఐడియాలని పట్టేసా . అసలే ఇది ఓపెన్ సోర్సు యుగం కదా నా ఐడియాలని నాకోక్కదానికే స్వంతం అని నా బుర్రలో పెట్టి తాళం వేయటం ఎందుకు అని ఇదుగో ఇలా పబ్లిక్ గా బ్లాగులో పెడుతున్నా . మీకు నచ్చితే విచ్చలవిడి గా వాడేసుకోండి, చూసారా నేను ఎంత నిస్వార్ధపరురాలినో .

ఆ ఐడియాలని ఫాలో అయ్యేముందు మీరు ఈ చిన్న పనులు చేయాలి అవి :

ముందు గా ఈ సంవత్సరం జాతకఫలాలు లో మీ రాశి ఫలితాలు   చూసుకోండి రాజపూజ్యం 5 , అవమానం 1 ఉందనుకోండి హాపీస్ ఇక మన పోబ్లెం సగం solved లేదనుకోండి ఏముంది సింపుల్ మీకు ఈ రాశి నచ్చితే అది మీది అయ్యేట్లు మీ జన్మ రహస్యపు వివరాల డేటాని మార్చేయ్యటమే.

బాగా గుళ్ళు వున్న ఏరియా చూసుకొని సైకిల్ వేసుకొని ప్రతి గుడిలో ప్రసాదం తినడం ప్రాక్టీస్ చేయండి , స్టీవ్ జాబ్స్ అమెరికా లో ఇస్కాన్ టెంపుల్ లో పెట్టె ఫ్రీ భోజనం ఒక సంవత్సరం పాటు తిన్నాడట ఇక మనమెంత. దానితో మనం యాపిల్ లాంటి సంస్థను కాకపోయినా జామపండు లేదా కనీసం అరటిపండు కంపనీ పెట్టుకోవచ్చు. 

ఒక మంచి నక్కని తెచ్చి మీ వాకిట్లో దాని తోక మీరు నడిచే దారిలోకి వచ్చేట్లు గా కట్టేయండి, వీలయితే ఏ ఫెవికాల్ నో వాడి మీరు నడిచే దార్లో అతికించేయండి . ఏంటండీ అలా అయోమయం గా చూస్తారు మీరెప్పుడు వినలా "వీడు నక్క తోక తొక్కి వచ్చాడు" అనే ముక్క ? (మరీ ఇంత అయోమయం ఐతే కష్టం అండీ ) ఇంతకీ ఆ నక్కని కట్టేసాక మీరు చేయాల్సిన పని జస్ట్ మీరు బయటికి వెళ్ళేప్పుడల్లా దాని తోక తోక్కడమే . మీ కర్మ కాలి అది కరిచిందనుకోండి మీరెళ్ళి బూరెల బుట్టలో పడ్డట్లే ఏ టీవీ 10 లేదా 11 వాడో వచ్చి మీరు నక్కని తెచ్చి పెంచటానికి గల కారణాలు తవ్వి తీసి ఒకరెండు రోజులు పండగ చేసుకుంటాడు ఇక మీరు ఫుల్ famous

సరే ఇక మనం మన జీవితాన్ని మార్చే ఐడియాల్లోకి వచ్చేద్దాం :

1.కొత్తగా ప్రారంభమయ్యే తెలుగు టి.వి సీరియళ్ళ లో ఏదో ఒక వేషం సంపాదించండి . హీనపక్షం ఐదు నుంచి పదేళ్ళ వరకు  పొద్దునో , సాయంత్రమో , రాత్రో ఏదో ఒక సమయంలో మీ దర్శన భాగ్యం అఖిల్లాంద్ర ప్రేక్షకులకి ఉచితం. అంతే కాకుండా ఏ దిక్కుమాలిన రియాల్టీ షో కో మిమ్మల్ని ఒక సెలబ్రిటీ గా మిమ్మల్ని పిలుస్తారు కాబట్టి అదో అడినల్ అవకాశం. కాకపొతే మీ టాలెంట్ అంతా వాడి ఎంత జనాలని ఎంత హింస పెట్టాలంటే హిట్లర్  వంటి వాళ్ళు మీ ముందు ఎంత అనుకోవాలి , అప్పుడే మీ పేరు పది కాలాల పాటు నిలుస్తుంది .

2. మీరు సాఫ్టువేరు కార్మికులా అయితే ఎర్ర పార్టీలు ఎలాగు మిమ్మల్ని పట్టించుకోవు. మీరే అన్ని పార్టి ల రంగు కలిపి ఒక  జెండా తయారు చేసి - పార్టీ పెట్టి అందరిని ఏకం చేసి ఒకే చోట వుండడానికి కావలసినంత భూమిని కబ్జా చేయండి , అంటే అక్కడ మీ జెండాను పాతండి. దెబ్బకి మీపేరు తో ఒక కాలనీ వెలుస్తుంది , అదృష్టం ఉంటే విగ్రహాలు ఆ పై తెలివి తేటలతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయొచ్చు .

  
3.. మీ తాత గారు బాగా కథలు చెబుతారా ? అయితే మీ అదృష్టం బావుంది , ఆయన దగ్గరకి పోయి కాకపట్టి  పురాణాలలో పిట్ట కథలు చెప్పించుకొని, అరిషడ్ వర్గాలను జయించి (నిజం గా కాదు అలా ఆక్షన్ చేయటం నేర్చుకొని) ఒక బాబా గా అవతారం దాల్చండి ఒక దెబ్బకి రెండు పిట్టలు డబ్బుకు డబ్బుకు , పేరు కు పేరు .

4 . ఏదో ఒక వర్గం అన్యాయం అవుతున్నారు అని ఒక agitation మొదలు పెట్టండి , మొత్తం ఒక వర్గం వారి సింపతీ మీ సొంతం ఇక మీడియా లో మీ పేరు మారుమోగి పోవటం కాయటం .

5.ఎక్కడి ఎక్కడి పురాతన సంపదని ఈ రకం గా అభివృద్దికి వాడొచ్చో మీ అమూల్యమైన సలహాలు ఉచితయం గా ఇచ్చేయండి . మీరు గొప్ప దయార్ద్ర హృదయులు అన్న ముద్ర సంపాదించుకోవచ్చు .

6 . డమ్మీస్ ఫర్ చేతబడి , చేతబడి ఇన్ nutshell అని బుక్ రాసి online లో అమ్మకానికి పెట్టండి .


ఏంటి ఇవన్ని వద్దు జనాలకి ఉపయోగపడేవి సలహాలు కావాలా ? ఏంటి మీరే కాలం లో ఉన్నారు అలాంటి చేసి పేరు సంపాయించటం అయ్యే పనేనా ? మీ పిచ్చ కాకపొతే ! సరే మీ ఉత్సాహాన్ని నేనెందుకు చల్లార్చాలి , కాస్కోండి :

   
1 . ఎక్కడ పడితే అక్కడ సెల్ ఫోనులో వేసే సొల్లు ఆపే ఒక వెంటతీసుకొని వెళ్ళగలిగే జామర్ ని కనిపెట్టి వెర్బల్ డయేరియా ని అరికట్టి నాలాంటి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడిన వారవుతారు .

2 . SMS లు చూసి , లేదా ఎవరో చెప్పే మాస్ హిస్త్రీరియా తో ఊగిపోయి కనపడిదనడల్లా ద్వసం చేసే జనాలకి రెండు చెవులు మధ్య పదార్ధం ఉంది దానితో ఆలోచించాలి అని హెచ్చరించే ఒక చిప్ ని కనిపెట్టండి .

3 . రోడ్ల మీద ఎక్కడ పడితే ఊసే పవిత్రమైన అలవాటు ఉన్నవాళ్ళని ఆ పని చేయాలి అనుకోగానే నోరు తెరుచుకోకుండా చేయగలిగే యంత్రాన్ని కనిపెట్టండి .

  
4 . నేను మాత్రం బిజీ మిగలిన జనాలకి పనిపాటా లేదు అన్నట్లు signal jumpings లేదా అడ్డదిడ్డం గా డ్రైవింగ్ చేసేవాళ్ళని , అలాగే హాస్పిటల్స్ వంటి పబ్లిక్ ప్లేసెస్ లో నానా హడావిడి చేసేవాళ్ళని సరైన దారిలో పెట్టె యంత్రాన్ని కనిపెట్టండి .

ఏంటోనండి జనానికి పనికొచ్చే  విషయాలు  చెబుతున్నా, కానీ  ఈ ఐడియాలతో  టైం వేస్ట్ తప్ప పని జరగదు అని గట్ ఫీలింగ్,  ఉదాహరణకి ఒక సారి మీ చూట్టూ ఉన్న వాళ్లకి ఈ  చిన్న ప్రశ్నలు  వేసి చూడండి "పెన్సిలిన్ ని కనిపెట్టినది   ఎవరు "  ? అలాగే  "లేటెస్ట్  బద్రినాథ్  సినిమా లో    హీరో       ఎవరు" ?  ఆ రెండిటికి వచ్చిన సరైన సమాధానాల percentage  తో నిర్ణయించుకోండి  ఏది సులువైన దారో :)   

ప్రస్తుతానికి నాకు తోస్తున్నవి ఇవండీ , మీకు తట్టిన అమూల్యమైన సలహాలని కామెంట్ల రూపం లో నలుగురికి పంచటం మర్చిపోకండే

46 comments :

Indrasena Gangasani said...

Nice..

Indian Minerva said...

"డమ్మీస్ ఫర్ చేతబడి , చేతబడి ఇన్ nutshell అని బుక్ రాసి online లో అమ్మకానికి పెట్టండి ."

hey this is my idea. And one more... you seem tnot to be sparing my themes too... this is not fair :-D

"ఎక్కడ పడితే అక్కడ సెల్ ఫోనులో వేసే సొల్లు ఆపే ఒక వెంటతీసుకొని వెళ్ళగలిగే జామర్ ని కనిపెట్టి వెర్బల్ డయేరియా ని అరికట్టి నాలాంటి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడిన వారవుతారు"

I used to think about buying a jammer.

మురళి said...

హమ్మయ్య.. మీ బ్లాగుని మీరు మర్చిపోయారేమో అని నిన్నో మొన్నో అనేసుకున్నాను నేను.. మర్చిపోలేదన్న మాట!! సలహాలు చాలా బాగున్నాయండీ.. కాకపొతే మరీ ఇంట రిస్కీ కాకుండా కొంచం సులువైన మార్గాలుంటే చెప్పరూ :))

రాజ్ కుమార్ said...

హహహ... నాకు నక్క అవిడియా పిచ్చిపిచ్చి గా నచ్చేసిందండీ..
జనాలకి ఉపయోగపడేవి సలహాలు.. హ్మ్మ్ ఇవి ఆలోచించాల్సినవే..!

ఫేమస్ అవ్వటానికి ఇంకొన్ని మార్గాలూ..

౧. సుమన్ సీరియళ్ళన్నీ ఒకే రోజు చూసీ, గిన్నిస్ బుక్ లోకి ఎక్కెయ్యటం..
౨. ఓంకార్ ని హీరో గా పెట్టీ చిన్నిక్రిష్నకి డైరెక్షన్ అప్పగించీ.. సినిమా తీస్తున్నామని ప్రకటించడం..

నైస్ పోస్ట్

వేణూశ్రీకాంత్ said...

ఆహా ఐడియాలన్నీ మహాద్భుతంగా ఉన్నాయంటే నమ్మండి :)

మధురవాణి said...

కెవ్వ్ వ్వ్ వ్వ్.. :)))))))
కొసమెరుపు కేక! అవునింతకీ పెన్సిలిన్ ఎందుకు కనిపెట్టారో పాపం! ఖచ్చితంగా పేరు తెచ్చుకుందామని మాత్రం అయ్యుండదు కదా!
బద్రీనాథ్ తీసింది మాత్రం పేరు కోసమే కదా! పేరు తెచ్చుకోవాలంటే ఆప్షన్ B నే బెస్ట్ అన్నమాట! ;) :D

మంచు said...

నేను ఆచరించదగ్గవి, ప్రయతించదగ్గవి ఎమీ కనిపించడం లేదు. నాకివన్నీ వద్దు కానీ... తక్కువ టైం లొ బొల్డు డబ్బులు సంపాదించే మార్గం చెప్పండి. ఆ మార్గం ఎలాంటిది అయినా పర్లేదు కానీ ప్రబుత్వానికి టాక్స్ కట్టగలిగేలా ఉండాలి.... మాంచి ఐడియా చెప్తే మీకు కొంచెం వాటా :-)

Anuradha said...

మీ ఐడియాలు బాగున్నాయండి.

sunita said...

Hahaha! nice Post.

Sri Kanth said...

అబ్బే.. ఇంత కష్టపడడం ఎందుకండీ బాబూ. సులువుగా చేసే పనులు ఎన్ని లేవు. ఉదాహరణకు గాడ్సేని తీసుకోండి. చరిత్రలో రాసుకుని మరీ చదువుకుంటున్నాం ఆ పేరు. ప్రస్తుతం మారియా సుసాయిరాజ్ ను తీసుకోండి. మన పబ్లిసిటీ వర్మ ఆమెను పెట్టి ఏకంగా సినిమా తీస్తా అంటున్నాడు. ఇన్ని సులువైన మార్గాలుండగా ఇంత కష్టపడడం అవసరమా..!! :D :P

Sujata M said...

Crazy Ideas - I love them all.

బులుసు సుబ్రహ్మణ్యం said...

ఏమిటో ఇప్పటిదాకా ఎందుకు గొప్పవాడిని కాలేదో అర్ధం కాలేదు. ఇప్పుడు అదే పని మీద ఉంటా. ఇంతకీ నేను పెట్టె పార్టీలో మీరు చేరుతారా? స్వామీజీ అవతారం ఎత్తితే శిష్యురాలిగా చేరుతారా? కనీసం ఒక్కళ్లైనా లేకపోతే ఎలాగా అని. అహా.

శ్రీనివాస్ పప్పు said...

నాకు గొప్పవాడ్ని అవ్వాలనిలేదు కానీ గొప్పవాళ్ళయిన వాళ్ల సెక్రటరీ గా పనిచేస్తాను చాలు(వైఎస్సార్ వెనకాల సూరీడు లా అన్నమాట).

Sravya V said...

@ఇంద్రసేనా గంగసాని గారు Thank you :)))

@ఇండియన్ మినర్వా అవునా అవి ఐడియాలు కూడానా , ఐతే మనం మనం ఒక understanding కి వచ్చి లాభాలు పంచుకుందాం ఏమంటారు? Thank you :)))))

@మురళి గారు మర్చిపోయననుకున్నారా :)))) కొంచెం రిస్క్ ఉంటేనే కదా మజా వచ్చేది ఏమంటారు ?Thank you :)))))

Sravya V said...

@వేణురాం మీ సలహాలు సూపర్, కాని అవి పాటించిన తరవాత మనం ఉంటామా అనేది నాకు అనుమానం :))) పోస్టు నచ్చినందుకు Thank you !

@వేణు గారు అంతే అంటారా? Thank you :)))))

@మధుర పెన్సిలిన్ కనిపెట్టింది పేరు కోసం కాదు అనే నా అనుకోలు :)))) చూసారా మీరు intelligent ఎంత ఈజీ గా అసలు సత్యం పట్టేసారో , Thank you :)))))

Sravya V said...

@మంచు గారు మీకు ఆచరణీయం గా కనపడటం లేదా :(((( సులువు గా డబ్బులు సంపాదించటం ఏముందండి సింపుల్ , పదండి బ్యాంకు అఫ్ అమెరికాకో పోదాం నేను కళ్ళు మూస్తా , మీరు డబ్బు కొట్టేయండి అంతే, Thank you :)))))

@అనురాధ గారు Thank you , మీరెంటండి సడన్ గా మాయం అయిపోయారు . ఇప్పుడే మీ పేరు పాతుకొని వెళితే కొత్త బ్లాగు కనపడుతుంది . ఇల్లు మార్చేసారా ?

@సునీత గారు Thank you :))))

Sravya V said...

@శ్రీకాంత్ గారు అంతే అంటారా ? మీరు చెప్పినది కూడా నిజమే అనిపిస్తుంది పాతుబడినా పర్వాలేదు ఈ మధ్య తీహార్ జైల్లో కూడా సౌత్ ఇండియన్ ఫుడ్ సర్వ్ చేస్తున్నారట కాబట్టి అసలు దిగులు లేదు పైగా మంచి టైం పాస్ కూడా, Thank you :))))

@సుజాత గారు Thank you :))))

Sravya V said...

@బులుసు గారు, మాష్టారు మీరు పార్టీ పెట్టడం నేను చేరకపోవటమా :)) ముందు మీరు పెట్టండి జనాల్ని చేర్చే బాధ్యత నాది . Thank you (సు.ద.హ)

@ పప్పు గారు మీరు ఎప్పుడు సేఫ్టీ జోన్ లో ఉంటారన్న మాట తెలివిపరులు :))) Thank you :))))

Anonymous said...

రాంగోపాల్ వర్మని "24గంటల్లో చంపుతాను కాస్కో" అని తన ట్విట్టర్లో రాయాలి. వర్మ మనకి ఫ్రీ ప్రచారం చేస్తాడు. క్షణాల్లో ఫేస్ బుక్కూ గంటల్లో టీవీ మార్మోగిపోతాం.

Sravya V said...

హ హ పక్కింటబ్బాయి గారు మీరు అయిడియా సూపర్ :))))

..nagarjuna.. said...

శ్రావ్యగారు మీ సలహా పాటిద్దామని నల్లమల అడవుల్లోకి దూరి ఓ నక్కను పట్టుకున్నా, సిగదరగ అది నా పిక్కను పట్టుకుంది. నేను గొప్పోణ్ణవడం అటుంచి నా జేబులోని 'గొప్ప' అంతా పోయింది. కోడ్‌ ఇచ్చి యూజర్ గైడ్ ఇవ్వనందువలన నాకు జరిగిన నష్టానికి మీపై ఆస్తినష్టం, దేహ నష్టం దావా వేస్తున్నా.... [ గొప్పోళ్ళవడానికి ఇది కూడా ఓ పధ్ధతి, కేసు గెలిస్తే డబ్బూ+ పేరు. గెలవకపోతే పేరు. ఏది జరిగినా గొప్పోళ్లమైపోతాం :D ]

Sravya V said...

@నాగార్జున బాబోయ్ గురువుకే పంగనామాలు పెట్టేట్టున్నారు మీరు :))) అయిడియా మాత్రం అద్బుతం :)))

@చాణుక్య 'Knights order for the Mental disorder' ఇది మాత్రం గారెంటీ :)))) Thank you !

నాగార్జున & చాణుక్య నిన్నటి నిన్న రాత్రి ఈ పోస్టు పబ్లిష్ చేసినప్పటి నుంచి చూస్తున్నా రాయమన్న ఇద్దరు ఒక్క కామెంట్ పెట్టలేదు ఏమిటి అని ?
Once again thank you both !

హరే కృష్ణ said...

మనుషులకే 1BHK లు దొరకని ఈరోజుల్లో నక్కలను పట్టుకు రావడం అసంభవం
పైగా ఈ peta వాళ్ళ గోల కూడా

ఇక వేరే దారి లేదు కాబట్టి

మహాభారతం లో పాండవులు కౌరవులని ఏం చేసారు
సీనియర్ NTR సూపర్ స్టార్ కృష్ణ ని ఏం చేసారు
చిరంజీవి ఉదయ్ కిరణ్ ని ఏం చేసాడు
సంధ్య ని ప్రతీక్ ఏం చేసాడు
నక్క కోసం అష్ట కష్టాలు పడి తోక తొక్కకుండా పైన ఉదహరించిన మహానుభావులు తోక్కేసినట్టు తోక్కేస్తే చాలా గొప్పోళ్ళు అయిపోవచ్చు అని బ్లాగు ముఖంగా తెలియచేసుకుంటున్నాను

పద్మవల్లి said...

శ్రావ్యా ... ఐడియాలు సూపర్. అయినా గానీ నాకు ఇంకా సులభమయిన చెప్పు ప్లీజ్.

కొత్తావకాయ said...

ఫెవికాల్ వాడి నక్క తోక మాత్రం అతికించాను. నేను కాళ్ళు కడుక్కొచ్చి పవిత్రంగా దాని తోక తొక్కుదాం అనుకొనేలోపు శ్రావ్యగారట ఎవరో, ఆవిడ రాసిన పోస్టు చదివి నక్కని దొంగలు తోలుకెళ్ళారు. ఫెవికాల్ మహత్యం వల్ల తోక అక్కడే ఉంది. నక్కలేని వట్టి తోకని తొక్కెయ్మంటారా! ఫలితం దక్కేనా? తొందరగా చెప్పగలరు.

Sravya V said...

@హరేకృష్ణ అంతే అంతే ఎప్పుడు ఎవరో ఒకరిని తొక్కి పడేద్దాం అన్న ఆలోచన , అన్ని చోట్ల సంధ్యలు అప్పుడప్పుడు మనం కూడా తోక్కపడతాము అనేది జీవితసత్యం :)))))) Thank you !

@పద్మవల్లి గారు ఇంకా సులభమైనవి కావాలా :(((( సరే మీ కోసం ఎలా అయినా కష్టపడి సెకండ్ వెర్షన్ రిలీజ్ చేస్తా :))) Thank you పద్మ గారు!

Sravya V said...

@కొత్తావకాయ గారు అయ్యో మీరు ముందు ఆ తోక తొక్కి ఈ డౌట్ అడగాల్సింది కదండీ ? ఇప్పుడు మీరు కాళ్ళు కడిగి , ఈ డౌట్ తీర్చుకొనే లోపు ఆ తోకన్నా ఉందో అది కూడా లేపెసారో ఎవరన్నా . ముందు అర్జెంటు గా వెళ్లి తోక తోక్కేయండి నక్క ఉందా లేదా అనేది మనకు అనవసరం :))))

Thank you !

Anuradha said...

పాత ఇల్లు కూలిపోయింది శ్రావ్య!...కొత్త ఇంట్లోకి మారాను :)

Sravya V said...

అయ్యో అనురాధా గారు అవునా ఏదన్న టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందా ఏంటి ? మరి buzz లోకి కూడా వచ్చేయండి !

చాణుక్య :)))))

మనసు పలికే said...

హహ్హహ్హా.. శ్రావ్య గారూ.. భలే నవ్వుకున్నాను మీ టపా చదివి.. నిజానికి నేను బ్లాగుల్లోకి రాక చాలా రోజులు అయింది:) ఈరోజే ఒక్కొక్కరి బ్లాగులు వెలికి తీసి, టపాలు చదువుతూ ఉన్నాను.. ఇది చదివి నవ్వు ఆపుకోలేకపోయాను. మీ రెండు చెవుల మధ్య ఉన్న దానికి భలే అయిడియాలు వచ్చేస్తున్నాయి;) మీరు కూడా ఒక పార్టీ పెట్టెయ్యండి, నేను మీ పార్టీలో చేరిపోతాను:)))

Sravya V said...

హ హ అపర్ణ థాంక్ యు ! నేను పార్టీ పెట్టగానే మొదటి మెంబెర్ మీరే :)))))

Sravya V said...

మీరు పార్టీ పెడితే నన్ను కోశాధికారిగానో, అధికార ప్రతినిధిగానో నియమించాలి. తర్వాత రాజ్యసభకి కూడా పంపించాలి
----------------

హ హ అలాగే అలాగే దానికేమి తప్పక చేద్దాం :))))

కృష్ణప్రియ said...

ఐడియాలు బాగున్నాయి. నాదగ్గర ఇంకోటుంది. ఖుష్బూ, అరుంధతీ రాయ్ లాంటి వాళ్లు వేసే స్టేట్మెంట్ లు ఉంటాయి కదా ఎటువైపు ఎక్కువ కాంట్ర వర్షియల్ గా అనిపిస్తే అటువైపు మన 100% సపోర్ట్ ఇవ్వటం.. దాని గురించి కాస్త హడావిడి చేయటం...ఏదైనా వార్తా పత్రిక లో సోనియమ్మ/జగన్/చంద్రబాబు/ లాంటి వాళ్ళమీద పిచ్చిగా రాసారని వాళ్ల ఆఫీసు ముందు ధర్నాలు చేయటం.. వీలయితే అద్దాల్లాంటివి నాలుగు బద్దలు కొట్టటం..

ఇక ష్యూర్ షాట్.. ఒకటి గురి తప్పనిది 'ఏదో ఒక ప్రాంతానికి/వాదానికి/హీరో కి /నాయకుడికి సపోర్ట్ గా ఆత్మాహుతి కి ప్రయత్నించటం.. (రక్షించటానికి జనాలు, రికార్డ్ చేయటానికి మీడియా వాళ్లు ఉండేలే చూసుకోవటం మర్చిపోకూడదు.)

Sravya V said...

చాణుక్య అలాగే అలాగే తప్పకుండ మంచి రోజు చూసి చెబుతా , ఇక అడ్వాన్సు అంటారా అదే పుచ్చుకోవటమే కాని ఇవ్వటం తెలియదు (ఇది కూడా తెలియకుండా మా పార్టీలో చేరిపోదామనే :))

@కృష్ణ ప్రియ గారు హ హ బావున్నాయి మీ ఐడియాలు పైగా వర్క్ అవుట్ కూడా అయ్యేట్లు కనిపిస్తున్నాయి :)Thank you !

Rao S Lakkaraju said...

ఎక్కడ పడితే అక్కడ సెల్ ఫోనులో వేసే సొల్లు ఆపే ఒక వెంటతీసుకొని వెళ్ళగలిగే జామర్ ని కనిపెట్టి వెర్బల్ డయేరియా ని అరికట్టి నాలాంటి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడిన వారవుతారు .
-------
I think it is doable but unfortunately 2G spectrum is sold out. I want to help you Sravya but sorry.

Sravya V said...

లక్కరాజు గారు అవునా అయ్యో ఐతే ఛాన్స్ మిస్సయ్యనన్నమాట
?:))) Thank you !

Chandu S said...

అమ్మో, ఇదేంటీ, ఇంత బాగుందీ,

కానీ నక్కెక్కడ దొరుకుతుందో, మీ నక్క పిల్లలు పెడితే ఒక నక్క పప్పీ పిల్లని ఇస్తారా?

Sravya V said...

హ హ శైలజ గారు , మా ఇంట్లో నక్క తోక మాత్రమే ఉంది , నక్క లేదు :))) అంటే తోక ఒక్కటే కదా అవసరం అని అదొక్కటే మైంటైన్ చేస్తున్నా :))))

kiran said...

హహహహహః..శ్రావ్య జీ...sooooparu ...కాస్త ఆలస్యంగా చూస్తున్నా..మీ టపా ని..
నాకు ఒక్క విషయం అర్థమయ్యింది...మీరు సింగపూర్ లో ఉండి కూడా టీవీ 9 ని ఫాలో అయిపోతున్నారని ? ??
చాల ఈజీ avidea నక్క ని కొనటం..ఎక్కడ దొరుకుతుంది ??

Sravya V said...

టీవీ 9 అది ఎందుకు గుర్తొచ్చింది కిరణ్ మీకు :))) లేదే మాకు తెలుగు చానల్స్ రావు కదా , ఎప్పుడైనా ఉత్సాహం ఆపుకోలేకా నెట్ లో చూడటమే :))) నక్క దొరికే చోటు కావాలా ఇప్పుడు వాటికి డిమాండ్ ఎక్కువుంది అందుకే మీకు మెయిల్ చేస్తా ఇక్కడైతే అందరికి తెలిసిపోతుంది :))))

sphurita mylavarapu said...

LoL బావుందండీ...."మంచినక్కని తెచ్చి..." మంచిదో చెడ్డదో ఎలా తెలుస్తుందండీ..దాన్నడిగితే చెబుతుందంటారా ....:)

Sravya V said...

హ హ స్పురిత గారు , నక్కని అడుగుదాం అంటారా మంచి ఐడియా , మనం అడగగానే తోక ఊపితే మంచిది అన్నట్లు ఫిక్స్ అయ్యిపోదాం ఏమంటారు :))) థాంక్ యు !

శేఖర్ (Sekhar) said...

"మనం యాపిల్ లాంటి సంస్థను కాకపోయినా జామపండు లేదా కనీసం అరటిపండు కంపనీ పెట్టుకోవచ్చు"
"ఎక్కడ పడితే అక్కడ సెల్ ఫోనులో వేసే సొల్లు ఆపే ఒక వెంటతీసుకొని వెళ్ళగలిగే జామర్ ని కనిపెట్టి వెర్బల్ డయేరియా ని అరికట్టి నాలాంటి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడిన వారవుతారు "

ha ha laughed a lot :)

సంతు (santu) said...

హిహిహి చాలా పెద్ద ఐడియాలు ఇచ్చారు
ఇంకా ఆచరణలో పెట్టడమేయ్ తరువాయి

Sravya V said...

@Santu gaaru thank you :-)

kalasagar b said...

bagundandi mee blog. ee roje choostunnanu. it's very good

Post a Comment