మొదటి భాగం చదివారా? లేకపోతే ఒకసారి ఇక్కడ చూసి వచ్చేయండి .
ఇప్పుడు అర్ధం అయ్యింది కదా మీకు ఇప్పుడు నేను నాకు తెలిసిన సింగపూర్ ప్రజల రోజు వారి జీవితం గురించి సుత్తి వేయదల్చుకున్నాను అని , అయ్యో భయపడకండి మనం తెలుగు బ్లాగర్లం గుండె దిటవు చేసుకొని మన సాటి బ్లాగర్ రాసింది మనం కాకపొతే ఎవరు చదువుతారు అని ఫిక్స్ అయ్యిపొండి ఈసారి కి :)
సరే ఇప్పుడు ఎక్కడ నుంచి మొదలెడదాం .......... మనిషన్న వాడికి రోటీ , కపడా , మకాన్ అవసరం అన్న మాట ప్రతి భాష లోను , ప్రతి కవి చెబుతున్నాడు కదా అక్కడ నుంచి మొదలెడదాం .
ఆహారం : సింగపూర్ భిన్న సంసృతుల సమ్మేళనం , అలాగే ఎక్కువ ట్రాన్సిట్ visit కి అవకాశం ఉండే ఓడరేవు , విమానాశ్రయం ఉండటం , పైగా టూరిజం కి ఎక్కువ ప్రాధాన్యత ఉన్న దేశం కావటం తో అందుబాటు ధరలలో రకరకాల ఆహార పదార్ధాలు ఇక్కడ దొరుకుతాయి (కొన్ని చోట్ల 24 గంటలు ) . సాంప్రదాయ భారత , చైనా , మలయ్ , మయన్మార్ ఆహరం లభించే ఫుడ్ కోర్ట్స్ , ఖరీదైనా రెస్తారెంట్లే కాకుండా వెస్ట్రన్ ఫుడ్ లభించే దరిదాపు అన్ని ఫుడ్ చైన్స్ ఇక్కడ ఉంటాయి .చాల మంది సింగపూరియన్స్ కి వంట గది ఒక అలంకారం మాత్రమే . ఎక్కడ చూసినా ఉండే ఫుడ్ కోర్ట్స్, పైగా ధరలు కూడా అందుబాటు లో ఉండటం తో ఎక్కువ మంది ఈ ఫుడ్ కోర్ట్స్ పైనే ఆధారపడతారు . చైనీస్ కి చాలా త్వర గా రాత్రి భోజనం ముగించే అలవాటు , అలాగే ఇక్కడ ఉండే ఎక్కువ పని గంటలు కూడా ఈ అలవాటుకి ఒక కారణమేమో అని నా అభిప్రాయం . సాధరణం గా మొదటి తరం ఇండియన్స్ లేదా మాత్రం ఈ గ్రూప్ లోకి రారు :) వ్యవసాయం అనేది లేని దేశం అవటం తో ప్రతి దీ వేరే దేశం నుంచి దిగుమతి చేసుకోవటం తో నానా రకాల కూరగాయలు , పండ్లు ఇక్కడ దొరుకుతాయి . ఇక్కడ జనాభా కి సరిపడా మంచి నీటి వసతి లేకపోవటం తో నీరు కూడా మలేషియా నుంచి దిగుమతి చేసుకుంటారు. ఈ నీటి సమస్య ని ఎదుర్కోవటానికి , recycling ద్వారా నీటి ని శుభ్రపరిచి వాడటానికి ప్రయతిస్తున్నారు , దీన్నే ఇక్కడా న్యూ వాటర్ అంటారు .
ఇక్కడ steamboat అనే చైనీసు సంప్రదాయ వంటకం ఇక్కడ బాగా ఫేమస్ , చైనీస్ న్యూ ఇయర్ రెండు రోజుల్లో ఒక రోజు ఫ్యామిలీ మొత్తం వెళ్లి ఇది తినడటం అనేది వీళ్ళ అలవాటు. దీని గురించి తెలుసుకోవాలి అంటే ఇక్కడ చూడండి .
నివాసం :85 % ప్రజలు Multi Storied HDB ( Housing and Development Board ) flats ల లో నివసిస్తూ ఉంటారు . ప్రతి HDB బ్లాకు కి ఒక మల్టీ storied పార్కింగ్ ఏరియా ఉంటుంది . ఇలాంటి కొన్ని బ్లాకులని కలిపి హౌసింగ్ estates అంటారు . ఈ HDB లని సింగపూర్ గవర్నమెంట్ డెవలప్ చేసి race ratios , సిటిజెన్ షిప్ ఆధారం గా allot చేసుంది . వీటిని కొనుగోలు చేయటాని CPF నుంచి loans provide చేస్తారు . కొన్ని అపార్ట్మెంట్ బ్లాక్ లకి కలిపి ఒక గార్డెన్ , exercise equipment maintain చేస్తుంటారు . ఇవి కాక ప్రైవేటు కాండోస్ ఉంటాయి , వీటిని ఎవరైనా కొనుగోలు చేయొచ్చు . వీటి ఖరీదు ఎక్కువ గా ఉంటుంది .ఇక్కడ డెంగూ భయం వలన ఇళ్ళలో ఇండోర్ మొక్కల పెంపకం పైన నిషేధం ఉంది , తరచూ గా HDB లని inspect చేస్తుంటారు , ఇండోర్ మొక్కలు లేదా , నెలలు నిలువ ఉంచిన బకెట్స్ లాంటివి, లేదా శుభ్రత సరిగా లేకపోయినా ఫైన్ విధిస్తుంటారు . అలాగే రెంటల్ వ్యయం చాల ఎక్కువ కాబట్టి సాధారణం గా షేరింగ్ accommodation prefer చేస్తారు, అంటే రెండు ఫామిలీస్ కలిసి ఒక ఇంటిని అద్దెకి తీసుకోవటం , లేదా ఒక రూమ్ ని వంటిరి గా ఉండేవారికి అద్దె కి ఇవ్వటం వంటివి ఎక్కువ గా కనపడుతుంటాయి .
ఇక ఇన్ని తెలుసుకున్న తరవాత మనిషి చివరి గమ్యం గురించి కూడా తెలుసుకోవాలి కదా :) అంటే అదేనండి చనిపోయిన ఏమి చేస్తారు అని . చిన్న దేశం పైగా స్థలం ఎక్కువ గా లేకపోవటంతో ఇక్కడ సమాధులు వంటి కట్టడం నిషేధం. చనిపోయిన తరవాత ఆ కార్యక్రమాలని నిర్వహించటానికి సాధారణం గా Funeral Directors అని వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు అలాగే అస్తికల్ని భద్రపరచటానికి ఇక్కడ కొలంబేరియం అనే ఏర్పాటు ఉంటుంది . ప్రభుత్వ నిర్వహణ లో ఉండే మూడు కొలంబేరియం లు సింగపూరియన్ ప్రజల కోసం మాత్రమే , PRs లేదా మిగిన వాళ్ళు ఈ ఏర్పాటు కోసం ప్రైవేటు కొలంబేరియం లను వాడాల్సి ఉంటుంది . సింగపూరు లో మొదటి లక్సరీ కొలంబేరియం లో యూషున్ అనే ప్రాతం లో ఉంది . దీని గురించి వివరాలు తెలుస్కోవాలంటే ఇక్కడ చూడండి . భయపడనక్కర లేదండి , డబ్బుంటే చని పోయినాకా కూడా ఎంత రిచ్ గా ఉండొచ్చో చూడండి .
సరే ఇక సింగపూర్ గురించి వివరాలు ఇక్కడి తో ఆపి ప్రేక్షకుల కోరిక మేరకు పర్యాటక విశేషాలు కొన్ని తెలుసుకుందాం :
సింగపూర్ visiting వీసా దొరకటం చాలా సులువు , సాధారణం గా నెల రోజులకి ఈ వీసా ని ఇస్తారు . అలాగే ఉండటానికి మన budget మేరకు అకామిడేషన్ దొరుకుతుంది .
చూడాల్సిన కొన్ని ప్రదేశాలు :
Singapore airport
ఈ క్రింది లింక్ బ్లాగర్ హరేకృష్ణ గారి కోసం ప్రత్యేకం :)
సింగపూరియన్స్ కి షాపింగ్ అంటే మహా పిచ్చి , Shop till you Drop, అనేది ఇక్కడ జనాలు పాటించే సూత్రం , కాలరీ లు కరగటానికి కూడా షాపింగ్ ఒక మార్గం అని నమ్ముతారు .సింగపూర్ కి "shopping paradise " అని పెద్ద పేరు , పెద్ద పెద్ద malls మీ పర్సు బరువు తగ్గించుకోవటానికి చక్కగా ఆహ్వానం పలుకుతాయి . మీరు తప్పకుండా కనీసం విండో షాపింగ్ అన్న చేయాల్సిన షాపింగ్ మాల్స్ ఇవి Vivo city, ion , Great World City.
అలాగే మీరు గుర్తు పెట్టుకోవాల్సిన రెండు అంశాలు
సింగపూర్ లో చూయింగ్ గం తినడటం నేరం , అలాగే తీసుకు రావటం కూడా.
మీరు గాని పొగరాయుళ్ళు ఐతే మీరు బారీ మొత్తం లో సిగిరెట్లు కనక తెస్తుంటే వాటికి డ్యూటీ కట్టవలసి వస్తుంది ఒక వేళ పర్సనల్ వాడుకకోసం ఐతే వాటిని ఐర్పొర్ట్ లో రెడ్ line లో declare చేయాల్సి ఉంటుంది .
ఈ రెండు ముక్కలు మన బంతి గారికి కోసం ఇస్పెషల్ :) సింగపూర్ అంటేనే ఇన్ఫర్మేషన్ సిటీ పేరు కాబట్టి మీరు సింగపూర్ గురించి ఈ ఇన్ఫర్మేషన్ అయినా నిమషాల్లో తెలుస్కోవచ్చు (బస్సు రాకపోకల తో సహా ) ఇది IT తో నే సాధ్యం . ఇక IT employee భవిష్యత్తు అమెరికా తుమ్మితే ఇండియా కి జలుబు చేస్తుంది , కాని సింగపూర్ కి ఏకంగా టైఫాయిడ్ వస్తుంది అదీ విషయం .
ఇందండి సింగపూర్ గురించి నేను మీకు చెప్పదలుచుకున్న సోది , ఇక ఇక్కడితో దీనికి fullstop పెట్టేస్తున్నా మీరు ఊపిరి పీల్చుకోవచ్చు , అలాగే "Majulah Singapura" అని ఒకసారి చెప్పి విండో క్లోజ్ చేసి రెస్ట్ తీసుకోండి :)
సింగపూర్ ని ఫోటోలలో చూడాలి అనుకుంటే గతం లో నేను తీసినవి కొన్ని ఇక్కడ చూడొచ్చు !
Singapore |
35 comments :
చాలా బాగా వివరంగా రాసావు శ్రావ్యా.
అయినా మాకేం ఇబ్బందీ లేదు మేమెప్పుడొచ్చినా నువ్వున్నావు కదా మాకెందుకు బెంగ.
Baagundi! aite eesaari Trip meevoorikae !
Very Interesting!!
అయితే మరి మమ్మల్ని ఎప్పుడు రమ్మంటారు మీ ఊరికి.. ;)
నేనక్కడ విజిట్ కి వచ్చినప్పుడు బస్సుల్లో తిరిగాను. ప్రతీ రూం లోనూ బస్సు టైము టేబుల్సు ఉన్నాయి. ఇంటి అద్దెలు ఎల్లాఉంటాయి?
సింగపూర్ మీద వ్యాసం బాగుంది. సామాజిక సంగతులు చాలా తెల్సినయ్యి. థాంక్స్.
చాలా బాగుంది శ్రావ్య గారు... మంచి వివరాలు ఇచ్చారు..
బాగుంది సింగపూర్. చాలా విషేశాలే చెప్పారు. తప్పకుండా ఒకసారి చూడాలి. అప్పుడెప్పుడో నేస్తం గారి బ్లాగ్ లో కూడా కొన్ని విషేశాలు చూసాను.
శ్రావ్య గారూ.. సింగపుర చరిత్ర అంతా మాచేత చదివించేస్తున్నారు గా..
నాకయితే ముందు పోస్ట్ కన్నా ఇది బాగా నచ్చిందండీ.. పాఠం చదివినట్టొ లేదు, కధ చెప్పినట్టూ ఉందీ.. ఇలా అయితే ఎగ్జాం లో నేనే టాపర్.
నా లిస్ట్ లో సింగపూర్ ఎయిర్ పోర్ట్ కన్నా ముందు ఇంకో ప్లేస్ ఉందీ.. ఏమిటో చెప్పుకోండీ చూద్దాం? ;)
నేను మూడు సార్లు ట్రాన్సిట్ వీసా తీసుకుని సింగపూర్ సిటీ టూర్, సింగపూర్ టెంపుల్, జైలు టూర్లు వెళ్లాను. కానీ ఎప్పుడూ కొన్ని రోజులు ఉండేటట్టు రాలేదు. ఈ టపా ముందరి దాని కన్నా ఇంటరెస్టింగ్ గా అనిపించింది.
"Majulah Singapura" అని చెప్పమన్నారని చెప్పేశాను. సింగపుర గురించి క్షుణ్ణంగా చదివేశాను. కాబట్టి పరీక్షలో గోల్డ్ మెడల్ నాదే.
ఇంతమంది సింగపూరు వచ్చేస్తామంటున్నారు. "ఇక్కడ మడత మంచములు అద్దెకు ఇవ్వబడును" అనే హోటల్ ఏదైనా ఉంటే వాళ్లందరిని అక్కడ పెట్టేయండి. మా రెండు టిక్కెట్స్ మీ ఇంట్లోనే సుమా.
Majulah Singapura!
పబ్లిక్ హౌసింగ్ స్వర్గానికి దగ్గరలో ఉన్నట్టు ఉన్నాయి.
పరిశుభ్రమైన రోడ్లు రోడ్డుకి ఇరువైపులా చెట్లు,ప్రకృతి పిలుస్తోంది అనేలా చాలా బావుంది.
లిమిటెడ్ ప్రదేశం ఉండే దేశం లో వాతావరణాన్ని సంరక్షించడం అభినందనీయం.
humidity లేకుండా ఏడాది అంతా ఆహ్లాదకరమైన వాతావరణం ఉండడం కూడా కలిసొచ్చే అంశం
ఇక పర్యాటక విషయాలకు వస్తే పేరు పేరునా అన్ని విషయాలు ఫోటోలు వేబ్సైట్లతో సహా ప్రస్తావించినందుకు ధన్యవాద్ :)
మరినా బే ని చూసి మా గ్రాండ్ ప్రిక్స్ ఏరియా గురించి కామెంట్ రాద్దామనుకోనేలేపు.. స్పెషల్ గా మెన్షన్ చేసినందుకు బ్లాగ్ముఖంగా థాంక్స్ !
అలానే F1+లింకిన్ పార్క్ అభిమానుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు :)
http://upload.wikimedia.org/wikipedia/commons/1/13/Copa_de_Campe%C3%B3n_del_mundo_de_F1_02.jpg
1950 లో మొదలైనప్పటి నుండి ఫార్ములా వన్ చరిత్రలోనే మొదటి నైట్ రేస్ 2008 లో ఆతిధ్యం ఇచ్చి F1 లో new jewel in the Formula One sports Crown గా నిలిచిపోయింది :)
http://www.flickr.com/photos/oncoming/3386911159/
http://farm6.static.flickr.com/5092/5575334343_10f468a6b5.jpg
ట్రాక్ పైన ఉండే ఈ ఫ్లై ఓవర్ డైవెర్షన్ గ్రేట్ వ్యూ అని అనిపిస్తుంది :)
marina bay sands,Flier చాలా బావున్నాయి
super trees కాన్సెప్ట్ Awesome !
ఇంత ఓపికగా పర్యాటక విశేషాలను వివరిస్తూ రాసిన పోస్ట్ కి మరో సారి :))))
బాబోయ్ మీరు రాసింది చూస్తే సింగపూర్ ప్రభుత్వం అంధ్రప్రదేశ్‌లో సింగపూర్ పర్యాటక అభివృద్దిసంస్థకి మిమ్మల్ని అధికారిణిగా నియమించేస్తుందేమో.
Majulah Singapura
Majulah Singapura
Majulah Singapura
సూపర్ రాసారు శ్రావ్యా! ఒక్కసారైనా ఈ షాపింగ్ పేరడైజ్‌లో షాపింగ్ చేయాలి :))
@పప్పు శ్రీనివాసరావు గారు థాంక్ యు , తప్పకుండా మీరు బెంగ పడాల్సిన పనే లేదు :)
@సునీత గారు థాంక్ యు , తప్పకుండా రండి మరి :)
@మధుర థాంక్ యు, మీకు ఎప్పుడు వీలయితే అప్పుడే, you are welcome at any time :)
@రావు గారు థాంక్ యు , ఈ మధ్య కాలం లో బాగా పెరిగిపోయాయండి , మామూలు HDB 2 బెడ్రూం హౌస్ కనీసం 1600 $ దాకా ఉంది ఇప్పుడు .
@వేణు గారు థాంక్ యు :)
@జయ గారు థాంక్ యు , ఈసారి సెలవల్లో oka ట్రిప్ మీరు , మాల గారు :)
@రాజ్‌కుమార్ థాంక్ యు ! ఐతే మీరే టాపర్ అంటారు , ఐతే అల్లాగే కానిచేద్దాం ఈ సారికి :) నాకు తెలిసు ముందు మీరు చూడాలనుకునేది నేస్తం గారి ఇల్లు కరెక్టు కదా :)
కృష్ణప్రియ గారు థాంక్ యు , ఈసారి for a change కొన్ని రోజులు ఉండేట్లు ప్లాన్ చేసేయండి :)
@బులుసు సుబ్రహ్మణ్యం గారు "Majulah Singapura" అని చెప్పి నందుకు , చరిత్ర అంతా చదివినందుకు థాంక్ యు , గోల్డ్ మెడల్ మీదే :) అంటే వాళ్ళందరికీ మడత మంచాలు ఐనా కాకపోయినా మీ రెండు టికెట్లు మాత్రం మా ఇంట్లోనే :)
@హరేకృష్ణ ముందు గా అన్ని లింక్ లు అంత శ్రద్ద గా చూసినందుకు థాంక్ యు :) అవును ఆ సూపర్ ట్రీస్ సూపర్ ఉన్నాయి , పబ్లిక్ కి ఓపెన్ చేయగానే వెళ్లి చూడాలి !
@మురళి గారు అంతే అంటారా ఆ పోస్టు నాదే అంటారా :) థాంక్ యు నా శ్రమ గుర్తించినందుకు :)
@ఇందు మూడు సార్లు Majulah Singapura అని చెప్పినందుకు థాంక్ యు :) తప్పకుండా షాపింగ్ చేయండి మరి చందు గారి పర్స్ బరువు తగ్గించొద్దు :))))
ఎంత బాగా వ్రాసారో! అసలు అక్కడి పర్యాటక శాఖ అదికారులకి కూడా ఇన్ని వివరాలు ఇంత కూలంకషంగా తెలియవేమో!
ఈరోజు హిందూ పేపరులో సింగపూరు జూ గురించి వ్రాసారు.
మరి గిఫ్టులెక్కడ టీచర్!
బావుందండి. చక్కగా రాసారు.
సింగపూర్ ప్రభుత్వం అంధ్రప్రదేశ్‌లో సింగపూర్ పర్యాటక అభివృద్దిసంస్థకి మిమ్మల్ని అధికారిణిగా నియమించేస్తుందేమో.Murali gari matalto fully agree.
సిరిసిరిమువ్వ గారు థాంక్ యు ! అన్ని వివరాలు చక్క గా రాసాను అని చెప్పి మళ్ళీ గిఫ్ట్ అడుగుతారా ?:))) మీకు అన్ని చక్క గా virtual గా అన్ని ప్రదేశాలు చూపించా కాదు అదే గిఫ్ట్ కాదు :)))
శైలు గారు థాంక్ యు :)))
అమెరికా తుమ్మితే ఇండియా కి జలుబు చేస్తుంది , కాని సింగపూర్ కి ఏకంగా టైఫాయిడ్ వస్తుంది. :)))
బాగుందండి. సింగపుర గురించి చాలా బాగా చెప్పారు.
బహుబాగుందండీ టపా.. మరేమో ఎలాగూ రెండు భాగాలు రాశారు కాబట్టి, ఇంకో భాగం పొడిగించండి.. ఏం రాయాలంటారా? మరేం లేదండీ, ఇక్కడ మన రాజకీయ నాయకులు కొందరికి సింగపూర్‌లో హోటల్సూ, ఇతరత్రా వ్యాపారాలూ ఉన్నాయని వేరే ఇష్యూస్ ఏమీ లేనప్పుడు కోళ్ళయ్యి కూస్తున్నారు.. మీరు కొంచం ఆ ఆస్తుల వివరాలు గనక చెప్పగలిగితే, ఎవరెవరిది ఏది ఉంటున్నది మేం ఊహించేసుకుంటాం.. ఎప్పుడు రాస్తారు మరి??
శిశిర గారు థాంక్ యు :)
మురళి గారు హ హ హ ఏమి కోరిక కోరారు , ఇప్పుడు నేను అర్జెంటు గా ఏ టీవీ 9 , లేదా ABN లోనే ఉదొగ్యం సంపాదించాలి :))) అయినా రాజకీయ నాయకులు కేనా , బడా పారిశ్రామిక వేత్తలకి బోలెడు ఆస్తులు ఉండి ఉండొచ్చు. థాంక్ యు మురళి గారు మీకు ఈ పోస్టు నచ్చినందుకు :)))
you r tooooo intelligent.. (ప్రకాష్ రాజ్ స్టైల్..) శ్రావ్యగారూ హిహిహిహి
హ హ రాజ్‌కుమార్ గారు కరెక్ట్ గా పట్టేశాను కదా :)))
"మామూలు HDB 2 బెడ్రూం హౌస్ కనీసం 1600 $ దాకా ఉంది ఇప్పుడు."
బాబ్బాబు, ఎక్కడ దొరుకుతుందో చెప్పండి. మినిమం sgd 2000 అంటుంటేను.
రొండో ఫొటోలో మీరే అపార్ట్ మెంట్ ఉంటారో ఒక మార్క్ పెట్టండీ, రేపెప్పుడైనా, నేను సింగపూర్ వస్తే ఇబ్బంది లేకుండా...
అనానిమస్ గారు ఐతే 2000 $ దాకా వచ్చేసిందా :(( ఇక కష్టమే నండి ! Thank you సరిచేసినదుకు .
శైలజ గారు హ హ ఆ రెండో ఫోటోకి , నేను ఉండే చోటుకి సంభందమే లేదు :)))) Thank you !
పోస్టు,ఫొటోలు బాగున్నాయి.
తుమ్ము- జలుబు- టైఫాయిడ్ ... హ హ రెండు ముక్కల్లో తెల్చేసారు నెనరులు :)
బంతి గారు థాంక్ యు :)))
ఇక IT employee భవిష్యత్తు అమెరికా తుమ్మితే ఇండియా కి జలుబు చేస్తుంది , కాని సింగపూర్ కి ఏకంగా టైఫాయిడ్ వస్తుంది అదీ విషయం .---- kevvvvvvvvvvvvvvvvvv
Majulah Singapura
మీకు ఎంత ఓపికో...మురళి గారు ..చెప్పింది ఓ సారి ఆలోచించండి..:)
సింగపూర్ కి ఎవరన్న వెళ్తాను అంటే ఇది ప్రింట్ అవుట్ ఇద్దాం అనుకుంటున్నా:)
@కిరణ్ నాకు ఓపికా ఇది అన్న మొదటి వ్యక్తి మీరేనోమో :)))) ప్రింట్ అవుట్ ఇస్తారా :)))) థాంక్ యు !
శ్రావ్య గారూ!
(ఈ టపాకు సంబంధించిన వ్యాఖ్య కాదిది.)
మా ‘చదువు’ బ్లాగుపై మీ అభిప్రాయం తెలిపినందుకు థాంక్యూ!
Aha nenu unde singapore ninchi inko Bllogger unnaaru ante chala exciting ga undi.
Baaga rasaru Singapore gurinchi. nnenu prastutam untunnandi singapore lone. Ikkada Singaporean paddatula gurinchi baaga chepaaru. naku anniti kanna irritate chesedi .. okati chineese funeral and Malay marriages. Void room ane space lo 1 week ki taggakunda hadavidi chesi loud speaker lo chavagottestaru. Singapore lo naku nachina ekaika vishayam ide.
nachina ani type chesanu .. nachani ani correct cheyandi :)
అనాన్ నాకూ సంతోషం గా ఉందండి ఇలా కలవటం :) హ హ నేను మొదట్లో అది పెళ్ళో, చావో అర్ధం కాక confuse అయ్యేదాన్ని :)))
థాంక్స్ మీకు ఈ పోస్టు నచ్చినందుకు
Post a Comment