నమస్కారాలు నమస్కారాలు అందరూ బాగున్నారా ? ఈరోజు బృహుత్తరమైన ప్రణాళిక తో మీ ముందుకు వచ్చా ! అదేంటంటే అదేంటంటే .....
హూ ! అర్ధం అయ్యింది , "సోది ఆపి పని చూడు" అనే మీ వ్యంగపు చూపుల అర్ధం ? మరీ తెలుగు బ్లాగర్లు అదీ నా బ్లాగు కూడా చదువుతున్న మీకు ఇంత ఓపిక కూడా లేకపోతే మహా కష్టం సుమండీ . వస్తున్నా విషయానికి ఇప్పుడు మిమ్మలిని కొన్ని ప్రశ్నలు అడుగుతా మీరు చెప్పేయాలి అంతే !
- "నవ్వడం ఒక భోగం,నవ్వించడం ఒక యోగం.నవ్వకపోడం ఒక రోగం " అన్నది ఎవరు ?
- "పడమటి సంధ్యారాగం , శ్రీవారికి ప్రేమలేఖ , మల్లెపందరి , అహ నా పెళ్ళంట , వివాహ భోజనంబు , చంటబ్బాయి , రెండు రెళ్ళు ఆరు " ఈ పేర్లన్నీ చదువుతుంటే మీకు కామన్ గా గుర్తొస్తున్న వ్యక్తి ఎవరు ?
- సుత్తివేలు , సుత్తి వీరభద్రరావు , బ్రహ్మానందం , శ్రీలక్ష్మి వీళ్ళని మనకు దగ్గర గా పరిచయం చేసిన వ్యక్తి ఎవరు ?
నాకు తెలుసు మీరు మహా షార్ప్ కదా బేసిక్ గా అందుకే ఈజీ పట్టేశారు ఆన్సర్ :)) యెస్ మీరు అనుకున్నట్లు నేను మాట్లాడుతుంది హాస్య బ్రహ్మ గా పేరు పొందిన జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి గురించే . ఇప్పుడు అర్జెంటు గా ఎందుకు అంటే ? జంధ్యాల గారి గురించి మనకు తెలియని విషయాలు తెలుసుకోవటానికి అలాగే మనకు తెలిసింది పంచుకోవటానికి , మన తెలుగు బ్లాగరు మిత్రులు కొంతమంది కలిసి ఒక చిన్న ప్రయత్నం మొదలు పెట్టారు . అదే జంధ్యావందనం అనే ఈ సైటు . మీకు తీరిక ఉన్నప్పుడు ఒకసారి వారి ప్రయత్నాన్ని అభినందిస్తారు అని నా ఈ చిరు పరిచయం .
అలాగే నా బ్లాగులో కుడి వైపున ఒక బాడ్జీ కనపడుతుంది చూడండి "జంధ్యావందనం " అని అలాంటివి మీరు కూడా వీలయితే మీ బ్లాగులో పెడితే మీకు చదివే వారందరూ అక్కడ కూడా ఒక చూపు చూడటానికి వీలు గా ఉంటుంది :) మీ అభినందనలు ఆ సైట్ లో కామెంట్ గా రాయమని మనవి .
ఈ సైటు గురించి ముందే తెలిసిన మిత్రులు మీకు తెలిసిన విషయం మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటే తప్పేమీ లేదు దీని గురించి జంధ్యాల మార్కు తిట్ల వర్షం నా మీద కురిపించ వద్దని మనవి .
14 comments :
హహహ ఇంత మంచి విషయాలు చెప్తే ఎందుకు తిడతాం!
రసజ్ఞ గారు మీరెంత మంచి వారండి , తిట్టలేదు పైగా మెచ్చుకున్నారు కూడా థాంక్ యు వేరి మచ్ :)))
శ్రావ్య గారూ template మార్చారా? బాగుంది
sravya garuu, nenu mee blog lo comentadaaniki kudaratledu. kaaranamu yenti?
baadha padutoo -ennela
చందు గారు అవునండి టెంప్లేట్ మార్చాను థాంక్స్ మీకు నచ్చినందుకు :))
ఎన్నెల గారు కామెంట్ పెట్టలేకపోతున్నారా , మీ జిమెయిల్ ID తోనా , కామెంట్ బాక్స్ సెట్టింగ్ మర్చిచూస్తాను ఉండండి !
A laudable effort. Great work.
Thanks
మీరు ప్రకటనకు రెండు రొజుల ముందుగా నేను ఆ బ్లాగు చూసాను. కాని మీ ప్రకటన ఆ సైట్ కి ముందు మాటలా ఉంది. మీ బ్లాగు మొదటి సారి చూస్తున్నాను. మీ బ్లాగు బాగోలేదన్న వాన్ని బాకుతొ పొడుస్తా..... (జంధ్యాల గారి స్టైల్లో )
కుమార్ గారు :)))
చాణుక్య నాకు తెలుసు మీ లాంటి వాళ్ళు ఇలా అంటారు అని , అందుకే కామెంట్లు అక్కడ అని చెప్పా :)))
నారాయణ గారు థాంక్ యు వేరి మచ్ , మరీ పోడిచేస్తే కేసు అవుతుందేమోనండి :)))
thanks for the link
"telugammayi" garu
the way ur presentation is also good.
?!
ఎందుకో ఏమో గారు థాంక్ యు !
శ్రావ్య గారు...మరేమో మీరు ఆ మార్కు తిట్లు మా మీద ఉపయోగిస్తారేమో అని ఆ సైట్ గురించి తెలిసిన మరో సారి వెళ్లాను..:P
కాని చాలా చక్కటి పని చేస్తున్నారు...నా లాంటి వాళ్ళకి చాలా ఉపయోగకరం... :)
బై ది వే ..మీ టెంప్లేట్ క్యూట్ ఉంది...:)...అండ్ టెస్టి లాగ పైన మువ్వ గారు మీ గురించి రాసిన లింక్ కూడా బాగుంది :)
చాలా రోజుల తర్వాత బ్లాగ్స్ ఓపెన్ చేశాను..సో మీ పోస్ట్ అంత కామెంట్ పెట్టాను..తిట్టుకోకండోయ్..:)
కిరణ్ హ హ భయపడి ఆ సైట్ కి వెళ్లి చూసొచ్చారా ???:)))
టెంప్లేట్, లింక్ , ఇంకా పోస్టు నచ్చినందుకు బిగ్ థాంక్స్ :))) తిట్టడం ఎందుకు హ్యాపీ కామెంట్ చూసి .
మీరు తిట్టొద్దన్నారు కాబట్టి తిట్టట్లేదంతే!!!
Ennela
హ హ ఎన్నెల గారు థాంక్ యు !
Post a Comment