I’ll always stay connected with Apple. I hope that throughout my life I’ll sort of have the thread of my life and the thread of Apple weave in and out of each other, like a tapestry. There may be a few years when I’m not there, but I’ll always come back.
- Steve Jobs in 1985 (Source)
స్టీవ్ జాబ్స్ 1997 సెప్టెంబర్ లో తిరిగి ఆపిల్ iCEO గా కుపర్టినో కి తిరిగి ఎలా వచ్చాడో తెలుసుకోవాలి అంటే అసలు స్టీవ్, ఆపిల్ ని వదిలి వెళ్ళాక అక్కడ ఏమి జరిగింది అనేది మనకి తెలియాలి కదా ? అందుకే అసలు ఏమి జరిగింది అనేది ఒక్కసారి చూద్దాం. 1985 సెప్టెంబర్ లో స్టీవ్ జాబ్స్ ఆపిల్ ని వదిలేశాక John Sculley ఆపిల్ ని లాభాల బాట పట్టించటానికి చేపట్టిన చర్యలలో కొన్ని ముఖ్యమైనవి ఇవి.
- ఆపిల్ మాక్ ని Laser Writer తో integrate చేయటం
- మాక్ స్పెసిఫిక్ Mac Publisher , Aldus PageMaker DTP softwares రూపొందించటం.
- 128 KB మాక్ ని 512 KB కి upgrade చేయటం.
- 1986 జనవరి విడుదల చేసిన 1 MB మాక్ ప్లస్ .
దీనితో కొద్ది కాలం ఆపిల్ లాభాల బాటలోనే నడిచింది. నిజానికి 1986 నుంచి 1995 మధ్య కాలం లో GUI ఇంకా DTP టెక్నాలజీ రంగాలలో ఆపిల్ తన మొనోపలీ ని నిలబెట్టుకుంది.
కానీ 1990 లో విండోస్ 3.0 ని విడుదల చేసిన మైక్రోసాఫ్ట్ ఆపిల్ కి గట్టి పోటీ ని ఇచ్చి ఆపిల్ డౌన్ ఫాల్ కి తెరతీస్తే, ఇక 1995 లో మైక్రోసాఫ్ట్ విడుదల చేసిన విండోస్ 95 విజయం ఆపిల్ ని కోలుకోలేని దెబ్బ తీసింది. 1994 లో సుప్రీమ్ కోర్ట్ లో ఆపిల్ , మైక్రోసాఫ్ట్ కి వ్యతిరేకం గా వేసిన sue లో ఓడిపోవటంతో, GUI సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లో మైక్రోసాఫ్ట్ ని అడ్డుకునే అవకాశంని కోల్పోయింది . ఇక సాఫ్ట్వేర్ జైంట్ గా ఎదిగిన మైక్రోసాఫ్ట్ విడుదల చేసిన విండోస్95 అతి తక్కువ ధర కి మార్కెట్ లో దొరికే ప్రతి PC తోనూ DTP సదుపాయాన్ని వాడుకొనే అవకాశం కల్పించటం తో మార్కెట్ లో మాక్ సేల్స్ పడిపోవటం తో మొదలైన ఆపిల్ పతనం, దాని తరవాత Newton, Performa, Power macintosh , Power book లాంటి అనేక ప్రాజెక్ట్స్ ని సకాలం లో పూర్తి చేయలేకపోవటం తో మరింత దిగజారింది . 1993 లో ఆపిల్ పగ్గాలు పట్టుకున్న Michael Spindler, కానీ 1996 లో Gil Amelio కానీ ఈ పరిస్తితుల్ని ఏ మాత్రం సరిద్దిద్దలేకపోయారు. ఇదే సమయం లో మాక్ OS తయారు చేసే ఉద్దేశ్యం తో మొదలైన ఆపిల్ ఇంటర్నల్ ప్రాజెక్ట్ అయిన "Copland" ఫెయిల్ అయ్యింది. దీనితో BeOS , లేదా NextStep లను కానీ మాక్ OS కోసం కొనుగోలు చేయాలి అన్న ఆలోచనతో ఉన్న ఆపిల్ మానేజెమెంట్ అనూహ్యం గా NextStep వైపు మొగ్గడం తో స్టీవ్ జాబ్స్ తిరిగి యాపిల్ కి రావటానికి దారి సుగమం అయ్యింది . (ఈ Nextstep తరవాత కాలం లో Mac OS గా రూపుదిద్దుకుంది ).
1997 ఫిబ్రవరి లో ఆపిల్ 429 మిలియన్ డాలర్ల కి Next కంపెనీ ని కొన్నది. ఈ డీల్ లోభాగం గా స్టీవ్ జాబ్స్ కి 1.5 మిలియన్ డాలర్ల ఆపిల్ షేర్స్ allot అవ్వడం తో పాటు గా అప్పటి CEO, Gil Amelio కి అడ్వైజర్ గా నియమించబడ్డాడు. 1997 మొదటి క్వార్టర్ లో వచ్చిన నష్టం 700 మిలియన్ డాలర్లు గా అంచనా వేసిన ఆపిల్ మానేజ్మెంట్ , 1996 నుంచి 1997 వరకు Gil Amelio ఆధ్వర్యం లో మొత్తం నష్టం 1 బిలియన్ డాలర్లు గా గుర్తించింది. దానితో పాటు ఆపిల్ ని ఈ పరిస్తితుల నుంచి రక్షించటానికి GIl Amelio చేపట్టిన కాస్ట్ కటింగ్ వంటి చర్యలు ఏ మాత్రం సానుకూల ఫలితాలని ఇవ్వక పోవడం తో అదే సంవత్సరం (1997) సెప్టెంబర్ లో Gil Amelio ని CEO గా తొలిగించి స్టీవ్ జాబ్స్ ని ఇంటరిమ్ CEO గా నియమించాలి అన్న నిర్ణయానికి వచ్చారు.
ఇలా సరిగ్గా 13 సంవత్సరాల తరవాత రెండో సారి స్టీవ్ జాబ్స్ ఆపిల్ పగ్గాలు చేపట్టేనాటికి bankruptcy ప్రకటించటానికి కేవలం 90 రోజుల దూరం లో ఉన్న ఆపిల్ కంప్యూటర్స్ కంపెనీ విలువ 4 బిలియన్ డాలర్లు (2012 లో apple విలువ సుమారు 600 బిలియన్ డాలర్లు ) . ఇలాంటి పరిస్తితులలో iCEO గా బాధ్యతలు చేపట్టిన స్టీవ్ జాబ్స్ ఆపిల్ పరిస్తితిని సరిదిద్దటానికి తనదైన పద్దతి లో పని చేయటం ప్రారంభించాడు, అన్నిటి కన్నా ముందు గా తన జీతాన్ని ఒక్క డాలర్ గా నిర్ణయించుకున్నాడు . 2011 లో రిజైన్ చేసే వరకూ కూడా ఇదే కొనసాగింది.
ఆపిల్ మార్కెట్ లో కోల్పోయిన ప్రతిష్టని, నమ్మకాన్ని తిరిగి gain చేసే ప్రయత్నం లో భాగంగా 1997 సెప్టెంబర్ 28 న "Think Different " అన్న TV కమర్షియల్ కాంపైన్ తో తన పనిని మొదలు పెట్టాడు. ఈ కాంపైన్ అంచనాలకి మించి విజయం సాధించి తరవాత కాలం లో "Think Different " అనేది ఆపిల్ స్లోగన్ గా నిలిచిపోయింది. ఆ కమర్షియల్ కి సంబంధించిన వీడియో ఇక్కడ చూడొచ్చు. (దీని ప్రభావం తో pro mac సేల్స్ ఊపందుకుని 1997 చివరి క్వార్టర్ లో ఆపిల్ 45 మిలియన్ డాలర్ల లాభాలని చూసింది). ఇదే క్రమం లో ఆపిల్ కి తలనొప్పి గా మారిన పేటెంట్ లా సూట్ మూలం గా మైక్రోసాఫ్ట్ తో ఏర్పడిన అనేక వివాదాలు పరిష్కరించే దిశ గా స్టీవ్ జాబ్స్ తన ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఆ ప్రయత్నాల ఫలితం గానే 1997 లో వివాదాలకి ముగింపు పలికేందుకు ఒక అంగీకారానికి వచ్చేలా బిల్ గేట్స్ ని ఒప్పించగలిగాడు . ఆ డీల్ లో బాగం గా మైక్రోసాఫ్ట్ మాక్ కోసం ఆఫీస్ సూట్ సాఫ్ట్వేర్ తయారు చేసేట్లు గాను, దానికి ప్రతి గా మాక్ లో internet explorer ని డిఫాల్ట్ బ్రౌజరు గా 5 సంవత్సరాలు కొనసాగించేట్లు గాను, మైక్రోసాఫ్ట్ ఆపిల్ లో 150 మిలియన్ డాలర్ల ని non -voting షేర్ల రూపం లో పెట్టుబడి పెట్టేట్లు గాను నిర్ణయాలు తీసుకున్నారు. ఆ ప్రకారమే 1998 నుంచి 2003 వరకు మాక్ లో డిఫాల్ట్ బ్రౌజరు గా internet explorer ఉండేది, ఆ తరవాత కాలం లో ఆపిల్ స్వంత బ్రౌజరు సఫారి ని విడుదల చేసారు .
ఆపిల్ మార్కెట్ లో కోల్పోయిన ప్రతిష్టని, నమ్మకాన్ని తిరిగి gain చేసే ప్రయత్నం లో భాగంగా 1997 సెప్టెంబర్ 28 న "Think Different " అన్న TV కమర్షియల్ కాంపైన్ తో తన పనిని మొదలు పెట్టాడు. ఈ కాంపైన్ అంచనాలకి మించి విజయం సాధించి తరవాత కాలం లో "Think Different " అనేది ఆపిల్ స్లోగన్ గా నిలిచిపోయింది. ఆ కమర్షియల్ కి సంబంధించిన వీడియో ఇక్కడ చూడొచ్చు. (దీని ప్రభావం తో pro mac సేల్స్ ఊపందుకుని 1997 చివరి క్వార్టర్ లో ఆపిల్ 45 మిలియన్ డాలర్ల లాభాలని చూసింది). ఇదే క్రమం లో ఆపిల్ కి తలనొప్పి గా మారిన పేటెంట్ లా సూట్ మూలం గా మైక్రోసాఫ్ట్ తో ఏర్పడిన అనేక వివాదాలు పరిష్కరించే దిశ గా స్టీవ్ జాబ్స్ తన ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఆ ప్రయత్నాల ఫలితం గానే 1997 లో వివాదాలకి ముగింపు పలికేందుకు ఒక అంగీకారానికి వచ్చేలా బిల్ గేట్స్ ని ఒప్పించగలిగాడు . ఆ డీల్ లో బాగం గా మైక్రోసాఫ్ట్ మాక్ కోసం ఆఫీస్ సూట్ సాఫ్ట్వేర్ తయారు చేసేట్లు గాను, దానికి ప్రతి గా మాక్ లో internet explorer ని డిఫాల్ట్ బ్రౌజరు గా 5 సంవత్సరాలు కొనసాగించేట్లు గాను, మైక్రోసాఫ్ట్ ఆపిల్ లో 150 మిలియన్ డాలర్ల ని non -voting షేర్ల రూపం లో పెట్టుబడి పెట్టేట్లు గాను నిర్ణయాలు తీసుకున్నారు. ఆ ప్రకారమే 1998 నుంచి 2003 వరకు మాక్ లో డిఫాల్ట్ బ్రౌజరు గా internet explorer ఉండేది, ఆ తరవాత కాలం లో ఆపిల్ స్వంత బ్రౌజరు సఫారి ని విడుదల చేసారు .
Macworld Boston 1997-The Microsoft Deal
ఇలా మార్కెట్ లో కంపెనీ ప్రతిష్ఠ పెంచే ప్రయత్నాలతో పాటే, స్టీవ్ ఆపిల్ అంతర్గత సమస్యలని పరిష్కరించే పనిలో పడ్డాడు. దానిలో భాగంగా ఆపిల్ లో నడుస్తున్న ప్రతి ఒక్క ప్రాజెక్ట్ సంబంధించిన వివరాలను ఆ టీం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేసాడు . ప్రతి ఒక్క టీం , స్టీవ్ జాబ్స్ ని కాన్ఫరెన్స్ రూమ్ లో కలిసి వివరాలు చెప్పి అది కంపెనీ భవిష్యత్తుకి ఎందుకు ఉపయోగమో కన్విన్స్ చేయాల్సిన భాద్యత ఉండేది. (ఆపిల్ ఆఫీస్ ఎలివేటర్ లో ఉన్న సమయం లో కూడా ఎంప్లాయిస్ ని ఫైర్ చేసే అవకాశం ఉంది అన్న రూమర్లు ఉండేవి, దానితో స్టీవ్ తో పాటు ఎలివేటర్లో ప్రయాణం చేయటానికి కూడా ఆపిల్ ఎంప్లాయిస్ భయపడేవారు) ఇలా క్షుణ్ణంగా వివరాలు తెలుసుకున్న తరవాత ఎటువంటి సెంటిమెంట్లు లేకుండా వివిధ దశల్లో ఉన్న మొత్తం 300 ఆపిల్ ప్రాజెక్ట్స్ ని 10 ప్రాజెక్ట్స్ కి తగ్గించాడు. దీన్ని గురించి స్టీవ్ మాటల్లో :
"And I started to ask people," he continued, "why would I recommend a 3400 over a 4400? Or when should somebody jump up to a 6500, but not a 7300? And after three weeks, I couldn't figure this out. And I figured if I can't figure it out working inside Apple with all these experts telling me in three weeks, how are customers ever going to figure this out?"
-Steve Jobs (at 1998's Worldwide Developers Conference)
iMac |
ఆపిల్ లో కొనసాగించాలి అని నిర్ణయించిన 10 ప్రాజెక్ట్స్ లో ముఖ్యమైనది NC మెషిన్ (Network Computer) అనేది చాల ముఖ్యమైంది. దీని ఆధారంగా iMac ని రూపొందించాలి అని నిర్ణయం తీసుకున్నారు (i stands for internet ). iMac రూపు రేఖలని డిజైన్ చేసిన Jonathan Ive ని తరవాత కాలం లో ఆపిల్ ఇండస్ట్రియల్ డిజైన్ టీం కి హెడ్ గా నియమించారు. iMac USB connectivity తో డిజైన్ చేయబడిన మొట్ట మొదటి మెయిన్‌స్ట్రీం కంప్యూటర్. అలాగే స్టీవ్ కి ఫ్లాపీ డిస్క్ అంటే ఉన్నఅయిష్టం మూలంగా ఫ్లాపీ డ్రైవ్ లేకుండా డిజైన్ చేయబడిన మొట్ట మొదటి కంప్యూటర్. వీటన్నిటికి మించి iMac బ్లూ / గ్రీన్ రంగులలో డిజైన్ చేయబడిన translucent, round machine అవ్వడం తో అప్పటి వరకు వచ్చిన కంప్యూటర్స్ తో పోల్చితే డిఫరెంట్ డిజైన్ తో మార్కెట్ లో విపరీతమైన క్రేజ్ వచ్చింది . ఇన్ని ప్రత్యేకతలు ఉన్న iMac ని, 14 సంవత్సరాల క్రిత్రం ఎక్కడైతే మొట్టమొదటి మాక్ ని unveil చేసాడో అదే Flint Center auditorium, Cupertino లో మే 6, 1998 న unveil చేసాడు (ఆ వీడియో ని ఇక్కడ చూడొచ్చు) . iMac రెండు సంవత్సరాల కాలం లో రెండు మిలియన్ల యూనిట్ అమ్ముడు అయ్యి, ఆపిల్ ప్రొడక్ట్స్ లో ఒక అతి పెద్ద హిట్ అయిన ప్రోడక్ట్ గా నిలిచిపోయింది. 1980 లో మొదటిసారి గా ఆపిల్ పబ్లిక్ ఇష్యూ కి వెళ్ళినప్పుడు యాపిల్ కి, దానితో పాటు తనకి వచ్చినంత క్రేజ్ ని, కీర్తి ప్రతిష్ఠలని 1998 లో తిరిగి అదే స్థాయి లో పొందగలిగాడు. ఇలా మూడు సంవత్సరాల పాటు విజయవంతం గా ఆపిల్ ని లాభాల బాట లో నడిపిన తరవాత జనవరి 5 , 2000 కీనోట్ అడ్రస్ సమయం లో ఇంటరిమ్ సీఈఓ నుండి ఫుల్ టైం సీఈఓ గా మారాడు .
Macworld San Francisco 2000-Steve Jobs Becomes iCEO of Apple
Why Steve didn't like Switches ? Wait wait until next part :-)
- శ్రావ్య
10 comments :
Very nice post Sravya. Keep going !
నిజానికి నాకు మీరు చెప్పేవరకూ ఆపిల్ ప్రోడక్ట్స్ మీద పెద్ద ఇంట్రస్ట్ లేదండీ.
ఇప్పుడు స్టీవ్స్ గురించి తెలుసుకున్న తర్వాత గౌరవం పెరిగిపోతుంది.
నైస్ పోస్ట్.. గ్రేట్ సిరీస్
చాలా బాగారాస్తున్నారు శ్రావ్యా ఇలా కొన్ని వీడియోలు కోట్స్ తో సహా రాస్తున్న విధానం బాగుంది, ఆసక్తిగా చదివిస్తున్నారు.
For me Steve Jobs is just a successful CEO, nothing more than that. Professional writers are there to glorify anyone. Americans are good in selling themselves.
చాలా బాగా రాసారు శ్రావ్యక్కా, చాల విషయాలు తెలిశాయి.
నా దగ్గర ఐమాక్ లు మొదటి రెండు మోడల్స్ వున్నాయి, ఆ డిజైన్ చూసాక, వాడాక స్టీవ్ నిజం గా గ్రేట్ అనిపించింది. :)
I did not notice you were writing these articles about Steve jobs. Nice work Sravya.
Going great!! Waiting for the next one.
I spent almost a couple of hours on this thanks to the video you linked here. But its worth the time.
I felt (like the booing apple fans in the video) that Steve Jobs stooped too low when he made the deal with Microsoft.
చాలా బావుంది, మీ పోస్ట్ ల సిరీస్ చదివుతూ ఉంటెయ్ ఆపిల్ ఉన్న పిచ్చి ఇంకా ఇంకా పెరుగుతూ ఉంది.... :) :)
అరే.. how did i miss this?
చాలా బాగా రాసారు.. as usual. Videosతో పాటు చెప్పటం చాలా బాగుంది.. and good that you have all the collection.. :)
@శ్రీకాంత్ గారు , @రాజారావు పంతుల గారు , @రాజ్, @వేణు శ్రీకాంత్ గారు , @అనానిమస్ గారు, @ఫోటాన్, @జలతారు వెన్నెల గారు ,@వాసు గారు @అనానిమస్ గారు , @రాజేంద్ర
అందరికీ చాల చాల థాంక్స్ అండి :-)
@ఫోటాన్ రెండు మోడల్స్ ల్యాబ్ లోనా ? అవును మాక్ మొదటి మోడల్స్ ఎడ్యుకేషన్ సెక్టార్ లో బాగా క్లిక్ అయ్యాయి , అప్పట్లో కొని ఉంటారు :-)
@రాజేంద్ర మీరు లీవ్ లో ఉన్నారు లెండి అప్పుడు అందుకే మిస్సయ్యారు :-)
Post a Comment