Being the richest man in the cemetery doesn’t matter to me … Going to bed at night saying we’ve done something wonderful… that’s what matters to me.
- Steve Jobs
2007 - iPod తో సక్సెస్ చవిచూసిన ఆపిల్ కంప్యూటర్స్ సంస్థ , మార్కెట్ లో కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బిజినెస్ లో తన పరిధిని విస్తరించటానికి మరో అడుగు ముందుకు వేసిన సంవత్సరం. ఆ అడుగే iPhone. నిజానికి 2003 లోనే ఆపిల్ కంప్యూటర్స్ స్మార్ట్ ఫోన్ తయారు చేసేందుకు తన ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇంటర్నెట్ కమ్యూనికేటర్, మొబైల్ ఫోన్, iPod మూడిటిని కలిపి ఒక డిజిటల్ device ని తయారుచేయాలి అన్న ఆపిల్ ప్రయత్నమే iPhone. స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి అడుగు పెట్టాలి అన్న ఆలోచన రాగానే స్టీవ్ జాబ్స్ మొదట చేసిన ప్రయత్నం అమెరికా లో వైర్లెస్ సర్వీసెస్ రంగం లో లీడరైన అప్పటి Cingular Wireless LLC ఇప్పటి AT&T తో డీల్ కుదుర్చుకోవటం. బిజినెస్ negotiationsలో నిష్ణాతుడైన స్టీవ్ జాబ్స్, అప్పటి వరకు Wireless Carriers డిమాండ్స్ కి అనుగుణం గా handsets తయారు చేసే కంపెనీలు నడుచుకునే తీరును ఒక్కసారిగా మార్చేసాడు. నిజానికి అంతవరకు ఫోన్ ఫీచర్స్, ఖరీదు, మార్కెటింగ్ ఎలా చేయాలి అనేవి Wireless Carrier కంపెనీలు నిర్ణయించేవి. iPhone డీల్ ఈ పరిస్థితి ని పూర్తి గా మార్చేసింది . iPhone ఎలా ఉండబోతుంది అనేది AT&T కి, కేవలం iPhone రిలీజ్ కి కొన్ని వారాల ముందు మాత్రమే తెలిసింది. ప్రోడక్ట్ విషయం లో ఇలాంటి సీక్రెసీ ఆపిల్ కంప్యూటర్స్ కి కొత్త కాకపోయినా సెల్ ఫోన్ ఇండస్ట్రీ లో మాత్రం అంత వరకూ లేనిది. మొట్ట మొదటి సారిగా Jan .9, 2007 న San Francisco లో జరిగిన Mac World Keynote address లో స్టీవ్ iPhone ని ఇంట్రడ్యూస్ చేసాడు. అదే Keynote address లో Apple TV ని ఇంట్రడ్యూస్ చేయటం తో పాటు, కేవలం కంప్యూటర్ రంగం లోనే కాకుండా కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ రంగం లో మార్కెట్ లో సాధిస్తున్న విజయాలకి అనుగుణం గా ఆపిల్ కంప్యూటర్స్ Inc. అనే కంపెనీ పేరు ని కేవలం Apple Inc. గా మారుస్తున్నట్లు గా అనౌన్స్ చేసాడు. iPhone తరవాత అదే సంవత్సరం జూన్ 29 నుంచి మార్కెట్ లో అందుబాటు లోకి వచ్చింది. జూన్ 29 మొదటి జనరేషన్ iPhone రిలీజ్ అయితే 2012 లో ప్రస్తుతం నడుస్తున్నది 6th జనరేషన్(iPhone 5). 2011 లో iPhone రెవిన్యూ 47 బిలియన్ డాలర్లు, ఇది కంపెనీ మొత్తం రెవిన్యూ లో 40 శాతం కన్నా ఎక్కువ. iPhone సాధించిన ఈ కీలకమైన విజయం ఆపిల్ అమెరికా లో అత్యంత లాభదాయకమైన కంపెనీ గా ఎదగటానికి ఒక ముఖ్య కారణం.
(ఇప్పటి వరకు రిలీజ్ అయిన iPhone సిరీస్ వివరాలు ఇక్కడ చూడొచ్చు)
ఈ పై కారణాలు చాలవా ? స్టీవ్ జాబ్స్ ని అత్యంత ప్రతిభావంతుడైన ఐకానిక్ మోడల్ గా గుర్తించటానికి, కొన్ని మిలియన్ల మంది ఫాన్స్ అవ్వడానికి :-)
స్టీవ్ జాబ్స్ ఆత్మకథ ని రాసిన ISAACSON ఒకానొక ఇంటర్వ్యూ లో మీరు తయారు చేసిన ప్రోడక్ట్ అన్నిటిలోనూ ఇష్టమైన ప్రోడక్ట్ ఏంటీ? అని అడిగిన ప్రశ్నకి, స్టీవ్ సమాధానం "Apple Company " అని. అత్యంత మాడ్యులర్ మోడల్ గా మారుతున్న టెక్నాలజీ ప్రపంచం లో closed ఆర్కిటెక్చర్ పాలసీ ని పాటిస్తున్న స్టీవ్ డ్రీం కంపెనీ ఆపిల్ భవిషత్తు ఏంటి అంటే కాలమే జవాబు చెప్పాలి.
80 లలో IBM , 90 లలో Microsoft , 2000 లలో Apple ఇలా "Every Morning is a Fresh Morning" అన్నట్లు ఉండే ఈ టెక్నాలజీ ప్రపంచం లో భవిష్యత్తు లో టెక్నాలజీ రంగాన్ని శాసించబోయే కంపెనీ ఏదైనా స్టీవ్ జాబ్స్ flaw less presentations, టెక్నాలజీ విజనరీ అయిన తన ఆలోచనలు ఇంకా కొన్నేళ్ళ పాటు భవిష్యత్తు తరాలకి మార్గదర్శకం గా ఉంటాయి అన్న దానిలో ఎటువంటి సందేహం లేదు. అలాగే ప్రతి టెక్నాలజీ user ఇంకా కొన్నిసంవత్సరాల పాటు తప్పక గుర్తుంచుకునే వ్యక్తి స్టీవ్ జాబ్స్ అని భావిస్తూ తన మాటలతోనే ఈ సిరీస్ ని ముగిస్తున్నాను.
(ఇప్పటి వరకు రిలీజ్ అయిన iPhone సిరీస్ వివరాలు ఇక్కడ చూడొచ్చు)
Apple - Steve Jobs introduces the iPhone - 2007
ఇలా ఆపిల్ ని విజయపధం లో నడిపిస్తున్న స్టీవ్ జాబ్స్ జనవరి 2008 లో జరిగిన Mac World సమావేశాలలో లో ఒక్కసారి గా సన్నబడి పేలవం గా కనిపించడం తో, తన ఆరోగ్యం పైన మొదలైన అనేక రకాలైన రూమర్లు తరవాత అదే సంవత్సరం జూన్ లో జరిగిన WWDC keynote తర్వాత మరింతగా ఊపందుకున్నాయి. Bloomberg ప్రెస్ ఏజెన్సీ ఆగష్టు లో పొరపాటున స్టీవ్ జాబ్స్ obituary ని పబ్లిష్ చేయటం ఈ రూమర్స్ కి పరాకాష్ట . చివరికి అదే సంవత్సరం సెప్టెంబర్ 9 జరిగిన ఒక మ్యూజిక్ ఈవెంట్స్ లోను , అక్టోబర్ 14 న జరిగిన మీడియా ఈవెంట్ లోను స్టీవ్ తన ఆరోగ్యం గురించి మీడియా చేస్తున్న అతి ని ఖండించాడు. కానీ దురదృష్టవశాత్తు ఈ అనుమానాలు నిజం అయ్యాయి. 2009 ఏప్రిల్ లో pancreas ప్రాబ్లం తిరగబెట్టటం తో Methodist University Hospital , Memphis లో స్టీవ్ కి లివర్ transplant ఆపరేషన్ జరిగింది. దీనితో స్టీవ్, 2009లో ఒక్క సెప్టెంబర్ లో జరిగిన మ్యూజిక్ ఈవెంట్ కి అటెండ్ అవ్వడం తప్ప , దరిదాపు మిగిలిన కాలం అంతా పబ్లిక్ లైఫ్ కి దూరం గా గడిపాడు . అదే సమయం లో ఆపిల్ సీక్రెట్ device ని డిజైన్ చేస్తుంది అందుకే స్టీవ్ పబ్లిక్ లైఫ్ కి దూరం గా ఉన్నాడు అని రూమర్లు ఉండేవి . ఈ రూమర్లు ని నిజం చేస్తూ 27 జనవరి 2010 న స్టీవ్ iPad రిలీజ్ ని అనౌన్స్ చేసాడు . iPhone తరవాత ఆపిల్ చేసిన అతి పెద్ద రిలీజ్ ఇది. నిరాశపూర్వకమైన అనలిస్ట్ ల అంచనాలని తలక్రిందులు చేస్తూ ఆపిల్ , iPad తో మార్కెట్ లో మరోసారి విజయం సాధించింది. సెప్టెంబర్ 2010 నాటికి మొత్తం 7.5 మిలియన్ల iPad లని సేల్ చేసి టాబ్లెట్ మార్కెట్ లో తన పట్టు ని నిరూపించుకుంది. (2010 లో iPad ని రిలీజ్ చేసిన ఆపిల్ తరవాత కాలం లో చేసిన రిలీజ్స్ వివరాలు ఇక్కడ ).
The future Apple spaceship campus |
2010 లో ఆపరేషన్ తరవాత కొద్ది గా మెరుగవుతునట్లు గా కనిపించిన స్టీవ్ జాబ్స్ ఆరోగ్య పరిస్థితి మళ్ళీ జనవరి 2011 లో మరోసారి ఇబ్బంది పెట్టడం మొదలైంది. దీనితో జనవరి 2011 లో స్టీవ్ మెడికల్ లీవ్ లో వెళుతున్నట్లు గా ప్రకటించాడు. తన ఆరోగ్యం గురించి రకరకాల ఊహాగానాలు నడుస్తున్న ఈ సమయం లో కూడా మార్చ్ 2011 లో iPad 2 రీలీజ్ చేయటం తో పాటు , జూన్ 2011 WWDCలో iCloud ని ఇంట్రడ్యూస్ చేసాడు. స్టీవ్ జాబ్స్ చివరి సారి అటెండ్ అయిన పబ్లిక్ ఈవెంట్ - 2011 , జూన్ లో ఆపిల్ ఫ్యూచర్ హెడ్క్వార్టర్స్ ప్లాన్ గురించి వివరించటానికి Cupertino సిటీ కౌన్సిలర్ ని కలవడం . ఆరోగ్య పరిస్టితి మరింత గా క్షీణించటం తో ఆగష్టు 24 2011 న, ఆపిల్ CEO పదవి కి రిజైన్ చేసాడు (స్టీవ్ జాబ్స్ resignation లెటర్ ).
తన కుటుంబం తో టూర్ చేయాలి అన్న ఉద్దేశ్యం తో తన చివరి రోజులని దానికి కావాల్సిన బోట్ డిజైన్ చేస్తూ గడిపిన స్టీవ్ జాబ్స్ ఆ పనిని మాత్రం మధ్య లోనే వదిలి వెళ్ళాల్సి వచ్చింది . అక్టోబర్ 4 న iPhone 4S ని రిలీజ్ చేసిన ఆపిల్, దురదృష్టవశాత్తు ఆ తరవాత రోజునే అంటే అక్టోబర్ 5, 2011 న స్టీవ్ జాబ్స్ ఇక లేరు అన్న విషయాన్ని కూడా ప్రకటించాల్సి వచ్చింది .
తన కుటుంబం తో టూర్ చేయాలి అన్న ఉద్దేశ్యం తో తన చివరి రోజులని దానికి కావాల్సిన బోట్ డిజైన్ చేస్తూ గడిపిన స్టీవ్ జాబ్స్ ఆ పనిని మాత్రం మధ్య లోనే వదిలి వెళ్ళాల్సి వచ్చింది . అక్టోబర్ 4 న iPhone 4S ని రిలీజ్ చేసిన ఆపిల్, దురదృష్టవశాత్తు ఆ తరవాత రోజునే అంటే అక్టోబర్ 5, 2011 న స్టీవ్ జాబ్స్ ఇక లేరు అన్న విషయాన్ని కూడా ప్రకటించాల్సి వచ్చింది .
Statement by Apple’s Board of Directors
CUPERTINO, Calif.--(BUSINESS WIRE)-- We are deeply saddened to announce that Steve Jobs passed away today.
Steve’s brilliance, passion and energy were the source of countless innovations that enrich and improve all of our lives. The world is immeasurably better because of Steve.
His greatest love was for his wife, Laurene, and his family. Our hearts go out to them and to all who were touched by his extraordinary gifts.
(Source)
Statement by Steve Jobs’ Family
PALO ALTO, Calif.--(BUSINESS WIRE)--Steve Jobs’ family today made the following statement regarding his death:
Steve died peacefully today surrounded by his family.
In his public life, Steve was known as a visionary; in his private life, he cherished his family. We are thankful to the many people who have shared their wishes and prayers during the last year of Steve’s illness; a website will be provided for those who wish to offer tributes and memories.
We are grateful for the support and kindness of those who share our feelings for Steve. We know many of you will mourn with us, and we ask that you respect our privacy during our time of grief.
(Source)
Epilogue :
డిజైన్ గురించి స్టీవ్ అభిప్రాయలు కొన్ని :
నిజమే స్టీవ్ జాబ్స్ ఏదీ కనిపెట్టలేదు కానీ
స్టీవ్ సక్సెస్ వెనక ఉన్న సూత్రం "Keep it Simple". అలాగే తన కంపెనీ కి చెందిన ప్రోడక్ట్ కి సంబంధించిన ప్రైమరీ టెక్నాలజీ తన కంపెనీ చేతి లోనే ఉండాలి అన్న పాలసీ.
డిజైన్ గురించి స్టీవ్ అభిప్రాయలు కొన్ని :
Design is not just what it looks like and feels like. Design is how it works.
-Steve Jobs
In most people's vocabularies, design means veneer. It's interior decorating. It's the fabric of the curtains of the sofa. But to me, nothing could be further from the meaning of design. Design is the fundamental soul of a human-made creation that ends up expressing itself in successive outer layers of the product or service.
-Steve Jobs
స్టీవ్ జాబ్స్ అంటే గిట్టని వాళ్ళు చేసే ప్రధానమైన విమర్శ స్టీవ్ జాబ్స్ కనిపెట్టినది ఏమీ లేదు అని :
నిజమే స్టీవ్ జాబ్స్ ఏదీ కనిపెట్టలేదు కానీ
- ఒక పది సంవత్సరాల కాలంలో , దరిదాపు bankruptcy అంచున ఉన్న కంపెనీ ని అత్యంత ప్రభావితం చేయగల హై ఎండ్ టెక్నాలజీ కంపెనీ గా మార్చిన ప్రతిభాశీలి.
- ప్రస్తుతం మనం ఉన్నది పోస్ట్ ఇండస్ట్రియల్ ఎరా లో . ఇప్పటి పరిస్తితులకి అనుగుణం గా , కొన్ని వందల మంది ఇంజనీర్స్ ని సరియైన దిశ లో నడిపిన నాయకుడు.
- స్వతహా గా తను ఇన్వెంటర్ కాకపోయినా, టెక్నాలజీ భవిష్యత్తు ని చూడగల విజినరీ .
- వీటన్నిటిని మించి టెక్నికల్ విషయాలని మామూలు మాటల్లో వివరించగల టెక్ జీనియస్.
- తనదైన ఒక ప్రత్యేకమైన ముద్ర తో కంప్యూటర్స్, మ్యూజిక్, మొబైల్, CGI రంగాల రూపు రేఖలనే మార్చేసిన లెజెండ్ .
ఇంకొక ప్రధాన విమర్శ చాలా చాలా డిమాండింగ్ బాస్ అని : దానికి సమాధానం స్టీవ్ మాటల్లోనే "See the result"
స్టీవ్ జాబ్స్ కాంటెంపరరీ CEOs లో చాలా మంది తమకి రోల్ మోడల్ గా అంగీకరించే వ్యక్తి స్టీవ్ .
ఈ పై కారణాలు చాలవా ? స్టీవ్ జాబ్స్ ని అత్యంత ప్రతిభావంతుడైన ఐకానిక్ మోడల్ గా గుర్తించటానికి, కొన్ని మిలియన్ల మంది ఫాన్స్ అవ్వడానికి :-)
స్టీవ్ జాబ్స్ ఆత్మకథ ని రాసిన ISAACSON ఒకానొక ఇంటర్వ్యూ లో మీరు తయారు చేసిన ప్రోడక్ట్ అన్నిటిలోనూ ఇష్టమైన ప్రోడక్ట్ ఏంటీ? అని అడిగిన ప్రశ్నకి, స్టీవ్ సమాధానం "Apple Company " అని. అత్యంత మాడ్యులర్ మోడల్ గా మారుతున్న టెక్నాలజీ ప్రపంచం లో closed ఆర్కిటెక్చర్ పాలసీ ని పాటిస్తున్న స్టీవ్ డ్రీం కంపెనీ ఆపిల్ భవిషత్తు ఏంటి అంటే కాలమే జవాబు చెప్పాలి.
80 లలో IBM , 90 లలో Microsoft , 2000 లలో Apple ఇలా "Every Morning is a Fresh Morning" అన్నట్లు ఉండే ఈ టెక్నాలజీ ప్రపంచం లో భవిష్యత్తు లో టెక్నాలజీ రంగాన్ని శాసించబోయే కంపెనీ ఏదైనా స్టీవ్ జాబ్స్ flaw less presentations, టెక్నాలజీ విజనరీ అయిన తన ఆలోచనలు ఇంకా కొన్నేళ్ళ పాటు భవిష్యత్తు తరాలకి మార్గదర్శకం గా ఉంటాయి అన్న దానిలో ఎటువంటి సందేహం లేదు. అలాగే ప్రతి టెక్నాలజీ user ఇంకా కొన్నిసంవత్సరాల పాటు తప్పక గుర్తుంచుకునే వ్యక్తి స్టీవ్ జాబ్స్ అని భావిస్తూ తన మాటలతోనే ఈ సిరీస్ ని ముగిస్తున్నాను.
Here’s to the crazy ones. The misfits. The rebels. The troublemakers. The round pegs in the square holes. The ones who see things differently. They’re not fond of rules. And they have no respect for the status quo. You can quote them, disagree with them, glorify or vilify them. About the only thing you can’t do is ignore them. Because they change things. They push the human race forward. While some may see them as the crazy ones, we see genius. Because the people who are crazy enough to think they can change the world, are the ones who do.
- Apple Inc
-శ్రావ్య
(Images Source : Google Images )
Quick facts about Steve Jobs |
|
Born
|
|
Died
|
|
Spouse
|
|
Children
|
|
Education
|
Monta
Loma Elementary School, Cupertino
Junior High School, Homestead
High School (1972), Reed
College,(Drop out)
|
Parents
|
Paul
Jobs, Clara
Jobs, Joanne Carole (Adoptive )
|
Siblings
|
|
స్టీవ్ జాబ్స్ వ్యక్తిగత ప్రతిష్ఠ మసకబార్చిన అంశాలు |
|
1.
|
|
2.
|
|
స్టీవ్ జాబ్స్ గురించి కొన్ని ఇంటరెస్టింగ్ ఫాక్ట్స్ : |
|
1.
|
స్టీవ్ జాబ్స్ ని తలుచుకోగానే మన కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యే రూపం తన signature uniform అయిన బ్లూ జీన్స్, బ్లాక్ turtleneck లో కదా ? ఆపిల్ లో తన మొదటి టర్మ్ అంతా ఖరీదైన సూట్లలో కనిపించిన స్టీవ్, 1997 లో తిరిగి ఆపిల్ కి వచ్చిన తరవాత ఈ డ్రెస్ కోడ్ లో స్థిరపడి పోయాడు. బోర్డు మీటింగ్స్ కి కూడా ఇదే డ్రెస్ లో అటెండ్ అయిన స్టీవ్ ఒకానొక ఇంటర్వ్యూ లో దీనికి కారణం గా చెప్పిన సమాధానం ప్రతి రోజు డ్రెస్ సెలెక్ట్ చేసుకునే అవసరం ఉండదు అని . నిజానికి దానికి వెనక ఉన్న సీక్రెట్ ఇది.
|
2.
|
స్టీవ్ జాబ్స్ వెజిటేరియన్ . నిజానికి మొదటిసారి pancreas ప్రాబ్లం తో బాధ పడుతున్నపుడు తన స్పెషల్ డైట్ ఆ సమస్య ని క్యూర్ చేస్తుందని నమ్మాడు.
|
3.
|
ఈమెయిలు communication,ఆన్లైన్ కాన్ఫరెన్స్ లవంటి వాటికన్నాముఖాముఖీ సమావేశాలు మంచి ఫలితాలు ఇస్తాయని హై ఎండ్ టెక్నాలజీ కంపెనీ కి CEO అయిన స్టీవ్ జాబ్స్ నమ్మకం.
|
17 comments :
Good 'job' :)
Excellent Series!!
చాలా బాగా ప్రజంట్ చేశారు శ్రావ్యగారు. ఎక్స్‌లెంట్ సీరీస్.
నైస్ సిరీస్ శ్రావ్యా! చాలా ఓపికగా, వివరంగా రాసారు. కంగ్రాట్స్! :)
Good job. Thank you.
వ్యాసాలన్నీ చాలా బాగున్నాయి శ్రావ్య. I appreciate your efforts. Congratulations.
Awesome series శ్రావ్యా. స్టీవ్ జాబ్స్ గురించి Apple గురించి చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాను. గుడ్ జాబ్. విజయవంతంగా పూర్తిచేసినందుకు అభినందనలు.
చాల బాగ వ్రాశారు
great series sravyaji.. hats off steves..
తెలియని చాలా విషయాలు తెలుసుకున్నాను. మీకు తెలిసిందే అయినా మళ్ళీ చెప్తున్నా.. నాకు ఆపిల్ మీద పెద్ద ఇంట్రస్ట్ లేదు. ఇష్టం లేదు. అలాంటిది నా చేత ఆపిల్ ప్రాడక్ట్స్ కొనిపించింది స్టీవ్స్ మీద మీకు ఉన్న అభిమానమే. ఇప్పుడు ఆ అభిమానమే అతని గురించి తెలుసుకోడానికీ, ఆపిల్ ప్రాడక్ట్స్ మీద గాలి మళ్ళడానికీ కారణం అయ్యింది. ;)
ధన్యవాదాలు ;)
@ఫోటాన్ వావ్ రాసావు గా కామెంట్ :-) మొత్తం సిరీస్ అంతా ఓపిక గా ఫాలో అయినందుకు చాలా చాలా థాంక్స్ హర్ష !
@శ్రీకాంత్ గారు చాల చాల థాంక్స్ సిరీస్ ఫాలో అయినందుకు :-) మీరనట్లు పిడిఎఫ్ మంచి ఆలోచన కానీ పదాలకి నేను లింకులు ఇస్తూ పోయానండి . అవి మరి పిడిఎఫ్ లో మిస్ అవుతాయి కదా . ఒక వేళ ఎవరికైనా అలా చదవటం వీలు గా ఉంటె తప్పక చేసి అప్లోడ్ చేస్తానండి !
@కిషోర్ వర్మ గారు మిమ్మల్ని నా బ్లాగ్ లో చూడటం ఆనందం గా ఉండండి. మీ పోత్సహకరమైన కామెంట్ కి చాలా చాలా థాంక్స్ !
@కొత్తావకాయ గారు మీ పోత్సహకర కామెంట్ ని చాలా థాంక్స్ అండి . మీరు ఈ సిరీస్ మెచ్చుకోవటం నాకు చాలా చాలా సంతోషం గా ఉంది :-)
@ Indian Minerva గారు చాలా చాలా థాంక్స్ అండి :-) మీరు స్టీవ్ బయోగ్రఫీ చదివారు కదా, ఇంకొంచెం పెద్ద కామెంట్ రాస్తారు అని ఊహించాను. చాలా చాల థాంక్స్ అండి !
@శైలజ గారు మీరు మెచ్చుకోవటం తో నాకు ఏనుగు ఎక్కినంత సంబరం అంటారు చూడండి , అలా ఉండండి . మొత్తం సిరీస్ ఫాలో అయినందుకు చాలా చాలా థాంక్స్ అండి !
@వేణు శ్రీకాంత్ గారు ముందు మీకు చాల చాల థాంక్స్ అండి . ఓపిక గా నా టైపో లు సరిద్దినందుకు . నేను ఈ సిరీస్ మొదలు పెట్టేటప్పుడు అనుకున్నాను, స్టీవ్ కి టైపో లంటే మహా మంట కదా కొంచెం జాగ్రత్త గా రాయాలి . మీ హెల్ప్ నిజం గా నా పనిని చాలా సులువు చేసింది . ఇక మీరు ఈ సిరీస్ నుంచి కొత్త విషయాలు తెలుసుకున్నా అనడం నాకు నిజం గా పెద్ద కాంప్లిమెంట్ :-)
@బంతి చాల చాల థాంక్స్ :-) చాల చాల డిమాండింగ్ బాస్ గురించి రాసినా ఈ సిరీస్ మీకు నచ్చడం నాకు చాలా సంతోషం గా ఉంది :-)
@రాజ్ హ హ :-) నిజానికి స్టీవ్ ఇండియన్ మార్కెట్ పైన దృష్టి పెట్టకపోవటం తో మన లో చాల మంది కి అంత గా ఇంట్రెస్ట్ లేదు . పైగా చాలా కంపెనీలు లాగా సాఫ్ట్వేర్ కాక హార్డువేర్ outsourcing అది చైనా నుంచి కావటం తో ఇండియన్ మార్కెట్ లో ఆపిల్ ప్రభావం తక్కువే . అదే కారణం అయ్యి ఉంటుంది మీకు పెద్ద గా ఇంట్రెస్ట్ కలగపోవటానికి. మొత్తం సిరీస్ చాలా క్షుణ్ణం చదివి నా తప్పులు కరెక్ట్ చేసినందుకు చాలా చాలా థాంక్స్ :-) మొత్తానికి iDevice వాడకం దారు అయినందుకు మరింత సంతోషం :-)
మీరు తిట్టరనే ధైర్యంతో చెప్తున్నా ..... స్టీవ్ జాబ్స్ పేరు వినడం తప్ప, ఆయన గురించి ఒక్క ముక్క కూడా తెలియదు నాకు. అలాగే, ఎప్పుడూ apple products ఏవీ వాడను కూడా లేదు. iPod లో Pod అంటే ఏమిటో చెప్పారు, మరి iPad లో Pad అంటే ఏమిటో మీరు చెప్పలేదో లేక నేను చూడలేదో, మరొకసారి చెప్పరూ!
ప్రతీ విషయాన్నీ మీరు వ్యక్త పరచిన తీరులో ఆయన మీద మీకున్న అభిమానం, దానికి తగ్గట్టుగా మీరు చేసిన కృషీ తెలుస్తున్నాయి! మీ ఈ సీరిస్ ద్వారా ఆయన గురించి తెలుసుకుంటూ, అభిమానించడం మొదలుపెట్టాను. ఆఖరి భాగం చదువుతుంటే మాత్రం కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఒక స్ఫూర్తిదాయక మయిన వ్యక్తండీ ఆయన. చాలా మంచి సీరిస్ ఇచ్చారు, ధన్యవాదాలు!
@ హ హ రసజ్ఞ తిట్టేస్తానా , భలే వారు :-)
iPad అంటే Internet Personal Access Device, కానీ ఈ పేరు తో తైవాన్ కంపెనీ తో dispute నడిచింది అందుకే ఈ పేరు ని confirm చేయలేదు.
Thanks a lot for dropping by to read and comment! I am so glad Rasajna :-)
I finally read through the entire series Sravya.
I really liked the way you presented. Apart from being a big fan of apple's products..I did not much about Steve jobs. Thanks for the informative post! Good Job!
జలతారు వెన్నెల గారు ఈ సిరీస్ మీకు నచ్చినందుకు చాలా సంతోషం గా ఉందండి :-)
Thank you very much !
చాలా వివరంగా చక్కగా రాశారు శ్రావ్య గారు.
జ్యోతిర్మయి గారు మీకు నచ్చినందుకు చాలా సంతోషం గా ఉందండి, చాలా Thanks :-)
Post a Comment