Subscribe:

Sunday, July 26, 2009

నాకు లక్కుందా?

ఈ పోస్టు నా లక్కు గురించండి ! ఈ వాక్యం వ్రాసా కాదా అని మనకేదో కేజిల కేజీల లక్కు ఉంది మీరు అనుకుంటే మీరు అసలే రేట్ పెరిగిందని జనాలు మొత్తుకుంటున్నారే ఆ కందిపప్పు ఉడకపెట్టిచేసే ముద్దపప్పు లో కాలు పేసినట్టే. నాకు లక్కు కు ఎంత దూరమంటే నాకు నేను లక్కుతో మనకు సంభంధం ఏమిటి తొక్కలో లక్కు చేతగాని వాళ్లకి కాని మనలాంటి experts కి అవసరం లేదు అని ఓదార్చుకొనే అంత :).
సరే అసలు విషయం వదిలి ఏదో చెబుతున్నా విషయం ఏమిటంటే ఒక రెండు నెలల క్రితం నా EZ link కార్డు (అంటే సింగపూర్ లో పబ్లిక్ transport కి వాడే prepaid టికెట్) , ఎక్సేంజ్ చేస్తుంటే ఒక లక్కీ కూపన్ ఇచ్చారు అది పూర్తి చేసి డ్రాప్ చేసాను. ఒక నెల తరవాత ఒక లెటర్ వచ్చింది మీ NRIC No డ్రా లో వచ్చింది ౩౦$ గిఫ్ట్ వోచరు గెలుచుకున్నారు అని. అడ్రస్ అనుమానం గా ఒకసారి చెక్ చెసుకున్నా నాదే. రెండు వారాలు గడిచాయి ఒక శనివారం ఏమి చేయాలా అని ఆలోచిస్తుంటే ఈ వోచరు సంగతి గుర్తు వచ్చింది.
సరే ఈ పని ఫినిష్ చేద్దామని బయల్దేరా తిన్న గా వెళ్లి వోచర్ తీసుకున్నా, ఇక ఆలాగే తిరిగి ఇంటికి వస్తే నేనేందుకవుతాను. మళ్లీ తిరిగి ట్రైన్ లో ఇంటికి వెళ్ళటానికి బోర్, సరే బస్సు స్టాప్ కి వెళ్లి నుంచుంటే 136 నెంబర్ బస్సు (తరవాత గుర్తుకు వచ్చిన విషయం రోజు నేను చూసేది 139 అని )కనపడింది ఇదేదో మన ఏరియా లో రోజు కనపడే నెంబర్ అనిపించి ఎక్కి కూర్చున్న, ఇక ఆ బస్సు లో కూర్చున్న 1 గంట తరవాత నాకర్దమైన విషయం నేను వెళ్ళవలసింది గ్రీన్ లైన్ బస్సు తిరిగేది రెడ్ లైన్ సరే నాకు నచ్చిన ఒక బస్సు స్టాప్ చూసుకొని దిగేసాను, బస్సు స్టాప్ వెనకాల ఒక షాపింగ్ మాల్ కనిపించిది సరే ఏమైనా తాగుదాం అని వెళ్లి ఒక వాటర్ బాటిల్ తీసుకొని, 20 $ పెట్టి ఒక టాప్ కొన్నా. తిరిగి బస్సు స్టాప్ కి వచ్చి బస్సు కోసం వెయిట్ చేయాలంటే బద్ధకం వేసి కాబ్ లో ఇంటికి వచ్చా 17 $ ఖతమ్. ౩౦ $ కోసం నేను ఖర్చుచేసింది 40 $. ఇంకొక కొసమెరుపు ఏమిటంటే ఆ టాప్ ట్రై చేసిన తరవాత నాకు తెలిసిన నిజం 20 $ బుట్ట దాఖలా అని :(
ఇప్పుడు నేనమనుకోవాలి నాకు లక్కు ఉందా లేదా ?

26 comments :

Bhãskar Rãmarãju said...

:):) హ్యాపెన్స్!! ఓ సినిమాలో శ్రీలక్ష్మి అనుకుంటా, గంటె ఉచితంగా ఇస్తున్నారని పట్టు చీరకొంటుంది. ఏమి సినిమా అబ్బా అది? గుర్తుకు రావట్లా.
ఐనంతమాత్రాన లక్కు లేదంటే ఎలా?
:)

Word verification తొలగించు...

Sravya V said...

భాస్కర్ గారు అంతే అంటారా :)

Sravya V said...

BTW word verification లేదు కాదా ?

జీడిపప్పు said...

lol that's funny!
నేను స్టూడెంట్ గా ఉన్నపుడు నా గంట జీతం $6. ఒకసారి కాలేజీ క్యాంపస్‌లో ఒక మూల ఏదో సేల్ లో గొడుగులు $3 కి అమ్ముతున్నారు (వాల్‌మార్ట్ లో $4 ఉండేది) అని తెలిసి మా బాసును అడిగి అర్థగంట శెలవు తీసుకొని వెళ్ళి కొనుక్కొచ్చి ఆనందంగా "ఇది మూడు డాలర్లే, ఒక డాలరు మిగిలింది" అన్నాను. బాసు ఒక చూపు చూసి "ఇందాక నీ జీతంలో $3 కట్ అయింది అని తెలుసా" అన్నపుడు నేను @$%^!*^&%
ఇప్పటికీ అర్థం కాదు అంత బుర్రతక్కువగా ఎందుకు చేసానో!!!

btw, wil your blog show up in Koodali?

జీడిపప్పు said...

Please remove word verification in Settings of the blog.

Sravya V said...

జీడిపప్పు గారు బాగుంది మీ experience.
I removed the word verification and I haven't added my blog to Koodali :) Thank you !

కాలనేమి said...
This comment has been removed by the author.
కాలనేమి said...

క్షమించాలి పై కామెంట్ ఈ పోస్ట్ కి కాదు.. ఇంకోదానికి

Sravya V said...

కాలనేమి గారు అనుకున్నాను :)

sivaprasad said...

super ga undi.......

Sravya V said...

@ శివ ప్రసాద్ గారు super ga undi....... >> పొస్టా? నా లక్కా?:)

విశ్వ ప్రేమికుడు said...

హ... హ... హా........... :)


అనుకున్నదొక్కటి....
అయినది ఒక్కటీ...

తరువాత పాట మీరే పాదుకోవాలి.... :)

విశ్వ ప్రేమికుడు said...

ఇంతకీ రవీయం అంటే ఏమిటబ్బా.... !?

ఈ రవి అనా...

అదెలా అంటారా....

సంస్కృత వార్తలు వినట్లేదేటి?

ఇయం వార్తాః స్రూయంతాం బలదేవానంద సాగరః...

గట్లనే గిది గూడా...

ఇయం అంటే.... ఈ
రవిః అంటే ... రవి అంతేనా...

ఏమోనండీ మేరే చెప్పాలి :)

Bhãskar Rãmarãju said...

యాండా!! మీకు లక్కు ఉందోలేదో తర్వాత, ఇంకో పోస్టేయండా!!

Sravya V said...

@ విశ్వ ప్రేమికుడు గారు సందర్భాని కి తగ్గట్టు భలే పాట గుర్తు చేసారండి :)
వామ్మో బ్లాగు కు పేరు పెట్టాలంటే ఇంత ఆలోచించలంటారా? దానికి అంత కత ఏమిలేదండి నాకు రవి పేరు ఇష్టం అందుకని అట్లా అంతే అంతే :)

భాస్కర్ గారు ఈ వారంతం మాకు పోడుగైన వారాంతం అన్నమాట మరి కామెంట్ పెట్టటానికి తయారు గా ఉండండి :)

కొత్త పాళీ said...

అయ్యో :(

Sravya V said...

కొత్తపాళీ గారు థాంక్స్ అండి ! మీరన్న నా బాధ గుర్తించారు:(

ప్రణీత స్వాతి said...

మొగుడు పెళ్ళాలు అనే సినిమా లో శ్రీలక్ష్మి లాగా చేసారన్నమాట..బాగుంది!!

Sravya V said...

ప్రణీత గారు అవునండి అలా అయిపోయింది :(

చైతన్య.ఎస్ said...

లక్కు లేదని భాద వలదు ...

అన్నట్టు మీ బ్లాగ్ కూడలి లో ఉందా..

ఇప్పుడే చుస్తున్నా మీ టపాలు :(

Sravya V said...

బాధ వలదంటారా ? సరే :(
లేదండి కూడలి లో లేదు .

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

ఏడోతరగతి సంగతి- నాకు సాయంత్రం ఇంటర్వెల్లో ఒక బ్రిల్‌పెన్ను (విలువ రూ.మూడూన్నర) దొరికింది. ఇంటికొచ్చి అమ్మోయ్ నాకోపెన్ను దొరికింది అన్నా. పిచ్చెదవా అన్నట్టు ఓచూపుచూసి వెళ్ళిపోయింది.
ఆవారంలో మూడురేనాల్డ్స్ పెన్నులు (విలువ రూ.ఐదు) పోగొట్టుకున్నా. అప్పుడర్థం అయ్యింది అమ్మభావం. మరినాలక్కో..

Sravya V said...

సుబ్రహ్మణ్య ఛైతన్య :)

పరుచూరి వంశీ కృష్ణ . said...

ayyo papam ....undandi meeku luck kanee jagrattaga upayoginchukovalsindemo .. ""BETTER""LUCK NEXT TIME SRAVYA GARU

Sravya V said...

Thanks Vamsi !

సంతు (santu) said...

మీకు లక్ ఉందండి,
నిరూపించామంటారా... :o, ఒకవేళ మీకు ఆ వోచేర్ రాకుండా ఉండి ఉంటె
ఏదో ఒక దుర్దినాన మీరు ఆ షాపింగ్ మాల్ కి వెళ్లి అదే డ్రెస్ తీసుకొని ఉంటె మీకు $20 loss ఎహ్ కద...
చూసారా మీకు అనుబవం తో పటు డబ్బులు మిగిలిపోఇనవి.....
ఏదో నా ఈ చిరు సలహాని... చిరునవ్వుతో స్వీకరించగలరు...

Post a Comment