Monday, December 14, 2009
జై సమైక్యాంధ్ర !
Saturday, November 28, 2009
గుర్తుందా మీకు ఒక సంవత్సరం క్రితం (26th Nov.2008) మతమౌడ్యంతో ఒళ్ళు తెలియని ముష్కరమూక సృష్టించిన విధ్యంసం! ఈ ఘటన తరవాత మనం నేరుచుకున్న పాఠాలు?సమాధానం శూన్యం. అఫ్జల్ గురు ను విడుదల చేయకపోతే, కాశ్మీరులో హింసాకాండ చెలరేగుతుందని భయపెట్టే గులాంనబీ అజాద్ లాంటి ముఖ్యమంత్రులు, రిపబ్లిక్ డే వేడుకలను బహిష్కరించమనే షాబుద్దీన్ లు, వందేమాతరాన్ని పాడము అని తేల్చి చెప్పే ఉలేమాలు ఉన్న ఈ దేశం లో ఇంత ఇంత కన్నా ఆశించటం దురాశే .మనది మేధావుల దేశం కదా అందుకని కసబ్ ని యాక్షన్ లో పట్టుకున్నా లా ప్రకారం విచారిస్తారు ఇది ప్రపంచదేశాలలో మన పరువు ప్రతిష్టలను పెంచుతుంది దీనికి మనం చేసే ఖర్చు రోజుకి సగటున 8.75 లక్షలట, ఇది వింటే నాకైతే ఈ కసబ్ గాడు ఎందుకు ప్రాణాలతో దొరికాడురా బాబు అనిపిస్తుంది. అసలు ఇంత దారుణానికి ఒడిగట్టిన ఇతడిని మనం మనిషి గా ట్రీట్ చేయాలా అనేది నాకు సమాధానం దొరకని ప్రశ్న.
దేశరక్షణ కన్నా ఓటు బ్యాంకు రాజకీయాలకు విలువ నిచ్చే రాజకీయనాయకులు , తన మాతృదేశం కన్నా మతానికి విలువనిచ్చే మతమౌడ్యులు, మైనారిటీల హక్కులు కాపాడటమే దేయ్యం గా పనిచేసే కుహనా మానవతావాదులు ఉన్నంత కాలం ఈ తరహా దాడులు మనం ఎదుర్కొనక తప్పదు.
And lastly, my heartfelt condolences to all those who may have lost a loved one in these attacks.
Encounter Specialist Vijay Salaskar and ATS Chief Hemant Karkare, ACP Ashok Kamate, Additional Commissioner Ashok , Major Sandeep Unni Kirshnan and other officers who lost their lives – We salute you to have given a brave service to the country.
Sunday, October 18, 2009
నేను, నా మల్టీ టాస్కింగ్
If you want to get more done, be mindful.If you want to have more time, be mindful.
Wednesday, August 12, 2009
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
ఎందరో మహానుభావుల కలల పంట, మరెందరో అమరవీరుల త్యాగఫలం ఈనాడు మనం అనుభవిస్తున్న ఈ స్వతంత్ర ఫలం. ఆ వీరుల త్యాగఫలం వృధా కాకుండా మన జాతి గౌరవాన్ని కాపాడటం మనందరి బాధ్యత. ఈ సందర్భంగా ఆనాటి నుండి ఈనాటి వరకు మన దేశరక్షణ కు, అబివృద్ది కి పాటుపడిన మహానీయులందరికి నా నమస్కారాలు.
జై హింద్ !
Sunday, July 26, 2009
నాకు లక్కుందా?
Friday, July 24, 2009
స్నేహమంటే ....
Saturday, July 11, 2009
My First Post
నేను ఈ బ్లాగు క్రియెట్ చేసి 6 నెలలు అయినా ఇంత వరకు ఒక్క టపా కూడ వ్రాయలేదంటే నా బద్దకం గురించి మళ్ళీ చెప్పాల్సిన పని లేదు కదా?(ఈ టపా కి సంబంధం లేకుండా ఒక చిత్రం పెట్టటానికి కూడ అదే కారణం అని తెలిసి పోయిందా కొంపతీసి :()
సరే ఎదో గుగూల్ పుణ్యమా అని నేను ఒక బ్ల్గాగు మెదలు పెట్టా కాని వ్రాయాలంటే బుర్రలో గుజ్జుండాలి కదా అది మనకు నిల్. ఇంత వరకు చేతికి దొరికిన కాగితం వదలకుండా చదివి అది బాగలేదు ఇది బాగలేదు అని వంక పెట్టే నాకు ఇప్పుడు అర్థం అవుతుంది వ్రాయటం ఎంత కష్టమో ! సరే నా కష్టం గురించి సోది మీకెందులేండి గాని మరీ చదువరి, తెలుగోడు, జీడిపప్పు గారి అంత స్థాయి లో కాకపోయిన కొంచం నా వ్రాత కళానైపుణ్యం పెంపొందించుకొందామని ఈ నా ప్రయత్నం.