Subscribe:

Wednesday, December 28, 2011

బెర్రీలమ్మ బెర్రీలు రక రకాల బెర్రీలు !

మొన్నొక రోజు తృష్ణ గారి plus లో ఒక రకం పండ్లు (fruits ) ఫోటో పెట్టి ఇవేంటో  చెప్పుకోండి అన్నారు . అంతే ఇక ఒకరి తో ఒకరం సంభంధం లేకుండా మాకు దొరికిన లింకుల తో సహా రక రకాల పేర్లు చెప్పేసాం . అంటె అదుగో ఆ పల్నాడు వీర బ్రదర్స్ ఇద్దరూ ఒకే పేరు చెప్పారు లెండి వాళ్ళిద్దరూ కాకుండా మిగిలిన వాళ్ళం అన్న మాట .
ఇక ఆ పోస్టు చూసిన దగ్గర నుంచి ఏదో ఒక రకం గా క్లాస్ తీసుకోవాలి అన్న దురద విపరీతం గా పెరిగిపోయి ఇదుగో ఈ రూపం లో మీ ప్రాణాలు తీసుకోబోతుందన్న మాట :)
సరే ఇక పిట్ట కథలు ఆపేసి అసలు కథ లోకి వద్దాం నేను నేను బెర్రీ పళ్ళ గురించి ఈ పోస్టు రాస్తునన్నమాట . అసలు   బెర్రీ అంతె ఎంతంతే అది ఒకటి లేదా బోలెడు గింజలు కలిగిన గుజ్జు ఫలం అన్నమాట . (ఈ వాక్యం లో నేను రాసిన పదాలు నా శతకోటి టైపోలలో ఇవి కూడా కొన్ని అని ఫిక్స్ అయిన వారు ఇక్కడ చూడ ప్రార్ధన ) .చా మరీ ఎక్కువ కామెడీ చేస్తే అది కాస్త వికటించి అసలకే మోసం వచ్చే ప్రమాదం ఉంది అందుకే కాసేపు మనందరం సీరియస్ నెస్ పాటిద్దాం .
పైన చెప్పినట్లు బెర్రీ అనేది పండ్ల లో ఒక రకం . ఈ పండ్ల సాధారణ లక్షణం జ్యుసీ గా ఉండటం , తినలేనటువంటి గింజలు లేకపోవటం . ఇప్పుడు మనం అన్నీ కాకపోయినా, కొన్ని రకాల బెర్రీ పండ్ల గురించి తెలుసుకుందాం .


Blackberries

బ్లాక్ బెర్రీస్ (Blackberries)

: (ఏయ్ ఎవరిది ఇది ఫోన్ అనే వాళ్ళు :P)   ఇవి పచ్చి గా ఉన్నప్పుడు రెడ్ ఒక రకమైన రెడ్ కలర్ ఉండి, పండి తినటానికి రెడీ అయినాయి మనకి అని చెప్పటానికి బ్లాక్ కలర్ (చిక్కని పర్పుల్ ) కలర్ లో మారి జ్యుసీ గా మెరుస్తుంటాయి .

Raspberries

రాస్బెర్రీస్(Raspberries) : రాస్బెర్రి , బ్లాక్ బెర్రీ చూడటానికి ఒకే రకం గా ఉన్నా రాస్బెర్రీ పండు మధ్య లో ఖాళీ గా ఉంటుంది . అలాగే మామూలు గా బెర్రీ లలో ఉండే విటమిన్ సి తో పాటు వీటిలో మెగ్నీషియం అధికం గా ఉంటుంది . వీటి ని భారీ ఎత్తు న సాగుచేయాలి అన్న ప్రయత్నాలు ఫలించకపోవటం తో మిగిలిన బెర్రీ లతో పోల్చితే మార్కెట్ లో తక్కువ గా దొరుకుతాయి అందుకే రేటు కూడా అధికం .

Boysenberry



బోయ్సేన్బెర్రి (Boysenberry) : ఇవి బాగా చిక్కని మెరూన్ కలర్ లో ఉంటాయి . ఈ బెర్రీ రాస్బెర్రెస్ , బ్లాక్ బెర్రీస్ , లంగాన్ బెర్రీస్ ల క్రాస్ సెక్షన్ తో ఏర్పడిన హైబ్రిడ్. మిగిలిన వాటితో పోల్చితే ఒక ప్రత్యేకమైన ఫ్లేవర్ తో ఉంటాయి .

Cloudberries








క్లౌడ్బెర్రీస్(Cloudberries) : ఇవి బ్రౌన్ కలర్ లో ఉండే బుల్లి బుల్లి బెర్రీలన్న మాట . వీటిలో విటమిన్ సి తో పాటు గా benzoic acids ఉండటం తో నాచురం preservative గా ఉపయోగపడతాయి .




Mulberries
మల్బెర్రీస్ (Mulberries) : ఇవి మనకు బాగా తెలుసు కదా , ఈ చెట్టు ఆకులు పట్టు పురుగుల కోసం అయితే పళ్ళు మాత్రం మన పొట్ట కోసం అన్న మాట .








స్ట్రాబెర్రీస్(Strawberries ) : ఇవి జగమెరిన బెర్రీలన్న మాట , అంటే తెగ ఫేమస్ . మంచి రుచి తో ప్రపంచమంతా దొరికే ఈ బెర్రీ లలో విటమిన్ సి తో పాటు మాంగనీస్ , ఫోలిక్ యాసిడ్ అధికం గా ఉంటాయి .

Strawberries

 
పైన చూసిన కొన్ని aggregate ( in which one flower contains several ovaries ), multiple (fruits that are formed from a cluster of flowers) బెర్రీ లతో పాటు Tayberries, Logan berreis బొమ్మల్లో చూడండి .

Loganberries
   
Tayberries

ఇప్పుడు కొన్ని సింపుల్(A fruit that develops from a single ovary in a single flower) బెర్రీలు ఎలా ఉంటాయో చూద్దాం .


 
Blue Berry

బ్లూ బెర్రీస్ (Blueberries) : బ్లూ బెర్రీస్ లో flavonoid antioxidants ఎక్కువ గా ఉండటం వల్ల ఆరోగ్యానికి మంచిది అని చెప్తారు . అందులో ఎంత నిజం ఉందొ మన డాక్టరు బ్లాగర్లు కౌటిల్య గారు లేదా శైలజ గారు గాని confirm చేస్తారేమో చూద్దాం .

Gooseberries




Gooseberries: ఈ పేరు వినగానే మన ఉసిరి కాయ అని confuse   అవుతాం కాని Gooseberries,  Indian Gooseberries  వేరు వేరు అన్న మాట .








Blackcurrant




Blackcurrant & Red Currants :  బ్లూ బెర్రీస్ లాగా ఇవి బాగా ఫేమస్ బెర్రీలు అన్న మాట , వీటిలో విటమిన్ సి తో పాటు  high levels of potassium, phosphorous, iron and Vitamin B5 ఉంటాయి .

Redcurrant







Cranberries




Cranberries: ఇవి బుల్లి బుల్లి ఎర్ర గా ఉండే బెర్రీలన్న మాట . పచ్చి గా ఉన్నపుడు తెల్ల గా ఉంటాయి , పండినా ఎర్ర గా అవుతాయి . వీటిని మామూలు గా తినలేము కాని కాన్బెర్రే రైస్ , లేదా మన రోటి పచ్చడి లాగానో   , లేదా జ్యూస్ గానో  ఐతే బాగా లాగించోచ్చు .
.





ఇప్పుడ మనందరికీ బాగా తెలిసిన రెండు రకాల బెర్రీలు వీటి పేర్లు నేను చెప్పా , మీరే చెప్పేయాలి





ఇవండీ నాకు తెలిసిన కొన్ని బెర్రీలు . విటమిన్ సి , ఇంకా antioxidant లు ఎక్కువ గా ఉన్న ఈ బెర్రీ పళ్ళని తిని ఆనందించండి . అలాగే మీకేమన్నా doubts ఉంటె మన మొక్కల డాక్టరు మధుర , మామూలు డాకర్లు శైలజ గారు , కౌటిల్య గార్ల ని సంప్రదించండి .
ఏదో అమెరికా లో , యూరోప్ లలో ఉన్న వాళ్ళు అంత స్టైల్ గా మనం  "We are going for summer berrying"
అని చెప్పలేకపోయినా మార్కెట్ కెళ్ళి కొనుక్కొని సంతోష పడొచ్చు ఏమంటారు , మరి ఇంకెందుకు ఆలస్యం కానివ్వండి :)








Thursday, November 3, 2011

రండి రండి దయచేయండి ......!

నమస్కారాలు నమస్కారాలు  అందరూ బాగున్నారా ?  ఈరోజు  బృహుత్తరమైన ప్రణాళిక తో మీ ముందుకు  వచ్చా !  అదేంటంటే  అదేంటంటే .....

హూ  ! అర్ధం అయ్యింది , "సోది  ఆపి పని చూడు"  అనే  మీ వ్యంగపు చూపుల  అర్ధం ?  మరీ తెలుగు బ్లాగర్లు  అదీ నా బ్లాగు కూడా  చదువుతున్న మీకు ఇంత ఓపిక కూడా లేకపోతే  మహా కష్టం సుమండీ .  వస్తున్నా  విషయానికి  ఇప్పుడు మిమ్మలిని  కొన్ని ప్రశ్నలు   అడుగుతా మీరు చెప్పేయాలి అంతే !
  1.  "నవ్వడం ఒక భోగం,నవ్వించడం ఒక యోగం.నవ్వకపోడం ఒక రోగం "  అన్నది  ఎవరు ? 
  2.  "పడమటి సంధ్యారాగం ,  శ్రీవారికి ప్రేమలేఖ ,  మల్లెపందరి ,  అహ నా పెళ్ళంట ,   వివాహ         భోజనంబు ,  చంటబ్బాయి ,  రెండు రెళ్ళు ఆరు "   ఈ పేర్లన్నీ  చదువుతుంటే  మీకు కామన్ గా        గుర్తొస్తున్న   వ్యక్తి ఎవరు ?
  3. సుత్తివేలు , సుత్తి వీరభద్రరావు , బ్రహ్మానందం , శ్రీలక్ష్మి  వీళ్ళని మనకు దగ్గర గా పరిచయం    చేసిన   వ్యక్తి  ఎవరు ?
నాకు  తెలుసు  మీరు  మహా షార్ప్  కదా బేసిక్ గా  అందుకే ఈజీ పట్టేశారు  ఆన్సర్  :))   యెస్   మీరు అనుకున్నట్లు నేను మాట్లాడుతుంది   హాస్య బ్రహ్మ గా  పేరు  పొందిన   జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి గురించే . ఇప్పుడు అర్జెంటు గా ఎందుకు అంటే ?   జంధ్యాల  గారి  గురించి  మనకు తెలియని విషయాలు  తెలుసుకోవటానికి అలాగే మనకు తెలిసింది  పంచుకోవటానికి  , మన తెలుగు బ్లాగరు  మిత్రులు  కొంతమంది  కలిసి  ఒక చిన్న ప్రయత్నం మొదలు పెట్టారు . అదే  జంధ్యావందనం అనే  ఈ సైటు .  మీకు తీరిక ఉన్నప్పుడు  ఒకసారి  వారి ప్రయత్నాన్ని  అభినందిస్తారు  అని నా ఈ చిరు పరిచయం .

అలాగే నా బ్లాగులో  కుడి వైపున ఒక బాడ్జీ  కనపడుతుంది  చూడండి "జంధ్యావందనం " అని అలాంటివి మీరు కూడా వీలయితే  మీ బ్లాగులో పెడితే  మీకు చదివే వారందరూ అక్కడ కూడా ఒక చూపు చూడటానికి వీలు గా ఉంటుంది :)   మీ అభినందనలు ఆ సైట్ లో కామెంట్ గా రాయమని మనవి . 
ఈ సైటు  గురించి  ముందే తెలిసిన మిత్రులు   మీకు తెలిసిన విషయం మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటే  తప్పేమీ  లేదు దీని గురించి   జంధ్యాల మార్కు  తిట్ల వర్షం నా మీద కురిపించ వద్దని మనవి .

Monday, August 8, 2011

సింగపుర - II

మొదటి భాగం చదివారా?   లేకపోతే ఒకసారి ఇక్కడ చూసి వచ్చేయండి . 

ఇప్పుడు అర్ధం అయ్యింది కదా మీకు ఇప్పుడు నేను  నాకు  తెలిసిన  సింగపూర్  ప్రజల  రోజు వారి  జీవితం  గురించి సుత్తి వేయదల్చుకున్నాను అని  ,  అయ్యో భయపడకండి  మనం తెలుగు బ్లాగర్లం  గుండె దిటవు   చేసుకొని  మన సాటి  బ్లాగర్ రాసింది మనం కాకపొతే ఎవరు చదువుతారు అని ఫిక్స్ అయ్యిపొండి ఈసారి కి :) 
సరే ఇప్పుడు ఎక్కడ నుంచి మొదలెడదాం .......... మనిషన్న వాడికి రోటీ , కపడా , మకాన్ అవసరం అన్న మాట ప్రతి భాష లోను , ప్రతి కవి చెబుతున్నాడు కదా అక్కడ నుంచి మొదలెడదాం .


ఆహారం : సింగపూర్ భిన్న సంసృతుల సమ్మేళనం , అలాగే  ఎక్కువ ట్రాన్సిట్ visit  కి అవకాశం ఉండే ఓడరేవు , విమానాశ్రయం ఉండటం , పైగా టూరిజం కి ఎక్కువ ప్రాధాన్యత ఉన్న దేశం కావటం తో అందుబాటు  ధరలలో   రకరకాల  ఆహార పదార్ధాలు ఇక్కడ  దొరుకుతాయి (కొన్ని చోట్ల 24 గంటలు ) . సాంప్రదాయ  భారత ,  చైనా , మలయ్ , మయన్మార్ ఆహరం లభించే ఫుడ్ కోర్ట్స్ , ఖరీదైనా రెస్తారెంట్లే కాకుండా వెస్ట్రన్ ఫుడ్ లభించే దరిదాపు అన్ని ఫుడ్ చైన్స్ ఇక్కడ ఉంటాయి .చాల మంది సింగపూరియన్స్ కి వంట గది ఒక అలంకారం  మాత్రమే .   ఎక్కడ చూసినా ఉండే ఫుడ్ కోర్ట్స్,  పైగా ధరలు కూడా అందుబాటు లో ఉండటం తో  ఎక్కువ మంది ఈ ఫుడ్ కోర్ట్స్  పైనే ఆధారపడతారు .   చైనీస్ కి  చాలా త్వర గా   రాత్రి భోజనం ముగించే అలవాటు , అలాగే ఇక్కడ ఉండే ఎక్కువ  పని గంటలు  కూడా ఈ అలవాటుకి ఒక కారణమేమో అని నా  అభిప్రాయం . సాధరణం గా  మొదటి తరం  ఇండియన్స్ లేదా  మాత్రం  ఈ గ్రూప్ లోకి రారు :)  వ్యవసాయం అనేది లేని దేశం అవటం తో   ప్రతి దీ వేరే దేశం నుంచి  దిగుమతి  చేసుకోవటం తో   నానా రకాల కూరగాయలు , పండ్లు ఇక్కడ దొరుకుతాయి . ఇక్కడ జనాభా కి సరిపడా మంచి నీటి వసతి లేకపోవటం తో నీరు కూడా మలేషియా నుంచి   దిగుమతి  చేసుకుంటారు.  ఈ నీటి సమస్య ని ఎదుర్కోవటానికి , recycling ద్వారా నీటి ని  శుభ్రపరిచి వాడటానికి  ప్రయతిస్తున్నారు ,  దీన్నే  ఇక్కడా న్యూ వాటర్ అంటారు . 
ఇక్కడ steamboat అనే చైనీసు సంప్రదాయ వంటకం ఇక్కడ బాగా ఫేమస్ , చైనీస్ న్యూ ఇయర్ రెండు రోజుల్లో ఒక రోజు ఫ్యామిలీ మొత్తం వెళ్లి ఇది తినడటం అనేది వీళ్ళ అలవాటు. దీని గురించి తెలుసుకోవాలి అంటే ఇక్కడ చూడండి .

నివాసం :85  %  ప్రజలు Multi Storied HDB ( Housing and Development Board ) flats ల లో నివసిస్తూ ఉంటారు .    ప్రతి HDB బ్లాకు కి ఒక మల్టీ storied పార్కింగ్ ఏరియా ఉంటుంది . ఇలాంటి కొన్ని బ్లాకులని కలిపి హౌసింగ్ estates  అంటారు . ఈ HDB లని సింగపూర్ గవర్నమెంట్ డెవలప్ చేసి race  ratios , సిటిజెన్ షిప్  ఆధారం గా allot చేసుంది .     వీటిని కొనుగోలు చేయటాని CPF  నుంచి  loans  provide  చేస్తారు . కొన్ని  అపార్ట్మెంట్ బ్లాక్ లకి కలిపి ఒక గార్డెన్ , exercise equipment maintain  చేస్తుంటారు . ఇవి కాక ప్రైవేటు  కాండోస్ ఉంటాయి , వీటిని ఎవరైనా కొనుగోలు చేయొచ్చు . వీటి ఖరీదు ఎక్కువ గా ఉంటుంది .ఇక్కడ డెంగూ భయం వలన ఇళ్ళలో ఇండోర్ మొక్కల పెంపకం  పైన నిషేధం ఉంది , తరచూ గా HDB లని inspect చేస్తుంటారు , ఇండోర్ మొక్కలు లేదా , నెలలు నిలువ ఉంచిన బకెట్స్ లాంటివి, లేదా శుభ్రత సరిగా లేకపోయినా ఫైన్ విధిస్తుంటారు . అలాగే రెంటల్ వ్యయం చాల ఎక్కువ కాబట్టి సాధారణం గా షేరింగ్ accommodation  prefer   చేస్తారు, అంటే రెండు ఫామిలీస్ కలిసి ఒక ఇంటిని అద్దెకి తీసుకోవటం , లేదా  ఒక రూమ్ ని వంటిరి గా ఉండేవారికి అద్దె కి ఇవ్వటం వంటివి ఎక్కువ గా కనపడుతుంటాయి .
ఇక ఇన్ని తెలుసుకున్న తరవాత మనిషి చివరి  గమ్యం గురించి కూడా తెలుసుకోవాలి కదా :) అంటే  అదేనండి చనిపోయిన ఏమి చేస్తారు అని .  చిన్న  దేశం  పైగా స్థలం ఎక్కువ గా లేకపోవటంతో ఇక్కడ సమాధులు వంటి కట్టడం నిషేధం.  చనిపోయిన తరవాత  ఆ కార్యక్రమాలని నిర్వహించటానికి సాధారణం గా Funeral Directors అని వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు  అలాగే అస్తికల్ని భద్రపరచటానికి ఇక్కడ కొలంబేరియం అనే ఏర్పాటు ఉంటుంది .  ప్రభుత్వ నిర్వహణ లో ఉండే మూడు కొలంబేరియం లు సింగపూరియన్ ప్రజల కోసం   మాత్రమే ,   PRs లేదా మిగిన వాళ్ళు ఈ ఏర్పాటు కోసం ప్రైవేటు కొలంబేరియం లను వాడాల్సి ఉంటుంది . సింగపూరు లో మొదటి లక్సరీ కొలంబేరియం లో యూషున్ అనే ప్రాతం లో ఉంది . దీని గురించి వివరాలు  తెలుస్కోవాలంటే ఇక్కడ  చూడండి . భయపడనక్కర లేదండి , డబ్బుంటే చని పోయినాకా కూడా ఎంత రిచ్ గా ఉండొచ్చో చూడండి .

సరే ఇక సింగపూర్ గురించి వివరాలు ఇక్కడి తో ఆపి ప్రేక్షకుల   కోరిక మేరకు  పర్యాటక విశేషాలు కొన్ని తెలుసుకుందాం :

సింగపూర్ visiting వీసా దొరకటం చాలా సులువు , సాధారణం  గా నెల రోజులకి ఈ వీసా ని ఇస్తారు .  అలాగే ఉండటానికి మన  budget మేరకు అకామిడేషన్ దొరుకుతుంది .

చూడాల్సిన కొన్ని ప్రదేశాలు :

Singapore airport   
ఈ క్రింది లింక్ బ్లాగర్ హరేకృష్ణ గారి కోసం ప్రత్యేకం :)


 సింగపూరియన్స్ కి షాపింగ్ అంటే మహా పిచ్చి , Shop till you Drop, అనేది ఇక్కడ జనాలు పాటించే సూత్రం , కాలరీ లు కరగటానికి కూడా షాపింగ్ ఒక మార్గం అని నమ్ముతారు .సింగపూర్ కి "shopping paradise " అని పెద్ద పేరు , పెద్ద పెద్ద malls మీ పర్సు బరువు తగ్గించుకోవటానికి చక్కగా ఆహ్వానం పలుకుతాయి . మీరు తప్పకుండా కనీసం విండో షాపింగ్ అన్న చేయాల్సిన షాపింగ్ మాల్స్ ఇవి Vivo cityion , Great World City.

అలాగే మీరు గుర్తు పెట్టుకోవాల్సిన రెండు అంశాలు
సింగపూర్ లో చూయింగ్ గం తినడటం నేరం , అలాగే తీసుకు రావటం కూడా.
మీరు  గాని పొగరాయుళ్ళు ఐతే మీరు బారీ మొత్తం లో సిగిరెట్లు కనక తెస్తుంటే వాటికి డ్యూటీ కట్టవలసి వస్తుంది ఒక వేళ పర్సనల్ వాడుకకోసం ఐతే వాటిని ఐర్పొర్ట్ లో రెడ్ line లో declare చేయాల్సి ఉంటుంది .
ఈ రెండు ముక్కలు మన బంతి గారికి కోసం ఇస్పెషల్ :) సింగపూర్ అంటేనే ఇన్ఫర్మేషన్ సిటీ పేరు కాబట్టి మీరు సింగపూర్ గురించి ఈ ఇన్ఫర్మేషన్ అయినా నిమషాల్లో తెలుస్కోవచ్చు (బస్సు రాకపోకల తో సహా ) ఇది IT తో నే సాధ్యం . ఇక IT employee భవిష్యత్తు అమెరికా తుమ్మితే ఇండియా కి జలుబు చేస్తుంది , కాని సింగపూర్ కి ఏకంగా టైఫాయిడ్ వస్తుంది అదీ విషయం .
ఇందండి సింగపూర్ గురించి నేను మీకు చెప్పదలుచుకున్న సోది , ఇక ఇక్కడితో దీనికి fullstop పెట్టేస్తున్నా మీరు ఊపిరి పీల్చుకోవచ్చు , అలాగే "Majulah Singapura"   అని ఒకసారి చెప్పి విండో క్లోజ్ చేసి రెస్ట్ తీసుకోండి :)



సింగపూర్ ని ఫోటోలలో చూడాలి అనుకుంటే గతం లో నేను తీసినవి కొన్ని ఇక్కడ చూడొచ్చు !



Singapore

Saturday, July 30, 2011

సింగపుర - 1

 రండి రండి మీరందరూ సోషల్ స్టడీస్ పాఠాలు చదివి చాలారోజులు అయిపొయింది కదూ ? 9th ఆగష్టు సింగపూర్ నేషనల్ డే అంటే సింగపూర్ పుట్టినరోజు !అందుకే ఈ వారం అంతా, నేను మీ అందరితో సింగపూరు చరిత్ర చదివించాలి అని కంకణం కట్టుకున్నా . ఇక మీకు  తప్పదు.:-).
 ఏదో పైపైన రెండు లైన్లు చదివి విండో క్లోజ్ చేయటమో , ఒక కామెంట్ పెట్టటమో కాదు , చదివి exam రాయాలి మీరందరూ .  ఏంటి బహుమతా ? .....ఉన్నాయండి,    ఫస్ట్ , సెకండ్ , థర్డ్ ప్రైజెస్ , ఆకర్షణీయమైన ఆ గిఫ్ట్లు మొత్తం పోస్టు చదివితే తెలుస్తాయి , కానీయండి మరి !

 మనం వెస్ట్రన్ స్టైల్ లో పిలుస్తున్న సింగపూర్ అసలు పేరు సింగపుర .   ఈ పేరు  రెండు మలయ్ (మూలం సంస్కృతం) పదాలైన సింగ (సింహము) మరియు పుర (పురము) అనే రెండు పదాల కలయిక వలన వచ్చింది. చారిత్రక ఆధారాల  ప్రకారము, పధ్నాలుగువ శతాబ్దపు సుమత్ర ద్వీప యువరాజు "సంగ్ నిల ఉతమ"  ఈ ద్వీపాన్ని సందర్శించినప్పుడు సింహము తల లాగా  ఉన్న ఒక వింత జంతువు కనిపించినందుకు ఆ పేరు పెట్టాడట(ఇప్పుడు లేవులేండి మీరు అర్జెంట్ గా వెతకటం మొదలుపెట్టి కష్టపడొద్దు ) .



భౌగోళిక లక్షణాలు : 
దక్షిణ ఆసియా లో (మలేషియా , ఇండోనేషియా దేశాల మధ్య)   ప్రధానద్వీపంతో చేరి 63 ద్వీపాలతో కూడిన అతి చిన్న దేశము సింగపూర్.  సింగపూర్ మొత్తం విస్తీర్ణం  704 చదరపు కిలోమీటర్లు , అయితే ప్రభుత్వం చేపట్టిన అనేక భూమి విస్తీర్ణ కార్యక్రమాల కారణంగా క్రమేణా పెరుగుతూ వస్తుంది . ఈ విస్తీరణ చిన్న చిన్న దిబ్బలా ఉన్న దీవులని , కొండ ప్రాంతాలని నివాసయోగ్యం గా మార్చటం ద్వారా జరుగుతుంది . ఇండోనేషియా పక్కనే ఉన్నప్పటికీ , ఆ దేశం లో ఉన్న ఫాల్ట్ లైన్ కి కొన్ని వందల కిలోమీటర్ల దూరం లో ఉండటం వల్ల seismic activity వల్ల పెద్ద ప్రమాదం లేదని అంచనాలు , అలాగే సముద్రం పక్కనే ఉన్నప్పటికీ "సమత్రా లాండ్ మాస్" వల్ల 2004 లో వచ్చిన అతి పెద్ద సునామీ నుండి సురక్షితం గా బయటపడింది .
వాతావరణం :
భూమధ్య రేఖకి 100 మైళ్ళ కన్నా తక్కవ దూరం లోనే ఉండటం వల్ల , ఇక్కడ రాత్రి , పగలు కాలాలు సమానం గా ఉంటాయి . అలాగే సంవత్సరం అంతా ఒకే రకమైన వాతావరణ పరిస్టితులు ఉంటాయి . ఈ సమయమలో నైనా వర్షం కురవోచ్చు . గాలిలో తేమ శాతం అధికం గా ఉంటుంది (సరాసరిన 90 % శాతం ).
ఆర్దిక అంశాలు :
 ప్రపంచ దేశాలలో ఆర్ధికంగా 13వ స్థానంలో స్థానం సంపాదించింది . అంతర్జాతీయ వ్యాపార రంగంలోనాలుగు ఆసియా టైగర్స్  గా వర్ణించబడే దేశాలలో సింగపూరు ఒకటి (మిగిలినవి వరసగా హాంగ్‌కాంగ్, కొరియా ఇంకా  తైవాన్). ఇంకా  విదేశీమారక వ్యాపారరంగంలో పేరుపొందిన  వ్యాపార అంతర్జాతీయ కేంద్రాలైన  లండన్, న్యూయార్క్ ,  టోక్యో  ల సరసన చేరింది.

ఎంట్రీపోర్ట్(tax free)వ్యాపార విధానాల వలన  ఆర్ధికరంగాన్ని చక్కదిద్దుకున్న దేశాలలో సింగపూరు ఒకటి.  సింగపూరు  ఆదాయంలో 26 శాతం రాబడి పరిశ్రమల  (ఎలక్ట్రానిక్స్, రిఫైనరీ, రసాయనాలు, మెకానికల్ ఇంజనీరింగ్ ,బయో మెడికల్ సైన్స్ ) ద్వారా వస్తుంది . .. సింగపూరు రేవు అత్యంత చురుకైన రేవుగా అంతర్జాతీయ గుర్తింపు పొందింది . అత్యంత వ్యాపారానుకూల దేశంగా కూడా సింగపూరు కు అంతర్జాతీయ గుర్తింపు ఉంది .
సంస్కృతి :
సింగపూరులో పూర్వీకులైన మలాయ్ ప్రజలు,మూడవ తరానికి చేరుకున్న చైనీయులు, విదేశీవాసులైన ఇండియనులు, అరేబియనులు, యూరేషియనులు నివసిస్తున్న కారణంగా మిశ్రమ సంప్రదాయాలు కలిగి ఉంది. కులాంతర, మతాంతర వివాహాలు ఇక్కడ సహజం.  వివిధ మతాల ఆలయాలు ఇక్కడి  మిశ్రమ మత సంప్రదాయానికి ప్రతీకలు.
సంప్రదాయ నిర్మాణాలతో నిండి ఉండే చైనా టౌన్ ,లిటిల్ ఇండియా ప్రదేశాలు సింగపూరు విభిన్న సాంప్రదాయాలకు గుర్తులు . ఇవి ఈస్టిండియా కంపెనీ కాలంలో ఇక్కడ పనులు చేయడానికి దేశాంతరాలనుండి వచ్చి స్థిరపడిన పౌరుల నివాసాలు. చైనీయులు, ఇండియనులు ఇక్కడ నివాసముంటారు. చర్చులు, హిందూకోవెలలు, మసీదులు, బౌద్ధ దేవాలయాలు కూడా ఇక్కడి ప్రజల సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంటాయి. వీటిని కాపాడవలసిన పురాతన చిహ్నాలుగా ప్రభుత్వం భావిస్తుంది.
హిందూ, చైనీస్ సంసృతులకి సంభదించిన దేవాలయాలు సాధారణం గా అన్ని ప్రదేశాల్లో పక్కన పక్కనే ఉండటం ఇక్కడ సాధారణం గా కనపడుతుంది . హిందూ దేవాలయాల్లో తమిళ సాంప్రదాయ పద్దతులలో పూజలు నిర్వహిస్తారు .


సింగపూరు జాతీయ భాష మలయ్, జాతీయ గీతం మజులా సింగపుర . అధికార భాషలు మలాయ్, మాండరిన్, ఇంగ్లీష్, తమిళం. దేశ స్వాతంత్ర్యానంతరము ఇంగ్లీష్ అధికారిక హోదాను పొందింది. మొదట అమెరికన్ యాసతో ప్రభావితమైన ఇంగ్లీష్ ప్రారంభమైంది. విద్యా విధానాలలో ఇంగ్లీష్ మాధ్యమం కారణంగా ఇంగ్లీష్ వాడకం దేశమంతా వ్యాపించింది అలా ఇంగ్లీష్ సాహిత్యం అధికంగా సింగపూరు సాహిత్యంలో చోటు చేసుకోవడం సహజమై పోయింది. రాజ్యాంగ ప్రచురణలకు ఇతర అధికారిక అనువాదాలతో కూడిన ఇంగ్లీషుకు ప్రాముఖ్యత ఇవ్వడం అలవాటు. వివిధ భాషలను మాతృభాషగా కలిగిన ప్రజలు నివసిస్తున్న కారణంగా అనుసంధాన భాషగా ప్రజల మధ్య ఇంగ్లీష్ ప్రాచుర్యాన్ని సంతరించుకుంది. ఇక్కడి ప్రజల మాతృభాషలతో కలగలసిన సింగ్లీష్ ఇక్కడి ప్రజల స్వంతం.
చరిత్ర :
ఈ ద్వీపము 'సుమత్రన్ శ్రీవజయ' సామ్రాజ్యములో తెమసెక్(సముద్ర పురము) అనే పేరుతో  క్రీపూ 2 వ శతాబ్దమునుండి 14 వ శతాబ్దము వరకు వ్యాపారకేంద్రముగా విలసిల్లిన తరవాత క్షీణదశ ఆరంభమైంది ( పురాతన అవశేషాలు మిగిలి ఉన్నా ఆర్కియాలజిస్టులచే ఇది నిర్ధారించబడలేదు). 16వ శతాబ్ధము నుండి 19వ శతాబ్ధపు ప్రారభం వరకు జోహర్లో  (మలేషియా) ఒక భాగంగా ఉంది. ఆ  సమయములో ఈ ద్వీపము జాలరుల నివాసస్థలంగా ఉండేది .
1819వ సంవత్సరము  లో "థోమస్ స్టాన్ ఫోర్డ్స్ రాఫిల్స్" భౌగోళికంగా సింగపూరు వ్యాపారానికి అత్యంత అనుకూలమైన ప్రదేశంగా గుర్తించి ఈస్టిండియా కంపెనీ తరఫున బ్రిటిష్ వ్యాపారకేంద్రముగా అభివృద్ధి పరచే ఉద్దేశముతో ఒక ఒప్పందము చేసుకున్నాడు.ఈ ఒప్పందము దేశములో ఆధునిక యుగానికి నాంది పలికింది. ఈయనని ఆధునిక సింగపూర్ రూపకర్త గా చెప్పవచ్చు , ఈయన పేరు మీద ఏర్పడిన raffles place ఏరియా ప్రముఖ వాణిజ్య సముదాయలకి నెలవు . దీనినే డౌన్ టౌన్ అని కూడా అంటారు.అంతర్జాతీయంగా ఇక్కడకు వచ్చినివసించే వారిపై పౌరసత్వ కట్టుబాట్లు నిర్బంధం లేని కారణంగా వివిధ సంస్కృతులకు చెందిన ప్రజలు ఇక్కడ స్థిరపడటము ఆరంభము అయినది. 1858 వ సంవత్సరము నుండి జరిగిన ఈస్టిండియా పరిపాలన 1867 వ సంవత్సరమున బ్రిటిష్ సామ్రాజ్యపు పాలన లో కి వచ్చింది . బ్రిటిష్ కలోనీ నగరనిర్మాణ వ్యూహాలతో నగరాన్ని సంస్కృతి పరంగా విభజించింది. సింగపూర్ నది ప్రాంతము వ్యాపారుల,బ్యాంకర్ల ఆధిక్యములో వాణిజ్యపరంగా అభివృద్ధిని సాధించింది.
రెండవ ప్రపంచ యుద్ధకాలములో ఈ ద్వీపము  1942 వ సంవత్సరము 6 రోజుల యుద్ధము తరవాత జపాను సైన్యంచే ముట్టడించబడి జపాను వశమైంది. 1945 వ సంవత్సరము సెప్టెంబర్ 12 వ తేదీన జపానీయుల లొంగుబాటు తరువాత తిరిగి ఈ ద్వీపాన్ని బ్రిటిష్ వశపరచుకుంది.  31 August 1963  లో బ్రిటన్ నుంచి Federation  of  Malaysia  లో భాగం గా స్వాతంత్ర్యం పొందింది . తరవాత రెండు సంవత్సరాల తరవార ఒప్పందాల ప్రకారంమలేసియా నుంచి విడిపోయి  9th ఆగష్టు 1965 న రిపబ్లిక్ అఫ్ సింగపూర్ గా ఏర్పడింది .
రాజకీయ అంశాలు :
 సింగపూర్ పార్లమెంటరీ రిపబ్లిక్ అయినప్పటికీ అదికార పార్టీ అయిన PAP (పీపుల్ ఆక్షన్ పార్టీ ) 1965 నుంచి ఇప్పటికి వరకు వరుస గా ఎన్నిక అవుతూ వస్తుంది . ప్రతిపక్ష పార్టీ  ప్రభావం తక్కువే అయినప్పటికీ , 2011 లో జరిగిన ఎన్నికలలో మాత్రం ఓటింగ్ శాతాన్ని గతం లో పోలిస్తే గణనీయం గా పెంచుకుంది . ప్రధాన ప్రతిపక్ష పార్టీలు (SDP & SDA) కలిసి పోటీ చేయటం వలన  ఇది సాధ్యమైంది అని విశ్లేషకుల అంచనా .
సింగపూరు అతితక్కువ అవినీతి కలిగిన దేశంగా ఆసియాలో ప్రధమ స్థానంలోను, అంతర్జాతీయంగా పదవ స్థానంలోనూ ఉంది.  సుస్తిరమైన రాజకీయ పరిస్తితులు , పాలకుల విచక్షణ , పరిపాలనా దక్షత దీనికి కారణాలు గా చెప్పవచ్చు .
మీడియా ప్రసారాలు , వార్తా పత్రికల ప్రచురణ పైన పూర్తి ప్రభుత్వ నియంత్రణ ఉంటుంది  విభిన్న సంస్కృతుల, మతముల, భాషల ప్రజలు నివసిస్తున్న దేశం కనుక అల్ప సంఖ్యాకులను రెచ్చగొట్టేవి, ప్రశాంతతకు భంగం కలిగించేవి, ప్రజాశ్రేయస్సుకు ప్రతికూలమైనట్టి వ్యాఖ్యలను నిషేధిస్తూ వాక్ స్వాతంత్ర్యాన్ని  కట్టుబాటులో  ఉంచుతుంది. క్రూరమైనహత్యలూ, హానికరమైన మత్తు పదార్థాలకు సంబంధించిన నేరాలకు ఉరిశిక్ష విధించడం మామూలువిషయం . ప్రపంచంలో అధికశాతం ఉరిశిక్షలు అమలవుతున్న దేశాలలో సింగపూరుది అగ్రస్థానం.
సింగపూర్ లో రెండు రకాలైన ELECTORAL DIVISIONS ఉంటాయి .
1 . Single Member Constituencies (SMC ) : ఇవి సాధాణం గా జనాభా లోను , విస్తీరణం లో చిన్నవి . ఈ పార్లమెంటరీ డివిజన్ ని కేవలం ఒక MP రేప్రజేంట్ చేస్తారు . అంటే ప్రజలు ఒక MP ని మాత్రమే ఎన్నుకుంటారు . ప్రస్తుత SMC ల సంఖ్య - 12.
2 Group Representation Constituencies (GRCs): విస్తీరణం లోను , జనసాంద్రత లోను పెద్దవి . 3 - 6 మంది MP లను ప్రెసిడెంట్ నియమిస్తారు . ఈ మొత్తం సభ్యులలో ఒకరు తప్పని సరి గా మైనార్టీ రేస్ నుంచి ఉంటారు . ప్రస్తుత GRC ల సంఖ్య - 15 .
MP గా పోటీ చేయటానికి అభ్యర్ధి తప్పనిసరిగా పొలిటికల్ సైన్సు తప్పని సరి గా చదవి ఉండాలి .
అంతర్జాతీయ సంబంధాలు :
సింగపూరుకు దరిదాపు 175 దేశాలతో మంచి దౌత్య సంబంధాలు ఉన్నాయి. సింగపూరుకు ఐక్యరాజ్యసమితిలో, కామన్వెల్త్, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ లో సభ్యత్వము ఉంది.   బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మలేషియాలతో కలిసి ఐదు దేశాల రక్షణ ఒప్పందము  ఉంది. సింగపూర్ యునైటెడ్ కింగ్‌డమ్ తో ,  అమెరికాతో కూడా మంచి సంబంధాలను కలిగి ఉంది, అలాగే అనేక దేశాలతో విసృత  వ్యాపార ఒప్పందాలను కలిగి ఉంది.
విద్య
సింగపూరు అత్యధిక అక్షరాస్యులు కలిగిన దేశం. ఇక్కడ ప్రైమరీస్కూలు ఆరవసంవత్సరం నుండి మొదలౌతుంది. స్కూలుకు ముందు  తరగతులు ప్రైవేట్ సంస్థలే నిర్వహిస్తుంటాయి.  , మొదటి భాషగా ఇంగ్లీష్, ఇతర భాషలను (హిందీ, తమిళ్ , మాండరిన్ వంటివి)రెండవ భాషగానూ బోధిస్తుంటాయి. కొన్ని చైనీస్ పాఠశాలలు మాండరిన్ మాధ్యమంగానూ బోధిస్తూ ఉంటాయి.విద్యావిధానంలో చేరని మూడు సంవత్సరాల కిండర్ గార్డెన్ (ప్రాధమిక విద్యకు ముందు తరగతులు) తరవాత 6 సంవత్సరాల primary education ఉంటుంది .  స్కూల్ లీవింగ్ పరీక్షల (PSLE) తరువాత ఎంచుకున్న పాఠ్యాంశాలతో 4 నుండి 5 సంవత్సరాల Seconday Education  అనంతరం N లెవెల్ లేక  O లెవెల్ పరీక్షలు నిర్వహిస్తారు.జూనియర్  colleges 2 నుండి 3  సంవత్సరాల ప్రి యునివర్సిటీ తరగతులు నిర్వహిస్తాయి.  దీని తరవాత మాస్టర్స్ కోర్సులు చేయటానికి అర్హులు . నిరుద్యోగ శాతం 1 .5 శాతం మాత్రమే కావటం తో ఎక్కువ మంది ప్రీ యునివర్సిటీ కోర్సులు కాగానే ఉద్యోగాలలో చేరటానికి మక్కువ చూపుతారు .

రక్షణ వ్యవహారాలు

సింగపూరు రక్షణవ్యవహారాలు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్(MINDEF)ఆధ్వర్యంలో ఉంటాయి. సింగపూరు ఆర్మీ, రిపబ్లిక్ ఆఫ్ సింగపూరు నావీ, రిపబ్లిక్ ఆఫ్ సింగపూరు ఎయిర్ ఫోర్స్ఈ మూడు కలిసి సింగపూరు ఆర్మ్ ఫోర్స్ రక్షణశాఖ మంత్రి అధికారంలోఉంటాయి.  వీటికి సివిల్ డిఫెన్సు వంటి కొన్ని సంస్థలు స్వచ్ఛందంగా తమ సేవలు అందిస్తాయి.ప్రతి సింగపూరు పురుషుడు రక్షణవ్యవస్థలో కనీసం 2 సంవత్సరాల కాలం పనిచేయాలి. ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకు, కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లోని వారికి కొన్ని మినహాయింపులు ఉంటాయి. రెండవతరానికి చెంది సింగపూరులో స్థిరనివాస మేర్పరచుకున్న పురుషులకు ఈ చట్టం వర్తిస్తుంది. రెండు సంవత్సరముల సేవల అనంతరం రక్షణశాఖలో కొనసాగే విషయం  స్వయంగా నిర్ణయించుకోవచ్చును.సింగపూరు ఆర్మీ అంతర్జాతీయ శిక్షణా కేంద్రాలను అమెరికా, ఆస్ట్రేలియా, రిపబ్లిక్ చైనా, న్యూజిలాండ్, బ్రూనై, ఫ్రాన్స్, థాయిలాండ్, భారత్ మరియు దక్షిణాఫ్రికా లలో నిర్వహిస్తుంది. 1991 సింగపూరు ఎయిర్ లైన్స్ ఫ్లైట్ 117ను హైజాక్ చేసినప్పుడు సింగపూరు స్పెషల్ ఆపరేషనల్ ఫోర్స్ ప్రయాణీకులకుగాని సిబ్బందికిగాని ప్రాణనష్టం లేకుండా హైజాకర్ల వ్యూహాన్ని తిప్పికొట్టింది. ఈ ఆపరేషన్ లో నలుగురు హైజాకర్స్ ప్రాణాలు కోల్పోయారు . ఇది వీరి ప్రతిభ కి ఒక మచ్చు తునక .

సాధారణ ప్రజల జీవన విధానం , పర్యాటక విశేషాలు రెండో భాగం లో తెలుసుకుందాము ...... అంత  వరకు take a break :)











Sunday, July 17, 2011

అర్జెంట్ గా గొప్పవాళ్ళు కావటం ఎలా ?

ఈ మధ్య నేను కొంచెం లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తునట్లు గా నాకు అనుమానం గా ఉంది . సో...ఇప్పుడు నాకున్న ఏకైక ద్యేయం రాత్రికి రాత్రికి గొప్ప దాన్ని కావటం . ఇలా కావటానికి నాలో మిడి మిడి జ్ఙానాన్ని తట్టిలేపి కొన్ని ఐడియాలని పట్టేసా . అసలే ఇది ఓపెన్ సోర్సు యుగం కదా నా ఐడియాలని నాకోక్కదానికే స్వంతం అని నా బుర్రలో పెట్టి తాళం వేయటం ఎందుకు అని ఇదుగో ఇలా పబ్లిక్ గా బ్లాగులో పెడుతున్నా . మీకు నచ్చితే విచ్చలవిడి గా వాడేసుకోండి, చూసారా నేను ఎంత నిస్వార్ధపరురాలినో .

ఆ ఐడియాలని ఫాలో అయ్యేముందు మీరు ఈ చిన్న పనులు చేయాలి అవి :

ముందు గా ఈ సంవత్సరం జాతకఫలాలు లో మీ రాశి ఫలితాలు   చూసుకోండి రాజపూజ్యం 5 , అవమానం 1 ఉందనుకోండి హాపీస్ ఇక మన పోబ్లెం సగం solved లేదనుకోండి ఏముంది సింపుల్ మీకు ఈ రాశి నచ్చితే అది మీది అయ్యేట్లు మీ జన్మ రహస్యపు వివరాల డేటాని మార్చేయ్యటమే.

బాగా గుళ్ళు వున్న ఏరియా చూసుకొని సైకిల్ వేసుకొని ప్రతి గుడిలో ప్రసాదం తినడం ప్రాక్టీస్ చేయండి , స్టీవ్ జాబ్స్ అమెరికా లో ఇస్కాన్ టెంపుల్ లో పెట్టె ఫ్రీ భోజనం ఒక సంవత్సరం పాటు తిన్నాడట ఇక మనమెంత. దానితో మనం యాపిల్ లాంటి సంస్థను కాకపోయినా జామపండు లేదా కనీసం అరటిపండు కంపనీ పెట్టుకోవచ్చు. 

ఒక మంచి నక్కని తెచ్చి మీ వాకిట్లో దాని తోక మీరు నడిచే దారిలోకి వచ్చేట్లు గా కట్టేయండి, వీలయితే ఏ ఫెవికాల్ నో వాడి మీరు నడిచే దార్లో అతికించేయండి . ఏంటండీ అలా అయోమయం గా చూస్తారు మీరెప్పుడు వినలా "వీడు నక్క తోక తొక్కి వచ్చాడు" అనే ముక్క ? (మరీ ఇంత అయోమయం ఐతే కష్టం అండీ ) ఇంతకీ ఆ నక్కని కట్టేసాక మీరు చేయాల్సిన పని జస్ట్ మీరు బయటికి వెళ్ళేప్పుడల్లా దాని తోక తోక్కడమే . మీ కర్మ కాలి అది కరిచిందనుకోండి మీరెళ్ళి బూరెల బుట్టలో పడ్డట్లే ఏ టీవీ 10 లేదా 11 వాడో వచ్చి మీరు నక్కని తెచ్చి పెంచటానికి గల కారణాలు తవ్వి తీసి ఒకరెండు రోజులు పండగ చేసుకుంటాడు ఇక మీరు ఫుల్ famous

సరే ఇక మనం మన జీవితాన్ని మార్చే ఐడియాల్లోకి వచ్చేద్దాం :

1.కొత్తగా ప్రారంభమయ్యే తెలుగు టి.వి సీరియళ్ళ లో ఏదో ఒక వేషం సంపాదించండి . హీనపక్షం ఐదు నుంచి పదేళ్ళ వరకు  పొద్దునో , సాయంత్రమో , రాత్రో ఏదో ఒక సమయంలో మీ దర్శన భాగ్యం అఖిల్లాంద్ర ప్రేక్షకులకి ఉచితం. అంతే కాకుండా ఏ దిక్కుమాలిన రియాల్టీ షో కో మిమ్మల్ని ఒక సెలబ్రిటీ గా మిమ్మల్ని పిలుస్తారు కాబట్టి అదో అడినల్ అవకాశం. కాకపొతే మీ టాలెంట్ అంతా వాడి ఎంత జనాలని ఎంత హింస పెట్టాలంటే హిట్లర్  వంటి వాళ్ళు మీ ముందు ఎంత అనుకోవాలి , అప్పుడే మీ పేరు పది కాలాల పాటు నిలుస్తుంది .

2. మీరు సాఫ్టువేరు కార్మికులా అయితే ఎర్ర పార్టీలు ఎలాగు మిమ్మల్ని పట్టించుకోవు. మీరే అన్ని పార్టి ల రంగు కలిపి ఒక  జెండా తయారు చేసి - పార్టీ పెట్టి అందరిని ఏకం చేసి ఒకే చోట వుండడానికి కావలసినంత భూమిని కబ్జా చేయండి , అంటే అక్కడ మీ జెండాను పాతండి. దెబ్బకి మీపేరు తో ఒక కాలనీ వెలుస్తుంది , అదృష్టం ఉంటే విగ్రహాలు ఆ పై తెలివి తేటలతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయొచ్చు .

  
3.. మీ తాత గారు బాగా కథలు చెబుతారా ? అయితే మీ అదృష్టం బావుంది , ఆయన దగ్గరకి పోయి కాకపట్టి  పురాణాలలో పిట్ట కథలు చెప్పించుకొని, అరిషడ్ వర్గాలను జయించి (నిజం గా కాదు అలా ఆక్షన్ చేయటం నేర్చుకొని) ఒక బాబా గా అవతారం దాల్చండి ఒక దెబ్బకి రెండు పిట్టలు డబ్బుకు డబ్బుకు , పేరు కు పేరు .

4 . ఏదో ఒక వర్గం అన్యాయం అవుతున్నారు అని ఒక agitation మొదలు పెట్టండి , మొత్తం ఒక వర్గం వారి సింపతీ మీ సొంతం ఇక మీడియా లో మీ పేరు మారుమోగి పోవటం కాయటం .

5.ఎక్కడి ఎక్కడి పురాతన సంపదని ఈ రకం గా అభివృద్దికి వాడొచ్చో మీ అమూల్యమైన సలహాలు ఉచితయం గా ఇచ్చేయండి . మీరు గొప్ప దయార్ద్ర హృదయులు అన్న ముద్ర సంపాదించుకోవచ్చు .

6 . డమ్మీస్ ఫర్ చేతబడి , చేతబడి ఇన్ nutshell అని బుక్ రాసి online లో అమ్మకానికి పెట్టండి .


ఏంటి ఇవన్ని వద్దు జనాలకి ఉపయోగపడేవి సలహాలు కావాలా ? ఏంటి మీరే కాలం లో ఉన్నారు అలాంటి చేసి పేరు సంపాయించటం అయ్యే పనేనా ? మీ పిచ్చ కాకపొతే ! సరే మీ ఉత్సాహాన్ని నేనెందుకు చల్లార్చాలి , కాస్కోండి :

   
1 . ఎక్కడ పడితే అక్కడ సెల్ ఫోనులో వేసే సొల్లు ఆపే ఒక వెంటతీసుకొని వెళ్ళగలిగే జామర్ ని కనిపెట్టి వెర్బల్ డయేరియా ని అరికట్టి నాలాంటి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడిన వారవుతారు .

2 . SMS లు చూసి , లేదా ఎవరో చెప్పే మాస్ హిస్త్రీరియా తో ఊగిపోయి కనపడిదనడల్లా ద్వసం చేసే జనాలకి రెండు చెవులు మధ్య పదార్ధం ఉంది దానితో ఆలోచించాలి అని హెచ్చరించే ఒక చిప్ ని కనిపెట్టండి .

3 . రోడ్ల మీద ఎక్కడ పడితే ఊసే పవిత్రమైన అలవాటు ఉన్నవాళ్ళని ఆ పని చేయాలి అనుకోగానే నోరు తెరుచుకోకుండా చేయగలిగే యంత్రాన్ని కనిపెట్టండి .

  
4 . నేను మాత్రం బిజీ మిగలిన జనాలకి పనిపాటా లేదు అన్నట్లు signal jumpings లేదా అడ్డదిడ్డం గా డ్రైవింగ్ చేసేవాళ్ళని , అలాగే హాస్పిటల్స్ వంటి పబ్లిక్ ప్లేసెస్ లో నానా హడావిడి చేసేవాళ్ళని సరైన దారిలో పెట్టె యంత్రాన్ని కనిపెట్టండి .

ఏంటోనండి జనానికి పనికొచ్చే  విషయాలు  చెబుతున్నా, కానీ  ఈ ఐడియాలతో  టైం వేస్ట్ తప్ప పని జరగదు అని గట్ ఫీలింగ్,  ఉదాహరణకి ఒక సారి మీ చూట్టూ ఉన్న వాళ్లకి ఈ  చిన్న ప్రశ్నలు  వేసి చూడండి "పెన్సిలిన్ ని కనిపెట్టినది   ఎవరు "  ? అలాగే  "లేటెస్ట్  బద్రినాథ్  సినిమా లో    హీరో       ఎవరు" ?  ఆ రెండిటికి వచ్చిన సరైన సమాధానాల percentage  తో నిర్ణయించుకోండి  ఏది సులువైన దారో :)   

ప్రస్తుతానికి నాకు తోస్తున్నవి ఇవండీ , మీకు తట్టిన అమూల్యమైన సలహాలని కామెంట్ల రూపం లో నలుగురికి పంచటం మర్చిపోకండే

Saturday, April 23, 2011

శ్రమైకజీవన సౌందర్యం

మీరు రాంబాబు డైరీ చదివారా ? ఆగండి ! మీ తిట్లతో నా చెవులు చిల్లులు పడుతున్నాయి.  ఆ శ్రమైకజీవన సౌందర్యం అన్న హెడ్డింగ్ ఏంటి , రాంబాబు డైరీ చదివారా అన్న ప్రశ్నకి సంబంధం ఏమిటి అసలా మాటకొస్తే ఆ రాంబాబు గాడు ఎవడు అనే గా మీ సందేహం? చెప్తానండి ! ఒక్క క్షణం.

రాంబాబు డైరీ అనేది నండూరి పార్ధసారధి గారు రాసిన ఒక పుస్తకం పేరండి. ఆ సరే ఐతే ఆ పుస్తకానికి ఈ శ్రమైకజీవన సౌందర్యంకి సంబంధం ఏంటి అనేగా ఇప్పుడు మీ ప్రశ్న?  ఆ వివరాలలోకే వస్తున్నా . ఈ రాంబాబు డైరీ ల మొదటి బాగం మూడు సంవత్సరాల క్రితం నేను ఇండియాలో ఉన్నప్పుడు చదివాను. అది మొదటిసారి నేను చూసింది నేను చిక్కడపల్లి లైబ్రరీ లో (ఇప్పుడు ఆ లైబ్రరీ గురించి తెలిసిన వాళ్ళు సందేహపడకండి ఒక్కోసారి అంతే లక్కు లాగిపెట్టి తంతే మనం వెళ్లి బూరెల బుట్టలో పడతాం ). ఆ పుస్తకాన్ని మొదటి సారి చదవగానే నేను అర్జెంటు గా చేసిన పని , విశాలాంధ్ర  కెళ్ళి అది సంపాదించటం ఎందుకు అనుకుంటారేమో ఆ రాంబాబు కి ఉన్న సందేహలలో కొన్ని నాకు ఉన్నాయి మరి ఆయన వాటిని డైరీలో రాసుకున్నాడు, నాకు రాయటానికి బద్ధకం అందుకే రాసే పని తప్పుతుంది అని కొనేసుకున్నా :)

అందులో మచ్చుకి కొన్ని :
1.దేశంలో ఔషదాల పరిశ్రమ అభివృద్ధి చెందుతున్నప్పటికీ , ఎన్ని టానిక్కులు ఉత్పత్తి అవుతున్నప్పటికీ బలహీన వర్గాల పరిస్తితి ఎందుకు మెరుగుపడటం లేదు ?
2.షాపింగ్ అంటే షాప్ కి వెళ్లి కొనటం ఐతే , మార్కెటింగ్ అంటే మార్కెట్ కి వెళ్లి కొన్నుకోవటం ఎందుకు కాదు ?
3.దున్నేవాడిది భూమి అంటున్నారు రైతులు , రేపు బట్టలు ఉతికే వారు ఉతికేవాడిది బట్ట అనొచ్చు , తల క్రాఫింగ్ చేసే వారు గోరిగే వాడిది తల అని వాదించరు అని గ్యారెంటి ఏమిటి ?

  • సరే, సందేహాల సంగతి పక్కన పెడితే అనుభూతుల సంగతి చూద్దాం ఎంత సిన్సియర్ గా చెబుతాడో
    గ్రీష్మ ఋతువులో మధ్యాహాన్నం పాడే ముల్తానీ రాగం వింటే వేసవి కాలం మిట్ట మధ్యాహన్నం చెమటలు పోస్తుంటే బామ్మ గారు ఆవలిస్తూ గచ్చునేల మీద చెంగు పరుచుకొని పడుకుని ఆవలిస్తూ ఈగలు తోలుకుంటూ విసిన కర్రతో విసురుకుంటున్నట్లు ఉండటం (మామూలు జనాలకైతే ప్రియుని కోసం ఎదురుచూసే ప్రియురాలి విహార వేదన తెలియాలి ) .

  • ఇక మచ్చుకి మన రాంబాబు ప్రతిపాదించిన సిద్దాంతం :
    అవతలి వాడికి తెలిసిన విషయం గురించి మనం ఎప్పుడు మాట్లాడకూడదు , అవతలి వాడికి ఏది తెలియదు అని మనకి గట్టిగా తెలుసో దాన్ని గురించి మనకి తెలియకపోయినాసరే అనర్గళం గా మాట్లాడొచ్చు అందుకని అవతలి వాడికి ఏది తెలియదో అది తెలుసుకోవాలి ముందు .

ఈ పైవి చదివితే మనలోని రాంబాబుని ఒకసారి చదవాలి అనిపించటం లేదు ?! అనిపిస్తుంది కదా :) అందుకే నేను జనవరి లో వెళ్ళినప్పుడు రాంబాబు డైరీ రెండో బాగం దొరకబుచ్చుకుని నా వెంట తెచ్చుకున్నా. ఇక అప్పటినుంచి ఒక రెండు నెలలు పని పని , కాని చదవాలన్న కోరిక.  సరే ఆ బాధ తట్టుకోలేక ఎలాగోలా , రాంబాబు డైరీ తో పాటు ఇంకొక రెండు పుస్తకాలు హడావుడిగా ముద్దలు ముద్దలు మింగుతాం చూడండి అలా కానిచ్చేసా .

ఇక వారంతం మాకు గుడ్ ఫ్రైడే సందర్భం గా పొడుగాటి వారంతం , పైగా ఆఫీసులో కూడా ఒక పది రోజుల నుంచి తగ్గిన పని ఒత్తిడి వీటితో గురువారం సాయంత్రమే డిసైడ్ అయిపోయాను ఈ మూడు రోజులు కాలు తీసి బయట పెట్టకూడదు , పర్స్ లోంచి ఒక్క సెంట్ కూడా ఖర్చు చేయకూడదు అని . అంతే నిన్న , ఈవాళ పండగ రాంబాబు డైరీ రెండో బాగం మళ్ళీ తీరిగ్గా చదివేసా , ఇంకొక కొత్త బ్లాగు మొదలెట్టేసా. కొన్ని రోజులు పని తరవాత వచ్చే తీరిక సమయాన్ని ఈ మూడు రోజులు క్షణం కూడా వృధా చేయకుండా ఎంజాయ్ చేస్తున్నా , ఇప్పుడు అర్ధం అయ్యిందా మీకు ఈ పోస్టుకు ఆ హెడ్డింగ్ ఎందుకు అనేది :)

అలాగే శ్రమలో ఆనందాన్ని అనుభవించటమే కాదు శ్రమించే వారిని అభినందించటం కూడా మంచి పని కాబట్టి :

విజయవంతం గా మొదటి సంవత్సరం పూర్తి చేసుకొని రెండవ సంత్సరంలోకి అడుగు పెట్టిన శుభసందర్భం లో మాలిక టీం మెంబెర్స్ కి శుభాకాంక్షలు . చిన్నారి మాలిక కు బెలేటేడ్ హ్యాపీ బర్త్ డే !

మాలిక , మాలిక ప్రతిక , వనితా మాలిక ఇవే కాకుండా మీరు మరన్ని విజయవంతమైన పనులు చేయాలి అని మనస్పూరిగా గా కోరుకుంటున్నా !



Monday, March 21, 2011

ఇలా జరిగింది !


21 -03 -2011 - సమయం 9 :15 అం HR ఒక సౌత్ ఇండియన్ లుక్ తో ఉన్న అమ్మాయిని పరిచయం చేస్తుంది . ఈమె సో అండ్ సో మీ టీం లో సో అండ్ సో పొజిషన్ లో జాయిన్ అయ్యింది అని .
ఎదురు సీట్ తమిళ్ కొలీగ్ : తెలుగు అమ్మాయా ?
నేను : తెలియదు కాని పేరు మాత్రం తెలుగు పేరు లా ఉంది.
సరే introduction session అయ్యాకా ఆ అమ్మాయికి నా పక్క సీట్ allot చేసారు .
ఆమె ఏదో అడుగుతుంది , నేను ఆన్సర్ చేస్తున్నా (ఇదంతా ఇంగ్లీష్ లోనే ).
సమయం 4 PM :
నేను : కాఫీ ?
ఆమె : I don't like coffee , I like Milo .
5 నిమషాల తరవాత చెరొక కప్పు తో సీట్ దగ్గర కి వచ్చాం .
నేను : ఇండియా లో ఈ ప్రాంతం నుంచి వచ్చారు ?
ఆమె : ఆంధ్రప్రదేశ్
ఆమె : మీరు ?
నేను : హైదరాబాద్ !

నేను : హ్మ్ ! AP లో ఎక్కడ ? (ఇక్కడ నుంచి తెలుగు లోకి దిగిపోయాం :))
ఆమె : గుంటూరు
నేను : ఓహ్ గుంటురేనా , లేదా దగ్గర వేరే ఊరా ?
ఆమె : పొన్నూరు తెలుసా
నేను : తెలుసు పొన్నురా ? ఒకే !
ఆమె : అంటే పొన్నూరు కూడా కాదు దగ్గర xxxxxxx
నేను : హ (ఇక్కడ చచ్చేంత ఆశ్చర్యం) అవునా అదెలా ఎవరమ్మాయి మీరు ?
ఆమె : ఏమి మీకు తెలుసా ?
నేను : తెలుసా ? అది నా నేటివ్ ప్లేస్ .
ఆమె : అవునా నేను పలానా వాళ్ళ మనవరాలిని , మీరు
నేను : హ హ నేను పలానా !
ఆమె : హ మీరా ?
మా ఇద్దరి పెరిగిన గొంతులు , వాటిలోని excitement చూసి మిగిలిన కొలీగ్స్ ఏమి జరిగింది జరిగింది అని క్యురియస్ . ఇక తరవాత మా explanation :)


ఇంతకీ విషయం ఏంటంటే మా ఫ్యామిలీ తనకి తెలుసు , వాళ్ళ ఫామిలీ నాకు తెలుసు , మేము ఎప్పుడో చాలా చిన్నపుడు చూసుకొని ఉండొచ్చు , తరవాత వాళ్ళు గుంటూరు వెళ్ళిపోయారు , మేము హైదరాబాద్ . ఈ మధ్యనే రీసెంట్ గా పర్సనల్ reasons తో వాళ్ళు సొంత ఊరికి వచ్చేసారు . ఇప్పుడు పక్కనే పక్కనే కూర్చొని ఇన్ని సంవత్సరాల తరవాత కలిసి పని చేస్తున్నాం .
world is small అంటే ఇదే కదూ :)

Thursday, January 27, 2011

అన్నీ వృత్తులు సమానం కాదా ? ఎందుకు ?

ఏంటో ఇప్పుడు బ్లాగుల్లో వృతుల టాపిక్ బాగా హాట్ అనుకుంటా కదూ ? . ఏది క్లిక్ ఐతే దానికి వెనకే పరిగెత్తే తెలుగు జాతిలో పుట్టి ఇప్పుడు నేను దీని మీద ఒక పోస్టు రాయకపోతే నా ఐడెంటిటీ కే ప్రాబ్లం . సరేలెండి ఈ సోదంతా ఎందుకు కాని ఒకవేళ మీకు ఈ టపా బాక్గ్రౌండ్ తేలియకపోతే మంచు గారు ,  వేణు బాబు గారు రాసినవి ఒక చూపు చూసి వచ్చేయండి . ఇక మీకు మనం మన బుర్రలు ఎందుకు బద్దలు కొట్టుకోబోతున్నామో అర్ధం అయ్యింది కదా :)

సరే మీరందరూ ఆదిత్య 369 అదేంటండీ అలా చూస్తారు అదే మన సినిమా లో బాలయ్య వాడలా అది ఎక్కేసి అలా క్రీపూ 7000 సంవత్సరాల క్రితాని కి వెళ్ళండి . వెళ్ళారా ? ఏమి కనిపిస్తుంది అక్కడ ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు వేటాడి , లేదా దొరికిన కొమ్మలు , ఆకులు , పళ్ళు , కాయలు (అదేలెండి మన సలాడ్ స్టైల్ గా ) తింటున్నారు కదా. ఒకే ఇప్పుడు కొంచెం ముందుకు రండి ఏమి కనిపిస్తుంది అదేలెండి గుంపులు గుంపులు గా కలిసి వేటాడటం , లేదా ఏదో ఒక పంట పండించటం చేస్తున్నారు కదా ? ఇంకా కొంచెం ముందుకు రండి ఇప్పుడు కొంత మంది వ్యవసాయం చేస్తున్నారు , ఇంకొంత మంది వాళ్ళకి కావాల్సిన పనిముట్లు తయారు చేస్తున్నారు , కొంత మంది పిల్లల సంరక్షణ వగైరాలు చేస్తున్నారు కదా . అదండీ అక్కడ పడింది మొదటి బీజం మన వృత్తుల వర్గీకరణ కి . సరేలెండి ఇక మన టైంమెషిన్ లో పెట్రోల్ అయ్యిపోయ్యేట్లు ఉంది . ఇక మన బ్లాగుల కాలానికి వచ్చేయండి .

వచ్చేసారా ఇప్పుడు ఒక సారి మీ చిన్నతనాన్ని ఊహించుకోండి బావుంది కదా హాయి గా తినటం , తిరగటం :) సరే ఆ రెండేనా కొంచెం చదువు కూడా కావలిగా ఒక సారి మీ పుస్తకాల బ్యాగ్ గుర్తుతెచ్చుకోండి , ఏమి సబ్జేక్ట్లు ఉండేవి , సైన్సు , సోషల్ , తెలుగు, హిందీ , ఇంగ్లీష్ , మాధ్స్ యిలా కదా ? సరే పిల్లలు ఉన్నవాళ్ళు మీ పిల్లలు ఏమి సబ్జక్ట్స్ చదువుతున్నారో ఒక సారి గుర్తు తెచ్చుకోండి లేని వాళ్ళు అదేనండి పక్కింట్లో ఉంటారు కదా ఆ పిల్లల పుస్తకాలు చూడండి , ఆశ్చర్యం గా ఉంది కదా ఒక నాలుగు రకాల సైన్సులు, ఒక నాలుగు రకాల సోషల్లు ఇంకా ఏవేవో సరే కాసేపు అది అలా వదిలేద్దాం. ఇప్పుడు ,ఆసుప్తత్రుల గోల చూద్దాం మీ చిన్నప్పుడు మీకు జలుబు , జ్వరమో వస్తే మీ ఆమ్మమో , తాతో డాక్టర్ తీసుకెళ్ళి ఒక ఇంజెక్షన్ చేయిస్తే మరుసటి రోజుకి గంతులు వేసే వాళ్ళు కదా, మరి ఇప్పుడు ఒకసారి హాస్పిటల్ కి వెళదాం రండి , ఇక్కడే సందేహం కదా ఎవర్నీ కలవాలి జనరల్ ఫిజీషియన్ , అక్కడనుంచి జలుబు కాబట్టి పల్మనాలజిస్టు కి చూపిస్తే బెటర్ , వామ్మో కొంచెం వణుకు కూడా వుంది న్యురాలజిస్ట్ , కాదు కాదు కొంచెం గుండె దడ కూడా కార్డియాలజిస్ట్ అబ్బ ఎంత కన్ఫుజన్ . సరే ఆ రెస్టారెంట్ లో కొంచెం ఏమన్నా తిండి తిని దీని సంగతి చూద్దాం . ఇక రెస్టారెంట్ లో చైనీసు , ఇటాలియన్ , సౌత్ ఇండియన్ , నార్త్ ఇండియన్ ఇంకా ఇంకా . ఇక చాల్లెండి మీకు అర్ధం అయ్యింది కాదా, ప్రస్తుతం మనం ఉంది స్పెషలైజేషన్ యుగం లోనని .

ఇప్పుడు ఈ పైదంతా చదివాక మీకేమి అర్ధం అయ్యింది ? ఏంటి ఏమి అర్ధం కాలేదా ? మరీ అంత మొహమాటం లేకుండా చెప్తే నాకు బాధ వేయదండీ ? సరే ఏమి చేస్తాను నేనే చెబుతా . కాలం తో పాటు గా మన జీవనశైలి లో సంక్లిష్టత పెరిగి దాని కోసం అని మన జీనానికి అవసరమైన పనులన్నీ మనమే చేసుకోలేక రకరకాలు విడగొట్టి పంచుకున్నామన్న మాట అంగీకరిస్తారు కదా ? కాకపొతే ఇక్కడే మనకి కొంచెం పాత , కొత్త పనులు అనేవి ఉన్నాయి . మనకెప్పుడూ పాత ఒక రోత కొత్తొక వింతా కాబట్టి , సాధారణం ఏమి చేస్తాము కొత్త వాటి వెంట పరుగు అందుకుంటాము . అలాగని పరుగు అందుకని ఊరుకుంటామా? లేదు, అబ్బే ఇది లేకపోయినా పర్వాలా , వెనకటి రోజుల్లో మేము లేమా ? ఇదీ మన ఆలోచన , ఇది సహజం !కాకపొతే మనం ఇక్కడ మర్చిపోయే విషయం ఏమిటంటే దీని వల్ల కలిగే సౌకర్యాలు , అలాగే ఇవాళా మనకి అంత అవసరం గా కనిపించని ఇవే అవసరాలు రాబోయే తరాలకు కనీస అవసరాలు గా మారతాయి అని .

ఒక ఉదాహరణ చెబుతా ఎప్పుడో నేను పుట్టక పూర్వం పొలాలలో వరి నూర్పిడి మనుషులు చేసేవారట , కాని ఇప్పుడు నాకైతే ఎక్కడా కనపడలేదు , ప్రతి దగ్గర ట్రాక్టర్ తోనే . ఒకసారి ఊహించండి ఇప్పుడున్న పరిస్తితులలో మనుషులతో అది సాధ్యమా ? ఎన్ని రోజులు చేస్తారు ? ఎంత కూలీ కడతారు ? ఇక ఇప్పటి కాలం లో ఐతే చాలాచోట్ల నాట్లు , కోతలు కూడా మెషిన్ సాయం తోనే . నిజం గా ఒక్కసారి ఊహించండి ఇది మనిషి శ్రమ ని మేధస్సు తో తగ్గించటం కదా ? నా చిన్నపుడు కొన్ని జోక్స్ చదువుతుండే వాళ్ళం ఈ రోజు వర్షం పడుతుంది అని రేడియో లో చెబితే వడియాలు చేయాటానికి రెడీ అవ్వండీ అంటూ . ఇవాళ పరిస్తితులు మారలేదా ఎప్పుడు ఋతుపవనాలు వస్తాయి అనేది లెక్కలు కట్టి మరీ చెబుతున్నారు , అలాగే ఒక వారం ముందే ఈ రోజు వాతావరణ పరిస్తితి ని తెలుసుకోగలుగుతున్నాం దేని వల్ల ఇది సాధ్యం ? ఆ మేధస్సు కి విలువ అక్కరలేదా ?

ఇక మా తాత చిన్నప్పుడు చెబుతుండే వారు ఆయనకి ఏదో గవర్నమెంట్ స్కూల్ లో టీచర్ ఉద్యోగం వస్తే వాళ్ళ నాన్న బస్తా వడ్ల ఖరీదు చేయదు ఆ ఉద్యోగం ఎందుకు అని పంపలేదని . మీలో ఎంత మంది ఇలాంటివి విని ఉంటారో చెప్పండి ? రేపెప్పుడో నేను నా మనవరాల్లలో , మనవళ్ళకో చేబుతానేమో , నన్ను మా అమ్మ నాన్న వ్యవసాయం చేయనీయకుండా ఇదుగో ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని చేసారు అని :) ఇలా చెప్పటం లో నా ఉద్దేశ్యం ఒక్కొక్క కాలం లో ఒక్కొక్క వృత్తికి డిమాండ్ ఉంటుంది , అది రేపు ఏలా అన్న మారొచ్చు అని .దాని ప్రకారమే జనాలు choose చేసుకునే ప్రాధాన్యత క్రమం మారుతుంది అంత మాత్రానా ఈ వృతి మాత్రమే గౌరవనీయమైంది , వేరేది కాదు అనేది ఉండదు . అలాగే ఒక వృత్తి ని చేపట్టే వాళ్ళంతా ఉత్తములూ కాదు , వేరే పనులు చేసే వాళ్ళు కొంచెం తక్కువ కాదు . ఎవరైతే నిబద్దతతో వాళ్ళ వృత్తిని చేస్తారో వాళ్ళే గౌరవనీయులు, వాళ్ళ వల్లే ఆ వృత్తికి గౌరవం లబిస్తుంది .
మీరు మీ జీవితం లో ఒక్క రోజు మీ దినచర్య ని గమనించండి అది సక్రమం గా సాగటానికి ఎంతమంది సేవలు అవసరమో కూడా ఉహించండి . వారిలో ఏ ఒక్కరు సరిగా వాళ్ళ పని చేయక పోయిన ఎంత చిరాకు వేస్తుందో ఆలోచించండి . మనం ప్రస్తుతం గడిపే సామాజికజీవనం లో మనకు అనేక మంది సేవలు అవసరమవుతాయి , అలాగే మన సేవలు వేరే వాళ్లకి అవసరమవుతాయి సో ఒకరి మీద ఒకరు ఆధారపడక తప్పదు, ఈ ఆధారపడటం లో కొంచెం ఎక్కువ , కొంచెం తక్కువ అనే వర్గీకరణ అంత సబబు కాదు అని నా ఉద్దేశ్యం .
పైన నున్న లింకులలో రాసిన బ్లాగరుల అంత చక్కగా నేను రాసి ఉండక పోవచ్చు కాని నేను చెప్పదలుచుకున్న విషయం మాత్రం "ప్రపంచం లో వేరే వాళ్ళకి హాని కలిగించని ఏ వృత్తి ఐనా గౌరవనీయమైనదే నిబద్దతతో పనిచేసే వ్యక్తుల వల్ల ఆ వృత్తికే గౌరవం పెరుగుతుంది !".